 
															బాబు వచ్చే...జాబు పోయే!!
బాబు అధికారంలోకి వస్తే జాబు వస్తుందంటూ ఎన్నికల్లో ప్రకటనలు గుప్పించారు.
	గృహనిర్మాణ సంస్థలో 149 మంది వర్క్ ఇన్‌స్పెక్టర్ల తొలగింపు
	 రిటైర్మెంట్ పేరుతో 200 మంది అంగన్‌వాడీ ఉద్యోగులు ఇంటిదారి
	 ఆదర్శ రైతులు 1551 మంది తొలగింపు
	 
	మచిలీపట్నం : పోయి ఉన్న ఉద్యోగాలను పీకేశారు.జిల్లా గృహనిర్మాణ సంబాబు అధికారంలోకి వస్తే జాబు వస్తుందంటూ ఎన్నికల్లో ప్రకటనలు గుప్పించారు. టీడీపీ సర్కారు వచ్చాక కొత్తవి ఇవ్వడం స్థ 2007 నుంచి 149 మంది వర్క్ ఇన్‌స్పెక్టర్లు పనిచేస్తున్నారు. టెక్నికల్ ఉద్యోగులకు నెలకు రూ.9 వేలు, నాన్‌టెక్నికల్ ఉద్యోగులకు రూ.7,500 చొప్పున వేతనం ఇచ్చేవారు. 2014 అక్టోబర్ 14 నుంచి 70మంది వర్క్ ఇన్‌స్పెక్టర్లను తొలగించారు.  
	
	ఆదర్శరైతులదీ ఇంటిదారే: జిల్లాలో 2007-08లో 2,365 మంది ఆదర్శరైతులను నియమించారు. 2014 -15 నాటికి వీరి సంఖ్య 1551 మందికి పడిపోయింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2014 జూన్‌లో వారందరినీ విధుల నుంచి తొలగించారు. అంగన్‌వాడీలకు పదవీ విరమణ: టీడీపీ అధికారంలోకి వచ్చాక  అంగన్‌వాడీ టీచరుకు రూ.7వేల వరకు, ఆయాకు రూ.4,700 వేతనం ఇస్తామని  చెప్పింది. మినీ అంగన్‌వాడీల్లో పనిచేసే టీచరుకు రూ.6,400 ఇస్తామని, సెప్టెంబర్ నుంచి ఈ వేతనాలు అమలుచేస్తామని ప్రభుత్వం పేర్కొంది. అయితే  పెంచిన వేతనం ఇవ్వకపోగా అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు పదవీ విరమణ వయసు ప్రకటించారు. జిల్లాలో  135మంది టీచర్లు, 65 మంది ఆయాలను తొలగించారు.  
	
	గాలిలో ఫీల్డు అసిస్టెంట్లు :జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న 167 మంది ఫీల్డు అసిస్టెంట్లకు మూడు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా ప్రభుత్వం గాలిలో పెట్టింది. 7వేల పనిదినాలు లక్ష్యం చేరుకోలేదని కొంతమందిని, సక్రమంగా పనిచేయడం లేదని మరికొందరిని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తోంది.
	
	సీఎస్పీలూ ఇంటికే: జిల్లావ్యాప్తంగా 1100 మంది కష్టమర్ సర్వీస్ ప్రొవైడర్లు (సీఎస్పీ)లను ప్రభుత్వం తొలగించింది. వారు గ్రామాల్లో, పట్టణాల్లో లబ్ధిదారులకు సామాజిక పింఛన్లు అందజేసేవారు.
	 
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
