ట్రాక్టర్, లారీ ఢీ : నలుగురి మృతి | 2 killed in road accident at prakasam distirct | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్, లారీ ఢీ : నలుగురి మృతి

Mar 21 2016 9:18 AM | Updated on Aug 30 2018 4:07 PM

ప్రకాశం జిల్లా కనిగిరి మండలం చినఈర్లపాడు గ్రామం వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది.

కనిగిరి: ప్రకాశం జిల్లా కనిగిరి మండలం చినఈర్లపాడు గ్రామం వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, సుమారు 10 మందికి గాయాలు అయ్యాయి. పెళ్లి బృందంతో వెంగళాపురం గ్రామానికి వెళుతున్న ట్రాక్టర్‌ను ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. దీంతో గుంటూరు జిల్లా ఫిరంగిపురంకు చెందిన నర్సింహులతోపాటు ఆరో తరగతి విద్యార్థి నరేష్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన రాగమ్మ అనే మహిళ ఒంగోలు ఆస్పత్రిలో మృతి చెందగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో ప్రవీణ్ అనే వ్యక్తి మృతి చెందాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement