జలపాతంలో పడి ఇద్దరు గల్లంతు | 2 persons missed in sariya water falls in vishakapatnam district | Sakshi
Sakshi News home page

జలపాతంలో పడి ఇద్దరు గల్లంతు

Oct 4 2015 5:40 PM | Updated on Sep 3 2017 10:26 AM

విశాఖ జిల్లా అనంతగిరి మండలంలోని సరియా వాటర్‌ఫాల్స్‌లో ఇద్దరు యువకులు ఆదివారం గల్లంతయ్యారు.

అనంతగిరి: విశాఖ జిల్లా అనంతగిరి మండలంలోని సరియా వాటర్‌ఫాల్స్‌లో ఇద్దరు యువకులు ఆదివారం గల్లంతయ్యారు. ఈ సంఘటన అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీ పరిధిలో చోటుచేసుకుంది. గాజువాక ప్రాంతానికి చెందిన పది మంది విహారయాత్రలో భాగంగా సరియా వాటర్ ఫాల్స్‌కు వెళ్లారు.

జలకాలాడేందుకు దిగగా ఇద్దరు గల్లంతయ్యారు. వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement