గాలిలో విమానం: 13 కేజీల బంగారం స్వాధీనం! | 13 kg gold in indigo airways | Sakshi
Sakshi News home page

గాలిలో విమానం: 13 కేజీల బంగారం స్వాధీనం!

Mar 14 2014 11:19 AM | Updated on Aug 25 2018 5:33 PM

గాలిలో విమానం: 13 కేజీల బంగారం స్వాధీనం! - Sakshi

గాలిలో విమానం: 13 కేజీల బంగారం స్వాధీనం!

హైదరాబాద్ నుంచి శుక్రవారం ఉదయం ముంబై వెళ్తున్న ఇండిగో విమానంలో ఇద్దరు ప్రయాణికుల వద్ద 13 కేజీల బంగారం ఉన్నట్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని సీఐఎస్ఎఫ్ అధికారులు కొద్ది ఆలస్యంగా గుర్తించారు.

హైదరాబాద్ నుంచి శుక్రవారం ఉదయం ముంబై వెళ్తున్న ఇండిగో విమానంలో ఇద్దరు ప్రయాణికుల వద్ద 13 కేజీల బంగారం ఉన్నట్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని సీఐఎస్ఎఫ్ అధికారులు కొద్ది ఆలస్యంగా గుర్తించారు. అయితే అప్పటికే విమానం ముంబైకి బయలుదేరి పోయింది. దాంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఐటీ అధికారులకు సమాచారం అందించారు.

 

దాంతో హైదరాబాద్లోని ఐటీ అధికారులు వెంటనే స్పందించి ముంబైలోని ఐటీ అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో ముంబైలోని ఐటీ అధికారులు13 కేజీల బంగారాన్నీ స్వాధీనం చేసుకునే రంగం సిద్ధం చేసుకుని, ఇండిగో విమానం రాక కోసం ఎదురు చూస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement