
2,601/12
పురపాలక సంఘాల ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టానికి తెరపడింది.
పురపాలక సంఘాల ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టానికి తెరపడింది. శుక్రవారంతో నామినేషన్ల స్వీకరణ పూర్తయింది. చివరి రోజు జిల్లాలోని 12 పురపాలక సంఘాల్లో 1884 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 12 పురపాలక సంఘాల పరిధిలో 371 వార్డుల్లో పోటీ చేసేందుకు మొత్తం 2,601 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
నామినేషన్లను శనివారం అధికారులు పరిశీలించనున్నారు. 18వ తేదీలోపు నామినేషన్లు విత్ డ్రా చేసుకోవచ్చు. అనంతరం బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలను అధికారులు వెల్లడిస్తారు. ఈ నెల 30న ఎన్నికలు, అవసరమైతే ఏప్రిల్ 1న రీపోలింగ్, ఏప్రిల్ 2న ఫలితాలు వెల్లడిస్తారు. మాచర్లలో 29 వార్డులకు కేవలం మూడింటిలో మాత్రమే నామినేషన్లు వేయడం కాంగ్రెస్ పార్టీ దుస్థితిని తెలియజేస్తోంది. ఇక జిల్లాలోని పురపాలక సంఘాల వారీగా దాఖలైన మొత్తం నామినేషన్ల వివరాలను పరిశీలిస్తే....
తెనాలి పురపాలక సంఘం నుంచి మొత్తం 265 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వైఎస్సార్‌సీపీ 74, టీడీపీ 86, కాంగ్రెస్ 47, ఇండిపెండెంట్లు 37, లోక్‌సత్తా 7, సీపీఐ 2, బీజేపీ 12.
నరసరావుపేటలో మొత్తం 319 మంది నామినేషన్లు దాఖలు చేయగా వైఎస్సార్ సీపీ 90, టీడీపీ 100, కాంగ్రెస్ 59, ఇండిపెండెంట్లు 64, ఇతరులు 1, లోక్‌సత్తా 2, సీపీఐ 1, బీజేపీ 2.
చిలకలూరిపేటలో 193 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వైఎస్సార్ సీపీ 67, టీడీపీ 75, కాంగ్రెస్ 14, ఇండిపెండెంట్లు 27, లోక్‌సత్తా 5, సీపీఎం 2, బీజేపీ 1, ఇతర పార్టీల నుంచి ఇద్దరు.
బాపట్లలో మొత్తం 212 మంది నామినేషన్లు దాఖలు చేయగా వైఎస్సార్ సీపీ 55, టీడీపీ 64, కాంగ్రెస్ 30, ఇండిపెండెంట్లు 52, సీపీఐ 2, బీజేపీ 6, బిఎస్‌పీ 2, ఇతరపార్టీలు1.
పొన్నూరులో 226 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వైఎస్సార్ సీపీ 110, టీడీపీ 74, కాంగ్రెస్ 22, ఇండిపెండెంట్లు 13, బీజేపీ 1, బీఎస్‌పీ 5.
రేపల్లెలో 134 మంది నామినేషన్లు దాఖలు చేయగా వైఎస్సార్‌సీపీ 48, టీడీపీ 43, కాంగ్రెస్ 29, ఇండిపెండెంట్లు 13, సీపీఐ 1 .
మాచర్లలో 202 మంది నామినేషన్లు దాఖలు చేయగా వైఎస్సార్ సీపీ 103, టీడీపీ 81, కాంగ్రెస్ 3, ఇండిపెండెంట్లు 22, ఇతర పార్టీలు 2, సీపీఎం 3, సీపీఐ 6, బీజేపీ 3, బీఎస్‌పీ 2.
మంగళగిరిలో 246 మంది నామినేషన్లు దాఖలు చేయగా వైఎస్సార్ సీపీ 50, టీడీపీ 65, కాంగ్రెస్ 51, ఇండిపెండెంట్లు 34, లోక్‌సత్తా 1, సీపీఎం 10, సీపీఐ 16, బీజేపీ 18, ఇతరులు 1.
సత్తెనపల్లిలో మొత్తం 206 మంది నామినేషన్లు దాఖలు చేయగా వైఎస్సార్ సీపీ 70, టీడీపీ 73, కాంగ్రెస్ 37, ఇండిపెండెంట్లు 13, సీసీఎం 3, సీపీఐ 1, బీజేపీ 7, బీఎస్పీ 1, ఇతర పార్టీ 1.
వినుకొండలో మొత్తం 169 మంది నామినేషన్లు దాఖలు చేయగా వైఎస్సార్ సీపీ 56, టీడీపీ 29, కాంగ్రెస్ 32, ఇండిపెండెంట్లు 20, లోక్‌సత్తా 1, సీపీఎం 6, సీపీఐ 10, బీజేపీ 15.
పిడుగురాళ్లలో 194 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వైఎస్సార్ సీపీ 79, టీడీపీ 68, కాంగ్రెస్ 17, ఇండిపెండెంట్లు 20, సీపీఎం 4, సీపీఐ 2, బీజేపీ 1, బీఎస్పీ 2, ఇతర పార్టీ 1.
తాడేపల్లిలో 212 మంది నామినేషన్లు దాఖలు చేయగా వైఎస్సార్ సీపీ 42, టీడీపీ 48, కాంగ్రెస్ 43, సీపీఎం 44, సీపీఐ 4, లోక్‌సత్తా 1, ఇండిపెండెంట్లు 30.