కర్నూలు జిల్లా పాణ్యం మండలం తమ్మరాజుపల్లి గ్రామంలో అతిసార వ్యాధి ప్రబలింది.
పాణ్యం : కర్నూలు జిల్లా పాణ్యం మండలం తమ్మరాజుపల్లి గ్రామంలో అతిసార వ్యాధి ప్రబలింది. గత మూడు రోజుల నుంచి ఎండలు తీవ్రంగా ఉండటంతో ఉపాధి పనులకు వెళ్లిన కూలీలు అస్వస్థతకు గురయ్యారు. దీనికి తోడు గ్రామానికి సరఫరా అయ్యే నీరు కలుషితం కావటంతో దాదాపు 100 మంది మంచానపడ్డారని తెలిసింది. గ్రామవాసులు పెద్ద సంఖ్యలో వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడటంతో అధికారులు గ్రామంలోనే వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు.