15 మంది తమిళ కూలీల అరెస్ట్ | 15 arrested for illegal transportation of red sandalwood logs | Sakshi
Sakshi News home page

15 మంది తమిళ కూలీల అరెస్ట్

Dec 5 2015 4:53 PM | Updated on Sep 3 2017 1:33 PM

వైఎస్సార్ జిల్లా సుండుపల్లి సమీపంలోని కృష్ణారెడ్డి చెరువు వద్ద శనివారం 20 ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న 15 మంది తమిళ కూలీలను సుండుపల్లి ఎస్‌ఐ మధుసూదనరెడ్డి అరెస్ట్ చేశారు.

సుండుపల్లి (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ జిల్లా సుండుపల్లి సమీపంలోని కృష్ణారెడ్డి చెరువు వద్ద శనివారం 20 ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న 15 మంది తమిళ కూలీలను సుండుపల్లి ఎస్‌ఐ మధుసూదనరెడ్డి అరెస్ట్ చేశారు. ముందస్తు సమాచారం మేరకు ఎస్‌ఐ సిబ్బందితో దాడి చేసి ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని 15మందిని అరెస్ట్ చేసారు. స్వాధీనం చేసుకున్న దుంగల విలువ రూ.11.20 లక్షలు ఉంటుందని ఎస్‌ఐ చెప్పారు.

తమిళనాడులోని వేలూరుకు చెందిన తలారి విజయకుమార్ తమ నాయకుడని, ఆయన ఆదేశం మేరకే ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నామని కూలీలు చెప్పినట్లు ఎస్‌ఐ మీడియాకు వివరించారు. కూలీలను ప్రత్యేక బస్సులో రాయచోటి కోర్టుకు తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement