breaking news
-
మై వైఫ్ .. శివాని గురించి రమేశ్ చివరిమాటలు
సాక్షి, క్రైమ్: విశాఖలో వివాహేతర సంబంధంతో భర్త రమేశ్‌ను ప్రియుడితోపాటు హత్య చేసిన ఉదంతంలో సంచలన వీడియోలు బయటకు వచ్చాయి. భర్తను హత్యకు ముందు శివాని చేసిన పనికి పోలీసులు సైతం షాక్ తిన్నారు. రమేశ్‌కు మద్యం తాగించి.. ఆ సమయంలో తన గురించి పొగిడినదంతా ఆమె వీడియోలు తీయించుకుంది. కానిస్టేబుల్ రమేష్ హత్య కేసు లో కీలక వీడియోలు సాక్షి టివి చేతికి అందాయి. రమేశ్‌ని చంపే ముందూ.. తన మీద అనుమానం రాకుండా భర్తతో ప్రేమగా ఉన్నట్టు ఆమె వీడియోలు రికార్డు చేసింది. భర్తకి మటన్ వండి పెట్టీ.. మందు తాగించి.. ‘నా భార్య మంచిది’ అని రమేశ్‌తో చెప్పించింది శివాని. ఆపై మద్యం మత్తులో జోగుతున్న భర్తను మంచంపై పడుకోబెట్టినదంతా కూడా రికార్డు అయ్యింది. మా ఆవిడ చాలా తెలివైంది. గైడెన్స్ ఇస్తే ఏదైనా సాధిస్తుంది. నా వైఫ్.. మై లైఫ్. చాలా ధైర్యవంతురాలు. నేను ఉన్నంత వరకు ధైర్యం చూపిస్తుంది. నేను ఎప్పుడు ఉంటానో.. ఎప్పుడు పోతానో తెలియదు. నేను పోయాక కూడా అదే ధైర్యం చూపించాలి. నా వైఫ్ బెస్ట్ అంటూ మాట్లాడిన మాటలు అందులో ఉన్నాయి. భర్త హత్య తర్వాత గుండెపోటుతో చనిపోయాడని నాటకం ఆడే క్రమంలో.. తనపై ఎలాంటి అనుమానాలు రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఈ పని చేసింది శివాని. ఆమె ఫోన్ నుంచి వీడియోలు సేకరించిన పోలీసులు.. నేరస్తురాలి తెలివితేటలు చూసి షాక్ తిన్నారు. 2009 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ బర్రి రమేష్(35). 2012లో శివాని(జ్యోతి)తో వివాహం జరిగింది. వీళ్లకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆదర్శనగర్‌లో ఉంటూ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. బుధవారం ఉదయం అతను చనిపోయినట్లు ఎంవీపీ పోలీసులకు సమాచారం వచ్చింది. రాత్రి మద్యం సేవించి పడుకున్నాడని, తెల్లవారి లేచి చూసేసరికి చనిపోయి ఉన్నాడని అతని భార్య శివాని(శివజ్యోతి) పోలీసులకు చెప్పింది. అతని ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు సమయంలో ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. తమదైన శైలిలో విచారించడంతో అసలు వాస్తవాలు బయటకొచ్చాయి. పోస్టుమార్టం నివేదికలో సైతం అతను ఊపిరాడక చనిపోయినట్లు తేలింది. దీంతో పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయడంతో కుట్రకోణం వెలుగుచూసింది. రామారావు అనే టాక్సీ డ్రైవర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న రమేష్ భార్య శివాని.. అతని మోజులో కట్టుకున్న భర్తను మట్టుబెట్టింది. రామా రావు విషయంలో గతంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. కాగా.. మంగళవారం రాత్రి ఆమె రమేష్‌తో బాగా మద్యం తాగించి.. దాన్ని వీడియో కూడా తీసింది. కొంతసేపటికి అతను నిద్రలోకి జారుకున్నాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన ఆమె ప్రియుడు రామారావుకు సమాచారం ఇవ్వడంతో.. అతని స్నేహితుడు నీలాతో కలిసి ఇంట్లోకి వచ్చాడు. ఆమె సమక్షంలోనే అతనిని వీరు హత్య చేశారు. నీలా రమేష్‌కి ఊపిరాడకుండా దిండుతో నొక్కిపట్టుకోగా.. రామారావు కదలకుండా అతని కాళ్లు పట్టుకున్నాడు. కొద్దిసేపటికి ఊపిరాడక రమేష్ మృతి చెందాడు. ఇలా పక్కాగా రమేష్‌ను హతమార్చిన శివాని, అతని ప్రియుడు రామారావు దీన్ని సాధారణ మృతిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే తొలుత మద్యం తాగి చనిపోయాడని శివాని పోలీసులకు చెప్పినట్లు సీపీ వెల్లడించారు. ఈ కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి వాస్తవాలను రాబట్టినట్లు తెలిపారు. శివానీని ఏ1గా, ప్రియుడు రామారావును ఏ2గా, వారికి సహకరించిన నీలాను ఏ3గా నిర్ధారించి కేసు నమోదు చేశారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు. ఈ అఘాయిత్యంలో శివాని పెద్దమ్మ కూతురు పైడమ్మకు కూడా భాగం అయ్యిందనే అనుమానాలు ఉన్నాయి. పైడమ్మ వల్లే తనకు రామారావు పరిచయం అయ్యాడని శివాని పోలీసులకు చెప్పింది. అంతేకాదు.. కాన్ఫరెన్స్ కాల్స్‌లో మాట్లాడినట్లు నిర్థారించిన పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. అయితే తాను అమాయకురాలినని పైడమ్మ వాపోతోంది. -
వైజాగ్ కానిస్టేబుల్ రమేష్ హత్య కేసులో మరో కొత్త ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: కానిస్టేబుల్ రమేష్ మర్డర్ కేసులో మరో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. తెరపైకి కొత్త వ్యక్తి పేరు వెలుగులోకి వచ్చింది. ఆమె ఎవరో కాదు శివాని పెద్దమ్మ కూతురు పైడమ్మ.. పోలీసుల విచారణలో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. పైడమ్మే.. రామారావుతో కలవడానికి కారణమని పోలీసులకు శివాని తెలిపింది. ఫోన్ కాల్ డేటా పరిశీలించిన ఎంవీపీ పోలీసులు.. వందల సార్లు కాల్స్ మాట్లాడినట్టు గుర్తించారు. పైడమ్మ, శివాని, రామారావు ముగ్గురం కలిసే బయటకు వెళ్లే వాళ్లమని శివాని చెప్పింది. పైడమ్మాను ఏ4గా చేర్చే అవకాశం ఉంది. తనకు అసలు సంబంధం లేదంటున్నా శివాని అక్క పైడమ్మా.. కావాలనే ఇరికిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. శివాని.. రామారావు ఒక ఫ్రెండ్ మాత్రమే అని చెప్పి పరిచయం చేసిందని పైడమ్మా తెలిపింది. కాన్ఫరెన్స్ కాల్స్‌లో మాట్లాడినట్లు నిర్థారించిన పోలీసులు. పైడమ్మను విచారిస్తున్నారు. ఆమె ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎంవీపీ పోలీసుల అదుపులోనే A1 భార్య శివాని, A2 ప్రియుడు రామారావు, A3 నీలా ఉన్నారు. వారిని రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది. చదవండి: తహసీల్దార్ వేధింపులు... మహిళా ఉద్యోగి ఆత్మహత్య కాగా, వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ రమేష్ మృతి విషయంలో తొలి నుంచి అనుమానిస్తున్నదే జరిగింది. శివజ్యోతి అలియాస్ శివానీయే ఆమె ప్రియుడితో కలిసి తన భర్త రమేష్ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసుల విచారణలో తేలింది. నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ శుక్రవారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. 2009 బ్యాచ్‌కు చెందిన బర్రి రమేష్(35) ఆదర్శనగర్‌లో ఉంటూ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. బుధవారం ఉదయం అతను చనిపోయినట్లు ఎంవీపీ పోలీసులకు సమాచారం వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బెడ్‌పై విగతజీవిగా ఉన్న రమేష్ ను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. రాత్రి మద్యం సేవించి పడుకున్నాడని, తెల్లవారి లేచి చూసేసరికి చనిపోయి ఉన్నాడని అతని భార్య పోలీసులకు చెప్పింది. అతని ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు సమయంలో ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. తమదైన శైలిలో విచారించడంతో అసలు వాస్తవాలు బయటకొచ్చాయి. పోస్టుమార్టం నివేదికలో సైతం అతను ఊపిరాడక చనిపోయినట్లు తేలింది. దీంతో పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయడంతో కుట్రకోణం వెలుగుచూసింది. రామారావు అనే టాక్సీ డ్రైవర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న రమేష్ భార్య శివాని.. అతని మోజులో కట్టుకున్న భర్తను మట్టుబెట్టింది. రామా రావు విషయంలో గతంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. కాగా.. మంగళవారం రాత్రి ఆమె రమేష్‌తో బాగా మద్యం తాగించి.. దాన్ని వీడియో కూడా తీసింది. కొంతసేపటికి అతను నిద్రలోకి జారుకున్నాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన ఆమె ప్రియుడు రామారావుకు సమాచారం ఇవ్వడంతో.. అతని స్నేహితుడు నీలాతో కలిసి ఇంట్లోకి వచ్చాడు. ఆమె సమక్షంలోనే అతనిని వీరు హత్య చేశారు. నీలా రమేష్‌కి ఊపిరాడకుండా దిండుతో నొక్కిపట్టుకోగా.. రామారావు కదలకుండా అతని కాళ్లు పట్టుకున్నాడు. కొద్దిసేపటికి ఊపిరాడక రమేష్ మృతి చెందాడు. ఇలా పక్కాగా రమేష్‌ను హతమార్చిన శివాని, అతని ప్రియుడు రామారావు దీన్ని సాధారణ మృతిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే తొలుత మద్యం తాగి చనిపోయాడని శివాని పోలీసులకు చెప్పినట్లు సీపీ వెల్లడించారు. ఈ కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి వాస్తవాలను రాబట్టినట్లు తెలిపారు. శివానీని ఏ1గా, ప్రియుడు రామారావును ఏ2గా, వారికి సహకరించిన నీలాను ఏ3గా నిర్ధారించి కేసు నమోదు చేశారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు. తొలి నుంచి శివానీది నేర స్వభావమే.. రమేష్ భార్య శివానీది తొలి నుంచి నేర స్వభావమే అని సీపీ తెలిపారు. తల్లిదండ్రులతో సైతం ఆమె పలుమార్లు గొడవ పడినట్లు చెప్పారు. ప్రియుడి విషయంలో భార్యను పలుమార్లు రమేష్ మందలించాడని వెల్లడించారు. ఆమె తీరు కారణంగా విసిగిపోయి ఒక దశలో ఇద్దరు కుమార్తెలను తన వద్ద వదిలేసి ప్రియుడితో వెళ్లిపొమ్మని కూడా ఆమెకు చెప్పాడన్నారు. అయితే పిల్లలు, ప్రియుడు ఇద్దరూ కావాలనే ఉద్దేశంతో శివాని రమేష్ హత్యకు కుట్ర పన్నింది. ఈ హత్యలో సహకారానికి శివానీ, ప్రియుడు రామారావు అతని స్నేహితుడు నీలాకు రూ.లక్ష సుపారి కూడా ఇచ్చినట్లు సీపీ వెల్లడించారు. -
టీడీపీ రాక్షస క్రీడ
సాక్షి, తిరుపతి/చిత్తూరు/ పుంగనూరు/బి కొత్తకోట: రాయలసీమలో రక్తపాతమే లక్ష్యంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పక్కా స్కెచ్‌తో అగ్గి రాజేశారు. టీడీపీ గూండాలను రెచ్చగొట్టి.. పోలీసులు, వైఎస్సార్సీపీ శ్రేణులపై రాళ్లు, కర్రలు, బీరు బాటిళ్లతో దాడులు చేయించారు. అంతటితో ఆగక పోలీసు వాహనాలపై పెట్రోలు పోసి నిప్పంటించి విధ్వంసం సృష్టించారు. శాంతి భద్రతలకు తీవ్రంగా విఘాతం కలిగించారు. ఈ ఘటనలో పలువురు పోలీసులు, వైఎస్సార్సీపీ శ్రేణులు తీవ్ర రక్త గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రాజెక్టుల సందర్శన పేరుతో శుక్రవారం ఆయన అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పర్యటించారు. ములకలచెరువు మండలం నాయనపల్లి చెరువు వద్ద ఉన్న హంద్రీ–నీవా, గాలేరు నగరి అనుసంధానం కాలువ పనులను పరిశీలించారు. ఆ తర్వాత బి కొత్తకోట మండలం చీతివారిపల్లి సమీపంలో ఉన్న హంద్రీ–నీవా పుంగనూరు ఉప కాలువ పనులను పరిశీలించాల్సి ఉండింది. అయితే పుంగనూరులో విధ్వంసం సృష్టించాలనే లక్ష్యంతో రూట్ మ్యాప్ మార్చుకున్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండల పరిధిలోని ముదివేడు రిజర్వాయర్ పరిశీలనకు వెళ్తున్నారని తెలుసుకున్న స్థానికులు, వైఎస్సార్సీపీ శ్రేణులు బాబు తీరుపై మార్గం మధ్యలోని అంగళ్లు సర్కిల్ వద్ద నిరసన తెలిపి వెనుదిరిగారు. అంతలో అక్కడికి చేరుకున్న చంద్రబాబు బృందం వందలాది మందితో వచ్చీ రాగానే కేకలు వేస్తూ... తొడలు చరుస్తూ కర్రలు, బీరు బాటిళ్లు, రాళ్లు విసురుతూ దాడులకు తెగబడ్డారు. దూరంగా ఉన్న వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టారు. డీఎస్పీ, సీఐలు, ఎస్ఐలు, పోలీసులు ఎంతగా వారించినా వినలేదు. స్థానికులు భయాందోళనతో ఇళ్లలోకి పరుగులు తీశారు. టీడీపీ గూండాల రాళ్ల దాడిలో ముదివేడు పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ కేశవ, అంగళ్లకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త అర్జున్‌రెడ్డి (35) తీవ్రంగా గాయపడ్డారు. ములకలచెరువుకు చెందిన విశ్వనాథరెడ్డి సహా మరో పది మందికి గాయాలయ్యాయి. ఇంత జరుగుతున్నా చంద్రబాబు వారించడం అటుంచి, చోద్యం చూశారు. పైగా జీపుపైకి ఎక్కి రెచ్చగొట్టేలా మాట్లాడారు. పోలీసులపై రాళ్లు విసిరి దాడికి పాల్పడుతున్న టీడీపీ శ్రేణులు పుంగనూరు పుడింగితో తేల్చుకుందాం రండి అంగళ్ల వద్ద నుంచి చిత్తూరు జిల్లాలోని పుంగనూరు బైపాస్, పలమనేరు మీదుగా చంద్రబాబు చిత్తూరుకు చేరుకోవాల్సి ఉంది. చంద్రబాబు రూట్ మ్యాప్‌లో పుంగనూరు ప్రస్తావన లేదు. అయితే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని లక్ష్యంగా చేసుకున్న చంద్రబాబు.. పుంగనూరుకు వెళ్దాం.. రండి అంటూ టీడీపీ గూండాలకు మైక్ ద్వారా పిలుపునిచ్చారు. ‘పుంగనూరులో పుడింగి ఉన్నాడు.. రండి తేల్చుకుందాం’ అని గట్టిగా అరుస్తూ ముందుకు కదిలారు. బాబు పిలుపుతో పుంగనూరు వద్ద విధ్వంసం అంగళ్ల వద్ద చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు పుంగనూరు వద్ద టీడీపీ గూండాలు పెద్ద సంఖ్యలో అధినేత రాకముందే గుమిగూడారు. ఒక్కసారిగా బైపాస్ రోడ్డు వద్దకు చేరుకున్నారు. పుంగనూరు పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నా వినిపించుకోకుండా గొడవకు దిగారు. ఒక ఏఎస్పీ, డీఎస్పీ, ఐదుగురు సీఐలు, 10 మంది ఎస్‌ఐలతోపాటు సుమారు 350 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతలో చంద్రబాబు అక్కడికి చేరుకున్నారు. వందల సంఖ్యలో వచ్చిన టీడీపీ గూండాలను వెనకేసుకుని బైపాస్ రోడ్డులోని భీమగానిపల్లె సర్కిల్ నుండి పుంగనూరులోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ‘పుంగనూరులో కాలుమోపుతా.. ఎవరు అడ్డుకుంటారో? చూస్తా?’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పోలీసులు ఎంతగా వారించినా వినలేదు. పైగా పోలీసులను టార్గెట్‌గా చేసుకుని టీడీపీ శ్రేణులు తొలుత రాళ్ల వర్షం కురిపించాయి. ఆ తర్వాత కర్రలతో పోలీసులను తరిమికొట్టే ప్రయత్నం చేశారు. ముందస్తుగా సిద్ధం చేసుకున్న బీరు బాటిళ్లు, మద్యం సీసాలు పోలీసులపైకి విసిరి తీవ్రంగా గాయపరిచారు. పోలీసు గస్తీ కోసం ఏర్పాటు చేసిన వజ్ర వాహనాన్ని, మరో పోలీసు వాహనాన్ని కిందకు పడదోసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఎంతగా సంయమనం పాటించి, సర్దిచెప్పినప్పటికీ వారు వినకపోవడంతో పోలీసులు వారిపైకి బాష్ప వాయువు ప్రయోగించి చెదరగొట్టాల్సి వచ్చింది. ఈ విధ్వంసం గంటన్నరకుపైగా సాగింది. 27 మందికి గాయాలు టీడీపీ శ్రేణుల దాడిలో ఏఎస్పీ, డీఎస్పీతోపాటు ఐదుగురు సీఐలు, 10 మంది ఎస్‌ఐలతోపాటు మొత్తం 27 మందికి రక్త గాయాలయ్యాయి. సాయంత్రం 4 నుండి 5.30 గంటల మధ్య పుంగనూరు బైపాస్‌రోడ్డు ప్రాంతం రణరంగాన్ని తలపించింది. చిత్తూరు ఏఆర్ ఏఎస్పీ నాగేశ్వరరావు, దిశ స్టేషన్ డీఎస్పీ బాబుప్రసాద్, క్రైమ్ సీఐ భాస్కర్, పాలసముద్రం ఎస్ఐ ప్రసాద్‌లకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వారంతా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గాయపడ్డ పోలీసుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఫొటోలు, వీడియోల్లో పోలీసు అధికారులు, సిబ్బంది రక్త గాయాలతో ఉండటం చూసి కన్నీటి పర్యంతమయ్యారు. రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని పోలీసులపై టీడీపీ శ్రేణులు ఇలా దాడులు చేసి గాయ పరచడంపై ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి ఘటన స్థలాన్ని సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులను పరామర్శించారు. అనంతరం అనంతపురం రేంజి డీఐజీ అమ్మిరెడ్డితో కలిసి పుంగనూరులో ఘటన వివరాలను మీడియాకు వివరించారు. కాగా, గొడవ విçషయం తెలిసి పుంగనూరు బైపాస్ రోడ్డు వద్దకు చేరుకున్న స్థానిక వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో 50 మందికి టీడీపీ నేతల రాళ్ల దాడిలో తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులపైకి రాళ్లు విసురుతూ దూసుకొస్తున్న టీడీపీ శ్రేణులు అంతా వ్యూహాత్మకం చిత్తూరు అర్బన్: కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్ఎస్జీ కమాండోల రక్షణలో జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న టీడీపీ నేత చంద్రబాబు ఎక్కడైనా పర్యటించాలంటే 24 గంటల ముందుగా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఎస్‌వో) నుంచి ఇంటెలిజెన్స్ విభాగానికి రోడ్ మ్యాప్ ఇవ్వాలి. అప్పుడు జిల్లా పోలీసుశాఖ ముందుగా రూట్ మ్యాప్‌లో ఉన్న కల్వర్టులు, శివారు ప్రాంతాలు, అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతుంది. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్), ఆర్మ్డ్ రిజర్వు దళాలు చంద్రబాబు కార్యక్రమం జరిగే రూట్ మ్యాప్‌లో భద్రతా చర్యలు, ముందస్తు తనిఖీలు చేపడతారు. కానీ చిత్తూరు జిల్లా పర్యటనకు సంబంధించి చంద్రబాబు నుంచి పోలీసులకు అందిన రూట్ మ్యాప్ ఒకలా ఉంటే.. దాన్ని కాదని పుంగనూరులోకి పర్యటనను మారుస్తూ మరో దారిని ఎంచుకోవడం రాజకీయంగా లబ్ధి పొందే వ్యూహమేనని స్పష్టమవుతోంది. మదనపల్లె నుంచి పుంగనూరు బైపాస్ మీదుగా చంద్రబాబు నాయుడు చిత్తూరు శివారుల్లోని బాన్స్ హోటల్‌కు వెళతారని బుధవారం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి నుంచి పోలీసులకు సమాచారం అందింది. గురువారం రాత్రి కూడా పర్యటనలో మార్పులు చేస్తూ.. పుంగనూరు బైపాస్ మీదుగానే వెళ్లిపోతారని చెప్పారు. తీరా శుక్రవారం సాయంత్రం పుంగనూరులోకి ప్రవేశించడానికి విఫలయత్నం చేస్తూ విధ్వంసం సృష్టించారు. రాజంపేట టీడీపీ అభ్యర్థి నరహరి కారులో గన్ బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లా రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గంటా నరహరి కారు డ్రైవర్ గుర్మిత్ సింగ్(38)పై ముదివేడు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మదనపల్లె రూరల్ సీఐ శివాంజనేయులు కథనం ప్రకారం.. చంద్రబాబు పర్యటన సమయంలో కడప వైపు నుంచి అంగళ్లుకు నరహరి కారు వేగంగా వచ్చింది. కడప రోడ్డులోని పెట్రోలు బంకు వద్ద తంబళ్లపల్లె మండలం కన్నెమడుగుకు చెందిన ఎంపీటీసీ మహే‹Ùపైకి దూసుకొచ్చింది. మహేష్ హెచ్చరికతో కారు ఆగింది. అంత వేగమెందుకని మహేష్ నిలదీయగా.. ఆగ్రహించిన గురుమిత్‌సింగ్ కారులోంచి డబుల్ బ్యారల్ గన్ తీసి కాల్చుతానంటూ బెదిరించారు. దీంతో మహేష్ ముదివేడు పోలీసులకు చెప్పగా వారు కారును తనిఖీ చేశారు.పేకాట పెట్టెలు, వెనుకవైపు కింద డబుల్ బ్యారల్ గన్, సీటు కవర్లో ఎనిమిది తూటాలు కలిగిన ప్యాకెట్ లభించాయి. వీటితోపాటు కారును స్వాదీనం చేసుకుని ముదివేడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాధితుడు మహేష్ ఫిర్యాదు మేరకు డ్రైవర్ గుర్‌మిత్‌సింగ్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. రెచ్చగొట్టే ప్రసంగాలతోనే విధ్వంసం రెచ్చగొట్టే ప్రసంగాలతో పథకం ప్రకారం విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడులు జరగడం బాధాకరం. ఇలాంటి మాటలు సమాజానికి మంచిది కాదు. గాయపడిన పోలీసుల పరిస్థితి ఇది.. తెలుగుదేశం వారు ఉపయోగించిన రాళ్లివి (వీడియో చూపుతూ). అనుమతి పొందిన రూట్‌మ్యాప్‌ను కాదని తెలుగుదేశం పార్టీ శ్రేణులు పుంగనూరులోకి వచ్చే ప్రయత్నం చేయడంతోనే విధ్వంసం జరిగింది. పోలీస్ అధికారుల వద్ద పిస్టల్ ఉన్నప్పటికీ, ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని గ్రహించినా సంయమనంతో వ్యవహరించారు. ప్రజలు భయభ్రాంతులకు గురికాకూడదని కాల్పులు జరపలేదు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దాడులు చేసిన వారిని గుర్తిస్తాం. బాధ్యులందరిపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేస్తాం. విధ్వంసం సృష్టించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. – అమ్మిరెడ్డి, అనంతపురం రేంజ్ డీఐజీ ముందస్తు పథకం ప్రకారమే దాడులు ముందస్తు పథకం ప్రకారం విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందిపై దాడి చేశారు. రాళ్లు, మద్యం బాటిళ్లు, కర్రలతో దాడులకు పాల్పడ్డారు. పోలీస్ వాహనాలను సైతం తగులబెట్టడం దారుణం. దీని వెనుక ఎవరున్నా వదిలేది లేదు. చట్ట ప్రకారం వారందరిపై కేసులు నమోదు చేస్తాం. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు 350 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశాం. రూట్ మ్యాప్‌లో లేకపోయినా.. టీడీపీ నాయకులు కొంత మంది కావాలనే నిబంధనలకు విరుద్దంగా పుంగనూరులోనికి రావడానికి ప్రయత్నించారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా నిలువరించినందుకే దాడి చేశారు. పోలీసులు ఎంతో సంయమనంతో వ్యవహరించి, దెబ్బలు తిన్నప్పటికీ కాల్పులు జరపలేదు. గొడవనంతటినీ వీడియో చిత్రీకరించాము. చట్టప్రకారం బాధ్యులందరిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తాం. – రిషాంత్‌రెడ్డి, చిత్తూరు ఎస్పీ నేడు చిత్తూరు జిల్లా బంద్ పుంగనూరులో చంద్రబాబు అనుచరగణం సృష్టించిన విధ్వంసాన్ని నిరసిస్తూ, పోలీసులపై దాడిని ప్రజాస్వామ్యంపై దాడిగా ఖండిస్తూ వైఎస్సార్సీపీ శనివారం చిత్తూరు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. కాగా అంగళ్లు కూడలిలో శుక్రవారం వైఎస్సార్సీపీ నేతలు టీడీపీ దాష్టీకంపై పెద్దఎత్తున నిరసన తెలిపారు. -
పక్కా ప్లాన్‌తోనే టీడీపీ శ్రేణుల దాడి: చిత్తూరు ఎస్పీ
సాక్షి, పుంగనూరు: అన్నమయ్య జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు సహా పచ్చ పార్టీ నేతలు రెచ్చిపోయారు. పుంగనూరులో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, పోలీసులను టార్గెట్ చేసి దాడులకు పాల్పడ్డారు. ఇక, ఎల్లో బ్యాచ్ దాడిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, 14 మంది పోలీసులు గాయపడ్డినట్టు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనపై చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఎస్పీ రిషాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పథకం ప్రకారమే పోలీసులపై దాడి చేశారు. చంద్రబాబు పుంగనూరు హైవే మీదుగా చిత్తూరు వెళ్లాల్సి ఉంది. రూట్ మార్చి పుంగనూరు వచ్చేందుకు ప్రయత్నించారు. పుంగనూరులోకి రాకుండా టీడీపీ శ్రేణులను అడ్డుకున్నాం. అడ్డుకున్న పోలీసులపై టీడీపీ శ్రేణులు దాడులకు దిగారు. విచక్షణారహితంగా దాడులు చేశారు. బీర్ బాటిళ్లు, కర్రలు, రాళ్లతో టీడీపీ కార్యకర్తలు అక్కడికి వచ్చారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే దాడి చేశారు. టీడీపీ శ్రేణుల రాళ్ల దాడిలో 50 మందికిపైగా గాయపడ్డారు. రెండు పోలీసు వాహనాలను తగలబెట్టారు. దాడులకు దిగిన టీడీపీ శ్రేణులను అరెస్ట్ చేస్తాం. దాడుల వెనుక ఎంత పెద్ద వ్యక్తులను అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: పుంగనూరు దాడుల్లో షాకింగ్ వాస్తవాలు.. టీడీపీ నేతల వాహనాల్లో గన్స్.. -
అన్నమయ్య: టీడీపీ నేతల అరాచకం.. కర్రలు, రాళ్లతో దాడి
సాక్షి, అన్నమయ్య: అన్నమయ్య జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. చంద్రబాబు పర్యటన సందర్భంగా టీడీపీ కార్యకర్తలు ఓవరాక్షన్ చేశారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై రాళ్ల దాడికి దిగారు. ఈ క్రమంలో పలువురు వైఎస్సార్సీపీ శ్రేణులకు గాయాలయ్యాయి. వివరాల ప్రకారం.. చంద్రబాబు అన్నమయ్య జిల్లా పర్యటనలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారు. చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు ఓవరాక్షన్ చేస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఇక, టీడీపీ శ్రేణుల దాడిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో, గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా టీడీపీ కార్యకర్తలు కర్రలతో దాడులకు దిగారు. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలను టీడీపీ కార్యకర్తలు చించేశారు. ఇక, ఈ సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. దాడికి పాల్పడుతున్న టీడీపీ నేతలకు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు పట్టించుకోలేదు. ఈ క్రమంలో కొందరు టీడీపీ కార్యకర్తలు పోలీసులపైకి కూడా రాళ్లు విసిరారు. దీంతో, పోలీసులు పరిస్థితిని అదుపుచేసేందుకు లాఠీచార్జ్ చేసినట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: ‘ప్రజలకు ఉపయోగపడే పనిచేస్తే పవన్‌ను పట్టించుకునేవారేమో’ -
రమేష్ హత్య కేసును చేధించిన పోలీసులు.. సినిమాను మించిన ట్విస్ట్!
సాక్షి, విశాఖపట్నం: వన్‌టౌన్ పోలీసు స్టేషన్ కానిస్టేబుల్ బర్రి రమేష్ మృతికేసును పోలీసులు చేధించారు. రమేష్ మృతి కేసులో అతడి భార్య శివజ్యోతి అలియాస్ శివానినే హంతకురాలిగా పోలీసులు తేల్చారు. ప్రియుడి మోజులో పడి శివాని.. రమేష్‌ను హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు విశాఖ నగర కమిషనర్ త్రివిక్రమ్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఈ క్రమంలో సీపీ త్రివిక్రమ్ వర్మ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కానిస్టేబుల్ రమేష్‌ను అతడి భార్య శివాని హత్య చేయించింది. మూడు రోజుల క్రితం రమేష్ అనుమానాస్పదంగా మృతిచెందాడని శివాని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రమేష్ మృతదేహంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో డెడ్‌బాడీని పోస్టుమార్టంకు పంపించాం. రిపోర్టులో రమేష్.. ఊపిరాడక చనిపోయినట్టు తేలింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో లోతుగా విచారణ చేపట్టాం. ఈ కేసు దర్యాప్తులో భాగంగా భార్య శివానినే ప్రియుడి కోసం భర్త రమేష్‌ను చంపించింది. మూడు రోజుల క్రితం రమేష్‌తో మద్యం తాగించి వీడియో తీసింది. ఆ తర్వాత రమేష్ పడుకునే వరకు ప్రియుడు రామారావు బయటే ఉన్నాడు. అనంతరం, ఇంట్లోకి వెళ్లిన రామారావు, అతడి స్నేహితుడు రమేష్‌ను దిండుతో నొక్కి చంపాడు. ఆ సమయంలో రమేష్ కాళ్లు కదలకుండా భార్య శివానీ అతడిని పట్టుకుంది. కాగా, రమేష్‌ను చంపేందుకు నీలా అనే వ్యక్తికి లక్ష రూపాయలు సుపారీ ఇచ్చారు. అయితే.. రమేష్, శివానీ ప్రేమ వ్యవహారంపై గతంలో అనేక గొడవలు జరిగాయి. పిల్లల్ని వదిలి ప్రియుడితో వెళ్లిపోవాలని రమేష్ కోరాడు. కాగా, తమ వ్యవహారానికి రమేష్ అడ్డుగా ఉన్నారని వారిని చంపేశారు. ఇక, శివాని.. రామారావుకు బంగారం తాకట్టు పెట్టి లక్షన్నర ఇచ్చింది. శివానికి నేర స్వభావం ఉంది. ఆమె తల్లిదండ్రులతో సైతం గొడవలు ఉన్నాయి. ఈ కేసులో ఏ1గా భార్య శివాని, ఏ2గా ప్రియుడు రామారావు, ఏ3గా నీలాను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: యువతిని రూమ్‌కు తీసుకెళ్లి.. కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి ఫొటోలు.. ఆపై.. -
అధ్యాపకురాలి దారుణహత్య.. కళ్లలో కారం కొట్టి, కింద పడేసి
మదనపల్లె: ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న యువతి దారుణ హత్యకు గురికావడంతో అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. బండమీదకమ్మపల్లె వైఎస్సార్ కాలనీకి చెందిన రుక్సానా (35) ఎంఏ (ఇంగ్లిష్), బీఈడీ పూర్తిచేసి ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంగ్లిష్ అధ్యాపకురాలిగా పనిచేస్తోంది. తను డిగ్రీ చదువుతున్న సమయంలోనే వివాహం చేసుకుంది. ఒక బిడ్డ పుట్టిన తర్వాత అతడితో విడాకులు తీసుకుని తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. ప్రస్తుతం పాప పదో తరగతి చదువుతున్నది. ఈ క్రమంలో ఏపీఎస్పీడీసీఎల్లో డ్యూటీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఎస్కే ఖదీర్ అహ్మద్‌తో 2017 ఆగస్టులో మరో వివాహం జరిగింది. కొంతకాలం అనంతరం తన తల్లి వెన్నెముక నొప్పి కిత్స నిమిత్తం రుక్సానా కూడా బెంగళూరుకు వెళ్లింది. ఈ క్రమంలో భర్త ఖదీర్‌అహ్మద్ పట్టణంలోని అవంతి థియేటర్ వద్ద ఉంటున్న ఆయిషాను గుట్టుచప్పుడు కాకుండా రెండో వివాహం చేసుకున్నాడు. ఆరోగ్య సమస్యలతో ఆమెకు పిల్లలు పుట్టలేదు. ఈలోపు రుక్సానాకు మరో ఆడపిల్ల జన్మింంది. పిల్లలు పుట్టని కారణంగా భర్త ఖదీర్‌అహ్మద్ తనకు దూరమవుతాడనే భయంతో ఆయిషా పోలీస్‌స్టేషన్‌లో తనను మోసం చేసి పెళ్లిచేసుకున్నాడంటూ ఖదీర్ అహ్మద్‌తో పాటు రుక్సానాపై టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో అయిషా తమ్ముళ్ల వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ రుక్సానా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఓ ఇద్దరు యువకులు కళాశాల పనివేళలు ముగిశాక స్కటీపై ఇంటికి వెళుతున్న రుక్సానా కళ్లలో కారం కొట్టి కిందపడేలా చేశారు. మంటతో కళ్లు నులుముకుంటున్న ఆమెను అత్యంత కిరాతకంగా గొంతుకోసి, ఛాతిపై పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడిన ఆమె ఘటనాస్థలంలోనే ప్రాణాలు విడిచింది. డీఎస్పీ కేశప్ప ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆయిషా తమ్ముళ్లు తమ కుమార్తె రుక్సానాను దారుణంగా చంపేశారని ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. భర్త ఖదీర్‌అహ్మద్ మాట్లాడుతూ.. ఆయిషా తమ్ముళ్లపై రౌడీషీటర్ కేసులు నమోదై ఉన్నాయని, వారు తాము చెప్పినట్లు వినకపోతే ఇద్దరినీ చంపేస్తామని బెదిరింనట్లు చెప్పాడు. ఈ విషయమై కోర్టులో కేసు నడుస్తున్నదని తెలిపారు. తమకు ప్రాణహాని తలపెడతారేమోనని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని వాపోయాడు. అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు జిల్లా ఆస్పత్రికి చేరుకుని రుక్సానా మృతదేహాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. -
యువతిని రూమ్‌కు తీసుకెళ్లి.. కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి ఫొటోలు.. ఆపై..
హైదరాబాద్(వెంగళరావునగర్): పబ్జి గేమ్ ద్వారా స్నేహాన్ని పెంచుకున్న యువకుడు ఓ మహిళను శారీరకంగా కలవడమే కాకుండా నగ్న ఫొటోలు అందరికీ పంపుతానని బెదిరించడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన ఆంధ్రాలోని కోనసీమలో చోటు చేసుకుంది. ఈ కేసును తెలంగాణలోని మధురానగర్ పోలీస్ స్టేషన్‌కు ఆ రాష్ట్ర పోలీసులు బదిలీ చేశారు. మధురానగర్ పోలీసుల సమాచారం మేరకు.. ఆంధ్రాలోని కోనసీమ జిల్లా గండేపల్లి మండలం పి.వినాయకంపల్లి గ్రామానికి చెందిన జాషువా, ఓ మహిళ, కపిలేశ్వరం మండలం అంగర గ్రామానికి చెందిన వి.నరసింహమూర్తి పబ్జి గేమ్ ద్వారా స్నేహితులయ్యారు. ఆ మహిళ ఇటీవల తన మేనమామ జాషువాను వివాహం చేసుకుంది. వారి వివాహం తర్వాత నరసింహమూర్తి ఆ మహిళను ప్రేమ పేరుతో సందేశాలు పంపాడు. ఈ విషయాన్ని గమనించిన మహిళ భర్త జాషువా ఆమెతో గొడవపడ్డాడు. దాంతో ఆమె ఉద్యోగం చేసుకుంటానని చెప్పి హైదరాబాద్‌లోని బల్కంపేటలో ఉండే తన స్నేహితురాలు నవ్యను కలిసింది. ఇటీవల నవ్య ద్వారా ఆ మహిళ అడ్రస్‌ను తెలుసుకున్న నర్సింహమూర్తి హైదరాబాద్ వచ్చాడు. ఆమె గదిలోనే రెండు రోజులు గడిపాడు. అనంతరం తన స్నేహితురాలు మంచిది కాదని ఆమెను నమ్మించి అమీర్‌పేటలోని సిద్ధి వినాయక హాస్టల్‌కు తరలించి అక్కడే ఇద్దరూ ఉంటున్నారు. ఈ క్రమంలో నిందితుడు నీ భర్తకు విడాకులిస్తే నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. చదవండి: దంపతుల మధ్య ‘బ్యూటీ పార్లర్’ చిచ్చు.. భర్త కోరిక తీర్చడానికి ప్రయత్నించి.. జవహర్‌నగర్‌లోని తన మరో గదికి తీసుకెళ్లి కూల్ డ్రింక్‌లో మద్యం కలిపి ఆమె మత్తులో ఉన్నప్పుడు నగ్న ఫొటోలు తీశాడు. తనతో శారీరకంగా కలవకపోతే అందరికీ వాటిని పంపుతానని బెదిరించి లొంగదీసుకున్నాడు. ఆందోళన చెందిన ఆమె ఆంధ్రాకు వచ్చి నిందితుని స్వగ్రామమైన అంగర గ్రామ బస్టాప్ వద్ద ఆత్మహత్యకు ప్రయత్నం చేసింది. ఆమెను చుట్టుపక్కల వారు, బంధువులు సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం ఈ కేసును నిందితుడు ఉంటున్న హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు జరుగుతోంది. -
Viveka Case: దర్యాప్తు తీరు ఆద్యంతం సందేహాస్పదం.. ‘ద వైర్’ కథనం -2
వివేకాను చివరిగా ఎవరు చూశారు? వాచ్మెన్ రంగన్న ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం 2019 మార్చి 14 రాత్రి 12 గంటల సమయంలో వివేకా తన నివాసం నుంచి బయటకు వచ్చి సిగరెట్ తాగడం రంగన్న చూశాడు. నిందితులు కాకుండా వివేకా జీవించి ఉండగా చివరిసారిగా చూసిన వ్యక్తి రంగన్న. పోలీసు దర్యాప్తు నియమావళి ప్రకారం జీరో అవర్‌గా పిలిచే అప్పటి నుంచే దర్యాప్తు మొదలు కావాలి. అయితే 2021లో దస్తగిరి ఇచ్చిన అప్రూవర్ వాంగ్మూలం గానీ అనంతరం రంగన్న ఇచ్చిన వాంగ్మూలంలోగానీ 11.30 గంటలకు ఎర్ర గంగిరెడ్డి వివేకా నివాసానికి వచ్చారని చెప్పడం గమనార్హం. సాక్షి, అమరావతి: మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు తీరు ఆద్యంతం అశాస్త్రీయం, అహేతుకం, అసంబద్ధం, సందేహాస్పదంగా ఉందని ప్రముఖ జాతీయ వార్త వెబ్సైట్ ‘ద వైర్’ కుండబద్దలు కొట్టింది. రాజకీయ కారణాలతోనే హత్య జరిగిందని చెబుతున్న సీబీఐ.. కీలకమైన ఆస్తి వివాదం కోణాన్ని విస్మరించడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. వివేకా హత్య అనంతరం ఆయన నివాసంలో నిందితులు ఆస్తి పత్రాల కోసం వెతికారన్నది స్పష్టమవుతున్నా, ఆ కోణంలో ఎందుకు దర్యాప్తు చేయడం లేదని ప్రశ్నించింది. రెండున్నరేళ్ల తర్వాత హఠాత్తుగా గుర్తుకొచ్చిందా? నార్కో ఎనాలిసిస్ పరీక్షల్లో కూడా ఏమీ చెప్పని వాచ్మెన్ రంగన్నకు రెండున్నరేళ్ల తర్వాత అంతా గుర్తుకు వచ్చినట్టు సీబీఐ వాంగ్మూలం నమోదు చేయడంపై సందేహాలు వ్యక్తం చేసింది. ఇక కీలక ఆధారంగా గొప్పగా ప్రకటించిన గూగుల్ టేక్ అవుట్ డాటా పూర్తిగా తప్పని స్వయంగా సీబీఐనే ప్రకటించడాన్ని ‘ద వైర్’ ప్రధానంగా ప్రస్తావించింది. రాజకీయ, నేర సంబంధమైన పరిశోధనాత్మక పాత్రికేయంలో 20 ఏళ్ల అనుభవం ఉన్న ప్రముఖ జర్నలిస్ట్ సరితా రాణి రాసిన రెండు విశ్లేషణాత్మక కథనాలను ‘ద వైర్’ వెబ్సైట్ ప్రముఖంగా ప్రచురించింది. సాక్షుల వాంగ్మూలాల పేరిట కట్టు కథలా? మొదటి కథనంలో సీబీఐ దర్యాప్తులో డొల్లతనాన్ని బట్టబయలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రచురించిన రెండో కథనంలో మరింత లోతుగా విశ్లేషించి సీబీఐ దర్యాప్తు తీరును ఎండగట్టింది. సీబీఐ ప్రస్తావించిన ఐపీడీఆర్ డాటా కూడా హేతుబద్ధ ఆధారం కాదని తేల్చి చెప్పింది. దర్యాప్తునకు ఆధారంగా చెబుతూ సాక్షుల వాంగ్మూలాల పేరిట సీబీఐ చెబుతోంది కట్టు కథలేనని స్పష్టం చేసింది. ఏకంగా 14 మంది సాక్షులు సీబీఐ తీరును తప్పుబట్టడం.. ఏకంగా రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం సీబీఐపైనే న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. ఏ కోణంలో చూసినా సరే వివేకా హత్య కేసు దర్యాప్తులో సీబీఐ దారి తప్పిందనే విషయాన్ని స్పష్టం చేసింది. వాచ్మెన్ రంగన్న అప్పుడలా.. ఇప్పుడిలా వివేకా హత్య కేసు దర్యాప్తు చేసిన మొదటి దర్యాప్తు అధికారి చెప్పిన దాని ప్రకారం.. వాచ్మెన్ రంగన్న 2019 మార్చి 14వ తేదీ రాత్రి వివేకానందరెడ్డి నివాసం వరండాలో నిద్రపోయాడు. ఎన్నికల ప్రచారం ముగించుకుని రాత్రి 11.30 గంటల సమయంలో వివేకానందరెడ్డి తన నివాసానికి చేరుకున్నారు. కారు శబ్దం వినిపించి రంగన్న నిద్ర లేచి గేటు తెరిచాడు. వివేకా ఇంటి వద్ద దిగిపోయాక.. కారు డ్రైవర్ ప్రసాద్ ఇంటికి వెళ్లిపోయాడు. ‘నేను నిద్రపోతాను.. నువ్వు నిద్రపో’ అని వివేకా రంగన్నతో చెప్పి తన నివాసంలోకి వెళ్లిపోయారు. నార్కో ఎనాలిసిస్ ఎందుకు బయటకు రాలేదు? ఆ తర్వాత వివేకాను ఆయన నివాసంలో ఆ రోజు రాత్రి హత్య చేస్తుంటే బయటే ఉన్న రంగన్న ఏం చేశాడనే దానిపై టీడీపీ ప్రభుత్వ హయాంలోని పోలీసు అధికారులు విచారించనే లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక కొన్ని వారాల తర్వాత రంగన్న పేరు కూడా అనుమానితుల జాబితాలో చేర్చారు. మరికొందరు అనుమానితులతోపాటు రంగన్నను కూడా అహ్మదాబాద్ తీసుకువెళ్లి నార్కో ఎనాలిసిస్ పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో ఎలాంటి విషయాన్ని రాబట్ట లేదు. మరి రంగన్నకు ఏదైనా విషయం తెలిసి ఉంటే నార్కో ఎనాలిసిస్ పరీక్షల్లో బయటపడేది కదా! రెండున్నరేళ్ల తర్వాత అన్నీ గుర్తుకొచ్చాయా? వివేకా హత్య జరిగిన రెండున్నరేళ్ల తర్వాత సీబీఐ రంగన్నను ప్రత్యక్ష సాక్షిగా న్యాయస్థానంలో హాజరు పరిచింది. ఈ సారి రంగన్న కొన్ని కొత్త విషయాలు చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. 2019 మార్చి 14న రాత్రి వివేకాను ఇంటి వద్ద దించేసి డ్రైవర్ ప్రసాద్ వెళ్లిపోయిన తర్వాత.. 15 నిమిషాలకు అంటే 11.45 గంటలకు వివేకా స్నేహితుడు ఎర్ర గంగిరెడ్డి అక్కడికి చేరుకున్నాడని చెప్పాడు. దర్యాప్తులో ఇదే కీలకమైన టర్నింగ్ పాయింట్. ఎందుకంటే ఈ మొత్తం ఎపిసోడ్లో దస్తగిరి, రంగన్న వాంగ్మూలాలు రెండు చోట్ల సరిపోలుతున్నాయి. వివేకా నివాసానికి ఎర్ర గంగిరెడ్డి రావడం.. వెళ్లడం అనే అంశాలు. మృతదేహాన్ని అర్ధరాత్రే చూసిన రంగన్న 2021 జూలైలో జమ్మలమడుగు న్యాయస్థానంలో రంగన్న ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. 2019 మార్చి 14 అర్ధరాత్రి వివేకా నివాసం నుంచి శబ్దాలు రావడంతో కిటికీ వద్దకు వెళ్లి లోపలికి చూశాడు. లోపల నలుగురు వ్యక్తులు హాల్, బెడ్ రూమ్‌లలో తిరుగుతూ దేని కోసమో వెతుకుతున్నారు. రంగన్న ఓ చెట్టు వెనుక దాక్కున్నాడు. సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి బయటకు వచ్చి గోడదూకి వెళ్లిపోవడం చూశాడు. అనంతరం ఎర్ర గంగిరెడ్డి బయటకు వచ్చి విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించి వెళ్లాడు. ఆ తర్వాత అంటే తెల్లవారుజామున 3 గంటల సమయంలో రంగన్న వివేకా నివాసం లోపలికి వెళ్లాడు. బెడ్రూమ్లో మంచం పక్కన రక్తం పడి ఉంది. బాత్రూమ్లో వివేకా కింద పడిపోయి ఉన్నారు. ఆయన చుట్టూ రక్తం మడుగు కట్టి ఉంది. సాక్షులు చెప్పని విషయాలు చెప్పినట్లు.. సాక్షుల వాంగ్మూలాల పేరిటా సీబీఐ అడ్డదారులు తొక్కింది. సాక్షులు చెప్పని విషయాలు చెప్పినట్టుగా గతంలో దర్యాప్తు అధికారిగా ఉన్న రామ్‌సింగ్ నమోదు చేయడం వివాదాస్పదమవుతోంది. కనీసం 14 మంది సాక్షులు తాము చెప్పని విషయాలను చెప్పినట్టుగా సీబీఐ వాంగ్మూలం నమోదు చేయడాన్ని ఖండించారు. నలుగురు సాక్షులు రామ్‌సింగ్‌కు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇదే విషయాన్ని ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు రాసిన లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు కూడా. వివేకా చనిపోయారనే విషయాన్ని 2019 మార్చి 15న ఉదయం 6.15 గంటలకు ఆయన పీఏ కృష్ణా రెడ్డి గుర్తించారు. చెప్పని విషయాలు ఎలా ఆపాదిస్తారు? అంతకు ముందే వివేకా మరణం గురించి ఎవరికైనా తెలుసా అనే కోణంలో సీబీఐ దృష్టి సారించింది. వివేకా హత్య గురించి గజ్జెల ఉదయ్ కుమార్ రెడ్డికి 2019 మార్చి 15 తెల్లవారు జామున 4 గంటలకే తెలుసని ఆయన తల్లి తమ పొరుగున ఉండే ప్రభావతి దేవికి చెప్పినట్టుగా సీబీఐ చార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఆ మేరకు ప్రభావతి దేవి 161 వాంగ్మూలం ఇచ్చినట్టు కూడా వెల్లడించింది. కానీ సీబీఐ వాదనను ప్రభావతి దేవి ఖండించారు. తాను చెప్పని విషయాలను చెప్పినట్టుగా సీబీఐ తన పేరిట వాంగ్మూలం నమోదు చేసుకుందని ఆవిడ స్పష్టం చేశారు. (చదవండి : Viveka Case: దారి తప్పిన 'సీబీఐ దర్యాప్తు') అజేయ కల్లం పేరిట తప్పుడు వాంగ్మూలం సాధారణ వ్యక్తులే కాదు.. ఏకంగా రాష్ట్ర రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వాంగ్మూలాన్ని కూడా సీబీఐ వక్రీకరించడం వివాదాస్పదమైంది. అజేయ కల్లం చెప్పని విషయాలను చెప్పినట్టుగా సీబీఐ తప్పుడు వాంగ్మూలం నమోదు చేసి చార్జ్ïÙట్లో పేర్కొంది. దీన్ని అజేయ కల్లం తీవ్రంగా ఖండిస్తూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడం సీబీఐ తీరును ఎండగడుతోంది. అజేయ కల్లం చెప్పింది ఇది 2019 మార్చి 15 ఉదయం 5 గంటలకు పార్టీ మేనిఫెస్టో కమిటీ సమావేశం మొదలైంది. గంటన్నర తర్వాత అంటే 6.30 గంటల సమయంలో సహాయకుడు వచ్చి ఓఎస్డీ కృష్ణ మోహన్‌రెడ్డిని పిలిచారు. ఆయన బయటకు వెళ్లారు. తర్వాత కాసేపటికి కృష్ణమోహన్‌రెడ్డి వచ్చి వైఎస్ జగన్ చెవిలో ఏదో చెప్పారు. దాంతో నిశ్చేష్టులైన వైఎస్ జగన్ వెంటనే లేచారు. తన చిన్నాన్న వివేకానందరెడ్డి చనిపోయారు అని మాతో చెప్పారు. వెంటనే సమావేశాన్ని ఆపేసి బయటకు వచ్చాం’ అజేయ కల్లం చెప్పారంటూ CBI మార్చిన వాంగ్మూలం ఇది ‘2019 మార్చి 15 ఉదయం 5.30 గంటలకు హైదరాబాద్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసంలో పార్టీ మేనిఫెస్టో కమిటీ సమావేశం జరుగుతుండగా.. ఇంట్లో సహాయకుడు వచ్చి వైఎస్ భారతి పిలుస్తున్నారని వైఎస్ జగన్‌కు చెప్పారు. దాంతో లోపలికి వెళ్లిన జగన్ కాసేపటి బయటకు వచ్చి తన చిన్నాన్న వివేకానందరెడ్డి మరణించినట్టు అక్కడ ఉన్న మాకు చెప్పారు’ అని అజేయ కల్లం వాంగ్మూలంలో పేర్కొన్నట్టు సీబీఐ తెలిపింది. దీన్ని అజేయ కల్లం తీవ్రంగా ఖండించారు. అసలు వైఎస్ భారతి పేరును తాను ప్రస్తావించలేదని, అలాగే తాను 6.30 గంటలని చెప్పగా 5.30 గంటలుగా సీబీఐ పేర్కొందని ఆయన తప్పుబట్టారు. అయినా బయట నిద్రించిన రంగన్న! రక్తం మడుగులో తన యజమాని వివేకానందరెడ్డి చనిపోయి ఉండడాన్ని చూసిన తర్వాత రంగన్న ఏం చేశారంటే.. ఆయన ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం తలుపు దగ్గరకు మూసివేసి బయటకు వచ్చి అటూ ఇటూ చూశాడు. ఎవరూ కనిపించకపోవడంతో అక్కడే బీడీ తాగాడు. కాసేపు మెట్ల మీద కూర్చున్నాడు. కాసేపట్లో సమీపంలోని మసీదు నుంచి ఉదయం ప్రార్థనలు వినిపించాయి. దాంతో అక్కడే వరండాలో నిద్రపోయాడు. సీబీఐ అధికారులు ఆ ప్రాంతంలో ఉన్న రెండు మసీదుల్లోని మత పెద్దలతో మాట్లాడారు. వారు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం రోజూ ఉదయం 5 గంటలకు మసీదులో ప్రార్థనలు మొదలవుతాయి. అప్పటికి 15 నిమిషాల ముందే మసీదు మైకుల ద్వారా ఆజాన్ వినిపించడం మొదలు పెడతారు. అంటే తెల్లవారు జామున 3.30 గంటల నుంచి 4.45 గంటల మధ్యలో రంగన్న తన యజమాని వివేకా మృతదేహాన్ని చూశాడు. కానీ తన వద్ద ఉన్న ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్న వివేకా వద్ద పని చేసే సిబ్బందికి గానీ.. అక్కడికి పది నిమిషాల్లోనే వెళ్లగలిగేంత సమీపంలో ఉన్న డ్రైవర్ ప్రసాద్ నివాసానికి గానీ.. మరెవరికైనా చెప్పాలనిగానీ అనుకోలేదు. ఉదయం 5.30 గంటల నుంచి 6 గంటల మధ్య వివేకా పీఏ కృష్ణా రెడ్డి, వంటమనిషి లక్షి, ఆమె కుమారుడు ప్రకాశ్ వచ్చే వరకు నిద్రపోతున్నట్టు నటిస్తూ గడిపాడు. పైగా ఉదయం వివేకా నివాసం ఉత్తరం వైపు తలుపు తెరచి ఉండటాన్ని చూసిన పీఏ కృష్ణా రెడ్డి.. తనను ఇంటి లోపలికి వెళ్లి చూడమంటే రంగన్న లోపలికి వెళ్లాడు. అప్పుడు వివేకా మృతదేహాన్ని మొదటి సారి చూసినట్టుగా అందర్నీ నమ్మించాడు. ఆ విషయాన్ని 861 రోజుల తర్వాత సీబీఐ ద్వారా న్యాయస్థానంలో ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. హత్య జరిగిన రెండేళ్ల తర్వాత దస్తగిరి ఇచ్చిన అప్రూవర్ వాంగ్మూలం, రంగన్న ఇచ్చిన వాంగ్మూలం తప్ప మరే ఆధారం లేదు. -
బాలికపై లైంగికదాడికి పాల్పడిన ఆటో డ్రైవర్‌కు 15 ఏళ్లు జైలు
విశాఖ లీగల్: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఆటోడ్రైవర్‌కు 15 ఏళ్లు జైలుశిక్ష, రూ.50వేలు జరిమానా విధిస్తూ విశాఖ నగరంలోని ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జి.ఆనందిని గురువారం తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించకపోతే అదనంగా ఏడాదిపాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. పోక్సో చట్టం కింద బాలికకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షలు పరిహారం చెల్లించాలని న్యాయమూర్తి సూచించారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కరణం కృష్ణ అందించిన వివరాల మేరకు... విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం రాంజీ ఎస్టేట్‌కు చెందిన పదహారేళ్ల బాలిక 2016లో నగరంలోని రామా టాకీసు వద్ద ఉన్న ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరింది. మరికొందరు బాలికలతో కలిసి ఆమె ప్రతి రోజు ఆటోలో కళాశాలకు వెళ్లేది. ఈ క్రమంలో 2016, సెప్టెంబర్ 29న ఆటో డ్రైవర్ సాయిగణేష్(25) ఆ బాలికను ఒంటరిగా రామాటాకీస్ దగ్గర నుంచి పోర్టు స్టేడియం రోడ్డు మీదుగా అక్కయ్యపాలెం పైపుల సందులోకి తీసుకువెళ్లాడు. అక్కడ బాలికతో వికృతంగా ప్రవర్తించి లైంగిక దాడి చేశాడు. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో తిరిగి ఆటోలో తీసుకువచ్చి ఆమె ఇంటి దగ్గర వదలిపెట్టాడు. ఆటో డ్రైవర్ లైంగికదాడికి పాల్పడిన విషయాన్ని బాధితురాలు తన తల్లికి తెలియజేసింది. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో తొలుత ఆమెను సెవెన్ హిల్స్ ఆస్పత్రికి, ఆ తర్వాత కేజీహెచ్‌కి తరలించి చికిత్స చేయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విశాఖ నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేశారు. అనంతరం కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. నిందితుడిపై నేరం రుజువు కావడంతో 15 ఏళ్లు జైలు శిక్ష, రూ.50వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. -
కానిస్టేబుల్ భార్య పైశాచికం.. ప్రియుడి మోజులో పడి, ఇంటికి పిలిచి..
ఎంవీపీకాలనీ (విశాఖపట్నం): వన్‌టౌన్ పోలీసు స్టేషన్ కానిస్టేబుల్ మృతి కేసు కొత్త మలుపు తిరిగింది. ప్రియుడితో కలిసి భార్యే అతన్ని హత్య చేసినట్లు తెలిసింది. 2009 బ్యాచ్‌కు చెందిన బర్రి రమేష్ (35) ఆదర్శనగర్‌లో ఉంటూ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే బుధవారం ఉదయం అతను చనిపోయినట్లు ఎంవీపీ పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బెడ్‌పై విగతజీవిగా ఉన్న రమేష్‌ను పరిశీలించారు. అనంతరం భౌతికకాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. రాత్రి మద్యం సేవించి పడుకున్నాడని, తెల్లవారి లేచి చూసేసరికి చనిపోయి ఉన్నాడని అతని భార్య బుధవారం పోలీసులకు తెలిపింది. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కాగా.. రమేష్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ.. అతని అన్నయ్య బర్రి అప్పలరాజు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆ దిశగా ప్రారంభమైన పోలీసుల విచారణలో అవాక్కయ్యే వాస్తవాలు వెలుగుచూసినట్లు సమాచారం. ప్రియుడిపై మోజుతో కానిస్టేబుల్ రమేష్ భార్య శివజ్యోతి అలియాస్ శివాని.. భర్త హత్యకు ప్లాన్ చేసినట్లు తెలిసింది. టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్న రామారావు అనే వ్యక్తితో ఆమెకు కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో రమేష్‌ను అడ్డు తొలగించుకునే క్రమంలో హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు భావిస్తున్నారు. మంగళవారం రాత్రి రమేష్ మద్యం తాగి పడుకున్న సమయంలో హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ప్రియుడితో కలిసి తలగడతో నొక్కి ఊపిరాడకుండా చేసి చంపినట్లు ప్రచారం జరుగుతోంది. భర్త బెడ్‌పై గిలగిల కొట్టుకుంటుప్పుడు భార్య శివాని సెల్ఫోన్లో తీసిన వీడియో పోలీసులకు చిక్కినట్లు తెలిసింది. అయితే ఆ వీడియో ఎందుకు తీసింది? హత్యకు దారి తీసిన పరిణామాలు ఏంటి? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఆమె వద్ద లభించిన వీడియోలో దృశ్యాలు నేపథ్యంలో అతనిని తలగడతో నొక్కి చంపి ఉంటారా? లేదా విష ప్రయోగం చేశారా అనే కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం ఆమె ప్రియుడు రామారావును, గురువారం ఆమెను ఎంవీపీ పోలీసులు పూర్తిస్థాయిలో విచారించినట్లు సమాచారం. అయితే ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు పోలీసులు అందుబాటులోకి రాలేదు. దర్యాప్తు పట్ల పూర్తి గోప్యత పాటిస్తున్నారు. వీరు వెల్లడించిన వివరాలతో పాటు పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు మరింత లోతైన విచారణ చేపట్టి.. అనంతరం ఈ కేసు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. -
వివాహితపై టీడీపీ నేత లైంగిక వేధింపులు
అనంతపురంశ్రీకంఠంసర్కిల్: అనంతపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకరచౌదరి ప్రధాన అనుచరుడు, ఆ పార్టీ క్లస్టర్ ఇన్చార్జ్ మార్కెట్ మహేష్ ఓ వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వన్‌టౌన్ సీఐ రెడ్డెప్ప తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనంతపురం వేణుగోపాల్‌నగర్‌కు చెందిన ఓ యువతి ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. ఆమెకు తన భర్త ద్వారా అంబార్ గేరి వాసి.. ప్రస్తుతం భవానీనగర్‌లో ఉంటున్న టీడీపీ క్లస్టర్ ఇన్చార్జ్ మార్కెట్ మహేష్ ఏడాది క్రితం పరిచయమయ్యాడు. అప్పటినుంచి అవకాశం దొరికిన ప్రతిసారి లైంగిక వేధింపులకు గురిచేయసాగాడు. ఈ ఏడాది జూలై 27న ఆ యువతి భర్త మిత్రులంతా కలసి గోవా టూర్ ప్లాన్ చేశారు. భర్తకు వేరే పని పడడంతో యువతిని టూర్‌కు పంపాడు. అక్కడ ఆమె సోదరుడి వరుసైన వ్యక్తితో కలసి తీసుకున్న వీడియోలు, ఫొటోలను ఎవరి ద్వారానో తెప్పించుకున్నాడు. తన కోరిక తీర్చకపోతే వాటిని యువతి భర్తతో పాటు అందరికీ పంపుతానని బెదిరించాడు. దీంతో బాధితురాలు బుధవారం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు టీడీపీ నాయకుడు మహేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా మహేష్ ను రక్షించేందుకు బడా టీడీపీ నేతలు రంగంలోకి దిగినట్లు తెలిసింది. -
గ్రేహౌండ్స్ భూమిపై ఎల్లో రాబందుల కళ్లు.. పచ్చ గుండాలకు సుప్రీం కోర్టు షాక్
సాక్షి, ఢిల్లీ: 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు, ఆయన నాయకత్వంలోని టిడిపిలో ఏ చాప్టర్ చూసినా ఏదో ఒక అక్రమాలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. చంద్రబాబుతో తిరిగే వాళ్లెవరయినా.. ఏదో ఒక కేసులో ఇరుక్కోవడం తరచుగా బయటపడుతోంది. హైదరాబాద్ భూమి వెనక బాబు అనుచరుడు రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవుల రెవెన్యూ పరిధి. హైదరాబాద్ శివార్లలో అత్యంత విలువైన భూమి. 143 ఎకరాల ఈ భూమి విలువ అక్షరాలా పది వేల కోట్లు. దీన్ని గతంలో గ్రే హౌండ్స్ సంస్థకు కేటాయించారు. దేశంలో శాంతి భద్రతలను రక్షించే సంస్థల్లో ఒకటయిన గ్రౌహౌండ్స్ కే ఎసరు పెట్టేందుకు ప్రయత్నించారు టిడిపి నేత ఒకరు. ఆయనే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరఫున నంద్యాల పార్లమెంట్ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగుతున్న మాండ్ర శివానందరెడ్డి. రెండు దశాబ్దాలుగా ప్లాన్ అప్పట్లో పోలీస్ శాఖలో పని చేసిన మాండ్ర శివానందరెడ్డికి ఈ స్థలం వెనకున్న లూపోల్స్ కొన్ని తెలుసు. ఇంకేముంది.. ఈ భూమినే కొట్టేసేందుకు రకరకాల కుట్రలు పన్నారు. చంద్రబాబు అండతో రకరకాల కొత్త డాక్యుమెంట్లు సృష్టించారు. అసైన్డ్ భూముల క్రయ విక్రయాలు చెల్లవని తెలిసినప్పటికీ తామే జీపీఏ హోల్డర్లమంటూ దందా సాగించారు. అయితే ఈ కుట్రలకు సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. 1994 నుంచి కొనసాగుతున్న భూ వివాదానికి ముగింపు పలికింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? రూ.10 వేల కోట్ల విలువైన ఈ భూమిని కొట్టేసేందుకు రకరకాల కుట్రలు చేశారు. మంచిరేవులలోని ఈ భూములకు విలువ పెరగడంతో వాటిపై రాబందుల కళ్లు పడ్డాయని రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ల్యాండ్ మాఫియా జోక్యం కూడా కనిపిస్తోంది. ఈ భూములపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు తుదివి. ఎలాంటి జోక్యాలు అనుమతించబోం. ఇక ముందు ఈ వ్యవహారంలో ఎలాంటి పిటిషన్ లను అనుమతించబోం. అలాగే కింది కోర్టులు కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దు.’’ అని జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం స్పష్టం చేసింది. హక్కులన్నీ ప్రభుత్వానికే రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవులలోని 142.39 ఎకరాల భూయాజమాన్య హక్కులు పూర్తిగా తెలంగాణ ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తాజా ఆదేశాలతో 1994 నుంచి కొనసాగుతున్న భూవివాదానికి ముగింపు పలికినట్టయింది. ఈ భూములపై కిందిస్థాయి కోర్టులు, హైకోర్టు ఎలాంటి జోక్యం చేసుకునే అధికారం లేదని, ఇప్పుడు ఇచ్చిన తీర్పే తుదితీర్పు అని ఆదేశాల్లో పేర్కొంది. సదరు భూమి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతుందని, తదుపరి కేటాయింపులపై దాని యాజమాన్య, స్వాధీన హక్కులు ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకొని గ్రేహౌండ్స్‌కు బదిలీ చేయాలని చెప్పింది. బాబు బ్యాచ్ లో మహా ముదుర్లు చంద్రబాబు రాజకీయ ప్రస్థానంలో ఆయన వెంట బాగా దగ్గరగా నడిచిన వాళ్లలో, లేదా చంద్రబాబుతో కలిసి రకరకాల వ్యవహారాలు నడిపిన వాళ్లలో చాలా మంది ఇప్పుడు ఇబ్బందుల్లో ఇరుక్కున్నారు. మార్గదర్శి స్కాంలో బాబు ఫ్రెండ్ రామోజీరావు, అవినీతి కేసులో బాబు ఫ్రెండ్ సింగపూర్ ఈశ్వరన్, ఓటుకు కోట్లు కేసులో బాబు అనుచరుడు రేవంత్ రెడ్డి, అమరావతి రాజధాని కేసులో పార్టీ నేతల్లో చాలా మంది.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితా చాలా దూరం వెళ్తుంది. -
విశాఖలో లేడీ డాక్టర్ నిర్వాకం.. అర్ధరాత్రి తప్పతాగి..
సాక్షి, విశాఖపట్నం: నగరంలో వీఐపీ రోడ్డులో ఓ ఇన్నోవా కారు బీభత్సం సృష్టించింది. అర్ధ రాత్రి మందుబాబులు, మందు భామలు రెచ్చిపోయారు. వీరంతా ఉన్నత చదువులు చదువుకున్నవారు గమనార్హం. ఇందులో ఓ లేడీ డాక్టర్, ముగ్గురు మెడికోలు ఉన్నారు. వీరు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు.. ఫుట్ పాత్ పై ఉన్న 8 టూ వీలర్లను ఢీ కొట్టింది. సోమా పబ్‌లో రూం నంబర్ 102 లో నలుగురు మద్యం సేవించారు. మద్యం మత్తులో అతివేగంగా డ్రైవ్ చేయడంతో అదుపు తప్పి 8 వాహనాలను కారు ఢీకొట్టింది. కారును అక్కడే వదిలేసి.. అందులో ఉన్నవారంతా పరారీ అయ్యారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మందుబాబులు అర్ధరాత్రుళ్లు తప్ప తాగి నడిరోడ్లపై డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తూ నడిరోడ్లపై టెర్రర్ పుట్టిస్తున్నారు. ఈ ఘటన విశాఖ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి లోని సోమా పబ్ వద్ద అర్థరాత్రి చోటు చేసుకుంది. నిన్న రాత్రి ఒక లేడీ డాక్టర్, ముగ్గురు మెడికల్ స్టూడెంట్స్ ఫుల్ గా మద్యం సేవించి హంగామా సృష్టించినట్టు సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు. సోమా పబ్ లో 11 గంటల వరకు రూం నంబర్ 102 లో నలుగురు మద్యం సేవించినట్టు తేలింది. వేగంగా కారుతో దూసుకొచ్చిన లేడీ డాక్టర్ 8 వాహనాల ను ఢీ కొట్టినట్టు వీడియో దృశ్యాల ద్వారా తేలింది. ఇప్పటికే ఈ ఘటనపై కేసు నమోదు చేశారు విశాఖ త్రీ టౌన్ పోలీసులు. -
జేసీ ప్రభాకర్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: అనంతపురం(ఏపీ) టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. తెలంగాణలో దివాకర్ ట్రావెల్స్ BS3 వాహనాలను.. BS4గా మార్చి నడుపుతున్నారని అభియోగాలకుగానూ ఈ పరిణామం చోటు చేసుకుంది. నెలలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆయన్ని నోటీసుల్లో హైకోర్టు ఆదేశించింది. దివాకర్ ట్రావెల్స్ బీఎస్-3 వాహనాలను కొని బీఎస్-4 వాహనాలుగా మార్చి నడుపుతున్నట్టు గతంలో అధికారుల సోదాల్లో నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో కేసు నమోదు చేసి.. కర్ణాటక, ఏపీలోని పలు వాహనాలను సైతం సీజ్ చేశారు. అయితే తెలంగాణలో మాత్రం ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. జేసీ ట్రావెల్స్ వ్యవహారాలపై తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును సీబీఐకి విచారణకు అప్పగించాలని పిటిషన్ వేశారు. 2020, అక్టోబర్ 12న తెలంగాణ రవాణా శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశానని, అయినా చర్యలు తీసుకోలేదని తన పిటిషన్లో ఎమ్మెల్యే పెద్దారెడ్డి తెలిపారు. తెలంగాణలో మాత్రం బస్సులను అక్రమంగా నడుపుతున్నారని, ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్నించిన హైకోర్టు, కౌంటర్ దాఖలు చేయాలని కోరుతూ.. జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు ప్రతివాదులైన తెలంగాణ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, రవాణాశాఖ కమిషనర్, డీజీపీ, సీబీఐలకు నోటీసులు జారీ చేసింది. -
టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు ఇంట్లో ఈడీ సోదాలు
సాక్క్షి, గుంటూరు: టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దాడులు చేపట్టింది. మంగళవారం ఉదయం నుంచే ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో సోదాలు జరుపుతోంది. ట్రాన్స్‌స్టాయ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ.. బ్యాంకు రుణాల ఎగవేత అంశంపై గతంలో మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. కేసు విచారణలో భాగంగానే రాయపాటి నివాసంలో తనిఖీలు చేపట్టారు అధికారులు. హైదరాబాద్, గుంటూరు సహా తొమ్మిది చోట్ల సోదాలు నిర్వహించామని, రాయపాటి, ఇతర ప్రమోటర్ల కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు జరిగాయని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు హైదరాబాద్ నగరంలో మరోసారి ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. జూబ్లీహిల్స్, మణికొండ, పంజాగుట్టలో మంగళవారం(ఆగస్టు1) ఉదయం నుంచే దాడులు జరుపుతోంది. మాలినేని సాంబశివరావుతో పాటు పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మొత్తం 15 బృందాలతో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. చదవండి: నార్కో టెస్ట్‌కు నేను రెడీ : పొంగూరు ప్రియ -
పెందుర్తిలో వృద్ధురాలు దారుణ హత్య
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో ఓ వృద్దురాలు దారుణ హత్యకు గురైంది. పెందుర్తిలోని సుజాతనగర్‌కు చెందిన వరలక్ష్మి దంపతులు(70) ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతున్నారు. ఇటీవల వారి వద్ద ఉల్లిపాయలు కట్ చేసే వర్కర్‌గా వెంకటేష్ ఉద్యోగంలో చేరాడు. ఈ క్రమంలో వరలక్ష్మి ఇంట్లో డబ్బు ఉందని భావించిన వెంకటేష్.. నిన్న రాత్రి ఆమె ముఖంపై దిండుతో అదిమి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లాడు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పెందుర్తి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితుడు వృద్ధురాలు నివాసముంటున్న అపార్ట్మెంట్ లోపలికి వచ్చి బయటకు వెళ్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో గుర్తించారు. వీటి ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు. అయితే నెల రోజుల క్రితమే వెంకటేష్ పనిలో చేరినట్లు పోలీసులు గుర్తించారు. -
మాజీ మంత్రి నారాయణకు షాక్.. పోలీసులను ఆశ్రయించిన ప్రియ
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి నారాయణపై ఆయన తమ్ముడి భార్య ప్రియ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తనకు న్యాయం చేయాలని ప్రియ.. తాజాగా పోలీసులను ఆశ్రయించారు. కాగా, బాధితురాలు ప్రియ ఆదివారం రాయదుర్గం పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. ఈ సందర్బంగా మాజీమంత్రి నారాయణపై ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదులో నారాయణ.. తనను వేధిస్తున్నారని ఆరోపించారు. అంతకుముందు.. కొన్ని రోజులుగా నారాయణపై ప్రియ సోషల్ మీడియాలో వీడియోలు విడుదల చేస్తున్నారు. గతంలో నారాయణ తనను వేధించినట్టు వీడియోలో ఆరోపించారు. ఇక, తాను వీడియోలు విడుదల చేసిన తర్వాత వేధింపులు మరింత పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాను పోలీసులను ఆశ్రయించినట్టు చెప్పుకొచ్చారు. మరోవైపు.. గత ఎన్నికల్లో ప్రచారం చేయ్యాలని నారాయణ ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేసిన ప్రియ.. తన ఫ్యామిలీని కూడా నారాయణ ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. టీడీపీ తరపున ప్రచారం చేసేందుకు తన మనసు అంగీకరించలేదని ఆమె వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో వైరల్‌గా మారింది. ‘నేను 29 ఏళ్లు భరించాను. ఇక భరించే శక్తి నాకు లేదు. సీతాదేవి కూడా 16 సంవత్సరాలు అరణ్యవాసం చేసింది. మరో 11 సంవత్సరాలు బిడ్డల్ని పెంచింది. మొత్తం 27 ఏళ్లు కష్టపడింది. నేను 29 ఏళ్లు నరకం అనుభవించాను. ఇప్పుడు కూడా ఇంటి విషయాలు మాట్లాడొద్దని అంటున్నారు.ఇంటి విషయాలైనా, పబ్లిక్ విషయాలైనా, నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యల విషయాలపైనా బయట పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని అన్నారు. ఇది కూడా చదవండి: విద్యార్థుల ఆత్మహత్యలనూ బయట పెడతా: నారాయణ మరదలు ప్రియ -
సత్తెనపల్లి: తీవ్ర విషాదం నింపిన గోవా ట్రిప్
సత్తెనపల్లి: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సత్తెనపల్లి వాసులు మృతి చెందిన ఘటన శుక్రవారం ఉదయం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. సత్తెనపల్లికి చెందిన సినిమా థియేటర్ యజమాని షేక్ షుకూర్ (55)తోపాటు షేక్ బాషా (52), కొఠారు అంజయ్య కలిసి కారులో ఈనెల 22న గోవా ట్రిప్ వెళ్లారు. ట్రిప్ ముగించుకుని బుధవారం సాయంత్రం కారులో తిరుగు ప్రయాణమయ్యారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామ సమీపంలో 167వ జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న లారీని కారు వేగంగా వెళ్ళి ఢీకొట్టింది. కారు లారీ కింద ఇరుక్కుపోగా లారీ డ్రైవర్ గమనించకుండా కొంత దూరంపాటు లారీ నడుపుకుంటూ వెళ్ళాడు. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. ముందు సీటులో ఉన్ను షేక్ బాషా, వెనుక సీట్లో ఉన్న షేక్ షుకూర్ అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక సీటులో ఉన్న కొఠారు అంజయ్యకు కాలు, చెయ్యి, నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు. డ్రైవర్ ప్రశాంత్ కుమార్ సీట్ బెల్ట్ ధరించడం వల్ల అతనికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. షుకూర్‌కు భార్య, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. పిల్లులు ముగ్గురికి వివాహాలయ్యాయి. షేక్ బాషాకు భార్య, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉండగా కుమార్తెకు వివాహమైంది. ఇద్దరూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. రెండు కుటుంబాల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. షేక్ షుకూర్ ఎంతో జాగ్రత్తపరుడు. ఆయనకు లిఫ్ట్, ఫ్లైట్ అంటే భయం. ఎన్ని మెట్లు అయినా ఎక్కేవారు. ఎంత దూరమైనా కారులోనే ప్రయాణించేవారు. చివరికి కారు ప్రయాణమే ఆయనను తిరిగిరాని లోకాలకు చేర్చింది. ప్రమాద విషయం తెలియగానే మరో సినిమా థియేటర్ యజమాని షేక్ సలాం, షుకూర్ కుమారులు కారులో ఘటనా స్థలానికి వెళ్లారు. గురువారం అర్ధరాత్రికి మృతదేహాలను సత్తెనపల్లికి తీసుకువచ్చారు. -
మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసు: ఛీటింగ్ ‘మార్గం' మూత!
అతిపెద్ద కార్పొరేట్ మోసంమార్గదర్శి చిట్‌ఫండ్స్ దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ మోసానికి పాల్పడిందని సీఐడీ ఎస్పీ అమిత్ బర్దర్ పేర్కొన్నారు. మార్కెట్లో పేరుందని చెప్పుకున్నప్పటికీ చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే దర్యాప్తు సంస్థలు కఠిన చర్యలు తీసుకుంటాయని స్పష్టం చేశారు. గతంలో విద్యుత్ కుంభకోణంలో ఎన్రాన్ కంపెనీపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో సీఐడీ మరో కీలక చర్య తీసుకుంది. ఈ కేసులో ఏ–1గా ఉన్న చెరుకూరి రామోజీరావు, ఏ–2 శైలజా కిరణ్ కేంద్ర చిట్‌ఫండ్ చట్టానికి విరుద్ధంగా చందాదారుల డబ్బులను మళ్లించి అనుబంధ సంస్థల్లో పెట్టిన పెట్టుబడులపై కొరడా ఝళిపించింది. ప్రధానంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఉషోదయా ఎంటర్ ప్రైజస్‌లో ఉన్న వాటాలను అటాచ్ చేయాలని నిర్ణయించింది. రామోజీరావు వ్యాపార సామ్రాజ్యంలో ఇవే ప్రధాన విభాగాలు కావడం గమనార్హం. మరోవైపు మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాలకు సంబంధించి నమోదు చేసిన ఏడు కేసుల్లో రెండింటిలో సీఐడీ న్యాయస్థానంలో చార్జ్షీట్లు దాఖలు చేసింది. సీఐడీ ఐజీ సీహెచ్.శ్రీకాంత్‌తో కలసి శుక్రవారం వెలగపూడిలోని సచివాలయంలో సీఐడీ ఎస్పీ అమిత్ బర్దర్ మీడియాతో మాట్లాడారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ పేరిట రామోజీరావు, శైలజా కిరణ్ అతిపెద్ద కార్పొరేట్ మోసానికి పాల్పడ్డారని చెప్పారు. నిబంధన ప్రకారం దర్యాప్తు చేస్తున్నామని త్వరలోనే మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసు దర్యాప్తునకు సంబంధించి ఆయన వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. మ్యూచువల్ ఫండ్స్, ఇతర సంస్థల్లో పెట్టుబడులు మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా మళ్లించి పెట్టిన పెట్టుబడులను సీఐడీ అటాచ్ చేస్తోంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ వివిధ మ్యూచువల్ ఫండ్స్, ఇతర ఆర్థిక సంస్థల్లో పెట్టిన పెట్టుబడులు రూ.1,035 కోట్లను అటాచ్ చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే సీఐడీని అనుమతినిస్తూ రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఉషాకిరణ్ మీడియా లిమిటెడ్, ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌లో వాటాలను అటాచ్ చేసేందుకు హోంశాఖ అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్ పేరిట ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌లో ఉన్న 88.50 శాతం వాటాతోపాటు ఉషోదయ ఎంటర్ ప్రైజెస్‌లో 44.55 శాతం వాటా అటాచ్ కానుంది. ఆ సంస్థల్లో ప్రధాన వాటాలను సీఐడీ అటాచ్ చేయనుంది. ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతించాలని సీఐడీ ఇప్పటికే న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేసింది. న్యాయస్థానం అనుమతితో వాటిని అటాచ్ చేయనుంది. రెండు కేసుల్లో చార్జ్షీట్లు దాఖలు చిట్‌ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘించిన మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై సీఐడీ ఏడు కేసులు నమోదు చేసింది. వాటిలో రెండు కేసుల్లో న్యాయస్థానంలో చార్జ్షీట్లు దాఖలు చేసింది. ఏ–1 చెరుకూరి రామోజీరావు, ఏ–2 శైలజా కిరణ్, ఏ–3 మార్గదర్శి చిట్‌ఫండ్స్ మేనేజర్లు (ఫోర్‌మెన్)తోపాటు మొత్తం 15 మందిపై క్రిమినల్ కుట్ర, మోసం, నిధుల దుర్వినియోగం, విశ్వాస ఘాతుకానికి పాల్పడటం, రికార్డులను తారుమారు చేయడం తదితర నేరాలతోపాటు ఏపీ డిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఏడు కేసుల్లో రెండింటిలో చార్జ్షీట్లు దాఖలు చేసింది. మిగిలిన కేసుల్లో కూడా త్వరలోనే చార్జ్షీట్లు దాఖలు చేయడంతోపాటు చట్టపరంగా తదుపరి చర్యలు చేపడతామని సీఐడీ ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు. సీఐడీ విచారణకు గైర్హాజరై రామోజీరావు, శైలజా కిరణ్ దర్యాప్తునకు సహకరించడం లేదన్నారు. ఈ అంశంతోపాటు చార్జ్‌షీట్ దాఖలు తరువాత చేపట్టాల్సిన చర్యలను పరిశీలిస్తున్నామని, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. చందాదారులకు తెలియకుండా.. న్యాయస్థానం కళ్లుగప్పి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు చెందిన 23 చిట్టీ గ్రూపుల మూసివేతకు సంబంధించి రాష్ట్ర చిట్ రిజిస్ట్రార్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొందరు పిటిషన్లు దాఖలు చేయడం వెనుక లోగుట్టు బయటపడింది. న్యాయస్థానంలో పిటిషన్లు వేసిన కొందరు చందాదారులకు అసలు తమ పేరుతో అవి దాఖలైన విషయమే తెలియదని వెల్లడైంది. కొన్ని పత్రాలపై చందాదారుల సంతకాలు తీసుకుని ఇతరులే పిటిషన్లు దాఖలు చేసిన విషయం తమ దృష్టికి వచ్చినట్లు అమిత్ బర్దర్ తెలిపారు. తమ పేరిట పిటిషన్లు దాఖలైన విషయమే తెలియదని పలువురు వెల్లడించినట్లు చెప్పారు. అది న్యాయస్థానాన్ని మోసం చేయడం కిందకే వస్తుందని స్పష్టం చేశారు. దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా పత్రాలు అందచేసి సంతకాలు చేయాలని కోరితే మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారులు క్షుణ్నంగా చదవాలన్నారు. పూర్తిగా చదవకుండా సంతకాలు చేయవద్దని సూచించారు. మూతపడ్డ ‘మార్గదర్శి’ వెబ్సైట్ ఆర్థిక అక్రమాలకు పాల్పడి పీకల్లోతు కూరుకుపోయిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తాజాగా తమ వెబ్‌సైట్‌ను మూసివేసింది. ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఉషోదయ ఎంటర్ప్రైజెస్ సంస్థల్లో వాటాల అటాచ్‌మెంట్‌కు ప్రభుత్వం అనుమతించినట్లు సీఐడీ ఎస్పీ అమిత్ బర్దన్ వెల్లడించిన కాసేపటికే మార్గదర్శి చిట్‌ఫండ్స్ తమ వెబ్‌సైట్‌ను మూసివేయడం గమనార్హం. మార్గదర్శి డాట్‌కామ్ పేరుతో నిర్వహిస్తున్న వెబ్సైట్ శుక్రవారం సాయంత్రం నుంచి ఓపెన్ కావడం లేదు. వెబ్‌సైట్‌పై క్లిక్ చేయగా ‘నిర్వహణ పరమైన అంశాలతో వెబ్సైట్ అందుబాటులో లేదు. త్వరలోనే పునరుద్ధరిస్తాం’ అనే సందేశం కనిపిస్తోంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు సంబంధించిన అధికారిక సమాచారం అంతా అందులోనే ఉంటుంది. హఠాత్తుగా వెబ్సైట్ పనిచేయకపోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పెట్టుబడుల వివరాలను గోప్యంగా ఉంచేందుకే వెబ్‌సైట్‌ను మూసివేసినట్లు భావిస్తున్నారు. -
ఇదో కార్పొరేట్ ఫ్రాడ్.. మార్గదర్శి మోసాలపై ఏపీ సీఐడీ కీలక ప్రెస్‌మీట్
సాక్షి, అమరావతి: మార్గదర్శి వ్యవహారంలో అనేక అక్రమాలు గుర్తించామని సీఐడీ ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించారని పేర్కొన్నారు. మార్గదర్శిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, సీఐడీ విచారణ పారదర్శకంగా జరుగుతోందని వెల్లడించారు. ‘‘మార్గదర్శిపై నమోదైన ఏడు క్రిమినల్ కేసులపై విచారణ చేస్తున్నాం. ఉషాకిరణ్ మీడియా లిమిటెడ్, ఉషోదయ ప్రైవేట్ లిమిటెడ్ ఆస్తులు అటాచ్ చేస్తూ హోం శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆర్డర్స్ నంబర్ 104,116ల ద్వారా మొత్తంగా 1035 కోట్ల చరాస్తులు అటాచ్ చేశాం. కోర్డులోనూ అటాచ్ మెంట్ పిటీషన్ దాఖలు చేశాం. రెండు క్రిమినల్ కేసులలో 15 మందిపై చార్జిషీట్ వేశాం. ఈ రెండు కేసుల్లో ఏ1 రామోజీ రావు, ఏ2 శైలజాకిరణ్ తదితరులపై చార్జి షీట్ నమోదైంది’’ అని సీఐడీ ఎస్పీ పేర్కొన్నారు. చదవండి: మొసలికన్నీరు సంగతి సరే.. మరి ఈనాడుకు ఆ దమ్ముందా? ‘‘మోసం, డిపాజిట్లు మళ్లించడంపై చిట్ ఫండ్ యాక్ట్‌గా కేసులు నమోదు చేశాం. మిగిలిన ఐదు కేసులలో విచారణ చివరి దశకి వచ్చింది. త్వరలోనే ఆ కేసుల్లోనూ ఛార్జి షీట్ నమోదు చేస్తాం. మార్గదర్శి చిట్‌ఫండ్ డిపాజిట్ దారులను మోసం చేసి నిధులు మళ్లించారు. డిపాజిట్ దారులు సంతకాలు పెట్టే ముందే పూర్తిగా కాగితాలు చదవాలి. డిపాజిట్ దారులు మోసపోకుండా మీడియా కూడా అవగాహన కలిగించాలి. ఇది కార్పొరేట్ ఫ్రాడ్’’ అని సీఐడీ ఎస్పీ అమిత్ బర్దర్ అన్నారు. -
టీడీపీ నేతల అరాచకం.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేపై దాడి!
సాక్షి, గుంటూరు: వినుకొండలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి ఒడిగట్టారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కారుపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. బ్రహ్మనాయుడు కారుపై టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే గన్‌మెన్‌కు గాయాలయ్యాయి. ఈ సంద్బరంగా ఎమ్మెల్యే బ్రహ్మనాయుడిని టీడీపీ శ్రేణులు అరగంటపాటు అడ్డుకున్నారు. వారి రాళ్ల దాడిలో ఎమ్మెల్యే కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. రాళ్ల దాడిలో ఎమ్మెల్యే గన్‌మెన్‌కు గాయాలయ్యాయి. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులు దాడికి నిరసనగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేకు మద్దతుగా పార్టీ కార్యకర్తలు అక్కడికి తరలివచ్చారు. ఈ క్రమంలో వినుకొండలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు. అనంతరం.. ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు మీడియాతో మాట్లాడుతూ.. నేను జగనన్న సురక్ష కార్యక్రమానికి వెళ్తుంటే దాడికి దిగారు. టీడీపీ నేతలు నా కారుపై రాళ్ల దాడి చేశారు. కావాలనే వారు ప్లాన్ ప్రకారం నాపై దాడి చేశారు. నాపై భౌతికంగా దాడి చేయాలని ప్లాన్ చేశారు. టీడీపీ కుట్రలను తిప్పి కొడతాం. ప్రజల కోసం ప్రాణాలైనా ఇస్తాను. రెండు రోజుల క్రితం నా డెయిరీ ఫామ్‌ను ధ్వంసం చేశారు. ఇక్కడ జీవీ ఆంజనేయులు వంటి చెత్త నేతలు ఉన్నారు. ప్రజల తిరుగబాటుతో తోక ముడిచారు. జీవీ ఆంజనేయులుకు ప్రజాభిమానం లేదు. గ్రామాల్లో అలజడి సృష్టించాలని టీడీపీ కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలది నీచమైన సంసృతి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఇది కూడా చదవండి: జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులు జమ చేసిన సీఎం జగన్ -
విజయవాడలో టీడీపీ నేత ఘరానా మోసం.. రూ.6 కోట్లతో పరార్!
సాక్షి, విజయవాడ: నగరంలోని భానునగరంలో చిట్టీల పేరుతో టీడీపీ నేత ఘరానా మోసానికి పాల్పడ్డాడు. చిట్టీల పేరుతో టీడీపీ నేత పతివాడ అప్పలనాయుడు జనాన్ని నిండా ముంచారు. సుమారు 300 మంది నుంచి రూ.6 కోట్లు వసూలు చేసి పరారయ్యాడు. బాధితులు గుణదల పోలీసులను ఆశ్రయించారు. న్యాయం చేయాలంటూ అప్పలనాయుడి ఇంటి వద్ద బాధితుల ధర్నా చేపట్టారు. ‘సాక్షి’తో బాధితులు మాట్లాడుతూ, చిటీల పేరుతో నమ్మించి మోసం చేశాడని, రోజువారీ కూలీకి వెళ్తూ చీటీ కట్టామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.5 లక్షలు, రూ.10లక్షలు చిటీలు కట్టిన వాళ్లం వందల్లో ఉన్నాం. చిటీ పూర్తయిన తర్వాత కూడా ఇవ్వకుండా తన వద్దే ఉంచుకుని వడ్డీ ఇస్తానని మోసం చేశాడు. ఏడాదిగా డబ్బు ఇవ్వకుండా మోసం చేశాడు. ఐపీ పెట్టినట్టు నోటీసులు వచ్చాయి. మాకు న్యాయం చేయాలి’’ అని బాధితులు కోరుతున్నారు. చదవండి: మచిలీపట్నంలో ప్రముఖ వైద్యుడి భార్య దారుణ హత్య కాగా, పతివాడ అప్పలనాయుడు.. గత పదేళ్లుగా చిట్టీలు, ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. క్రమం తప్పకుండా చెల్లింపులు చేస్తుండటంతో పాటు అధిక వడ్డీలు ఇవ్వటంతో పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారు అప్పలనాయుడు వద్ద వారు దాచుకున్న నగదును వడ్డీలకు ఇచ్చుకునేవారు. ఈ క్రమంలో అప్పల నాయుడు అందినంత వరకు వసూలు చేసుకుని గత పదిరోజులుగా అదృశ్యమయ్యాడు. తాజాగా సోమ, మంగళవారాల్లో అప్పలనాయుడు కొంతమందికి ఐపీ నోటీసులు పంపించటంతో బాధితులు తమకు జరిగిన మోసాన్ని గ్రహించి లబోదిబోమంటున్నారు. -
మచిలీపట్నంలో ప్రముఖ వైద్యుడి భార్య దారుణ హత్య
సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో దారుణం జరిగింది. జవారుపేట సెంటర్లో శ్రీవెంకటేశ్వర నర్సింగ్ హోమ్ వైద్యుడు ముచ్చెర్ల మహేశ్వరరావు భార్య రాధను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. దోపిడీకి కోసం ఇంట్లో చొరబడి తన భార్యను హత్య చేసినట్లు డాక్టర్ చెబుతున్నారు. గొంతుకోసి హత్య చేసి, నగదు, నగలు దోపిడీ చేశారని ఆయన తెలిపారు ఘటన స్థలానికి క్లూస్ టీమ్ చేరుకుంది. డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించిన పోలీసులు.. ఆధారాలు సేకరిస్తున్నారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ మాధవరెడ్డి, ఎస్పీ రవి ప్రకాష్ పరిశీలించారు. ఆ ఇంటికి సమీపంలో సీసీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లుగా సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చదవండి: ఇంటి ఓనర్ లైంగిక వేధింపులు వివాహిత ఆత్మహత్య -
లైంగిక వేధింపుల కేసులో పూర్ణానందకు షాక్
సాక్షి, విశాఖపట్నం: జ్ఞానానంద, రామానంద ఆశ్రమం (సాధు మఠం) ఆశ్రమం లైంగిక వేధింపుల కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. విశాఖ పొక్సో కోర్టులో పూర్ణానంద వేసిన బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. ఈ నెల మొదటి వారంలో జరిగిన టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్‌లో ఇద్దరు బాధిత మైనర్ బాలికలూ పూర్ణానందను.. గుర్తు పట్టారు(మూడు సార్లు ). దీంతో.. బెయిల్ పిటిషన్‌ను పోక్సో కోర్టు డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించింది. బెయిల్ కోసం పూర్ణానంద పోక్సో కోర్టును ఆశ్రయింగా.. ఈ కేసులో అన్ని ఆధారాలు పూర్ణానందకు వ్యతిరేకంగా ఉన్నాయని, ఈ తరుణంలో బెయిల్ మంజూరు చేయడం ప్రమాదకరమని, పైగా సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని పోక్సో స్పెషల్ పీపీ కరణం కృష్ణ వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన పోక్సో కోర్టు.. పూర్ణానందకు బెయిల్ తిరస్కరించిది. చైల్డ్ వేల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పూర్ణానంద సరస్వతి స్వామీజీ 14 మంది మైనర్ బాలికలతో పశువుల నిర్వహణ పనులు చేయిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. ఈ క్రమంలో భయంతో అశ్రమం నుంచి వెళ్లిపోతానని ఏడవటంతో ఓ బాలిక(13) కాళ్లకు గొలుసులు కట్టి పనులు చేయిస్తుండేవాడు. ఈనెల 12న స్నానానికి వెళ్లేందుకు గొలుసులు తీయడంతో అక్కడ పనిచేసే ఒక మహిళ సహకారంతో బాలిక బయటకు పారిపోయి ఆటోలో రైల్వేస్టేషన్ వెళ్లి తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కింది. రైలులో ఓ కుటుంబం సాయంతో కంకిపాడు చేరుకుని.. ఆపై సీడబ్ల్యూసీ సహకారంతో విజయవాడ దిశ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పూర్ణానంద వ్యవహారం వెలుగు చూసింది.