గత మూడు రోజల్లో 150 ప్రైవేట్ బస్సులు సీజ్ | 150 private buses seized by Road Transport Authority | Sakshi
Sakshi News home page

గత మూడు రోజల్లో 150 ప్రైవేట్ బస్సులు సీజ్

Nov 2 2013 10:49 AM | Updated on Aug 30 2018 5:54 PM

మహబూబ్నగర్ జిల్లా పాలెంలో బుధవారం ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన అగ్నికి ఆహుతి అయి 45 మంది మృత్యువాత పడిన నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్పై ఆర్టీఏ అధికారులు కోరడా ఝుళిపించారు.

మహబూబ్నగర్ జిల్లా పాలెంలో బుధవారం ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన అగ్నికి ఆహుతి అయి 45 మంది మృత్యువాత పడిన నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్పై రవాణ శాఖ అధికారులు కోరడా ఝుళిపించారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజులుగా తనిఖీలు నిర్వహించారు. దాంతో 150 బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. విశాఖ జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 8 బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు.

 

గుంటూరు జిల్లాలో 9, నెల్లూరు జిల్లాలో 1 బస్సును సీజ్ చేశారు. అలాగే ఆదిలాబాద్ -6, నిజామాబాద్ - 2, మెదక్ -5, అనంతపురం -1, మెదక్ జహీరాబాద్ చెక్పోస్ట్ వద్ద 3 బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. అయితే ఉభయ గోదావరి జిల్లాల్లో గత అర్థరాత్రి నుంచి ఆర్టీఏ అధికారులు  నిర్వహంచిన తనిఖీల్లో 15 బస్సులను సీజ్ చేశారు. ఇంకా పలు జిల్లాలో ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.

 

మహబూబ్నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం సమీపంలో బుధవారం తెల్లవారుజామున బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతి అయింది. ఆ ఘటనలో 45 మంది మరణించారు. డ్రైవర్, క్లీనర్తోపాటు మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement