breaking news
-
టీడీపీ నేత కీచక పర్వం.. విద్యార్ధినికి వేధింపులు
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: ధర్మవరం మండలం గొట్లూరులో టీడీపీ నేత భాస్కర్ కీచక పర్వానికి తెగబడ్డాడు. ఆటోలో వెళ్తున్న పదో తరగతి విద్యార్ధినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆటోలో నుంచి బయటకు లాక్కెళ్లి విద్యార్ధినిపై అత్యాచారయత్నం చేశాడు. ఈ క్రమంలో బాలికకు గాయాలవ్వగా.. ఆసుపత్రికి తరలించారు.బాధితురాలి తల్లిదండ్రులు పోలసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: గూడూరులో నకిలీ రైల్వే డీఎస్పీ అరెస్ట్ -
Sep 21st : చంద్రబాబు కేసు అప్డేట్స్
Live Updates.. 7:00 PM, సెప్టెంబర్ 21, 2023 ఇమేజ్ బిల్డప్ కోసం అఖిలప్రియ అష్టకష్టాలు ► నంద్యాలలో దీక్ష పేరుతో మీడియాను ఆకర్షించేందుకు అఖిలప్రియ కష్టాలు ► ఇప్పటికే అఖిలప్రియపై బోలెడు కేసులు ► నడి రోడ్డుపై దౌర్జన్యం, పలువురిపై దాడి కేసుల్లో ఉన్న అఖిలప్రియ ► సుబ్బారెడ్డి కుటుంబంతో పలు వివాదాలు ► వేర్వేరు కేసుల్లో పలుమార్లు అరెస్టయిన అఖిలప్రియ ► ఇప్పుడు ఇమేజ్ బిల్డప్ కోసం నిరాహార దీక్ష ► చంద్రబాబును అరెస్ట్ అయిన RK ఫంక్షన్ హాల్ ఎదుటే అఖిలప్రియ దీక్ష ► నంద్యాల, ఆళ్లగడ్డల నుంచి జనాల్ని తరలించేందుకు ప్రయత్నాలు 7:00 PM, సెప్టెంబర్ 21, 2023 విజయవాడలో తెలుగుదేశం శాసనసభా పక్ష సమావేశం ► చంద్రబాబు అరెస్ట్‌పై రేపటి సభలోనూ పట్టుపట్టాలని టీడీఎల్పీ నిర్ణయం ► స్పీకర్ తమ్మినేనిని లక్ష్యంగా చేసుకోవాలని నిర్ణయం ► రేపు సభలో తగ్గేదే లేదన్న బాలకృష్ణ ► స్కిల్ అంశం పై పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు సిద్దం కావాలని నిర్ణయం ► ఎల్లో మీడియాలోనూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేరిట తమ వర్షన్ చెప్పుకోవాలని ఎమ్మెల్యేల నిర్ణయం 6:00 PM, సెప్టెంబర్ 21, 2023 ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్మెంట్ కేసులో కస్టడీకి ఇవ్వండి ► విజయవాడ ACB కోర్టులో చంద్రబాబు కస్టడీకి మరో పిటిషన్ ► అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణం కేసులో కస్టడీ కావాలని పిటిషన్ ► ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన CID ► ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వమని పిటీషన్లో కోరిన CID ► ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్మెంట్ కేసులో A1 ముద్దాయిగా చంద్రబాబు 5:50 PM, సెప్టెంబర్ 21, 2023 దోమల ప్రచారం వెనక అసలు వాస్తవాలు ఇవి ► రాజమండ్రి సెంట్రల్ జైల్లో దోమల వ్యవహారంపై స్పష్టత ఇచ్చిన అధికారులు ► రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీ డెంగ్యూతో మృతి చెందడాని టిడిపి చేస్తోన్న ప్రచారం తప్పు ► రిమాండ్ ఖైదీ సత్యనారాయణ ఈ నెల ఆరో తేదీన జైలుకు వచ్చారు ► వచ్చిన రోజే జరిగిన స్క్రీనింగ్ టెస్టులో ఫీవర్‌తో బాధపడుతున్నట్టు తెలిసింది ► వెంటనే రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి నిందితుడిని తరలించాము ► ఈ నెల 19న కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ► ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సత్యనారాయణ మృతి చెందారు ► జైల్లో కుట్టిన దోమల వల్ల సత్యనారాయణకు డెంగ్యూ వచ్చి చనిపోయాడన్న వాదన సరికాదు ► రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఇప్పటికి ఫాగింగ్ పూర్తి, ప్రతీ రోజూ కొనసాగింపు ► చంద్రబాబు ఒక్కరే కాదు, జైల్లో ఉన్న ఖైదీల అందరి ఆరోగ్య భద్రత చూడడమే తమ లక్ష్యం అంటున్న జైలు అధికారులు 5:25 PM, సెప్టెంబర్ 21, 2023 కస్టడీ పిటిషన్‌పై ఇదీ క్లారిటీ.! ► హైకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌కు కస్టడీ పిటిషన్‌కు సంబంధం ఉంది ► హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ను బట్టి నిర్ణయం తీసుకుంటానని చెప్పిన న్యాయమూర్తి ► రేపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ లిస్ట్ అయితే కస్టడీ పిటిషన్‌పై తీర్పు వాయిదా ► రేపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ లిస్ట్ కాకపోతే కస్టడీ పిటిషన్‌పై తీర్పు వెల్లడిస్తానన్న న్యాయమూర్తి 5:05 PM, సెప్టెంబర్ 21, 2023 కస్టడీ పిటిషన్‌పై నిర్ణయం రేపటికి వాయిదా ► హైకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ గురించి అడిగిన ACB కోర్టు న్యాయమూర్తి ► హైకోర్టు తీర్పు ఎప్పుడు రావొచ్చని చంద్రబాబు లాయర్లను అడిగిన ACB కోర్టు న్యాయమూర్తి ► హైకోర్టులో వాదనలు ముగిసాయి, తీర్పు రిజర్వ్‌లో ఉందని చెప్పిన లాయర్లు ► హైకోర్టు తీర్పు వచ్చేవరకు ACB కోర్టు వేచిచూడాలా లేదా అన్నదానిపై సమాలోచనలు ► కస్టడీ పిటిషన్‌పై రేపటి వరకు వేచి చూద్దామని చెప్పిన న్యాయమూర్తి ► రేపటి హైకోర్టు తీర్పును బట్టి ACB కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం 5:00 PM, సెప్టెంబర్ 21, 2023 అందరి చూపు ACB కోర్టు నిర్ణయంపై ► విజయవాడ : ACB కోర్టు వెలువరించబోయే కస్టడీ నిర్ణయంపై ఉత్కంఠ ► బెంచ్ మీదకు వచ్చిన జడ్జి ► కాసేపట్లో చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై తీర్పు వెల్లడించే అవకాశం 4:45 PM, సెప్టెంబర్ 21, 2023 పక్కా ఆధారాలతోనే బాబు అరెస్ట్ : CID చీఫ్ ► స్కిల్ స్కాంలో పక్కా ఆధారాలతోనే చంద్రబాబు అరెస్ట్ ► ప్రతి పేపర్ పై చంద్రబాబు సంతకం ఉంది ► షెల్ కంపెనీలకు డబ్బులు మళ్లించారు ► చంద్రబాబుకు పీఏగా పని చేసిన శ్రీనివాస్ ద్వారా డబ్బులు మళ్లించారు ► స్కిల్ స్కాంలో చంద్రబాబుకు పాత్ర ఉందని ఆధారాలు చెబుతున్నాయి ► పీఏ శ్రీనివాస్‌ను విచారిస్తే కీలక విషయాలు బయటకు వస్తాయి ► శ్రీనివాస్‌కు నోటీసులు ఇవ్వగానే అమెరికాకు పారిపోయాడు ► అప్పుడు సీఎంగా ఉన్నారు కనుకే ఐపీసీ 409 చంద్రబాబుకు వర్తిస్తుంది ► స్కిల్ స్కాంలో ఆధారాలు దొరికితే ఎవరినైనా అరెస్ట్ చేస్తాం ► సీమెన్స్ సంస్థలో గతంలో పని చేసిన వాళ్ల పాత్ర కూడా ఉంది ► సీమెన్స్ లో ఇప్పుడున్న వాళ్లు స్కాంతో తమకు సంబంధం లేదంటున్నారు ► చంద్రబాబు నుంచి సమాధానాలు రాబట్టాల్సి ఉంది 4:30 PM, సెప్టెంబర్ 21, 2023 CID లాయర్లు ఏం వాదించారు? ► కస్టడీతో అసలు కుట్ర కోణం వెల్లడవుతుంది : CID ► చంద్రబాబును అన్ని ఆధారాలతోనే అరెస్ట్ చేశారు ► కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు దోచుకున్నారు ► ఈ కేసులో రికవరీ కంటే కుట్ర కోణాన్ని వెలికి తీయడం ముఖ్యం ► చంద్రబాబును పూర్తి స్థాయిలో విచారిస్తేనే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయి ► చంద్రబాబు స్వార్థ పూరిత వ్యవహారాలు మరిన్ని బయటకు రాకుండా అడుగడుగునా విచారణను అడ్డుకుంటున్నారు ► స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో దుర్వినియోగం అయిన నిధులు ఎక్కడెక్కడికి వెళ్ళాయో సమాచారం ఉంది ► కస్టడికి ఇవ్వడం వల్ల ఎవరికీ, ఎలాంటి నష్టం ఉండదు, నిజం బయటకు వస్తుంది ► 24 గంటల్లో విచారణ పూర్తి చేయడం సాధ్యం కాదు ► స్కిల్ స్కాంలో మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి ► కొందరు కేసును తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు 4:30 PM, సెప్టెంబర్ 21, 2023 బాబు లాయర్లు ఏం వాదించారు? ► FIRలో పేరు లేదు, కస్టడీ వద్దు ► చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు ఎక్కడా ఆధారాలు లేవు ► FIRలో చంద్రబాబు పేరు లేకుండానే అరెస్ట్ చేశారు ► NSG సెక్యూరిటీ ఉన్న చంద్రబాబుని జైల్లో పెట్టారు ► అరెస్టు ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరిగింది ► NSG సెక్యూరిటీ ఉన్న చంద్రబాబుని రెండు రోజులు విచారణ పేరుతో ఇబ్బందులు పెట్టారు ► ఎటువంటి ఆధారాలు లేకుండా కస్టడీ కోరుతున్నారు ► ప్రస్తుతం పోలీసు కస్టడీ అవసరం లేదు ► విచారణలో కొత్త కోణం ACB కోర్టు ముందు ఉంచలేక పోయారు 4:00 PM, సెప్టెంబర్ 21, 2023 ACB కోర్టుకు ఇరుపక్షాల లాయర్లు ► విజయవాడ : ACB కోర్టుకు చేరుకున్న లాయర్లు ► చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై కాసేపట్లో తీర్పు ► కోర్టుకు చేరుకున్న అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు, చంద్రబాబు లాయర్లు 4:00 PM, సెప్టెంబర్ 21, 2023 ACB కోర్టు ఉత్తర్వులపై అందరి దృష్టి ► విజయవాడ : ACB కోర్టులో కస్టడీ పిటిషన్‌పై నిన్ననే పూర్తయిన వాదనలు ► ఇవ్వాళ మరోసారి బెంచ్ ముందుకు రానున్న కస్టడీ పిటిషన్ ► ఇవ్వాళ కస్టడీ ఇస్తారా? ఇస్తే ఎన్ని రోజులు అన్న విషయం న్యాయమూర్తి ప్రకటించే అవకాశం ► మరికొద్దిసేపట్లో ఏసీబీ కోర్టు బెంచ్ ముందుకు కస్టడీ పిటిషన్ అంశం వచ్చే అవకాశం 3:20 PM, సెప్టెంబర్ 21, 2023 ఎర్రన్నాయుడు కూతురు ఎందుకు కనిపించడం లేదు? ► రాజమండ్రిలో 11 రోజులుగా జైల్లో ఉన్న తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు ► పార్టీలో ఉన్న లీడర్లంతా ఇప్పటివరకు రాజమండ్రిలో హాజరు వేసుకున్నవాళ్లే ► రాజమండ్రిలో ఎమ్మెల్యేగా ఉన్న ఆదిరెడ్డి భవాని మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.! ► పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి అన్న కూతురు, లోకల్ ఎమ్మెల్యే ఎందుకు కనిపించడం లేదు? ► ఆదిరెడ్డి కుటుంబం దగ్గరుండి భవానిని దూరం పెట్టిందా? ► లేక చంద్రబాబు అసలు రంగు తెలిసి భవాని దూరంగా ఉంటోందా? ► చంద్రబాబు అరెస్టు నిరసిస్తూ భువనేశ్వరి, బ్రాహ్మణి నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో కూడా పాల్గొనే అవకాశం లేదా? 3:20 PM, సెప్టెంబర్ 21, 2023 భద్రతపై తప్పుడు ఆరోపణలు సరికాదు : విజయసాయిరెడ్డి ► చంద్రబాబు భద్రతపై తెలుగుదేశం నేతల ఆరోపణలు సరికాదు ► లోకేష్, బాలకృష్ణ, అచ్చెన్నాయుడు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం సరికాదు ► దోమలతో స్లో పాయిజన్ అంటూ ఎల్లో మీడియా చేస్తోంది విషప్రచారం ► అసలు తెలుగుదేశం నేతలే ఏదో చేస్తారా అన్న అనుమానాలున్నాయి మీ వ్యవహారం చూస్తుంటే మీరు, మీ పార్టీ వారే... జైల్లో చంద్రబాబు గారికి హాని తలపెడతారన్న అనుమానం కలుగుతోంది. బాబుకు వెన్నుపోటు పొడిచి ఆయన పదవిని కొట్టెయ్యాలన్న కసి కొందరు టీడీపీ నాయకుల్లో కనిపిస్తోంది. టీడీపీ వారితో జైలు అధికారులు అప్రమత్తంగా ఉండాలి. — Vijayasai Reddy V (@VSReddy_MP) September 21, 2023 3:00 PM, సెప్టెంబర్ 21, 2023 ఇదేం పార్టీ? ఇదేం ప్రవర్తన? టిడిపి నేతల తీరుపై YSRCP మండిపాటు ► చంద్రబాబు అరెస్ట్ విషయంలో టిడిపి నేతలు ఇష్టానుసారంగా ప్రవర్తించొద్దు ► అసెంబ్లీలో టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ తీరు ఏ మాత్రం సరికాదు ► యువగళం పాదయాత్రలో లోకేష్ సాంతం బూతులు మాట్లాడారు ► ప్రజలను రెచ్చగొట్టడమే మామా అల్లుళ్ల పనా? నాయకుడు అనేవాడు.. అందరికీ ఆదర్శంగా ఉండాలి. కానీ.. నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్‌కి ఆ లక్షణాలు మచ్చుకకి కూడా లేవు. ఒకరేమో అసెంబ్లీ వేదికగా, మరొకరేమో బహిరంగ వేదికపై అసభ్యంగా సైగలు చేస్తారు. కనీసం మహిళలు ఉన్నారనే ఇంగితం కూడా ఇద్దరికీ లేకపోయింది. #TDPGoonsInAssembly#APAssembly… pic.twitter.com/zBtLktpM7S — YSR Congress Party (@YSRCParty) September 21, 2023 2:30 PM, సెప్టెంబర్ 21, 2023 దోమల పేరు చెప్పి భయపెడతారా? ► చంద్రబాబుపై సానుభూతి కోసం దోమల పేరు చెప్పడం సరికాదు : బాపట్ల ఎంపీ సురేష్ ► ఎవరికి భయపడనని చెప్పే చంద్రబాబు, దోమలకు భయపడతారా ? ► చంద్రబాబు ప్రాణాలకు ప్రమాదం లోకేష్ , టిడిపి నేతల నుంచే ఉంది ► చంద్రబాబు లాగే వెన్నుపోటు విద్య లోకేష్‌కు అబ్బినట్టుంది ► చంద్రబాబు పదవి కోసం లోకేష్ ఇలా వ్యవహరించే అవకాశం ఉంది ► చంద్రబాబు పై ఇలాంటి ప్రకటనలు చేస్తున్న వారి ఫోన్లను కోర్టు తనిఖీ చేయాలి ► వారం రోజుల నుంచి ఢిల్లీలో ఉన్న లోకేష్ ఏపీకి ఎందుకు పోవడం లేదు? ► దోమల పేరుతో ఎలాంటి సానుభూతి రాదు, నవ్వులపాలవుతారు 1:30 PM, సెప్టెంబర్ 21, 2023 బాబు భద్రతపై ఆందోళన అవసరం లేదు: జైళ్ల శాఖ ► రాజమండ్రి : చంద్రబాబు భద్రత గురించి టిడిపి అభ్యంతరాలను ఖండించిన జైళ్ల శాఖ డీఐజీ ► సెంట్రల్ జైలులో 2,063 మంది ఖైదీలు ఉన్నారు ► జైలు లోపల జాగ్రత్తలు తీసుకుంటున్నాం ► కోర్టు సూచించిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం ► ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు 1:00 PM, సెప్టెంబర్ 21, 2023 భారతీయుల నిరసనతో హోరెత్తుతోన్న కెనడా ► కెనడాలో గత కొద్ది రోజులుగా సిక్కుల నిరసనలు ► సిక్కుల నిరసనకు తోడుగా తెలుగుదేశం నిరసనలు ► ఇప్పటికే వరుస నిరసనలపై కెనడా ప్రభుత్వం సీరియస్ ► టోరంటోలో తెలుగుదేశం నిర్వహించిన ఆందోళనలపై సీరియస్ ► భారత్‌కు సంబంధించిన అంశాలను సున్నితంగా చూస్తోన్న కెనడా ► ఇప్పటికే రెండు దేశాల మధ్య దెబ్బ తిన్న సంబంధాలు ► ఈ పరిస్థితుల్లో చంద్రబాబు పేరు చెప్పి కెనడాలో ఆందోళనలు చేయడం సరికాదంటున్న అక్కడి అధికారులు ► కెనడాలో సిక్కులకు పోటీగా టిడిపి నాయకులు చేస్తోన్న ఆందోళనలపై భారత ప్రభుత్వం సీరియస్ ► మన దేశానికి సంబంధించిన అంతర్గత అంశం, అది కూడా అవినీతి కేసుకు సంబంధించి అంతర్జాతీయంగా ఆందోళనలు చేపట్టడం సరికాదంటున్న కేంద్రం ► తెలుగు రాని విదేశీయులను ఆందోళనల్లో భాగస్వామ్యం చేస్తోన్న టిడిపి ► అనుమతి లేకుండా ఆందోళనలకు దిగే వారి వివరాలు సేకరిస్తోన్న భారత ప్రభుత్వం, కెనడా ప్రభుత్వం That’s Toronto canada 🇨🇦 for Babu garu #IAmWithBabu #IAmWithCBN 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 pic.twitter.com/LHJ3KkCHKt — Bring it On🔥TDP Voice - Siva (@TDPVoice2024) September 18, 2023 12:40 PM, సెప్టెంబర్ 21, 2023 చంద్రబాబుకు జైల్లో అన్ని సౌకర్యాలున్నాయి : వైఎస్సార్సిపి ► జైల్లో చంద్రబాబుకు నిర్దేశిత నిబంధనల మేరకు అన్ని సౌకర్యాలున్నాయి ► ఇంటి భోజనంకు అనుమతిస్తున్నారు, వేడి నీళ్లు కూడా ఇస్తున్నారు ► కోర్టు కల్పించిన అన్ని సౌకర్యాలు ఉన్నా.. టిడిపి బురద జల్లుతోంది ► భద్రత లేదంటూ లోకేష్ అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు వైఎస్సార్సీపీ గుర్తు ఫ్యాన్ అయినంత మాత్రాన జైలులో ఫ్యాన్ వాడరాదన్న నియమం ఏమీలేదు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఫ్యాన్ తీసేసి నాకు ఏసీ కావాలని పట్టుబట్టినా జైలు నిబంధనలు అందుకు అనుమతించవు. స్విచ్ వేయకుండా ఫ్యాన్ తిరగడం లేదంటే ఎలా? — Vijayasai Reddy V (@VSReddy_MP) September 21, 2023 12:35 PM, సెప్టెంబర్ 21, 2023 చంద్రబాబు అరెస్ట్‌పై అసెంబ్లీలో రాద్ధాంతమా? : వైఎస్సార్సిపి ► జైల్లో చంద్రబాబు ఉంటే.. అసెంబ్లీలో టిడిపి ఎమ్మెల్యేలు అల్లరి చేస్తున్నారు ► సభలో స్పీకర్ పోడియం చుట్టు ముట్టి సమావేశాలు అడ్డుకున్నారు ► మీసాలు తిప్పుతూ బాలకృష్ణ రెచ్చగొట్టేలా ప్రవర్తించారు .@ncbn అరెస్టుకు నిరసనగా అసెంబ్లీలో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన @JaiTDP ఎమ్మెల్యేలు. మీసాలు తిప్పుతూ రెచ్చగొట్టేలా ప్రవర్తించిన బాలకృష్ణ. వీరి నాయకుడు అవినీతి చేసి అరెస్టు అయితే దానిపై ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన అసెంబ్లీలో నిరసన తెలుపుతూ విలువైన అసెంబ్లీ… pic.twitter.com/lQuzKDG4BV — YSR Congress Party (@YSRCParty) September 21, 2023 12:30 PM, సెప్టెంబర్ 21, 2023 చంద్రబాబుకు జైల్లో ఏసీ లేక ఇబ్బందులు వస్తున్నాయి : అచ్చెన్నాయుడు ► జైల్లో చంద్రబాబుకు అన్ని సౌకర్యాలు లేవు ► ఏసీ లేకపోవడం వల్ల చంద్రబాబుకు ఇబ్బంది అవుతోంది ► దోమలు కూడా కుడుతున్నాయని చంద్రబాబు చెప్పారు ► ఇటీవలే డెంగ్యూ కేసులు కూడా పెరుగుతున్నాయని వార్తలు వచ్చాయి ► చంద్రబాబు చన్నీళ్లతో స్నానం చేస్తున్నారని చెబుతున్నారు ► చంద్రబాబుకు వేడి నీళ్లు స్నానానికి ఇవ్వాలని కోరుతున్నాం ► కోర్టులు ఇచ్చిన ఆదేశాలను పాటించాలి 12:25 PM, సెప్టెంబర్ 21, 2023 చంద్రబాబు రిమాండ్‌పై చర్చించడానికి రెడీ ► చంద్రబాబు రిమాండ్‌పై చర్చించాలని టిడిపి పట్టు ► Yes, చర్చించేందుకు సిద్ధమని స్పష్టం చేసిన ప్రభుత్వం ► ప్రభుత్వం అడిగిన ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉందా? ► తెలుగుదేశం పార్టీని సూటిగా ప్రశ్నించిన మంత్రి బుగ్గన చంద్రబాబు అరెస్ట్‌పై చర్చించేందుకు ప్రభుత్వం రెడీగా ఉంది. కానీ.. చట్టపరంగా ప్రస్తుతం న్యాయస్థానంలో ఈ కేసుపై విచారణ జరుగుతోంది. అయినప్పటికీ అసెంబ్లీలో చర్చకి డిమాండ్ చేస్తున్నారు. కానీ.. ప్రభుత్వం నుంచి అడిగే ప్రశ్నలకి టీడీపీ ఎమ్మెల్యేల వద్ద సమాధానం ఉందా? - మంత్రి బుగ్గన… pic.twitter.com/5qpL4L1Nmq — YSR Congress Party (@YSRCParty) September 21, 2023 12:20 PM, సెప్టెంబర్ 21, 2023 చంద్రబాబు రిమాండ్‌పై అసెంబ్లీలో బాలకృష్ణ ప్రెస్ మీట్ ► లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర సక్సెస్ కావడం వల్లే చంద్రబాబును అరెస్ట్ చేశారు ► ఈ కేసులో ఏమీ తేలదు, ఇలాంటి కేసులు చాలా చూశాను ► చంద్రబాబు జైల్లో చాలా ధైర్యంగా ఉన్నారు ► తననెవరు ఏమి చేయలేరని నాకు చెప్పారు ► అమరావతి ఉద్యమంలో అంతా జూనియర్ అర్టిస్టులను విమర్శిస్తున్నారు 12:15 PM, సెప్టెంబర్ 21, 2023 బెయిల్ కోసం తెలుగుదేశం యాగం ► చంద్రబాబుకు బెయిల్ రావాలంటూ విజయవాడలో యాగం ► టిడిపి నేత కేశినేని చిన్ని ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు ► చంద్రబాబు క్షేమంగా ఉండాలంటూ రుద్ర మహా మృత్యుంజయ యాగం ► రెండు రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల ఏర్పాటు 12:10 PM, సెప్టెంబర్ 21, 2023 కస్టడీపై ఈ సాయంత్రం నిర్ణయం ► చంద్రబాబును అయిదు రోజుల పాటు కస్టడీ అడిగిన CID ► కస్టడీ వద్దంటూ నిన్న బాబు లాయర్ల వాదన ► ఒక్క రోజు కస్టడీ ఇస్తే సరిపోతుందంటూ కొన్ని కేసుల ఉదాహరణ ► ఎన్ని రోజులు కస్టడీ ఇవ్వాలన్నదానిపై నేడు కోర్టు నిర్ణయం ప్రకటించే అవకాశం ► మరోవైపు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 26కు వాయిదా 12:00 PM, సెప్టెంబర్ 21, 2023 లోకేష్ కొత్త రాగం, చంద్రబాబుకు మరింత భద్రత కావాలని డిమాండ్ ► చంద్రబాబుకు జైల్లో దోమలు కుడుతున్నాయి ► చంద్రబాబు జైల్లో ప్రాణ భయం ఉంది ► చంద్రబాబుకు మరింత భద్రత కల్పించాలి ► పూర్తి భద్రత ఉందని జైలు అధికారులు చెప్పినా బురద వేసే ప్రయత్నం ► దోమల పేరు చెప్పి సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారన్న వైఎస్సార్సిపి సైకో జగన్ @ncbn గారిని అక్రమ అరెస్ట్ చేయించింది, జైలులోనే అంతం చేసేందుకే అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి బెయిల్ రాకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారు. జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్షనేతకి జైలులో హాని తలపెట్టేలా సర్కారు… pic.twitter.com/20a8Hq0Dl9 — Lokesh Nara (@naralokesh) September 21, 2023 11:45 AM, సెప్టెంబర్ 21, 2023 అసెంబ్లీలో చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ సభ్యుల ఓవరాక్షన్ ► శాసనసభ, మండలిలో టీడీపీ సభ్యుల రౌడీయిజం. ► స్పీకర్ తమ్మినేని పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు. ► పోడియం వద్ద మీసం మెలేయడంపై బాలకృష్ణకు స్పీకర్ వార్నింగ్. ► ఒక్కరోజు సభ నుంచి టీడీపీ సభ్యులు సస్పెండ్ ► సమావేశాల నుంచి పూర్తిగా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్ సస్పెండ్. 11:40 AM, సెప్టెంబర్ 21, 2023 ► రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో విచారణ వాయిదా ► ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో బాబు పిటిషన్‌పై విచారణ 26కు వాయిదా. ► చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్డు సాయంత్రం 4 గంటలకు తీర్పు ఇచ్చే అవకాశం 11:20AM, సెప్టెంబర్ 21, 2023 ►చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈనెల 26కు వాయిదా 11:00AM, సెప్టెంబర్ 21, 2023 ►చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ ►ఇప్పటికే ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ►కాసేపట్లో తీర్పు వెలువరించే అవకాశం ►సీఐడీ తరుఫున వాదనలు వినిపించిన పొన్నవోలు ►చంద్రబాబు తరఫున వాదనలు వినిపించిన లూద్రా, సిద్ధార్థ్ అగర్వాల్ 8:40AM, సెప్టెంబర్ 21, 2023 ►సీమెన్స్‌కి సీఐడీ ప్రశ్న :3300 కోట్ల రూపాయల ప్రాజెక్టు లో మీరు 90 శాతం పెట్టుబడితో 10 శాతం ప్రభుత్వం పెట్టుబడితో స్కిల్ సెంటర్స్ పెట్టడానికి డిజైన్ టెక్ తో కలిసి ఒప్పందం చేసుకున్నారా..? ►సీమెన్స్ సమాధానం: అలాంటి ఒప్పందం మేము చేసుకోలేదు, 90 శాతం పెట్టుబడి పెట్టి ప్రాజెక్ట్ చేసే పద్దతి మా దగ్గరలేదు.. ►సీమెన్స్‌కి సీఐడీ ప్రశ్న : 3300 కోట్ల ఈ ప్రాజెక్టులో భాగంగా మీకు డిజైన్ టెక్ నుండి గాని స్కిల్ కార్పొరేషన్ నుండి గానీ ఏమైనా పర్చేజ్ ఆర్డర్ వచ్చిందా..? ►సీమెన్స్ సమాధానం : ఈ ప్రాజెక్టు లో భాగంగా మాకు ఎటువంటి పర్చేజ్ ఆర్డర్ రాలేదు..2015 లో డిజైన్ టెక్ నుండి 3 సార్లు మొత్తంగా 58 కోట్ల రూపాయలకు మాకు ఆర్డర్ వచ్చింది,మేము సప్ప్లై చేశాం.. ►సీమెన్స్‌కి సీఐడీ ప్రశ్న : ప్రస్తుతం సుమన్ బోస్ ఎక్కడున్నారు?? వారు అసలు ఇలాంటి 90 శాతం పెట్టుబడి పెట్టె ప్రాజెక్ట్ ని ఒప్పందం చేసుకునే అర్హత ఉందా..? ►సీమెన్స్ సమాధానం : సుమన్ బోస్ ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు, 2018 లో వారు మా కంపెనీలో లేరు,ఇక ఇలాంటి 90 శాతం పెట్టుబడి పెట్టె ప్రాజెక్టులను మేము చేయం,ఇలాంటి ఒప్పందం చేసుకోవదానికి సుమన్ బోస్ కి ఆ అర్హత లేదు,ఇక ఇలాంటి ఒప్పందం చేసుకున్నట్లు మా దగ్గర ఉన్న రికార్డ్స్ ప్రకారం ఇలాంటి ఒప్పందం కూడా లేదు 8:00 AM, సెప్టెంబర్ 21, 2023 రాజమండ్రి సెంట్రల్లో జైలులో 11వ రోజు చంద్రబాబు.. ►యథావిధిగా చంద్రబాబు రోజు వారి కార్యక్రమాలు ►ఇంటి నుంచే వచ్చిన ఆహారం, మందులు. ►పటిష్టమైన భద్రత మధ్య స్నేహ బ్లాక్‌లో చంద్రబాబు ►రాజమండ్రి రూరల్ కాతేరులో కొనసాగుతున్న టీడీపీ క్యాంపు ►రాజమండ్రిలోనే ఉన్న భువనేశ్వరి, బ్రాహ్మణి ►రాజమండ్రి వస్తే లొకేష్‌ను అరెస్ట్ చేస్తారంటూ రచ్చ చేస్తున్న ఎల్లో మీడియా. ►ఇవాళ జరగనున్న అసెంబ్లీ సెషన్స్ కు హాజరుకానున్న టీడీపీ ఎమ్మెల్యేలు. 7:50 AM, సెప్టెంబర్ 21, 2023 ఎల్లో బ్యాచ్ కొత్త నాటకం. ►అసెంబ్లీకి హాజరుకానున్న టీడీపీ ఎమ్మెల్యేలు ►సభకే రాని బాబు కోసం ఎల్లో బ్యాచ్ కొత్త ప్లాన్ ►అసెంబ్లీ వాయిదా వేయాలని మరో నాటకం. 7:00 AM, సెప్టెంబర్ 21, 2023 చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై నేడు వాదనలు ► చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై నేడు ఏసీబీ కోర్టులో వాదనలు ► కస్టడీ పిటిషన్‌పై నేడు తీర్పు ఇచ్చే అవకాశం 6:00 AM, సెప్టెంబర్ 21, 2023 అంగళ్లు కేసుపై నేడు హైకోర్టులో విచారణ ► అంగళ్లు విధ్వంసం కేసులో ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ ► నేడు విచారణ చేపట్టనున్న హైకోర్టు ► అంగళ్లు కేసులో ఏ1 ముద్దాయిగా చంద్రబాబు నాయుడు ► అంగళ్లుకు రాకముందే పక్కాగా గొడవకు కుట్ర చేసినట్టు ఆధారాలు ► వైఎస్సార్సీపీ కార్యకర్తలపై రాజకీయ కక్షతో దాడులకు దిగిన టీడీపీ కార్యకర్తలు ► టీడీపీ కార్యకర్తల దాడిలో పలువురికి పోలీసులకు తీవ్ర గాయాలు ► ముందస్తు వ్యూహంతో దాడులకు పాల్పడిన టీడీపీ కార్యకర్తలు -
గూడూరులో నకిలీ రైల్వే డీఎస్పీ అరెస్ట్
నెల్లూరు: గూడూరు పట్టణ, పరిసర ప్రాంతాల్లో తాను సదరన్ రైల్వేలో డీఎస్పీ అంటూ కొద్దిరోజులుగా హల్చల్ చేస్తున్న వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. గూడూరు ఒకటో పట్టణ పోలీసు స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సూర్యనారాయణరెడ్డి నిందితుడి వివరాలను వెల్లడించారు. వివరాలు..ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఇనమనమెల్లూరు గ్రామానికి చెందిన మందా నాగరాజు ఆరు నెలలుగా గూడూరు ప్రాంతంలో నివాసం ఉంటూ తాను సదరన్ రైల్వేలో డీఎస్పీ అని నమ్మబలికాడు. ఈ క్రమంలోనే ఓ సెటిల్మెంట్కు సంబంధించి కొండంరెడ్డి రమేష్‌రెడ్డి అలియాస్ రాజారెడ్డిని కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లి బాండ్ పేపర్‌పై బలవంతంగా సంతకాలు పెట్టించాడు. పది రోజుల్లో రూ.10 లక్షలు ఇవ్వకపోతే ఎన్కౌంటర్ చేస్తానని బెదిరించాడు. దీంతో బాధితుడు ఒకటో పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెళ్లి నాగరాజును విచారించగా నకిలీ డీఎస్పీ అని తేలింది. ఈ మేరకు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో గూడూరు సొసైటీ ప్రాంతానికి చెందిన రమేష్ అనే వ్యక్తికి రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.1.5 లక్షలు వసూలు చేసినట్లు తేలింది. నిందితుడు నాగరాజు రైల్వేలో లోకోపైలట్, ఆర్పీఎఫ్ డీఎస్పీ అని చెప్పుకుంటూ గూడూరు పట్టణ, పరిసర ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు వలవేశాడు. రైల్వే డిపార్ట్మెంట్లో టీసీ, క్లర్క్ వంటి ఉద్యోగాలు ఇప్పిస్తానని మభ్యపెట్టి వారి నుంచి సుమారు రూ.30 లక్షల వరకు వసూలు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. అతనిపై ఒంగోలు –1 టౌన్లో 2021లో చీటింగ్ కేసు నమోదై ఉందని చెప్పారు. నకిలీ రైల్వే డీఎస్పీ నుంచి నకిలీ యూనిఫామ్, ఐడీ కార్డులు, రైల్వే మెడికల్ ఫిట్నెస్, ఆర్ఆర్బీ సెలెక్షన్ సర్టిఫికెట్లు, రైల్వే పోలీసు క్యాప్‌తో పాటు వైర్‌సెల్ సెట్, ఫైబర్ లాఠీ, ఐదు సెల్ఫోన్లు, పల్సర్ బైక్, ల్యాప్‌టాప్, రూ.1.9లక్షల నగదుతో పాటు రూ.7 లక్షల విలువ చేసే రెండు ఖాళీ స్థలం డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఈ సమావేశంలో పట్టణ సీఐ హజరత్‌బాబు, ఆర్పీఫ్ సీఐ లక్ష్మణరావు, ఏఎస్ఐ సీకేఎన్ రావు, ఒకటో పట్టణ ఎస్సై పవన్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
Live: చంద్రబాబు కేసు అప్డేట్స్.. Click & Refresh
Updates.. 06:00 PM, సెప్టెంబర్ 20, 2023 కస్టడీ పిటిషన్‌పై CID లాయర్, స్పెషల్ జీపీ వివేకానంద ► చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై వాదనలు ముగిసాయి, ఇవ్వాలని మేం కోరాం. ► చంద్రబాబు కస్టడీలో అన్ని విషయాలు బయటికి వస్తాయి ► 24 గంటల్లో విచారణ పూర్తి చేయడం సాధ్యం కాదు ► స్కిల్ స్కాంలో మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి ► కొందరు కేసును తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు 05:27 PM, సెప్టెంబర్ 20, 2023 కస్టడీ పిటిషన్‌పై ముగిసిన వాదనలు ► చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో వాదనలు పూర్తి ► చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై తీర్పు రేపటికి వాయిదా 05:00 PM, సెప్టెంబర్ 20, 2023 కస్టడీ పిటిషన్‌పై ఇంకా కొనసాగుతున్న వాదనలు ► చంద్రబాబు తరపున వాదనలు వినిపించిన సిద్ధార్థ్ అగర్వాల్, సిద్ధార్థ్ లూథ్రా ► చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడే CID ఆఫీసులో విచారించారు ► చంద్రబాబు నుంచి అన్ని వివరాలు రాబట్టామని CID చెప్పింది ► ఇప్పుడు మళ్లీ కస్టడీ అడగడం సరికాదు 04:10 PM, సెప్టెంబర్ 20, 2023 కస్టడీపై తిరకాసు : బాబు లాయర్ ► ACB కోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాది సిద్దార్ధ లూద్రా వాదనలు ► అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన రోజే కస్టడీ పిటిషన్ ఎందుకు వేయలేదు ► 2021 లోనే స్కాం జరిగినపుడు అప్పటి నుండి ఏం చేస్తున్నారు ► ఇతర రాష్ట్రాల్లో జరిగిన వివిధ కుంభకోణాల కేసులను ఉదాహరణగా చూపిస్తున్న లూద్రా ► 5 రోజుల కస్టడీ అడిగినపుడు న్యాయమూర్తి ఒక్కరోజే కస్టడీ కి ఇచ్చిన కేసులను రిఫరెన్స్ గా చూపించిన లూద్రా 03:40 PM, సెప్టెంబర్ 20, 2023 FIRలో పేరు లేదు, కస్టడీ వద్దు : బాబు లాయర్ ► చంద్రబాబు కస్టడీ వద్దంటూ సిద్దార్ద లూద్రా వాదనలు ► చంద్రబాబుకి ఈ కేసుతో ఎక్కడా సంబంధం లేదు ► చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు ఎక్కడా ఆధారాలు లేవు ► FIRలో చంద్రబాబు పేరు లేకుండానే అరెస్ట్ చేశారు ► NSG సెక్యూరిటీ ఉన్న చంద్రబాబుని జైల్లో పెట్టారు ► అరెస్టు ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరిగింది ► NSG సెక్యూరిటీ ఉన్న చంద్రబాబుని రెండు రోజులు విచారణ పేరుతో ఇబ్బందులు పెట్టారు ► ఎటువంటి ఆధారాలు లేకుండా కస్టడీ కోరుతున్నారు ► ప్రస్తుతం పోలీసు కస్టడీ అవసరం లేదు ► విచారణలో కొత్త కోణం ACB కోర్టు ముందు ఉంచలేక పోయారు ► ఆధారాలు లేకుండా కస్టడీ ఎలా అడుగుతారు? ► చంద్రబాబు కస్టడీ పిటీషన్ తిరస్కరించాలి ► చంద్రబాబుని అరెస్ట్ చేసిన తర్వాత సిట్ కార్యాలయంలో విచారించారు కాబట్టి ఇప్పుడు అవసరం లేదు 03:30 PM, సెప్టెంబర్ 20, 2023 కస్టడీతో అసలు కుట్ర కోణం వెల్లడవుతుంది : CID ► చంద్రబాబు కస్టడీ కోరుతూ ఏఏజీ పోన్నవోలు వాదనలు ► ఈ కేసులో న్యాయం అనేది జరిగి తీరాలి ► చంద్రబాబును అన్ని ఆధారాలతోనే అరెస్ట్ చేశారు ► కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు దోచుకున్నారు ► ఈ కేసుతో ప్రమేయం ఉన్న ప్రతీ ఒక్కరినీ మరింత విచారించాలి ► ఈ కేసులో రికవరీ కంటే కుట్ర కోణాన్ని వెలికి తీయడం ముఖ్యం ► చంద్రబాబును పూర్తి స్థాయిలో విచారిస్తేనే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయి ► చంద్రబాబు స్వార్థ పూరిత వ్యవహారాలు మరిన్ని బయటకు రాకుండా అడుగడుగునా విచారణను అడ్డుకుంటున్నారు ► స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో దుర్వినియోగం అయిన నిధులు ఎక్కడెక్కడికి వెళ్ళాయో సమాచారం ఉంది ► కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు రాబట్టాల్సి ఉంది ► కస్టడికి ఇవ్వడం వల్ల ఎవరికీ, ఎలాంటి నష్టం ఉండదు, నిజం బయటకు వస్తుంది 03:25 PM, సెప్టెంబర్ 20, 2023 చంద్రబాబుకు పవన్ మద్ధతివ్వడం అభ్యంతరకరం : కాపు నాయకులు ► జైల్లో ఉన్న చంద్రబాబుకు పవన్ మద్ధతివ్వడం ఏమాత్రం బాగోలేదు ► జైలు ఎదుట నిలబడి పొత్తు ప్రకటన చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం ► కాకినాడలో కాపు చర్చ గోష్టిలో పాల్గోన్న కాపు నేతలు, న్యాయవాదులు, అభిమానులు ► జనసేన ఒంటరిగా పోటి చేయాలి ► పవన్ కళ్యాణ్ నాయకుడిగా ఎదగాలనుకున్నాం ► టిడిపితో పొత్తు పెట్టుకుని చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి కాపులు ఎందుకు పని చేయాలి? ► టిడిపితో పవన్‌కు పొత్తు ఉంటే.. అసలు పవన్ కళ్యాణ్‌కే మద్దతు ఇవ్వము ► చంద్రబాబు ఏ మాత్రం విశ్వసనీయత లేని వ్యక్తి, అతని మాటల్ని నమ్మలేము ► ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ కళ్లు తెరవాలి, పొత్తు లేకుండా జనసేన ఒంటరిగా పోటీ చేయాలి ► అలా పోటీ చేస్తేనే కాపుల మద్దతు పవన్ కు ఉంటుంది 02:58 PM, సెప్టెంబర్ 20, 2023 భయంతోనే కస్టడీ అడ్డుకుంటున్నారు: ఏఏజీ సుధాకర్‌రెడ్డి ►చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో సీఐడీ తరపున వాదనలు వినిపిస్తున్న ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి. ►చంద్రబాబును విచారించేందుకు సమయం సరిపోలేదు. ►రూ.371 కోట్ల దుర్వినియోగంపై స్పష్టమైన ఆధారాలున్నాయ్. ►సీఐడీ విచారణలో అసలు విషయం బయటపడుతుందన్న.. భయంతోనే కస్టడీ అడ్డుకుంటున్నారు. 02:33 PM, సెప్టెంబర్ 20, 2023 అంగళ్లు కేసులో విచారణ రేపటికి వాయిదా ► అంగళ్లు విధ్వంసం కేసులో.. ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసిన చంద్రబాబు ► విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు ► అంగళ్లు కేసులో ఏ1 ముద్దాయిగా చంద్రబాబు నాయుడు ► అంగళ్లుకు రాకముందే పక్కాగా గొడవకు కుట్ర చేసినట్టు ఆధారాలు ► వైఎస్సార్సీపీ కార్యకర్తలపై రాజకీయ కక్షతో దాడులకు దిగిన టీడీపీ కార్యకర్తలు ►టీడీపీ కార్యకర్తల దాడిలో పలువురికి పోలీసులకు తీవ్ర గాయాలు ► ముందస్తు వ్యూహంతో దాడులకు పాల్పడిన టీడీపీ కార్యకర్తలు 02:29 PM, సెప్టెంబర్ 20, 2023 చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై విచారణ ప్రారంభం ► చంద్రబాబును కస్టడీ కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సీఐడీ ► ఐదు రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ వేసిన సీఐడీ ► స్కిల్ స్కాంలో ఏ1గా చంద్రబాబు నాయుడు ► ప్రధాన నిందితుడైన చంద్రబాబుని కస్టడీకి ఇస్తేనే అసలు నిజాలు బయటపడతాయంటున్న సీఐడీ 02:05 PM, సెప్టెంబర్ 20, 2023 మరికాసేపట్లో సీఐడీ కోర్టులో వాదనలు ► విజయవాడ ఏసీబీ కోర్టుకు చేరుకున్న అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ► స్కిల్ స్కాంలో సీఐడీ తరపున వాదనలు వినిపించనున్న ఏఏజీ 01:45 PM, సెప్టెంబర్ 20, 2023 ►మరికాసేపట్లో ఏసీబీ కోర్టులో విచారణ ►లంచ్ అనంతరం ఇరువైపులా వాదనలు వింటానన్న ఏసీబీ కోర్టు ►సీఐడీ తరపున వాదనలు వినిపించనున్న ఏఏజీ పొన్నవోలు ►స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబును విచారించాల్సి ఉంటుందంటున్న సీఐడీ ►చంద్రబాబుని కస్టడీకి ఇస్తేనే అసలు నిజాలు బయటపడతాయని వాదించే అవకాశం 12:55 PM, సెప్టెంబర్ 20, 2023 చంద్రబాబు ఒక్కడే జైలుకు వెళ్లలేదు ► విశాఖ: చంద్ర బాబు నాయుడు అరెస్ట్ పై మేధావుల అభిప్రాయం ► లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ ప్రెసిడెంట్ సుబ్బారావు ► ఈ దేశంలో మాజీ ముఖ్యమంత్రి నీ అరెస్ట్ చెయ్యడం కొత్త కాదు ► బీహార్‌లో పశుదాణా స్కాం అందరికీ తెలిసిందే, లాలూ అరెస్టయ్యారు ► తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జయలలిత జైలుకెళ్లారు ► ఉత్తరప్రదేశ్‌లో మాయావతిపై కేసు పెట్టారు ► న్యాయ స్థానం ముందు అందరూ సమానం ► రుల్ ఆఫ్ లా ఇన్ ఇండియాకు ఎవరు కూడా అతీతులు కాదు ► కోర్టు విచారణ ఎప్పుడు కూడా ఆధారాల మీద ఉంటుంది ► చంద్రబాబు నాయుడు ఏ తప్పు చెయ్యలేదని ఆధారాలు లేకపోతే కోర్టు ఆయనని జైలుకు పంపదు.! 12:45 PM, సెప్టెంబర్ 20, 2023 అసెంబ్లీకి వెళ్లాలని టిడిపి నిర్ణయం ► అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని టిడిపి ఎమ్మెల్యేల నిర్ణయం ► చంద్రబాబు అరెస్టును ప్రస్తావించాలని నిర్ణయం ► చంద్రబాబు అరెస్టు విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని లోకేష్ సూచన ► ప్రజల్లోకి పార్టీ వాదనను బలంగా తీసుకెళ్లాలన్న నారా లోకేష్ 12:42 PM, సెప్టెంబర్ 20, 2023 టీవీ డిబేట్లలో ఇష్టానుసార వ్యాఖ్యలా? ► విజయవాడ కోర్టు ప్రాంగణంలో వైసిపి లీగల్ సెల్ నిరసన ► ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై ఓ టీవీ ఛానల్ డిబేట్ కొలికపూడి శ్రీనివాస్ వ్యాఖ్యలు ► ఇష్టానుసారంగా మాట్లాడిన టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి ► కొలికపూడి, అనం అనుచిత వ్యాఖ్యలపై లాయర్ల నిరసన ► నిరసనలో బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యులు, లీగల్ సెల్ న్యాయవాదులు ► రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న పోన్నవోలుపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు ► కొలికపూడిపై సుమోటోగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ►కొలికపూడికి రిమాండ్ విధించాలి ►న్యాయ వ్యవస్థపై నోరు జారినవారిపై డిఫమేషన్ కేసు వేస్తామన్న లాయర్లు 12:05 PM, సెప్టెంబర్ 20, 2023 చంద్రబాబు అరెస్ట్‌పై టిడిపి ఎమ్మెల్యేల భేటీ ► బాబు అరెస్ట్‌పై తెలుగుదేశం శాసనసభాపక్ష సమావేశంలో చర్చ ► అచ్చెం నాయుడు అధ్యక్షతన సమావేశం, జూమ్ ద్వారా లోకేష్ జాయిన్ ► అసెంబ్లీకి హాజరు కావాలా? వద్దా? అనే అంశంపై మల్లగుల్లాలు ► అసెంబ్లీలో ప్రస్తావిస్తే మంచిదంటున్న కొందరు నేతలు ► అసెంబ్లీకి వెళ్లకుండా నిరసన తెలపాలంటున్న మరికొందరు ► ఢిల్లీ నుంచి లోకేష్ ఎప్పుడొస్తారని అడిగిన ఎమ్మెల్యేలు 12:01 PM, సెప్టెంబర్ 20, 2023 హనుమాన్ జంక్షన్ స్టేషన్‌కు అయ్యన్న ► కృష్ణాజిల్లా : హనుమాన్ జంక్షన్ స్టేషన్‌కు వచ్చిన టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ► లోకేష్ యువగళం బహిరంగ సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అయ్యన్నపై అభియోగాలు ► ఇష్టానుసారంగా నోరు పారేసుకున్న అయ్యన్నపాత్రుడు ► అయ్యన్నపాత్రుడి పై ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీస్ స్టేషన్లో YSRCP ఫిర్యాదు ► అయ్యన్నపాత్రుడికి ఇప్పటికే 41 నోటీసులిచ్చిన పోలీసులు ► పోలీసులకు వివరణ ఇచ్చేందుకు హనుమాన్ జంక్షన్ స్టేషన్‌కు వచ్చిన అయ్యన్నపాత్రుడు 12:00 PM, సెప్టెంబర్ 20, 2023 CID తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద ► కస్టడీ పిటిషన్ పై వాదనలు వినిపించేందుకు సమయం కోరిన సీఐడీ ► ఏఏజీ పొన్నవోలును ఒంటి గంటకు హాజరు కావాలని సూచించిన కోర్టు ► 2.15 నిమిషాల వరకూ సమయం అడిగిన సీఐడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద ► పొన్నవోలు రాలేని పక్షంలో తానే వాదనలు వినిపిస్తానని తెలిపిన వివేకానంద 11:50 AM, సెప్టెంబర్ 20, 2023 కస్టడీ పిటిషన్ కోసం కసరత్తులు ► ACB కోర్టుకు చేరుకున్న బాబు లాయర్ల బృందం ► సిద్ధార్థ్ అగర్వాల్ నేతృత్వంలో టిడిపి లాయర్లు ► ముందుగా ఏసీబీ కోర్టులో కస్టడీ పిటిషన్ విచారణ ► ఆ తర్వాత బెయిల్ పిటిషన్‌పై విచారణ ► పీటీ వారెంట్ల విచారణ ఇప్పుడు ముఖ్యం కాదన్న ఏసీబీ 11:35 AM, సెప్టెంబర్ 20, 2023 కస్టడీ పిటిషన్ @ 1pm ► ACB కోర్టు ముందుకు చంద్రబాబు కస్టడీ పిటిషన్ ► చంద్రబాబును 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన CID ► ఇవ్వాళ మధ్యాహ్నం ఒంటిగంటకు వాదనలు వింటామన్న ACB కోర్టు ► ముందు కస్టడీ పిటిషన్, ఆ తర్వాత బెయిల్ పిటిషన్‌పై వాదనలు ► ఇప్పటివరకు క్వాష్ పిటిషన్‌పై ఆశలు పెట్టుకున్న టిడిపి లీగల్ సెల్ ► క్వాష్ పిటిషన్‌పై నిన్న హైకోర్టులో ముగిసిన వాదనలు ► క్వాష్ పిటిషన్ తీర్పు వరకు ఆగేకంటే బెయిల్ కోసం మరో ప్రయత్నం ► స్కిల్ కేసు బెయిల్ ఉండగానే, మరో కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ 11:15 AM, సెప్టెంబర్ 20, 2023 తారాస్థాయికి చేరిన ఎల్లోమీడియా విషప్రచారం ► చంద్రబాబు జైలులో ఉండడంతో విషాన్ని చిమ్ముతున్న పచ్చమీడియా ► చంద్రబాబుకు దోమలతో స్లో పాయిజన్ ఇచ్చే ప్రమాదముందని స్పెషల్ డ్రైవ్‌లు ► నవ్విపోదురు గాక.. నాకేంటీ అన్న చందాన బాధ్యతారహిత వార్తలు ► మొదట సానుభూతి కోసం ప్రయత్నం, ఆ తర్వాత కుట్ర అంటూ గగ్గోలు ► చంద్రబాబుకు మార్నింగ్‌వాక్‌లో చప్పట్లతో స్వాగతం పలుకుతున్నారన్న ఎల్లో మీడియా ► వేడి నీళ్లు, దోమలు, ఏసీ, టీవీ ఛానళ్లు.. ఇష్టానుసారంగా సాగుతున్న దుష్ప్రచారం 11:00 AM, సెప్టెంబర్ 20, 2023 ఆలూ లేదు చూలు లేదు.. అల్లుడి పేరు..! ► పుకార్లను జనంలో నింపేందుకు ఎల్లో మీడియా టాప్ స్టోరీలు ► లోకేష్‌ను అరెస్ట్ చేసేస్తారు కాబట్టి పార్టీ ప్రచారానికి బ్రాహ్మణి సిద్ధం కావాలని స్పెషల్ స్టోరీలు ► బాలకృష్ణ విషయంలో పచ్చమీడియా వ్యూహాత్మకంగా నెగెటివ్ క్యాంపెయిన్ ► నాయకత్వ లక్షణాలు లేవని, అల్లుడి కోసం త్యాగం చేయాలని హితవులు ► పార్టీ పగ్గాలు నారా వంశం చేతిలోనే ఉండాలని తెగ ఆరాటపడుతోన్న పచ్చమీడియా ► నాడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు, నేడు ఎన్టీఆర్ వంశానికి వెన్నుపోటా.? 10:15 AM, సెప్టెంబర్ 20, 2023 కిం కర్తవ్యం.? లాయర్లతో బాబు వరుస భేటీలు ► రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును కలిసిన అడ్వకేట్ లక్ష్మీనారాయణ ► తన కేసుల జాబితా, ఆయా కేసుల్లో తన పాత్ర, దానికి సంబంధించిన ఆధారాలపై చర్చ ► వేర్వేరు కేసుల్లో సాంకేతికంగా ఏ వాదన వినిపించవచ్చన్న దానిపై లాయర్‌తో చర్చ ► జైల్లో వరుసగా లాయర్లను కలుస్తోన్న చంద్రబాబు ► ఇటీవలే సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రాతోనూ చర్చలు 9:50 AM, సెప్టెంబర్ 20, 2023 హైకోర్టు ముందు అంగళ్లు అల్లర్ల కేసు ► అంగళ్లు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ ► పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ ► చంద్రబాబు లాయర్లు దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు వాదనలు జరిగే అవకాశం ► నీటి ప్రాజెక్టుల సందర్శన పేరిట కార్యకర్తలను రెచ్చగొట్టి విధ్వంసం సృష్టించిన చంద్రబాబు & కో ► టిడిపి కార్యకర్తల దాడిలో పలువురికి పోలీసులకు తీవ్ర గాయాలు ► వైఎస్సార్సిపి కార్యకర్తలపై రాజకీయ కక్షతో దాడులకు దిగిన టిడిపి కార్యకర్తలు ► ముందస్తు వ్యూహంతో దాడులకు పాల్పడిన టిడిపి కార్యకర్తలు ► అంగళ్లుకు రాకముందే పక్కాగా గొడవకు కుట్ర చేసినట్టు ఆధారాలు ► టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుపై కేసు నమోదు చేసిన ముదివేడు పోలీసులు 9:15 AM, సెప్టెంబర్ 20, 2023 లోకేష్‌లో భయం, రాజమండ్రికి టిడిపి బృందం ► లోకేష్‌ను అరెస్ట్ చేస్తారంటూ గత మూడు రోజులుగా ఎల్లో మీడియా ప్రచారం ► ఎల్లో మీడియా ప్రచారం ఆధారంగా తెలుగుదేశం సోషల్ మీడియా ప్రచారం ► లోకేష్ ఢిల్లీ నుంచి రాజమండ్రి రాగానే అరెస్ట్ అవుతాడంటూ పచ్చ మీడియాలో వార్తలు ► టిడిపి క్యాంపెయిన్‌తో రాజమండ్రికి భారీగా వస్తోన్న యువగళం బృందం ► ఇప్పటికే రాజమండ్రిలోని హోటళ్లు, లాడ్జీల్లో బస చేసిన యువగళం బృందం ► రాజమహేంద్రవరంలో పెరిగిన టిడిపి నేతల కదలికలను గమనిస్తోన్న పోలీసులు ► సున్నితమైన ప్రాంతంలో భారీగా సమీకరణ సరికాదని తెలిసినా రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోన్న టిడిపి 8:15 AM, సెప్టెంబర్ 20, 2023 ACB కోర్టు ముందుకు చంద్రబాబు బెయిల్ పిటిషన్ ► చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరపనున్న కోర్టు ► స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ ► బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ సమర్పించనున్న CID ► వాదనల అనంతరం నిర్ణయం తీసుకోనున్న న్యాయమూర్తి 7:50 AM, సెప్టెంబర్ 20, 2023 ACB కోర్టులో నేడు కస్టడీ పిటిషన్ విచారణ ► CID వేసిన చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై నేడు విచారణ ► కౌంటర్ దాఖలు చేయాలని ఇప్పటికే చంద్రబాబు లాయర్లకు కోర్టు సూచన ► ఇవ్వాళ చంద్రబాబు తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేసే అవకాశం 7:15 AM, సెప్టెంబర్ 20, 2023 అత్యంత భద్రత నడుమ చంద్రబాబు. ►పదో రోజుకు చేరుకున్న చంద్రబాబు జైలు జీవితం. ►అత్యంత భద్రత నడుమ రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు ►యథావిధిగా చంద్రబాబు రోజువారీ కార్యకలాపాలు. ►ఇంటి నుంచే చంద్రబాబుకు ఆహారం, మందులు పంపిణీ ►ఈ వారంలో కుటుంబ సభ్యులతో ముగిసిన ఒక ములాఖత్ ►రాజమండ్రిలోనే ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న నారా భువనేశ్వరి, బ్రాహ్మణి 7.10 AM, సెప్టెంబర్ 20, 2023 నేడు టీడీపీ శాసనసభాపక్ష సమావేశం ►ఈరోజు ఉదయం 10.30 గంటలకి టీడీపీ శాసనసభాపక్ష సమావేశం. ►అచ్చెన్నాయుడు అధ్యక్షతన జరగనున్న సమావేశం? ►అసెంబ్లీ సమావేశాలు, చంద్రబాబు అరెస్టు పరిణామాలపై చర్చ. 7.00 AM, సెప్టెంబర్ 20, 2023 నేడు బెయిల్ పిటిషన్లపై విచారణ ►నేడు ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై విచారణ. ►చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్‌పై విచారణ. ►నేడు కౌంటర్ దాఖలు చేయనున్న సీఐడీ అధికారులు. ►చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై ఏసీబీకోర్టులో విచారణ చంద్రబాబు @ A25 ► విజయవాడ : ACB కోర్టులో మెమో దాఖలు చేసిన CID ► ఫైబర్ నెట్ కుంభకోణంలో 25వ నిందితుడిగా చంద్రబాబు పేరు చేరుస్తూ మెమో ►ఫైబర్ నెట్‌పై వేసిన పిటి వారెంట్‌కు అనుబంధంగా మెమో దాఖలు ఫైబర్ గ్రిడ్ కుంభకోణం జరిగిందిలా.. ► గతంలో ఏపీ సివిల్ సప్లైస్‌కు సర్వీసులు అందించిన టెర్రాసాఫ్ట్ కంపెనీ ► నాసిరకం ఈ- పోస్ మిషన్లు పంపిణీ చేసినందుకు టెర్రా సాఫ్ట్‌ను నాడు బ్లాక్ లిస్టులో పెట్టిన ప్రభుత్వం ► అయినా టెర్రాసాఫ్ట్‌పై అంతులేని ప్రేమ కురిపించిన చంద్రబాబు సర్కారు ► టెర్రాసాఫ్ట్‌కు టెండర్లు కట్టబెట్టేందుకు నాడు చంద్రబాబు సర్కారు అవకతవకలు ► బ్లాక్‌లిస్ట్‌లో టెర్రాసాఫ్ట్‌ను రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే తప్పించిన వైనం ► బ్లాక్ లిస్ట్ లో పెట్టిన 2 నెలలకే టెర్రాసాఫ్ట్‌ను లిస్ట్ నుంచి తొలగించిన అప్పటి సివిల్ సప్లైస్ డైరక్టర్ రవిబాబు ► హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీతో జట్టు కట్టి ప్రాజెక్టు దక్కించుకున్న టెర్రాసాఫ్ట్ ► టెండర్లు దక్కించుకున్న తర్వాత హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీని నిబంధనలకి విరుద్దంగా బయటకి పంపిన టెర్రాసాఫ్ట్ ► ఇప్పటికే హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అనీల్ జైన్ స్టేట్ మెంట్ రికార్డు చేసిన CID ► తమని మోసం చేసినట్టు వాంగ్మూలమిచ్చిన హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ VP అనీల్ జైన్ ► నిబంధనలకి విరుద్దంగా మరొక కంపెనీ నుంచి రూ.115 కోట్ల నాసిరకం మెటీరియల్‌ను కొనుగోలు చేసి ఫైబర్ నెట్‌కు సరఫరా చేసిన టెర్రా సాఫ్ట్ ► చంద్రబాబు సూచనల మేరకే టెర్రాసాఫ్ట్ వ్యవహరం మలుపులు తిరిగిందని తేల్చిన CID. -
తల్లిని సజీవదహనం చేసిన తనయుడు
కంబదూరు: నవమాసాలు మోసి.. జన్మనిచ్చి.. కంటికి రెప్పలా కాపాడి.. పెంచి పెద్ద చేసిన కన్నతల్లినే ఓ కుమారుడు పెట్రోల్ పోసి సజీవదహనం చేశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా కంబదూరులో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కంబదూరులోని ఓబయ్య కాలనీకి చెందిన ఈడిగ గోపీనాథ్, సుజాతమ్మ(59) దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెలు ఇద్దరికీ పెళ్లిళ్లు కావడంతోపాటు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇంటర్ చదివిన కుమారుడు ప్రణీత్ హైదరాబాదులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. తాగుడుకు బానిసైన అతను ఉద్యోగం మానేసి స్వగ్రామం చేరుకున్నాడు. రోజూ మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులను హింసించేవాడు. సోమవారం కూడా మద్యం తాగడానికి డబ్బు ఇవ్వాలని అనారోగ్యంతో మంచంలో పడుకుని ఉన్న తల్లి సుజాతమ్మను అడిగాడు. ఆమె డబ్బులు ఇవ్వకపోవడంతో ఆగ్రహంతో తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. చుట్టుపక్కలవారు మంటలను గమనించి సుజాతమ్మ భర్త గోపీనాథ్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చేలోపే పూర్తిగా కాలిపోయిన సుజాతమ్మ మృతి చెందింది. ఘటనాస్థలాన్ని కళ్యాణదుర్గం డీఎస్పీ బి.శ్రీనివాసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి నిందితుడు ప్రణీత్‌ను అరెస్ట్ చేశారు. -
పోలీసులపై టీడీపీ గూండాల దాడి
నరసరావుపేట టౌన్: పోలీసులపై మరోసారి టీడీపీ గూండాలు దాడులకు పాల్పడ్డారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారు. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ మంగళవారం నరసరావుపేట ప్రకాశ్‌నగర్‌లో డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావుకు చెందిన వైద్యశాల ప్రాంగణంలో హోమం చేపట్టారు. ఒక్కసారిగా టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ అరవిందబాబు, కడియాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యకర్తలు హోమం జరుగుతున్న స్థలం నుంచి మెయిన్‌రోడ్డు ఫ్లై ఓవర్ బ్రిడ్జి వైపునకు వచ్చేందుకు ప్రయత్నించారు. అక్కడ విధుల్లో ఉన్న సీఐ అశోక్‌కుమార్, సిబ్బంది అడ్డుకుని అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించవద్దని కోరారు. టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయి పోలీసుల చొక్కాలు పట్టుకుని నెట్టివేశారు. దీంతో కిందపడిన స్పెషల్ పార్టీ పోలీస్ సిబ్బందితోపాటు వన్‌టౌన్ ఏఎస్ఐ మీరావలికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులను నెట్టివేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేసుకూంటూ ర్యాలీగా ఫ్లై ఓవర్ బ్రిడ్జిపైకి చేరారు. అక్కడ నిలువరించేందుకు ప్రయత్నించిన స్పెషల్ పార్టీ పోలీసులపైనా దాడికి పాల్పడ్డారు. అనుమతి లేకుండా టీడీపీ చేపట్టిన ర్యాలీ కారణంగా ఆర్టీసీ బస్టాండ్, మల్లమ్మ సెంటర్, ఓవర్ బ్రిడ్జి వద్ద ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతోపాటు దాడికి పాల్పడిన 20 మంది టీడీపీ నాయకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నరసరావుపేట వన్‌టౌన్ సీఐ అశోక్‌కుమార్ తెలిపారు. -
పండగ పూట విషాదం
శ్రీకాకుళం: పండగ పూట ఆ కుటుంబంలో విషాదం అలముకుంది. వినాయక చవితి వైభవంగా నిర్వహించుకుందామని భార్యకు చెప్పి వెళ్లిన భర్త మార్గం మధ్యలో బైక్ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యారు. విశాఖలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేర కు ఆనందపురం పంచాయతీ ఆబోతులపేట గ్రామానికి చెందిన కీస రవి(27) వినాయక చవితి సామాన్లు కొనుగోలు చేయడానికి ఆదివారం రాత్రి పొందూరు వెళ్లి తిరిగి ఆబోతులపేట గ్రామానికి వస్తుండగా.. ఆనందపురం, వాండ్రంగి గ్రామ సమీపంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద మరో బైక్ రవి బైక్‌ను ఢీకొట్టింది. ఘటనలో రవి తీవ్రంగా గాయపడ్డాడు. మరో నలుగురికి కూడా గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని శ్రీకాకుళంలోని కిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడ నుంచి విశాఖ పంపించారు. అక్కడ చికిత్స పొందుతూ రవి సోమవారం కన్నుమూశాడు. రవి వెనుక కూర్చున్న సోమరాజుల కృష్ణ కిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. అలాగే పొందూరుకు చెందిన స్వరూప సాయి, హరి సాయి, పేడాడ దామోదరరావు రాజాం కేర్‌లో చికిత్స తీసుకుంటున్నారు. మృతుడికి భార్య స్వామి, తొమ్మిది నెలల బాబు ఉన్నారు. పండగ వేళ ఇంతటి విషాదం జరగడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సామంతుల రామారావు తెలిపారు. -
రితీ సాహా మృతిపై వైద్యుల కమిటీ విచారణ
మహారాణిపేట : ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విద్యార్థిని రితీ సాహా కేసుకు సంబంధించి కేజీహెచ్‌లో విచారణ మొదలైంది. అయిదుగురు వైద్యులతో కూడిన విచారణ కమిటీ మంగళవారం కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో విచారణ నిర్వహించింది. పలువురి నుంచి వివరాలు సేకరించిన కమిటీ మరోసారి విచారణ చేయాలని నిర్ణయించింది. నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పశ్చిమబెంగాల్‌కు చెందిన రితీ సాహా జూలై 14వ తేదీన ఆ కళాశాల అవుట్సోర్సింగ్ ద్వారా నిర్వహిస్తున్న సాధన హాస్టల్ భవనంపై నుంచి పడి తీవ్రంగా గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన ఆమెకు ముందుగా వెంకటరామ ఆస్పత్రిలోను, తరువాత కేర్ ఆస్పత్రికి చికిత్స అందించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె మరణించిందని మృతురాలి తండ్రి డీఎంహెచ్‌వో డాక్టర్ పి.జగదీశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టాలని కేజీహెచ్ సూపరింటెండెంట్ పి.అశోక్‌కుమార్‌కు డీఎంహెచ్‌వో సూచించడంతో కేజీహెచ్ న్యూరో మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ బి.హయగ్రీవరావు, జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ వి.సత్యప్రసాద్, అనస్థీషియా ప్రొఫెసర్ డాక్టర్ వి.రవి, కార్డియో థొరాసిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ మణిత, ఆర్థోపెడిక్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి.రజనీ కుమార్‌లతో విచారణ కమిటీ వేశారు. మంగళవారం కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో నిర్వహించిన కమిటీ విచారణకు రితీ సాహా తల్లిదండ్రులు, చికిత్స చేసిన ఆస్పత్రి వైద్యులు, ల్యాబ్ సిబ్బంది, నిర్వాహకులు హాజరయ్యారు. అన్ని రికార్డులు, రిజిస్టర్లతో పాటు సీటీ ఫిల్మ్ అండ్ రిపోర్ట్, ఎక్స్ రే ఛాతి ఫిల్మ్, రిపోర్ట్, సీటీ బ్రెయిన్ రిపోర్ట్, డెత్ కేసుకు సంబంధించిన ఇతర నివేదికలు విచారణ కమిటీకి సమర్పించారు. -
వివాహేతర సంబంధం.. భర్త చెంపపై భార్య కొట్టడంతో భర్త మృతి
తూర్పు గోదావరి: పండగ వేళ పాశర్లపూడి బాడవలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో జరిగిన ఘర్షణలో భార్య చేతిలో భర్త హత్యకు గురయ్యాడు. వివరాలివీ.. పాశర్లపూడి బాడవ పల్లవపాలేనికి చెందిన కొల్లు సాయికుమార్ (24).. అదే గ్రామానికి చెందిన యువతిని ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు. సాయికుమార్ ఇళ్ల సీలింగ్ పనులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. అతడి భార్య.. అదే గ్రామానికి చెందిన కొల్లు వెంకటేష్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇదే విధంగా ఈ నెల 17వ తేదీ రాత్రి ఇద్దరి మధ్యా ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో సాయికుమార్ చెంపపై భార్య గట్టిగా కొట్టడంతో అతడు మృతి చెందాడు. ఈ మేరకు హతుని తండ్రి కొల్లు వీరపండు నగరం పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటనపై పి.గన్నవరం సీఐ ప్రశాంత్‌కుమార్ ఆధ్వర్యాన నగరం ఎస్సై పి.సురేష్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. సాయికుమార్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
Babu Case : గవర్నర్ అనుమతి చుట్టే బాబు లాయర్ల పట్టు
సాక్షి, గుంటూరు: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టైన చంద్రబాబు నాయుడు.. క్వాష్ పిటిషన్‌కు అనర్హుడని సీఐడీ తరపు న్యాయవాదులు మంగళవారం ఏపీ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఎఫ్ఐఆర్ చేసిన వెంటనే చంద్రబాబును అరెస్ట్ చేయలేదని.. రెండేళ్లు అన్ని సాక్ష్యాలు సేకరించాకే అరెస్ట్ చేశారని తెలిపారు న్యాయవాదులు. కేవలం ఎఫ్ఐఆర్ ఆధారంగానే చంద్రబాబు అరెస్ట్ జరగలేదు. సెక్షన్ 319 ప్రకారం ఎన్ని ఛార్జిషీట్లు అయినా వేయొచ్చు.. ఎంత మంది సాక్ష్యులను అయినా చేర్చొచ్చు. ఈ కేసు ప్రారంభ దశలోనే ఉంది. బెయిల్ దరఖాస్తు చేసుకున్న దరిమిలా.. 10 రోజుల్లో దర్యాప్తు పూర్తి కాదు. కేసు దర్యాప్తు దశలోనే ఉంది. ఐటీ శాఖ దర్యాప్తు చేస్తోంది. ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ దశలో నిందితుడికి అనుకూలంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకూడదని హైకోర్టును కోరారు. ► 2018 జూన్ 5వ తేదీనే ప్రాథమిక విచారణ ప్రారంభమైంది.ఐపీసీ ప్రకారం నేరం కనిపిస్తున్నప్పుడు.. గవర్నర్ నుంచి ఎలాంటి అనుమతి అవసరం లేదని ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి అన్నారు. అంటే 2018లో సెక్షన్ 17A సవరణకు ముందే ఇది పూర్తయింది. 2015లోనే ఈ స్కాంకు సంబంధించి ప్రశ్నలు తలెత్తాయి. ఒక సెక్షన్‌కు సంబంధించిన సవరణ కోసం దర్యాప్తు ఆగదు అని హైకోర్టు ముందు వాదించారాయన. ► పథకం ప్రకారం కుంభకోణం జరిగింది. ఎంవోయూలో సబ్ కాంట్రాక్ట్ ప్రస్తావనే లేదు. ఎలాంటి సేవలు అందించకుండానే షెల్ కంపెనీలకు నిధులు వెళ్లాయి. షెల్ కంపెనీల కోసమే డబ్బు విడుదల చేశారు. ఎంవోయూలో సబ్‌కాంట్రాక్టుల అంశం ప్రస్తావనే లేదు. చంద్రబాబు నాయకత్వంలో నెమ్మదిగా మానిప్యులేషన్ చేశారు. ఆరు షెల్ కంపెనీలకు డబ్బు తరలించారు. ప్రభుత్వం ముందుగా డబ్బు ఇవ్వడం ఎప్పుడూ ఉండదు. మొదటి నుంచి కూడా ఇదొక బొమ్మ మాదిరిగా జరిగింది. కక్ష సాధింపు అనుకుంటే చంద్రబాబును ఏనాడో అరెస్ట్ చేసేవారు.ఏపీ ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరిస్తోంది. ► షెల్ కంపెనీల జాడ తీస్తున్నాం. అన్ని బోగస్ కంపెనీలు కలిపి ప్రజాధనాన్ని లూటీ చేశాయి. . ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా నిధుల దుర్వినియోగం జరిగింది. ఈ డీల్‌కు కేబినెట్ ఆమోదం లేదు. చంద్రబాబు పథకం ప్రకారమే తన అనుచరులతో కలిసి బోగస్ కంపెనీల పేరుతో రూ.371 కోట్ల ప్రజాధనం దోచుకున్నారు. రూ. 3 వేల కోట్లు ఎక్కడికి వెళ్లాయో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. మార్గదర్శకాలను కూడా కోర్టు అనుసరించాలి. విచారణ పూర్తయ్యే దాకా ఆగాలి. దర్యాప్తు సంస్థను నివేదిక సమర్పించేదాకా వేచి చూడాలి. ► విచారణ పూర్తై అధికారులు నివేదిక సమర్పించిన తరువాతే కోర్టు జోక్యం చేసుకోవాలి. మెరిట్స్‌లోకి వెళ్లాల్సిన అవసరం లేదు ఇక్కడ. నేను సీఎంను(మాజీ) కాబట్టే.. అనే అంశం ప్రస్తావిస్తున్నారు కాబట్టి ఇది రాజకీయమైంది. దర్యాప్తు బృందంపై రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులపైనే నిందలు మోపుతున్నారు. కానీ, వీళ్లంతా శిక్షణ పొందిన అధికారులు. ఆరోపించేవాళ్లు ముందు ఈ విషయం గుర్తించాలి. ► 2021కు ముందు చంద్రబాబుపై ఎలాంటి ఆరోపణలు చేయలేదు. పూర్తి ఆధారాలతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టకుండానే కంపెనీలకు రూ.300 కోట్లు విడుదల చేశారు. అవినీతి చేసిన వారు సెక్షన్ 17ఏ పేరుతో తప్పించుకోలేరు. సెక్షన్ 17A ప్రజా ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకున్న అమాయక సేవకులను (innocent servants) రక్షించడం కోసం మాత్రమే. కాబట్టి.. పోలీసులకు పూర్తి స్వేచ్చను ఇచ్చి.. క్వాష్ పిటిషన్‌ను కొట్టివేయాలి. సెక్షన్ CrPC 482 ప్రకారం దర్యాప్తు అధికారులను విచారణ పూర్తి చేసుకోనివ్వాలి అని సీఐడీ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. -
Live: చంద్రబాబు కేసు అప్డేట్స్.. Click & Refresh
Updates.. 08:52PM, సెప్టెంబర్ 19, 2023 సీఐడీ కౌంటర్ దాఖలు ► విజయవాడ: చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై సీఐడీ కౌంటర్ ► బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా 06:50PM, సెప్టెంబర్ 19, 2023 చంద్రబాబు @ A25 ► విజయవాడ : ACB కోర్టులో మెమో దాఖలు చేసిన CID ► ఫైబర్ నెట్ కుంభకోణంలో 25వ నిందితుడిగా చంద్రబాబు పేరు చేరుస్తూ మెమో ►ఫైబర్ నెట్‌పై వేసిన పిటి వారెంట్‌కు అనుబంధంగా మెమో దాఖలు 06:00PM, సెప్టెంబర్ 19, 2023 ఫైబర్ గ్రిడ్ కుంభకోణం జరిగిందిలా.. ► గతంలో ఏపీ సివిల్ సప్లైస్‌కు సర్వీసులు అందించిన టెర్రాసాఫ్ట్ కంపెనీ ► నాసిరకం ఈ- పోస్ మిషన్లు పంపిణీ చేసినందుకు టెర్రా సాఫ్ట్‌ను నాడు బ్లాక్ లిస్టులో పెట్టిన ప్రభుత్వం ► అయినా టెర్రాసాఫ్ట్‌పై అంతులేని ప్రేమ కురిపించిన చంద్రబాబు సర్కారు ► టెర్రాసాఫ్ట్‌కు టెండర్లు కట్టబెట్టేందుకు నాడు చంద్రబాబు సర్కారు అవకతవకలు ► బ్లాక్‌లిస్ట్‌లో టెర్రాసాఫ్ట్‌ను రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే తప్పించిన వైనం ► బ్లాక్ లిస్ట్ లో పెట్టిన 2 నెలలకే టెర్రాసాఫ్ట్‌ను లిస్ట్ నుంచి తొలగించిన అప్పటి సివిల్ సప్లైస్ డైరక్టర్ రవిబాబు ► హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీతో జట్టు కట్టి ప్రాజెక్టు దక్కించుకున్న టెర్రాసాఫ్ట్ ► టెండర్లు దక్కించుకున్న తర్వాత హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీని నిబంధనలకి విరుద్దంగా బయటకి పంపిన టెర్రాసాఫ్ట్ ► ఇప్పటికే హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అనీల్ జైన్ స్టేట్ మెంట్ రికార్డు చేసిన CID ► తమని మోసం చేసినట్టు వాంగ్మూలమిచ్చిన హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ VP అనీల్ జైన్ ► నిబంధనలకి విరుద్దంగా మరొక కంపెనీ నుంచి రూ.115 కోట్ల నాసిరకం మెటీరియల్‌ను కొనుగోలు చేసి ఫైబర్ నెట్‌కు సరఫరా చేసిన టెర్రా సాఫ్ట్ ► చంద్రబాబు సూచనల మేరకే టెర్రాసాఫ్ట్ వ్యవహరం మలుపులు తిరిగిందని తేల్చిన CID 05:40PM, సెప్టెంబర్ 19, 2023 ACB కోర్టులో చంద్రబాబుపై మరో కేసులో PT వారంట్ ► చంద్రబాబుపై మరో పిటి వారెంట్ దాఖలు, ఫైల్ నంబర్ 2916/2023 ► ఫైబర్‌నెట్ కుంభకోణంలో చంద్రబాబు ప్రదాన ముద్దాయిగా పిటి వారెంట్ ► రూ.115 కోట్ల నిధులు గోల్ మాల్ అయ్యాయని దర్యాప్తులో తేల్చిన సిట్ ► 2021 లోనే ఫైబర్ నెట్ కుంభకోణంలో 19 మందిపై సిఐడి కేసు నమోదు ► నాటి FIRలో A1గా వేమూరి హరిప్రసాద్, A2గా మాజీ MD సాంబశివరావు ► చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు వేమూరి హరిప్రసాద్ 05:12PM, సెప్టెంబర్ 19, 2023 ACB కేసులో విచారణ రేపటికి వాయిదా ► CID కస్టడీ పిటిషన్‌పై సమయం అడిగిన చంద్రబాబు లాయర్లు ► హైకోర్టులో క్వాష్ పిటిషన్‌పై వాదనలు కొనసాగుతున్న దృష్ట్యా కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలన్న చంద్రబాబు లాయర్లు ► రేపటి వరకు సమయం అడిగిన చంద్రబాబు లాయర్లు, సరేనన్న ACB కోర్టు ► CID వేసిన చంద్రబాబు కస్టడీ పిటీషన్ పై విచారణ రేపటికి వాయిదా 05:00PM, సెప్టెంబర్ 19, 2023 వాదనలు ముగిసాయి, 2 రోజుల్లో తీర్పు : హైకోర్టు ► ఈ కేసులో వాదనలు పూర్తయ్యాయి ► ఇప్పుడు కోర్టు నిర్ణయం తీసుకోనివ్వండి ► రెండు రోజుల్లో ఈ పిటిషన్‌పై తీర్పు ఇస్తాం 04:50PM, సెప్టెంబర్ 19, 2023 చివరిగా మరోసారి మా విజ్ఞప్తి వినండి : బాబు లాయర్ లూథ్రా ► చంద్రబాబును ఈ కేసులో A1 అంటున్నారు ► నిధులు విడుదల చేసిన వ్యక్తే అసెంబ్లీలో ప్రకటన చేశారు ► నిజంగా తప్పు చేసి ఉంటే, లేదా కుంభకోణం కుట్ర ఉంటే సభలో ఎందుకు ప్రకటన చేస్తారు? ► సెక్షన్ 17A సవరణ ఈ కేసుకు వర్తిస్తుంది. గవర్నర్ అనుమతి తీసుకోకుండా అరెస్ట్ చేశారు ► ఈ కేసును రఫెల్ కేసుతో పోల్చవచ్చు. ఆ కేసులో జస్టిస్ జోసెఫ్ ఇచ్చిన ఆదేశాలను గుర్తు చేసుకోవాలి ► మా వాదన అంతా 17A చుట్టే ఉంది. CID వాదనల్లో 90%, 10% అన్న దగ్గర కన్ఫ్యూజన్ ఉంది ► సీమెన్స్ కంపెనీ నుంచి వచ్చిన ఈ మెయిల్‌కు రిమాండ్ రిపోర్ట్‌కు తేడా ఉంది 04:45PM, సెప్టెంబర్ 19, 2023 ఈ కేసును ఇవ్వాళే ముగిస్తాం : హైకోర్టు ► ఈ కేసులో ఇంకేదైనా చెప్పుకోవాలంటే ఇప్పుడే అవకాశం ఇస్తున్నాం ► ఉదయం నుంచి ఇప్పటిదాకా ఇదే కేసులో వాదనలు విన్నాం ► ఈ కేసులో స్పష్టత వచ్చింది. చివరి అవకాశం ఇస్తున్నాం 04:35PM, సెప్టెంబర్ 19, 2023 బాబు లాయర్లు ఇచ్చినవి సరైన రిఫరెన్స్‌లు కావు.! : CID లాయర్లు ► ఈ కేసులో బాబు లాయర్లు అర్నబ్ గోస్వామి కేసును ఉదహరించారు ► అర్నబ్ గోస్వామిది వాక్ స్వాతంత్ర హక్కుకు సంబంధించినది ► ఆ కేసుకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు ► ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి నుంచి పథకం ప్రకారం జరిగింది ► సెక్షన్482 పిటిషన్లపై నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది ► అరెస్టు చేయకూడదంటూ హైకోర్టులు ప్రతీసారి జోక్యం చేసుకోవద్దంటూ నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేసులో సుప్రీం తీర్పునిచ్చింది ► పోలీసులకు పూర్తి విచారణ చేసుకునే వెసులుబాటు కల్పించాలి ► ఈ కేసులో విచారణ ఇప్పుడే ప్రారంభమైంది… ఈడీ, ఇన్‌కంటాక్స్ కూడా విచారిస్తున్నాయి. దీనిని కోర్టు పరిగణలోకి తీసుకోవాలి 04:32PM, సెప్టెంబర్ 19, 2023 CID వాదనలు అభ్యంతరకరంగా ఉన్నాయి : బాబు లాయర్ సాల్వే ► ఈ ప్రభుత్వం ఏర్పడి నాలుగున్నరేళ్లు పూర్తయ్యాయి ► ఈ ప్రభుత్వం ఇప్పుడు పైల్స్ కనిపించడం లేదని, అవి చంద్రబాబు మాయం చేశారని ఆరోపిస్తున్నారు ► 2018లోనే ఫిర్యాదు వచ్చిందన్న వాదనను మేం ఒప్పుకోం ► 2021లో నమోదయిన ఫిర్యాదునే కోర్టు పరిగణించాలి 04:32PM, సెప్టెంబర్ 19, 2023 సెక్షన్ 17A సవరణ ఈ కేసులో వర్తించదు : CID లాయర్ ► ఈ కేసులో ప్రాథమిక విచారణ జూన్ 5, 2018న జరిగింది : పొన్నవోలు సుధాకర్ రెడ్డి ► అంటే 2018లో సెక్షన్ 17A సవరణకు ముందే ఇది పూర్తయింది ► 2015 నుంచే స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై ఆరోపణలున్నాయి ► ఒక సెక్షన్‌కు సంబంధించిన సవరణ కోసం దర్యాప్తు ఆగదు ► ఈ కేసులో శుక్రవారం కౌంటర్ ఫైల్ చేయగలం 04:25PM, సెప్టెంబర్ 19, 2023 సెక్షన్ 17A గురించి చర్చిద్దాం : బాబు లాయర్ హరీష్ సాల్వే ► CID లాయర్ వాదిస్తుండగా.. జోక్యం చేసుకున్న సాల్వే ► కేసు పెట్టింది 2020లో కాబట్టి 2018లో చేసిన సవరణ వర్తిస్తుంది ► సీమెన్స్ గుజరాత్లో కూడా ప్రాజెక్టు చేపట్టింది ► గుజరాత్లో ఎలా జరిగిందో.. ఏపీలో కూడా చంద్రబాబు అలాగే నిర్వహించారు ► ప్రభుత్వం కోరినట్టు ప్రాజెక్టు పూర్తయింది ► ఇక్కడ తప్పు ఎక్కడ జరిగి ఉండొచ్చంటే.. పన్ను ఎగ్గొట్టడానికి డిజైన్ టెక్ చేసిన ప్రయత్నంలో చంద్రబాబును ఇరికించారు ► 2024లో ఏపీ శాసనసభకు, లోక్‌సభకు ఎన్నికలున్నాయి ► చంద్రబాబును లోపల పెట్టడమన్నది రాజకీయ కక్ష కాకుంటే మరొకటని భావించలేం ► ఒక వేళ చంద్రబాబు విదేశాలకు పారిపోయి ఉంటే.. దాన్ని ఈ ప్రభుత్వం సంతోషంగా అనుమతించేది 04:20PM, సెప్టెంబర్ 19, 2023 క్వాష్ పిటిషన్ ఎందుకు కొట్టేయాలంటే... : CID లాయర్ ► NCT ఢిల్లీ X ప్రీతీ సరఫ్ కేసును ప్రస్తావించిన CID లాయర్ ► సాంకేతిక కారణాలు చూపించి క్వాష్ కొట్టేయడం సరికాదని సుప్రీంకోర్టు చెప్పింది ► సెక్షన్ CrPC 482 ప్రకారం దర్యాప్తు అధికారులను విచారణ పూర్తి చేసుకోనివ్వాలి 04:10PM, సెప్టెంబర్ 19, 2023 స్కిల్ డెవలప్ స్కాంలో ఎప్పుడు ఏం జరిగిందంటే.. కోర్టుకు వివరించిన CID లాయర్ రంజిత్ ►నిందితులకు ఆదాయపుపన్నుశాఖ నోటీసులు జారీచేసింది ► స్కిల్ స్కాంపై ఆదాయంపన్ను శాఖ ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించింది ► వాళ్ల మోడస్ ఆపరండీని మొత్తం ఇన్‌కంటాక్స్ పసిగట్టింది ► రూ.200 కోట్ల మేర నిధులను మళ్లించినట్టుగా IT తన ఫోరెన్సిక్ ఆడిట్లో గుర్తించింది ► స్కిల్ డెవలప్మెంట్ కోసం నాటి చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్లో ఎలాంటి తేదీ కూడా లేదు ► ఒప్పందం చేసుకున్న వెంటనే డిజైన్ టెక్ స్కిల్లర్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది ► ఎలాంటి ముందస్తు ఒప్పందం లేకుండానే ఈ కంపెనీని ఇన్కార్పొరేట్ చేశారు ► స్కిలర్ నుంచి రూ.178 కోట్లు కొనుగోలు చేసినట్టుగా డిజైన్‌టెక్ చూపింది ► ఒప్పదంలోకాని, ప్రతిపాదనలోకాని ఎలాంటి తేదీ కూడా లేదు ► డాక్యుమెంట్లలో ఎలాంటి తేదీలు కూడా లేవు, ఇది ఉద్దేశపూర్వకంగా విస్మరించారు ► ప్రభుత్వం ఉత్తర్వుల్లో కానీ, MOUల్లో ఎలాంటి స్థిరత్వం లేదు ► సంతకాలకు ముందే ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా 164 స్టేట్మెంట్లో నిందితులు అంగీకరించారు 04:00PM, సెప్టెంబర్ 19, 2023 ఇది పక్కా కుంభకోణమే, చంద్రబాబే సూత్రధారి, పాత్రధారి : CID లాయర్లు ► నేరం జరిగినప్పుడు తాను ముఖ్యమంత్రిని కాబట్టి ఇది రాజకీయ కక్ష్య అని చంద్రబాబు అంటున్నారు. ► విచారణ పూర్తై అధికారులు నివేదిక సమర్పించిన తరువాతే కోర్టు జోక్యం చేసుకోవాలి. ► FIRలో తన పేరులేదు కాబట్టి అరెస్టు చేయకూడదని చెప్పడం తప్పు ► FIR సర్వస్వం కాదు కోర్టులో కేసు విచారణ జరుగుతున్న సందర్భంలో కూడా పేరు చేర్చవచ్చు. ► ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో వ్యవహరించింది… అందుకే 2021లో చంద్రబాబు పేరును ఎఫ్ఐఆర్లో చేర్చలేదు ► ప్రైవేటు కంపెనీలు ఒక్క రూపాయి ఇవ్వకుండానే ప్రభుత్వానికి చెందిన 300కోట్లు రిలీజ్ చేశారు ► ముందుగానే ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేయడం అనేది ఎక్కడా ఉండదు. ► చంద్రబాబు ఆధ్వర్యంలోనే ఈ కుట్ర జరిగింది.. షెల్ కంపెనీలకు సైతం చంద్రబాబే సూత్రధారి, పాత్రధారి 03:48PM, సెప్టెంబర్ 19, 2023 కేవలం ఎఫ్ఐఆర్ ఆధారంగానే అరెస్ట్ జరగలేదు: CID లాయర్లు ► దర్యాప్తు బృందంపై రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు. కానీ, వీళ్లంతా శిక్షణ పొందిన అధికారులు. ఆరోపించేవాళ్లు ముందు ఈ విషయం గుర్తించాలి. ► సీమెన్స్ కంపెనీతో జరిపిన మెయిల్ సంభాషణలు మా దగ్గర ఉన్నాయి. ► చంద్రబాబు సెక్రటరీకి ఈడీ, ఐటీ నోటీసులు ఇచ్చాయి. ఆయన దేశం విడిచి అమెరికాకు పారిపోయారు. ► సీమెన్స్‌కు నిందితుడు సుబ్బారావు, గంటా ఈమెయిల్స్ పంపారు.. అప్పటి ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ కూడా ఇందులో బాగం అయ్యారు. ► కేవలం ఎఫ్ఐఆర్ ఆధారంగానే చంద్రబాబు అరెస్ట్ జరగలేదు. 03:23PM, సెప్టెంబర్ 19, 2023 పోలీసులపై నిందలు మోపుతారా? : CID లాయర్లు ►ఈ కేసు ప్రారంభ దశలోనే ఉంది. బెయిల్ దరఖాస్తు చేసుకున్న దరిమిలా.. 10 రోజుల్లో దర్యాప్తు పూర్తి కాదు. ►ప్రభుత్వం ప్రతీకారమే తీర్చుకోవాలనుకుంటే.. ఈ పెద్దమనిషి (చంద్రబాబు నాయుడు) ఏనాడో అరెస్టు అయ్యేవారు కదా. ►సెక్షన్ 17A ప్రజా ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకున్న అమాయక సేవకులను (innocent servants) రక్షించడం కోసం మాత్రమే. ►శంభూ నాథ్ మిశ్రా కేసును ఉదహరిస్తూ.. ‘‘రికార్డులను రూపొందించడం, నిధుల్ని దుర్వినియోగం చేయడం అధికారిక విధి కాదు." ►కేసు దర్యాప్తు దశలోనే ఉంది. ఐటీ శాఖ దర్యాప్తు చేస్తోంది. ఈడీ దర్యాప్తు చేస్తోంది. ►నేను సీఎంను(మాజీ) కాబట్టే.. అనే అంశం ప్రస్తావిస్తున్నారు కాబట్టి ఇది రాజకీయమైంది ►ఎంవోయూలో సబ్ కాంట్రాక్ట్ ప్రస్తావనే లేదు. ఎలాంటి సేవలు అందించకుండానే షెల్ కంపెనీలకు నిధులు వెళ్లాయి. ► రూ. 3 వేల కోట్లు ఎక్కడికి వెళ్లాయో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది ► షెల్ కంపెనీల జాడ తీస్తున్నాం ► నిబంధనలకు వ్యతిరేకంగా ఎంవోయూ నుంచి సబ్ కాంట్రాక్టుకు ఎలా వెళ్లింది? ► అన్ని బోగస్ కంపెనీలు కలిపి ప్రజాధనాన్ని లూటీ చేశాయి. ► ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా నిధుల దుర్వినియోగం జరిగింది ► ఈ డీల్‌కు కేబినెట్ ఆమోదం లేదు ► చంద్రబాబు పథకం ప్రకారమే తన అనుచరులతో కలిసి బోగస్ కంపెనీల పేరుతో రూ.371 కోట్ల ప్రజాధనం దోచుకున్నారు. ►మార్గదర్శకాలను కూడా కోర్టు అనుసరించాలి. విచారణ పూర్తయ్యే దాకా ఆగాలి. దర్యాప్తు సంస్థను నివేదిక సమర్పించేదాకా వేచి చూడాలి. మెరిట్స్‌లోకి వెళ్లాల్సిన అవసరం లేదు ఇక్కడ. 02:55PM, సెప్టెంబర్ 19, 2023 చంద్రబాబు క్వాష్పిటిషన్కు అనర్హుడు : CID తరపు లాయర్లు ► చంద్రబాబు క్వాష్ పిటిషన్‌కు అనర్హుడు ► ఎఫ్ఐఆర్ చేసిన వెంటనే చంద్రబాబును అరెస్ట్ చేయలేదు. ► రెండేళ్లు అన్ని సాక్ష్యాలు సేకరించాకే అరెస్ట్ చేశారు. ► పోలీసులకు పూర్తి స్వేచ్చను ఇచ్చి.. క్వాష్ పిటిషన్‌ను కొట్టివేయాలి ► సెక్షన్ 319 ప్రకారం ఎన్ని ఛార్జిషీట్లు అయినా వేయొచ్చు.. ఎంత మంది సాక్ష్యులను అయినా చేర్చొచ్చు. 02:38PM, సెప్టెంబర్ 19, 2023 సీఐడీ తరపున వాదనలు ►చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ► గణపతి వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు తో పాటు శంభునాథ్ మిశ్రా కేసు లో తీర్పుల్ని వివరిస్తున్న ముకుల్ రోహత్గీ ► చంద్రబాబు క్వాష్ పిటిషన్‌కు అనర్హుడంటూ వాదనలు ► ఈ దశలో నిందితుడికి అనుకూలంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకూడదని హైకోర్టుకు విజ్ఞప్తి 02:25PM, సెప్టెంబర్ 19, 2023 లంచ్ విరామం తర్వాత మొదలైన కోర్టు ►లంచ్ తర్వాత మొదలైన హైకోర్టు ► క్వాష్ పిటిషన్‌పై వాదనలు వినిపిస్తున్న చంద్రబాబు తరపు న్యాయవాదులు 1:58 PM, సెప్టెంబర్ 19, 2023 హైకోర్టుకు లంచ్ బ్రేక్.. ►చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ లంచ్ తర్వాతకు వాయిదా ►లంచ్ తర్వాత వాదనలు వినిపించనున్న చంద్రబాబు లాయర్లు 1:40 PM, సెప్టెంబర్ 19, 2023 స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో బాబు తరపున సిద్ధార్థ్ లూథ్రా వాదనలు ► చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరుపై అభ్యంతరాలున్నాయి ► ఒక వేళ ఈ FIR 2018 సవరణ కంటే ముందు నమోదై ఉంటే అడిగేవాళ్లం కాదు ► కానీ FIR 2020లో నమోదయింది కాబట్టి చంద్రబాబును అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి ► 2020లో అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసినప్పుడు ఇలాగే జరిగింది ► కర్ణాటక కేసును ఉదహరించిన లూథ్రా, 17Aలో ముందస్తు అనుమతి అవసరమని వాదన 1:30 PM, సెప్టెంబర్ 19, 2023 ► చంద్రబాబును అరెస్ట్‌పై కాంగ్రెస్ ప్రకటన ► చంద్రబాబును అరెస్ట్‌పై మాట్లాడిన మధుయాష్కీ ► చంద్రబాబును జైలుకు పంపడం వెనుక మోదీ, కేసీఆర్ ఉన్నారు ► కేసీఆర్ పాత్ర పై మాకు పూర్తిస్థాయి సమాచారం ఉంది ► ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పనిచేసినందుకే చంద్రబాబుపై కక్షసాధింపు చర్యలు ► చంద్రబాబు అరెస్టు పై కేసీఆర్, కేటీఆర్ ఎందుకు స్పందించలేదు? : మధుయాష్కి 12:30 PM, సెప్టెంబర్ 19, 2023 ► స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో బాబు తరపున హరీష్ సాల్వే వాదనలు ► చంద్రబాబు అరెస్టులో సరైన నియామవళి పాటించలేదు ► చంద్రబాబు అరెస్టులో గవర్నర్ అనుమతి తీసుకోలేదు ► ప్రీవెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 17A ప్రకారం అరెస్ట్ చూపించారు ► దీని ప్రకారం పోలీసులు గవర్నర్ అనుమతి తర్వాతే అరెస్ట్ చేయాలి ► ఈ కేసులో 2020లో FIR నమోదయింది, అప్పుడు బాబు పేరు లేదు ► అరెస్ట్ చేసే సమయానికి బాబు పేరు FIRలో లేదు ► FIRలో పేరు ఉంటేనే అరెస్ట్ చేయాలి కాబట్టి ప్రోసీజర్ సరిగా ఫాలో కాలేదు ► ఎన్నికలు వచ్చాయి కాబట్టి రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారు ► సీమెన్స్ కంపెనీ రాసిన మెయిల్ ఆధారంగా APSSDC ఛైర్మన్ ఫిర్యాదు చేశారు ► స్కిల్ డెవలప్మెంట్లో సేవలందించింది సీమెన్స్‌కు చెందిన ఉప కంపెనీనే ► ప్రభుత్వం బాధ్యత నిధులు విడుదల చేయడం, సేవలు పొందడం ► CID ఆరోపించినట్టు ఎక్కడా సాక్ష్యాలను తారుమారు చేయలేదు ► ఈ కేసులో చంద్రబాబు సహకరిస్తున్నా.. అరెస్ట్‌కు తొందరపడ్డారు ► ముగిసిన హరీష్ సాల్వే వాదనలు 12:20 PM, సెప్టెంబర్ 19, 2023 ► స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసును విచారిస్తోన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ► కేసు నుంచి చంద్రబాబు పేరును తొలగించాలని క్వాష్ పిటిషన్ ► చంద్రబాబు తరపున వర్చువల్‌లో (వీడియో కాన్ఫరెన్స్ ద్వారా) హరీష్ సాల్వే వాదనలు ► చంద్రబాబు తరపున రంగంలోకి దిగిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సిద్థార్థ లూథ్రా, హరీష్ సాల్వే, సిద్దార్థ్ అగర్వాల్ ► CID తరపున సుప్రీం న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదనలు 12:09PM, సెప్టెంబర్ 19, 2023 ► హైకోర్టు ముందుకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ స్కాం ► ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు లాయర్ల పిటిషన్ ► ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ స్కాం కేసును ఎల్లుండికి (ఈ నెల 21కి) వాయిదా వేసిన హైకోర్టు 11:30 AM, సెప్టెంబర్ 19, 2023 హైకోర్టులో మధ్యాహ్నం 12 తర్వాత రింగ్‌రోడ్డు కేసు విచారణ ► చంద్రబాబు రిమాండ్ పిటిషన్‌పై మధ్యాహ్నం 12 గంటలకు వాదనలు జరిగే అవకాశం ► సీనియర్ లాయర్ హరీశ్ సాల్వే హాజరవుతారు, సమయం కావాలన్న బాబు లాయర్లు ► చంద్రబాబు తరపు న్యాయవాదుల అభ్యర్ధనను అంగీకరించిన హైకోర్టు ► హరీష్ సాల్వే వల్ల జరిగిన ఆలస్యంపై CIDని అడిగిన హైకోర్టు ► తమకు అభ్యంతరం లేదని చెప్పిన ప్రభుత్వ న్యాయవాదులు 11:20 AM, సెప్టెంబర్ 19, 2023 పచ్చ మీడియా చెప్పని/చెప్పలేని అసలు నిజాలు ► అరెస్ట్ అక్రమమంటూ గొంతు చించుకుంటోన్న పచ్చమీడియా ► కేంద్ర సంస్థల నుంచి బాబుకు ఇప్పటివరకు వచ్చిన నోటీసులు ► కేంద్ర దర్యాప్తు సంస్థ నుంచి వచ్చిన ఏ ఒక్క నోటీసునూ బయటపెట్టని పచ్చ మీడియా Case - 1 ► ఆగష్టు 4న ఇన్‌కమ్‌టాక్స్ నుంచి చంద్రబాబుకు అందిన నోటీసు ► అమరావతి కాంట్రాక్టర్ల నుంచి 600 కోట్ల కాంట్రాక్టులో (సచివాలయం బిల్డింగ్) 119 కోట్లు (20 శాతం ) ముడుపులు ► బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ చౌదరికి ఇచ్చానని చెప్పిన షాపూర్జీ పల్లోంజీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ ► ఆ నోటీసు గురించి ఇప్పటివరకు నోరు మెదపని బాబు, ఎల్లో మీడియా Case - 2 ► స్కిల్ డెవలప్మెంట్తో మాకు సంబంధం లేదని లిఖితపూర్వకంగా పంపిన సీమెన్స్ ► అయినా సీమెన్స్ కంపెనీ, చాలా గొప్ప పని బాబు చేశారంటూ ఎల్లోమీడియా ప్రచారం ► టెండర్ లేకుండా తరలిపోయిన 371 కోట్ల గురించి అధికారులను అడగాలని తిరకాసు ► ఈ కేసులో నలుగురిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్ట్ చేసిన విషయం రహస్యం.! ► బాబు పర్సనల్ సెక్రటరీ మరియు మనోజ్ విదేశాలకు పారిపోయిన విషయం అత్యంత గోప్యం Case - 3 ► ఫిబ్రవరి 17,2020న ప్రెస్ నోట్ విడుదల చేసిన ఆదాయంపన్ను శాఖ ► స్వయంగా విడుదల చేసిన ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లువాలియా ► బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాసచౌదరి ఇంట్లో ఫిబ్రవరి 13 ,2020న తనిఖీలు ► ఐటీ అధికారులు సోదాల్లో 2 వేల కోట్ల అక్రమ లావాదేవీలకు సంబందించి నల్లధన వివరాలు ► దీనికి సంబంధించి చంద్రబాబుకు ఇన్‌కంటాక్స్ నోటీసులు ► ఇప్పటివరకు నోటీసుల గురించి ఎక్కడా కోట్ చేయని పచ్చమీడియా 11:15 AM, సెప్టెంబర్ 19, 2023 అల్లర్లను నమ్ముకున్న తెలుగుదేశం టీం ► గుంటూరు, విశాఖ, విజయవాడలో రోడ్లపైకి టిడిపి నేతలు ► ఎలాంటి అనుమతులు లేకుండా ర్యాలీ చేస్తామంటూ ఏర్పాట్లు ► జన జీవనానికి ఇబ్బందులు వస్తాయని వద్దని చెప్పిన పోలీసులు ► పలు చోట్ల పోలీసులతో వాగ్వాదం, అల్లర్లు చేసేందుకు ప్రయత్నాలు ► గుంటూరులో తెలుగుదేశం ర్యాలీని అడ్డుకున్న పోలీసులు ► నక్కా ఆనంద్ బాబు, డేగల ప్రభాకర్, నన్నపనేని రాజకుమారిని నిలువరించిన పోలీసులు ► పూజలు చేస్తామంటూ వేర్వేరు దారుల్లో గుళ్లకు వస్తోన్న టిడిపి నేతలు ► దుర్గగుడికి ఆటోలో వచ్చిన దేవినేని ఉమ, వినాయకుడి గుడి వద్ద ఉమను గమనించి నిలువరించిన పోలీసులు 11:00 AM, సెప్టెంబర్ 19, 2023 హైబ్రీడ్ మోడ్‌లో చంద్రబాబు కేసు విచారణ.! ► నేరుగా వాదిస్తాం, వర్చువల్‌గా వాదిస్తాం... ► హైకోర్టుకు చంద్రబాబు తరపున లాయర్ల విజ్ఞప్తి ► ఒక సీనియర్ లాయర్, మరో సీనియర్ లాయర్ వర్చువల్‌గా ► ఆన్లైన్లో వాదనలు వినాలని న్యాయమూర్తికి విజ్ఞప్తి ► మధ్యాహ్నం తర్వాత కేసు విచారణ చేపట్టనున్న హైకోర్టు 10:30 AM, సెప్టెంబర్ 19, 2023 కస్టడీ ఇస్తారా? రిమాండ్ పొడిగిస్తారా? ► హైకోర్టు, ఏసీబీ కోర్టుల్లో చంద్రబాబు పిటిషన్లపై నేడు విచారణ ► నేటితో ముగియనున్న నేటితో ముగియనున్న రిమాండ్ ► సాధారణ ప్రక్రియలో భాగంగా రిమాండ్ పొడిగించే అవకాశం ► హైకోర్టుకు చేరుకున్న అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ► మధ్యాహ్నం 12 గంటల తర్వాత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ జరిగే అవకాశం 10:30 AM, సెప్టెంబర్ 19, 2023 ఏ కేసులో ఏ లాయర్ ? గంటకు ఫీజు ఎంత? ► చంద్రబాబు పిటిషన్లపై హేమాహేమీలను దించిన టిడిపి లీగల్ సెల్ ► చంద్రబాబు కోసం రంగంలోకి దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్లు ► క్వాష్ పిటిషన్‌పై వాదనలు వినిపించనున్న సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లోథ్రా ► రిమాండ్ ఉత్తర్వుల సస్పెన్షన్, కస్టడీ ఇవ్వొందంటూ వాదించనున్న ముఖుల్ రోహత్గీ ► ఏపీ హైకోర్టులోనే మరో బెంచ్‌లో ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై విచారణ ► ఈ పిటిషన్‌పై చంద్రబాబు తరపున హరీశ్ సాల్వే వర్చువల్ వాదనలు ► గంటకు కోటి అయినా ఇచ్చేందుకు టిడిపి లీగల్ సెల్ సిద్ధమని ఢిల్లీలో చర్చలు 10:10 AM, సెప్టెంబర్ 19, 2023 ఏపీ హైకోర్టుకు చేరుకున్న లూథ్రా ► ఏపీ హైకోర్టుకు చేరుకున్న సీనియర్ లాయర్ సిద్ధార్ధ్ లూథ్రా ► చంద్రబాబుపై నమోదయిన స్కిల్ కేసును కొట్టేయాలని లూథ్రా పిటిషన్ ► లూథ్రా వేసిన క్వాష్ పిటిషన్ ఇవ్వాళ హైకోర్టులో విచారణ ► గత పది రోజులుగా కేసుపై వీపరీతంగా ప్రిపేర్ అయిన లూథ్రా ► చంద్రబాబును విడిపించే బలమైన లాజిక్ దొరక్క లూథ్రా నిర్వేదం ► నిర్వేదంలో గురు గోవింద్ సింగ్, స్వామి వివేకానంద కొటేషన్లతో ట్వీట్లు Swami Vivekananda says in Karma Yoga - "A man must go about his duties without taking notice of the sneers and the ridicule of the world." And definitely not by those who have neither read nor understood the words of the venerable 1Oth guru who stood for justice and piety!! — Sidharth Luthra (@Luthra_Sidharth) September 14, 2023 10:00 AM, సెప్టెంబర్ 19, 2023 చంద్రబాబు కోసం దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్లు ► చంద్రబాబు తరపున దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్లు ► ముగ్గురు టాప్ మోస్ట్ లాయర్లతో టిడిపి లీగల్ సెల్ మంతనాలు ► ఇవ్వాళ హైకోర్టులో వాదనలు వినిపించనున్న ముగ్గురు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ► సిద్ధార్ధ లూథ్రాతో పాటు హారీశ్ సాల్వే, సిద్ధార్ధ్ అగర్వాల్ ► ఇతర పనుల నిమిత్తం ఫ్రాన్స్‌లో ఉన్న హారీశ్ సాల్వే ► ఎక్కడ ఉన్నా.. ఇక్కడ వాదనలు వినిపించాలని హారీశ్ సాల్వేకు టిడిప లీగల్ సెల్ విజ్ఞప్తి ► ఫ్రాన్స్ నుంచి వర్చువల్ గా వాదనలు వినిపించనున్న హరీశ్ సాల్వే 9:00 AM, సెప్టెంబర్ 19, 2023 యనమలపై ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు.. ►చంద్రబాబు జైల్లో కూర్చుని విజన్ 2047 గురించి ఆలోచిస్తున్నారు. ►జాతీయ నేతలకు ధన్యవాదాలు చెప్పమన్నారని స్వయంప్రకటిత మేధావి యనమల రామకృష్ణుడు సెలవిస్తున్నారు. ►బెయిల్ కోసం ఆయన బెంబేలెత్తిపోతుంటే మీ బిల్డప్స్ ఏంటి రామా కృష్ణా!. చంద్రబాబు గారు జైల్లో కూర్చుని విజన్ 2047 గురించి ఆలోచిస్తున్నారని, జాతీయ నేతలకు ధన్యవాదాలు చెప్పమన్నారని స్వయంప్రకటిత మేధావి యనమల రామకృష్ణుడు సెలవిస్తున్నారు. బెయిల్ కోసం ఆయన బెంబేలెత్తిపోతుంటే మీ బిల్డప్స్ ఏంటి రామా కృష్ణా! — Vijayasai Reddy V (@VSReddy_MP) September 19, 2023 08:12AM, సెప్టెంబర్ 19, 2023 ►గుంటూరులో టీడీపీ నేతల పూజా కార్యక్రమాలు ►చంద్రబాబు బెయిల్ కోసం ప్రత్యేక పూజలు ►వినాయక మండపాల వద్ద టీడీపీ నేతల పూజలు ►ఆధ్యాత్మిక ప్రాంతాల్లో రాజకీయాలు చేయడం ఏంటని భక్తుల ఆగ్రహం 7:59 AM ఢిల్లీలో లోకేష్ వెంటే రఘురామ కృష్ణంరాజు ►రాజ్‌ఘాట్‌కు నారా లోకేష్, టీడీపీ మంత్రులు, ఎంపీలు ►అదే టీంలో రఘురామ కృష్ణంరాజు ►ఢిల్లీ వెళ్లినప్పటి నుంచి రఘురామ లాబీయింగ్‌పై ఆధారపడ్డ లోకేష్ ►బీజేపీ పెద్దల అపాయింట్మెంట్లు ఇప్పించాలని విజ్ఞప్తి ►పార్లమెంటు సమావేశాలతో కేంద్ర పెద్దలు బిజీ బిజీ ►ఎలాగైనా వారి దృష్టిలో పడేందుకు టీడీపీ బృందం విశ్వప్రయత్నాలు 07:30 AM, సెప్టెంబర్ 19, 2023 లోకేష్‌లో గుబులు ► ఇంకా ఢిల్లీలోనే చంద్రబాబు కొడుకు నారా లోకేష్ ► ఎల్లో మీడియాలో లోకేష్ పై విపరీతంగా ప్రచారం ► రాజమండ్రి రాగానే లోకేష్ ను అరెస్ట్ చేస్తారంటున్న ఎల్లో మీడియా ► రాజమండ్రికి రావాలా? వద్దా? ఇంకొన్నాళ్లు ఢిల్లీలోనే ఉండాలా? ► ఎల్లో మీడియా చెప్పినట్టు అరెస్ట్ చేస్తే రాజమండ్రి కంటే ఢిల్లీ బెటరా? ► ఢిల్లీలో సుప్రీంకోర్టు లాయర్లతో లోకేష్ మంతనాలు ► తనకు వ్యతిరేకంగా ఏయే ఆధారాలున్నాయన్నదానిపై చర్చ ► ఇవ్వాళ ఢిల్లీలో ఎంపీలతో కలిసి ధర్నాలో పాల్గొనున్న లోకేష్ ► ఢిల్లీలో ఉదయం రాజ్ ఘాట్ సందర్శించనున్న లోకేష్ ► ఎక్కడికి వెళ్లినా వెంట టిడిపి ఎంపీలు ఉండాలని సూచించిన లోకేష్ 07:20 AM, సెప్టెంబర్ 19, 2023 పీక్స్‌కు చేరిన ఎల్లో మీడియా సానుభూతి ఆరాటం ► లోకేష్ ను అరెస్ట్ చేస్తారని ఎల్లో మీడియాలో భారీ ప్రచారం ► బాబును అరెస్ట్ కు లోకేష్ ను జత చేయాలని ఎల్లో మీడియా ఆరాటం ► ప్రజల్లో సానుభూతి తెచ్చుకొనేందుకు ప్రయాసలు ► ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేశ్‌ను అరెస్ట్ చేస్తారంటున్న ఎల్లో మీడియా ► ఫైబర్ గ్రిడ్ కేసులో ఇప్పటికే కొందరి అరెస్ట్ ► రెండేళ్ల నుంచి ఫైబర్ గ్రిడ్ కేసులో దర్యాప్తు ► ఈ రోజు రాత్రి లోకేశ్ రాజమండ్రి చేరుకునే అవకాశం ► రాజమండ్రికి లోకేష్ రాగానే CID అరెస్ట్ చేస్తుందంటూ పచ్చ ప్రచారం 07:00 AM, సెప్టెంబర్ 19, 2023 అసలు మన లాయర్లు ఏం చేస్తున్నారు? : చంద్రబాబు రుసరుస ► తన కేసు వాదిస్తోన్న లాయర్లతో కలుస్తానని నిన్న యనమలకు చెప్పిన చంద్రబాబు ► నేడు చంద్రబాబుతో సుప్రీంకోర్టు లాయర్ తో పాటు టీడీపీ లీగల్ సెల్ లాయర్లు కలిసే అవకాశం ► కేసులో సాంకేతిక లోపాలు ఏమున్నాయన్న దానిపై టిడిపి లీగల్ సెల్ రంధ్రాన్వేషణ ► ఏసీబీ కోర్టులో ఏం వాదించాలి? హైకోర్టులో క్వాష్ పిటిషన్ సందర్భంగా ఏం చెప్పాలి? ► బాబు కోసం భారీ కసరత్తు చేస్తోన్న సుప్రీంకోర్టు లాయర్లు 6:50 AM, సెప్టెంబర్ 19, 2023 టీడీపీవి బూటకపు వాదనలు.. ► స్కిల్ స్కామ్ కేసులో మనోజ్ వాసుదేవ్ పార్థసాని, పెండ్యాల శ్రీనివాసరావు దేశం విడిచి పారిపోయారు. ► వీరికి చంద్రబాబుతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. ► ఈ కేసు విషయంలో టీడీపీ చేస్తున్నవన్నీ బూటకపు వాదనలు. ► స్కిల్ డెవలప్మెంట్ పేరుతో రూ.371 కోట్ల అవినీతి జరిగినట్టు ఐటీ, ఈడీ నిర్ధారించాయి. ► చంద్రబాబు షెల్ కంపెనీలకు నిధులు మళ్లించి, తర్వాత వాటిని స్వాహా చేశాడు. ► ఇన్నేళ్ళ తర్వాత ఈ కేసులో చట్టం చంద్రబాబును పట్టుకుంది. “స్కిల్ స్కామ్ కేసులో మనోజ్ వాసుదేవ్ పార్థసాని, పెండ్యాల శ్రీనివాసరావు దేశం విడిచి పారిపోయారు” - వీరికి చంద్రబాబుతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. - ఈ కేసు విషయంలో టీడీపీ చేస్తున్నవన్నీ బూటకపు వాదనలు. - స్కిల్ డెవలప్మెంట్ పేరుతో రూ.371 కోట్ల అవినీతి జరిగినట్టు ఐటీ, ఈడీ… pic.twitter.com/LScpdrWDGE — YSR Congress Party (@YSRCParty) September 18, 2023 06:30 AM, సెప్టెంబర్ 19, 2023 ఏసీ లేని గదిలో ఎవరయినా ఉంటారా? : బాబుకు కోపమొచ్చింది..! ► రాజమండ్రి సెంట్రల్ జైలు స్నేహా బ్లాక్ లో చంద్రబాబు ► పదో రోజుకు చేరుకున్న చంద్రబాబు రిమాండ్ ► నిన్న కుటుంబ సభ్యులను ములాఖత్ లో కలిసిన చంద్రబాబు ► కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నేత యనమలతో బాబు చర్చలు ► తనకు గదిలో ఏసీ లేదని, ఇబ్బందిగా ఉందని బాబు తనతో చెప్పాడన్న యనమల ► కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్న జైలు అధికారులు ► చంద్రబాబు కాలక్షేపం కోసం అయిదు న్యూస్ పేపర్లు, టీవీ ► స్నేహా బ్లాక్ లో ఉదయం మార్నింగ్ వాక్ చేస్తున్న చంద్రబాబు ► ఇంటి నుంచి అన్ని పూటల భోజనం, స్నానానికి వేడి నీళ్ల సదుపాయం 06:20 AM, సెప్టెంబర్ 19, 2023 హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ► స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నేడు హైకోర్టులో విచారణ ► చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ ► జ్యుడీషియల్ రిమాండ్ ఉత్తర్వులను కొట్టివేయాలని కోరిన చంద్రబాబు ► చట్టవిరుద్ధంగా చంద్రబాబుని అరెస్ట్ చేశారని వాదించారన్న లాయర్ సిద్దార్థ లూథ్రా ► ఇవ్వాళ కౌంటర్ దాఖలు చేయనున్న CID ► అనంతరం ఇరు పక్షాల వాదనలు విననున్న హైకోర్టు 06:15 AM, సెప్టెంబర్ 19, 2023 హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ► ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నేడు హైకోర్టులో విచారణ ► బెయిల్ కోరుతూ పిటిషన్ వేసిన చంద్రబాబు ► చంద్రబాబు వేసిన పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగే అవకాశం 06:10 AM, సెప్టెంబర్ 19, 2023 బాబును కస్టడీకి ఇవ్వండి : CID విజ్ఞప్తి ► ఏసీబీ కోర్టులో CID కస్టడీ పిటిషన్ ► స్కిల్ కుంభకోణం కేసులో చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ పిటిషన్ ► కస్టడీకి ఇస్తే స్కాంకు సంబంధించి కీలక వివరాలు రాబడతామన్న సీఐడీ 6:00 AM, సెప్టెంబర్ 19, 2023 బెయిల్, మధ్యంతర బెయిల్.. ACB కోర్టులో నేడు విచారణలు ► ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ ► చంద్రబాబు తరపున మరో పిటిషన్, మధ్యంతర బెయిల్ కోరుతూ పిటిషన్ ► బెయిల్ తో పాటు మధ్యంతర పిటిషన్ పై నేడు విచారణ. -
సుమన్ బోస్‌కు ఏ అధికారమూ లేదు: సీమెన్స్
స్కిల్ డెవలప్మెంట్ కేసు నిరాధారమైందని, ఈ ప్రాజెక్టు నూరుశాతం విజయవంతమైందని.. దీనిలో ఏమాత్రం అవినీతి జరగలేదని సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్ తాజాగా మీడియా ముందుకొచ్చారు. పైగా యువత జీవితాన్ని దారుణంగా దెబ్బతీసే విధంగా సీమెన్స్, స్కిల్ డెవల్‌పమెంట్ ప్రాజెక్టులపై ఏపీ సీఐడీ నిరాధార ఆరోపణలు చేస్తున్నాయంటూ చెప్పుకొచ్చారు. అయితే.. ఈ వ్యవహారంపై సీమెన్స్ కంపెనీనే స్వయంగా స్పందించింది. సుమన్ బోస్ సంతకాలు చేసినట్టు చెబుతున్న ఒప్పందంతో సీమెన్స్ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని మరోమారు స్పష్టత ఇచ్చింది. ప్రశ్న: జీవోలో పేర్కొన్నట్టుగా రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కోసం సీమెన్స్–డిజైన్ టెక్ కంపెనీలు రూ.3,300కోట్లతో ప్రాజెక్ట్ నెలకొల్పడానికి అంగీకరించారా? మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.3,300 కోట్లలో ప్రభుత్వం వాటా 10 శాతంగా, గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా సీమెన్స్ 90శాతం వాటా సమకూర్చేందుకు సమ్మతించిందా? గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద అటువంటి ప్రాజెక్ట్‌లు చేపట్టే విధానం సీమెన్స్ కంపెనీలో ఉందా? సీమెన్స్ కంపెనీ సమాధానం: గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ప్రాజెక్ట్‌లకు 90% నిధులు సమకూర్చే విధానం సీమెన్స్ కంపెనీలో లేనే లేదు. డిజైన్ టెక్ కంపెనీతో కలసి మేము స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. అలాంటి ఒప్పందం గురించి మాకు అసలు తెలీదు. ప్రశ్న: ఏపీలో యువతకు నైపుణ్య శిక్షణ కోసం కుదుర్చుకున్న త్రైపాక్షిక ఒప్పందానికి సంబంధించి ఏపీఎస్ఎస్డీసీ నుంచిగానీ డిజైన్ టెక్ కంపెనీ నుంచి ఏమైనా వర్క్ ఆర్డర్ మీకు వచ్చిందా? సీమెన్స్ కంపెనీ సమాధానం: ఏపీఎస్‌ఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్ట్‌కు సంబంధించి మాకు ఏపీఎస్ఎస్డీసీ నుంచిగానీ డిజైన్ టెక్ కంపెనీ నుంచి ఎలాంటి వర్క్ ఆర్డర్ రాలేదు. ప్రశ్న: ఏపీఎస్ఎస్డీసీ, డిజైన్‌టెక్‌తో కలిసి సీమెన్స్ కంపెనీ పేరున కుదుర్చుకున్నట్టు చెబుతున్న ఒప్పందంపై సీమెన్స్ కంపెనీ తరపున అని చెబుతూ సుమన్ బోస్ సంతకాలు చేశారు. సీమెన్స్ కంపెనీలో ఆయన హోదా ఏమిటి? ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారు? సుమన్‌బోస్ తాజా ప్రెస్ మీట్లో.. సీమెన్స్ కంపెనీ సమాధానం: సీమెన్స్ కంపెనీ తరపున ప్రాజెక్ట్‌లు కుదర్చుకునేందుకుగానీ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద నిధులు సమకూరుస్తామని ఒప్పందం చేసుకునేందుకుగానీ సుమన్ బోస్‌కు ఎలాంటి అధికారం లేదు. కంపెనీ ఆ అధికారాన్ని ఆయనకు ఎప్పుడూ ఇవ్వ లేదు. సుమన్ బోస్ మా కంపెనీకి ఎప్పుడో రాజీనామా చేశారు. ఆయనకు మా కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు. ఆయన ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో కూడా మాకు సమాచారం లేదు. ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ పేరిట అవినీతి కేసులో సుమన్ బోస్‌ను సీఐడీ దర్యాప్తు చేస్తోందని మాకు తెలిసింది. సీమెన్స్ కంపెనీ ఎలాంటి ప్రాజెక్ట్‌లలోనూ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద నిధులు వెచ్చించదు. కాబట్టి సుమన్ బోస్ సంతకాలు చేసినట్టు చెబుతున్న ఒప్పందంతో సీమెన్స్ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు సీమెన్స్ కంపెనీ ఈ-మెయిల్ ద్వారా ఇచ్చిన సమాధానాలు ఇవి.. ఇదీ చదవండి: బాబుకు తోడు దొంగల వత్తాసు -
Live : చంద్రబాబు కేసు .. Sep 18th 2023
Updates.. లోకేష్ లో గుబులు 07:30 AM, సెప్టెంబర్ 19, 2023 ► ఇంకా ఢిల్లీలోనే చంద్రబాబు కొడుకు నారా లోకేష్ ► ఎల్లో మీడియాలో లోకేష్ పై వీపరీతంగా ప్రచారం ► రాజమండ్రి రాగానే లోకేష్ ను అరెస్ట్ చేస్తారంటున్న ఎల్లో మీడియా ► రాజమండ్రికి రావాలా? వద్దా? ఇంకొన్నాళ్లు ఢిల్లీలోనే ఉండాలా? ► ఎల్లో మీడియా చెప్పినట్టు అరెస్ట్ చేస్తే రాజమండ్రి కంటే ఢిల్లీ బెటరా? ► ఢిల్లీలో సుప్రీంకోర్టు లాయర్లతో లోకేష్ మంతనాలు ► తనకు వ్యతిరేకంగా ఏ ఏ ఆధారాలున్నాయన్నదానిపై చర్చ ► ఇవ్వాళ ఢిల్లీలో ఎంపీలతో కలిసి ధర్నాలో పాల్గొనున్న లోకేష్ ► ఢిల్లీలో ఉదయం రాజ్ ఘాట్ సందర్శించనున్న లోకేష్ ► ఎక్కడికి వెళ్లినా వెంట టిడిపి ఎంపీలు ఉండాలని సూచించిన లోకేష్ పీక్స్ కు చేరిన ఎల్లో మీడియా సానుభూతి ఆరాటం 07:20 AM, సెప్టెంబర్ 19, 2023 ► లోకేష్ ను అరెస్ట్ చేస్తారని ఎల్లో మీడియాలో భారీ ప్రచారం ► బాబును అరెస్ట్ కు లోకేష్ ను జత చేయాలని ఎల్లో మీడియా ఆరాటం ► ప్రజల్లో సానుభూతి తెచ్చుకొనేందుకు ప్రయాసలు ► ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేశ్‌ను అరెస్ట్ చేస్తారంటున్న ఎల్లో మీడియా ► ఫైబర్ గ్రిడ్ కేసులో ఇప్పటికే కొందరి అరెస్ట్ ► రెండేళ్ల నుంచి ఫైబర్ గ్రిడ్ కేసులో దర్యాప్తు ► ఈ రోజు రాత్రి లోకేశ్ రాజమండ్రి చేరుకునే అవకాశం ► రాజమండ్రికి లోకేష్ రాగానే CID అరెస్ట్ చేస్తుందంటూ పచ్చ ప్రచారం అసలు మన లాయర్లు ఏం చేస్తున్నారు? : చంద్రబాబు రుసరుస 07:00 AM, సెప్టెంబర్ 19, 2023 ► తన కేసు వాదిస్తోన్న లాయర్లతో కలుస్తానని నిన్న యనమలకు చెప్పిన చంద్రబాబు ► నేడు చంద్రబాబుతో సుప్రీంకోర్టు లాయర్ తో పాటు టీడీపీ లీగల్ సెల్ లాయర్లు కలిసే అవకాశం ► కేసులో సాంకేతిక లోపాలు ఏమున్నాయన్న దానిపై టిడిపి లీగల్ సెల్ రంధ్రాన్వేషణ ► ఏసీబీ కోర్టులో ఏం వాదించాలి? హైకోర్టులో క్వాష్ పిటిషన్ సందర్భంగా ఏం చెప్పాలి? ► బాబు కోసం భారీ కసరత్తు చేస్తోన్న సుప్రీంకోర్టు లాయర్లు ఏసీ లేని గదిలో ఎవరయినా ఉంటారా? : బాబుకు కోపమొచ్చింది..! 06:30 AM, సెప్టెంబర్ 19, 2023 ► రాజమండ్రి సెంట్రల్ జైలు స్నేహా బ్లాక్ లో చంద్రబాబు ► పదో రోజుకు చేరుకున్న చంద్రబాబు రిమాండ్ ► నిన్న కుటుంబ సభ్యులను ములాఖత్ లో కలిసిన చంద్రబాబు ► కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నేత యనమలతో బాబు చర్చలు ► తనకు గదిలో ఏసీ లేదని, ఇబ్బందిగా ఉందని బాబు తనతో చెప్పాడన్న యనమల ► కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్న జైలు అధికారులు ► చంద్రబాబు కాలక్షేపం కోసం అయిదు న్యూస్ పేపర్లు, టీవీ ► స్నేహా బ్లాక్ లో ఉదయం మార్నింగ్ వాక్ చేస్తున్న చంద్రబాబు ► ఇంటి నుంచి అన్ని పూటల భోజనం, స్నానానికి వేడి నీళ్ల సదుపాయం హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం 06:20 AM, సెప్టెంబర్ 19, 2023 ► స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నేడు హైకోర్టులో విచారణ ► చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ ► జ్యుడీషియల్ రిమాండ్ ఉత్తర్వులను కొట్టివేయాలని కోరిన చంద్రబాబు ► చట్టవిరుద్ధంగా చంద్రబాబుని అరెస్ట్ చేశారని వాదించారన్న లాయర్ సిద్దార్థ లూథ్రా ► ఇవ్వాళ కౌంటర్ దాఖలు చేయనున్న CID ► అనంతరం ఇరు పక్షాల వాదనలు విననున్న హైకోర్టు హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్ కేసు 06:15 AM, సెప్టెంబర్ 19, 2023 ► ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నేడు హైకోర్టులో విచారణ ► బెయిల్ కోరుతూ పిటిషన్ వేసిన చంద్రబాబు ► చంద్రబాబు వేసిన పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగే అవకాశం బాబును కస్టడీకి ఇవ్వండి : CID విజ్ఞప్తి 06:10 AM, సెప్టెంబర్ 19, 2023 ► ఏసీబీ కోర్టులో CID కస్టడీ పిటిషన్ ► స్కిల్ కుంభకోణం కేసులో చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ పిటిషన్ ► కస్టడీకి ఇస్తే స్కాంకు సంబంధించి కీలక వివరాలు రాబడతామన్న సీఐడీ బెయిల్, మధ్యంతర బెయిల్.. ACB కోర్టులో నేడు విచారణలు 6:00 AM, సెప్టెంబర్ 19, 2023 ► ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ ► చంద్రబాబు తరపున మరో పిటిషన్, మధ్యంతర బెయిల్ కోరుతూ పిటిషన్ ► బెయిల్ తో పాటు మధ్యంతర పిటిషన్ పై నేడు విచారణ -------- 06:20PM, సెప్టెంబర్ 18, 2023 రేపు చంద్రబాబు పిటిషన్లపై విచారణ ► రేపు ఏపీ హైకోర్టు, ఏసీబీ కోర్టులో చంద్రబాబు పిటిషన్లపై విచారణ ► బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై ఇప్పటికే ఏసీబీ కోర్టులో వాదనలు పూర్తి ► సెప్టెంబర్ 15న ఇరువర్గాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ► కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీ అధికారులనూ ఆదేశించింది. మరోవైపు.. ► చంద్రబాబు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ► ఈ పిటిషన్‌పై కూడా విచారణ మంగళవారానికే (19వ తేదీ) వాయిదా పడింది. 05:04PM, సెప్టెంబర్ 18, 2023 బాబు అరెస్ట్‌పై టీడీపీకి లోక్‌సభలో కౌంటర్ ► చంద్రబాబు అరెస్టుపై లోక్‌సభలో టీడీపీ చేసిన తప్పుడు ప్రచారాన్ని వైఎస్సార్సీపీ ఎంపీలు అడ్డుకున్నారు. ► పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో.. చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని లేవనెత్తింది టీడీపీ ► చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ గల్లా జయదేవ్ వాదన ► ఇది పూర్తిగా అవినీతి కేసు అన్న ఎంపీ మిథున్ రెడ్డి ► చంద్రబాబు పీఏకు నోటీసులు వెళ్లాయి.. ఆయన పరారీలో ఉన్నారు. ► 80 షెల్ కంపెనీలకు డబ్బు వెళ్లిందిన ఈడీ తేల్చింది. ► అన్ని ఆధారాలు ఉన్నందునే అరెస్ట్ జరిగింది. 04:34PM, సెప్టెంబర్ 18, 2023 ► చంద్రబాబును కలుసుకున్న లాయర్ దమ్మాలపాటి శ్రీనివాస్ ► పలు అంశాలకు సంబంధించి చంద్రబాబుతో మంతనాలు జరిపిన లాయర్ శ్రీనివాస్ 02:23 PM, సెప్టెంబర్ 18, 2023 45 నిమిషాలపాటు సాగిన ములాఖత్ ► స్కిల్ స్కామ్ కేసులో నిందితుడి చంద్రబాబు నాయుడు.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ► ఇవాళ.. 45 నిమిషాలపాటు ములాఖత్ అయ్యారు కుటుంబ సభ్యులు. ► చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణితో పాటు సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ములాఖత్ ద్వారా కలిసి మాట్లాడారు. 01:58 PM, సెప్టెంబర్ 18, 2023 సుమన్ బోస్‌కు ఆ అధికారం లేదు: సీమెన్స్ ► సీమెన్స్ కంపెనీ తరపున ప్రాజెక్ట్‌లు కుదర్చుకునేందుకుగానీ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద నిధులు సమకూరుస్తామని ఒప్పందం చేసుకునేందుకుగానీ సుమన్ బోస్‌కు ఎలాంటి అధికారం లేదు ► గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ప్రాజెక్ట్‌లకు 90% నిధులు సమకూర్చే విధానం సీమెన్స్ కంపెనీలో లేనే లేదు. ► ఏపీఎస్‌ఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్ట్‌కు సంబంధించి మాకు ఏపీఎస్ఎస్డీసీ నుంచిగానీ డిజైన్ టెక్ కంపెనీ నుంచి ఎలాంటి వర్క్ ఆర్డర్ రాలేదు. ► ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ పేరిట అవినీతి కేసులో సుమన్ బోస్‌ను సీఐడీ దర్యాప్తు చేస్తోందని మాకు తెలిసింది. సీమెన్స్ కంపెనీ ఎలాంటి ప్రాజెక్ట్‌లలోనూ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద నిధులు వెచ్చించదు. కాబట్టి సుమన్ బోస్ సంతకాలు చేసినట్టు చెబుతున్న ఒప్పందంతో సీమెన్స్ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు. 1.22 PM, సెప్టెంబర్ 18, 2023 చంద్రబాబు గదిలో ఏసీ లేదు: యనమల ► జైల్లో చంద్రబాబు సంతోషంగా లేరు. ► ఆయన గదిలో ఏసీ లేదు ► 2047 గురించి ఆలోచిస్తున్నారు. ► చంద్రబాబు అరెస్ట్‌పై జాతీయ స్థాయిలో నిరసనలు చేస్తాం 1:15 PM, సెప్టెంబర్ 18, 2023 అవాస్తవాలు ప్రచారంలో ఉన్నాయి: సీఐడీ చీఫ్ సంజయ్ ►దర్యాప్తు సంస్థల దగ్గర పక్కా ఆధారాలున్నాయి. ►చంద్రబాబు అరెస్టులో ఎలాంటి చట్ట ఉల్లంఘన జరగలేదు. ►రూ.371 కోట్ల నిధుల్లో గోల్ మాల్ జరిగిందని కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ►నగదు లావాదేవీల విషయంలో ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. ►చంద్రబాబును కస్టడీలోకి తీసుకోవాలి. ►పెండ్యాల శ్రీనివాస్‌ను విదేశాల నుంచి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. 12.15 PM, సెప్టెంబర్ 18, 2023 బాబు కోసం ఫేక్ నిరసనల బాగోతం బట్టబయలు.. ►మాదాపూర్‌లో ఐటీ ఉద్యోగుల మద్దతు బాగోతం బట్టబయలు. ►చంద్రబాబుకు మద్దతు పేరుతో మాదాపూర్‌లో ఐటీ ఉద్యోగుల నిరసన. ►టీడీపీ కనుసనల్లోనే నిరసన కార్యక్రమం. ►ఐటీ ఉద్యోగుల ప్లకార్డులపై ఐటీడీపీ సింబల్. ►నిరసనకు మూడు రోజుల ముందే ఐటీడీపీ వింగ్ హైదరాబాద్‌లో మంతనాలు. ►టీడీపీ నేతలను సమన్వయ పరిచే బాధ్యత ఐటీడీపీకి అప్పగింత. ►ఐటీ ఉద్యోగుల ముసుగులో టీడీపీ సానుభూతిపరులతో నిరసన. ►ఎల్లో మీడియాలో చంద్రబాబుకు ఐటీ ఉద్యోగులు మద్దతు అంటూ తప్పుడు ప్రచారం. 12.00 PM, సెప్టెంబర్ 18, 2023 చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్.. ►చంద్రబాబును కలిసేందుకు వచ్చిన భువనేశ్వరి, బ్రాహ్మణి ►వీరితోపాటు యనమల రామకృష్ణుడు, టీడీపీ నేతల ములాఖత్. ►తనకు అన్ని రకాల ఏర్పాట్లు ఉన్నాయన్న బాబు. ►ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హితవు. 11.00 AM, సెప్టెంబర్ 18, 2023 వారానికి 2 ములాకత్‌లు ఉంటాయి: జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ ►అత్యవసరమైతే మరో ములాకత్పై నిర్ణయం. ►జైలులో చంద్రబాబు ఉన్న దగ్గర పూర్తిస్థాయి భద్రత ఉంది. ►మాజీ సీఎంకి నిబంధనల ప్రకారం సౌకర్యాలు అందిస్తున్నాం. ►కోర్టు గైడెన్స్ ప్రకారం ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు. ►చట్టప్రకారం పనిచేస్తున్నాము 9:15 AM, సెప్టెంబర్ 18, 2023 త్వరలో టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం ►సమన్వయ కమిటీ సభ్యుల నియామకంపై పవన్ కల్యాణ్ కసరత్తు. ►సమన్వయ కమిటీ సభ్యుల నియామకంపై సీనియర్ నేతలతో చర్చించిన పవన్. ►ఇప్పటికే టీడీపీ-జనసేన సమన్వయ బాధ్యతలు మనోహర్‌కు అప్పగించిన పవన్. ►ఢిల్లీలో కొనసాగుతున్న నారా లోకేష్ పర్యటన. ►చంద్రబాబుతో చర్చించాక సమన్వయ కమిటీ సభ్యులను ప్రకటించనున్న టీడీపీ. ►ఈ నెలలోనే టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం. ►పొత్తు వల్ల ఏయే స్థానాలు ఎవరు త్యాగం చేయాలన్న దానిపై చర్చ. 9:00 AM, సెప్టెంబర్ 18, 2023 తొమ్మిదో రోజు రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు ►ఉదయం 5 గంటలకు లేచి మెడిటేషన్ చేసిన చంద్రబాబు. ►బ్లాక్ కాఫీ తాగి పేపర్ చదివిన చంద్రబాబు. ►ఈ వారంలో మరో రెండు ములాకాత్‌లు. ►ఈరోజు మూలాకాత్లో న్యాయవాదులను కలిసే అవకాశం. ►సాయంత్రం రాజమండ్రికి నారా లోకేష్. ►లోకేష్ క్యాంపులోనే భువనేశ్వరి, బ్రహ్మణి. ►మరోసారి కుటుంబసభ్యుల ములాకాత్ అయ్యే అవకాశం సెప్టెంబర్ 18, 2023 - చంద్రబాబుతో ములాఖత్‌లకు అవకాశం ► నేటి నుంచి వచ్చే శనివారంలోపు రెండు ములాఖత్‌లకు అవకాశం. ► నేడు చంద్రబాబుతో ములాఖత్‌కు ధరఖాస్తు చేయనున్న భార్య భువనేశ్వరీ, బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్, బాలకృష్ణ సతీమణి వసుంధర సెప్టెంబర్ 18, 2023 - పార్లమెంట్ ఆల్ పార్టీ మీటింగులో గొడవ ► పార్లమెంట్లో టీడీపీ, వైఎస్సార్సీపీ ఎంపీల మధ్య వాగ్వాదం. ► చంద్రబాబు అరెస్టును ప్రస్తావించిన టీడీపీ నేతలు. ► జీ20 సమావేశాల సమయంలో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారన్న టీడీపీ? ► వెంటనే జోక్యం చేసుకున్న విజయసాయిరెడ్డి, భరత్. ► చంద్రబాబు నేరానికి పాల్పడ్డారని, అన్ని సాక్షాలతో సీఐడీ అరెస్టు చేసింది. ► చంద్రబాబు ఒక క్రిమినల్. ► కుట్రకు ప్రధాన సూత్రధారి ► లబ్ధిదారు చంద్రబాబు నాయుడే ► జీ 20 సమావేశాలు జరుగుతున్నాయని 420లను వదిలేయాలా?. -
స్కిల్ కుంభకోణం సూత్రధారి చంద్రబాబే
సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణం ప్రధాన సూత్రధారి అని నిర్ధారణ అయినందునే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశామని సీఐడీ అదనపు డీజీ సంజయ్ స్పష్టం చేశారు. సీమెన్స్ అనే కంపెనీ ఉదారంగా రూ.3 వేల కోట్లు పెట్టుబడి పెడుతుందని చంద్రబాబు అసెంబ్లీలో చెప్పడంతోపాటు అలానే జీవోలు జారీ చేసి ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు. అయితే అందుకు విరుద్ధంగా 2015–16 ఆర్థిక సంవత్సరంలో మూడు నెలల వ్యవధిలో రూ.371 కోట్లు ప్రాజెక్టు నిమిత్తం హడావుడిగా విడుదల చేసి అవినీతికి పాల్పడ్డారని వెల్లడించారు. ఏపీ అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డితో కలిసి ఆదివారం ఆయన ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీమెన్స్ కంపెనీ ద్వారా ఏపీలో ఆరు క్లస్టర్లుగా ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందన్నారు. జీవోలో నిధుల వెచ్చింపు 90ః10 నిష్పత్తిగా చెప్పిన్పటికీ ఒప్పందంలో మాత్రం ఆ ప్రస్తావనే లేదని చెప్పారు. అయితే వాస్తవంగా సీమెన్స్ కంపెనీకి ఆ ప్రాజెక్ట్ గురించే తెలియదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం వాటా కింద రూ.371 కోట్లు విడుదల చేసి, 2015–16లో అందులోంచి రూ.271 కోట్లు ఇతర సంస్థలకు అక్రమంగా నిధులు మళ్లించారని చెప్పారు. సీమెన్స్ కంపెనీకి తెలియదు సీమెన్స్ కంపెనీకే తెలియకుండా ఆ కంపెనీ మాజీ ఎండీ సుమన్‌బోస్ ఈ కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించారని సంజయ్ తెలిపారు. ఆ విషయాన్ని సీమెన్స్ కంపెనీ కూడా గుర్తించిందన్నారు. నిందితుల్లో ఒకరైన సుమన్ బోస్.. ఒప్పందం కుదిరిన రోజున విద్యుత్తు లేనందున కొవ్వొత్తుల వెలుగులో సంతకాలు చేశామని.. కాబట్టి అందులో వివరాలు సరిగా చూడలేదని చెబుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ విద్యుత్తు రాలేదా అని ప్రశ్నించారు. అసలు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ప్రైవేటు వ్యక్తి అయిన గంటా సుబ్బారావుకు ఏకంగా నాలుగు పోస్టులు కట్టబెట్టి, ప్రభుత్వ అధికారులపై పెత్తనం అప్పగించడం.. ఆయన చెప్పినట్టే నిధులు విడుదల చేయాలని చెప్పడం ఏమిటని నిలదీశారు. నిధులు విడుదల చేయాలని చంద్రబాబు ఆదేశించినట్టు సమావేశం మినిట్స్ రికార్డులను గంటా సుబ్బారావు చూపించినట్టు ఆర్థిక శాఖ అధికారులు తెలిపారన్నారు. త్వరలో మరో ఏడుగురి అరెస్ట్ కుంభకోణం తాలూకు ఫైళ్లలో చంద్రబాబు 13 డిజిటల్ సంతకాలు చేశారని సంజయ్ తెలిపారు. మొత్తం కుంభకోణంలో చంద్రబాబు పాత్ర ఆధారాలతోసహా బయట పడటంతోనే ఆయన్ను అరెస్ట్ చేశామని, ఏసీబీ న్యాయస్థానం రిమాండ్ విధించిందన్నారు. ఈ కేసులో మరో ఏడుగురిని అరెస్ట్ చేయాల్సి ఉందని చెప్పారు. స్కిల్ కుంభకోణంపై ఈడీ కూడా దర్యాప్తు చేస్తూ ఇప్పటికే సుమన్ బోస్, డిజైన్ టెక్ ఎండీ వికాస్ వినాయక్ ఖని్వల్కర్, స్కిల్లర్ ప్రైవేట్ లిమిలెడ్ మాజీ ఆర్థిక సలహాదారు ముకుల్ చంద్ర అగర్వాల్, సీఏ సురేష్ గోయెల్లను అరెస్ట్ చేసిందన్నారు. ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ లక్షల డాలర్లు లాటరీ తగలిందని చెప్పి అందులో పది శాతం కడితేనే మొత్తం ఇస్తాననే రీతిలో ఈ కుంభకోణానికి పాల్పడ్డారని చెప్పారు. తేదీ, లెటర్ నంబరు లేకుండా ఒప్పందం చేసుకోవడం ఎక్కడన్నా జరుగుతుందా.. అని ప్రశ్నించారు. ఈ కేసులో ముద్దాయిలు సెల్ఫ్ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. -
వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నాయకుల హత్యాయత్నం
ద్వారకాతిరుమల: ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలంలోని గొల్లగూడెంలో ఆదివారం రాత్రి వినాయకచవితి ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్న పలువురు వైఎస్సార్సీపీ నేతలపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కర్రలు, ఇతర ఆయుధాలతో దాడిచేసి హత్యాయత్నం చేశారు. ఈ దాడిలో ఐదుగురు వైఎస్సార్సీపీ నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుల కథనం ప్రకారం.. వినాయకచవితి ఉత్సవాల నిర్వహణ కోసం స్థానిక రామాలయం వద్ద వైఎస్సార్సీపీ నేతలు గంటా వెంకటసుబ్రహ్మణ్యం, బొంతు రమేష్, ఈలప్రోలు ధర్మరాజు, కొత్తపల్లి గురువిష్ణు, కొత్తపల్లి హేమంత్ షామియానా పందిరి ఏర్పాటు చేస్తున్నారు. ఆ సమయంలో పాతకక్షల నేపథ్యంలో టీడీపీ గ్రామకమిటీ అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రసాద్, నాయకులు కొమ్మిన సత్యనారాయణ, చిలకా సతీష్, బొంతు వెంకటేశ్వరరావు, కొత్తపల్లి హరికృష్ణ, గంజి సతీష్, గంజి సురేష్, బొంతు మణీంద్రరావు, బొంతు నరసింహరావు, కవి భార్గవ, కొత్తపల్లి దుర్గారావు తదితరులు వారిపై ఒక్కసారాగా దాడిచేశారు. కర్రలు, ఆయుధాలతో తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో ఘంటా వెంకటసుబ్రహ్మణ్యం, బొంతు రమేష్, ఈలప్రోలు ధర్మరాజు తలలకు బలమైన గాయాలై తీవ్ర రక్తస్రావమైంది. కొత్తపల్లి గురువిష్ణుకు చెయ్యి విరగ్గా, కొత్తపల్లి హేమంత్‌కు తీవ్రగాయాలయ్యాయి. గాయపడినవారిని స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారు అక్కడ చికిత్స పొందుతున్నారు. రాజకీయకక్షల నేపథ్యంలో తమను హత్యచేసేందుకు ప్రయత్నించారని బాధితులు పేర్కొన్నారు. ఈ దాడిపై దర్యాప్తు చేస్తున్నట్లు ద్వారకాతిరుమల ఎస్ఐ టి.సుధీర్ తెలిపారు. -
Live Updates: చంద్రబాబు కేసు అప్డేట్స్
Updates.. 3.24 PM పవన్‌కి జైలులో బేరం సెట్ అయింది: మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ ►చంద్రబాబు సేవ పవన్‌కు ప్రధాన లక్ష్యం. ►కాపులను మోసగించిన చంద్రబాబు గురించి ఆలోచించవా పవన్? ►ఉమ్మడి గోదావరి జిల్లాలలో 34 సీట్లు గెలిపిస్తానని పవన్ లోకేష్ కు చెప్తున్నాడు. ►మళ్ళీ ప్రజలను మోసగించడానికి నటిస్తున్నావు. ►ప్రాణ త్యాగాలతో పనిలేదు పవన్, ముందు రాష్ట్ర ప్రజల అవసరాలు గుర్తించాలి. ►2014 లో ప్రజలను చంద్రబాబు హింసించడానికి పవన్ కారణం ►శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ►ఢిల్లీ వెళ్లిన లోకేష్ కి లోకం అర్ధం అయింది. చంద్రబాబు తప్పు చేశాడని తెలిసిపోయింది. 1.20 PM టీడీపీతో జనసేన పొత్తుపై మంత్రి జోగి రమేష్ ఫైర్ ►ఇది పిచ్చోడికి మళ్లీ మళ్లీ పెళ్లి లాంటిది. ►జైల్లో చంద్రబాబుతో మిలాఖత్ తరువాత లగ్నం కుదిరింది. ►తాడు బొంగరం లేని వాళ్లతో పవన్ విస్తృత స్థాయి సమావేశం. ►సీఎం జగన్‌పై పవన్ అర్థరహితమైన విమర్శలు. ►ఏపీలో ప్రతీ ఇంటికి సంక్షేమ పథకం అందుతోంది. ►సీఎం జగన్ ఒంటిచేత్తో వైసీపీని స్థాపించారు. ►విపక్ష నేతగా ఒక్కడే 67 మందిని గెలిపించాడు. ►ఆ తర్వాత 151 సీట్లు గెలిపించి సీఎం అయ్యారు. 12:20 PM లోకేశ్ వచ్చాకే టీడీపీలో అవినీతి పెరిగింది: ద్వారంపూడి ►కులంతో రాజకీయాలు చేసే నాయకుడు చంద్రబాబు. ►రాజకీయాలలో అవినీతి మొదలు పెట్టిందే చంద్రబాబు. ►లోకేష్ వచ్చాకే టిడిపిలో అవినీతి ఎక్కువ పెరిగింది. ►టీడీపీ మీద ప్రజలకు ప్రేమాభిమానులు లేకపోవడానికి కారణం లోకేషే. ►ఎల్లో పార్టీలో ఉన్న నాయకులందరూ అవకాశ వాదులు. ►బాబు అరెస్టుతో ప్యాకేజీ రాదేమోనని పవన్ బెంగ పెట్టుకున్నాడు ►లోకేష్, బాలకృష్ణ కలిసి పవన్‌ను దగ్గరుండీ బాబుతో ములాఖాత్ చేయించి ప్యాకేజీ కన్ఫార్మ్ చేశారు. ►ప్యాకేజీ కన్ఫార్మ్ కావడంతో పవన్ ఆనందంతో పొత్తులు ప్రకటించాడు. ►చంద్రబాబు మీద అభిమానంతో ఎవరూ ధర్నాలు చేయడం లేదు. ►అమెరికా, బెంగళూరు, హైదరాబాదులో ఒక కులం చేస్తున్నవి ఆర్టిఫిషియల్ ధర్నాలు. 12:15 PM చంద్రబాబును కలుద్దామనుకున్నా: రజనీకాంత్ ►జైలులో ఉన్న మిత్రుడు చంద్రబాబును కలుద్దామనుకున్నాను. ►ఫ్యామిలీ ఫంక్షన్‌తో చంద్రబాబును కలవడం కుదరలేదు. 12:10 PM ర్యాలీలకు, ధర్నాలకు అనుమతి లేదు: సెంట్రల్ ఏసీపీ భాస్కరరావు ►నగర పోలీస్ కమిషనరేట్ లిమిట్స్‌లో ర్యాలీలు, ఆందోళనలకు అనుమతులు లేవు. ►కొందరు సోషల్ మీడియాలో యువతను రెచ్చగొడుతున్నారు. ►సోషల్ మీడియాలో ధర్నా, ర్యాలీ అంటూ ఫేక్ మెసెజ్‌లు పెడుతున్నారు. ►ఫేక్ మెసేజ్‌లు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ►అసత్య ప్రచారాలతో యువత భవిష్యత్తును పాడుచేసుకోవద్దు. ►బైక్ ర్యాలీల పేరుతో మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారు. ►నగరంలో ర్యాలీలకు, ధర్నాలకు అనుమతి లేదు ►నగర వ్యాప్తంగా 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంది ►అనుమతులు లేకుండా రోడెక్కితే క్రిమినల్ కేసులు పెడతాం ►ధర్నాల పేరుతో అలజడి సృష్టిస్తే ఊరుకునేది లేదు. 12.00 PM మూడు ముఖ్యమైన పరిశీలనలు ►గ్రాంట్ ఇన్ ఏయిడ్ అనేది మా పాలసీ కాదు అని తరువాత సీమెన్స్ ఎండీ మాధ్యూ థామస్ ఈడీకి వాంగ్మూలం. ఎందుకు సుమన్‌బోస్ ఎంవోయులో ఆ పదం రాశారో మాకు తెలియదని ఆయన స్పష్టం చేశారు. ►కేపీఎస్పీఎల్ అనే వెండర్‌ను సెలక్ట్ చేయడంలో సుమన్ బోస్ ఏకపక్షంగా వ్యవహరించారు. ముగ్గురు వెండర్స్ నుంచి కోట్ తీసుకోలేదని మాద్యూ ధామస్ తరువాత అంతర్గత నివేదికలో తప్పుబట్టారు. ►సిమెన్స్ సంస్థ సాధారణంగా వ్యవహరించేలా కాకుండా ఇన్ వాయిస్ తయారీలో తప్పిదాలు జరిగాయి. ఐటమ్ వైస్ ప్రైజ్ వేయకుండా గంపగుత్తగా ప్రైజింగ్ జరిగినట్లు తరువాత సిమెన్స్ అంతర్గత నివేదికలో బయటపడింది. ఇది సుమన్‌బోస్ కావాలనే చెసిన స్కాంగా గుర్తించారు. 11:40 AM అవినితీకి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు: కరణం ధర్మశ్రీ ►ఢిల్లీలో లోకేశ్ కలరింగ్ ఇస్తున్నారు. ►లోకేశ్ ఢిల్లీలో సాధించేదేమీ లేదు. ►అవినీతికి పాల్పడ్డారు కాబట్టే చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. ►అవినీతి జరిగితే ఎంతటివారైనా అరెస్ట్ అవ్వాల్సిందే. ►చట్టం తన పని తాను చేసుకుపోతుంది. 11:30 AM లోకేశ్‌ని ఢిల్లీలో ఎవరూ పట్టించుకోలేదు: మంత్రి కాకాణి ►చంద్రబాబు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతి చేశారు. ►ప్రజాధనాన్ని కొల్లగొట్టి చంద్రబాబు జైలుకెళ్లారు. ►సీఎం జగన్, తీర్పు ఇచ్చిన జడ్జీపై ఆరోపణలు చేయడం దుర్మార్గం. ►ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ముద్దాయి. ►చంద్రబాబు అవినీతి తెలిసే ఎవరి సపోర్టు లేదు 10:15 AM చంద్రబాబు అరెస్టుపై నేడు ఢిల్లీలో సీఐడీ ప్రెస్‌మీట్ ►మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ అశోక హోటల్లో ఏపీ సీఐడీ ప్రెస్ మీట్. ►చంద్రబాబు అరెస్ట్, స్కిల్ డెవలప్మెంట్ స్కాం వివరాలను జాతీయ మీడియాకు వివరించనున్న ఏపీ సీఐడీ 10.00 AM జనసేనతో బీజేపీ పొత్తు ఉంది: పురంధేశ్వరి ►పవన్ వ్యాఖ్యలను తప్పుగా చూడటం లేదు. ►ఏపీలో పరిస్థితులను బీజేపీ పెద్దల దృష్టికి మేము మా అభిప్రాయాలు చెబుతాం. ►చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తున్నామని ప్రకటన చేశాం. ►ఏపీ, తెలంగాణ బీజేపీ నేతలు చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించారు. 9:15 AM ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఫైర్ ►స్కిల్ కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయిన దొంగ చంద్రబాబు. ►స్కిల్ కుంభకోణం అనేది కేవలం చంద్రబాబు అవినీతిలో శాంపిల్ మాత్రమే. ►పూర్తిస్థాయిలో విచారిస్తే చంద్రబాబు అవినీతి వేల కోట్లు బయటపడుతుంది. ►రెండు ఎకరాల నుంచి రెండు లక్షల కోట్లు చంద్రబాబు ఎలా సంపాదించారో ప్రజలకు చెప్పాలి. ►ఎన్టీఆర్ భక్తులమన్న అయ్యన్న మాటలు చూసి ప్రజలు సిగ్గుపడుతున్నారు. ►ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన కేటుగాళ్లు అయ్యన్న, చంద్రబాబు. ►అధికారం పోవడంతో చంద్రబాబు, అయ్యన్న సైకోలుగా మారారు. 8:45 AM లోకేశ్ తీవ్ర ప్రయత్నాలు.. ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏడో రోజు చంద్రబాబు ►రోజువారిలానే యథావిధిగా అల్పాహారం, ఆహారం సరఫరా. ►న్యూస్ పేపర్లు చదివిన చంద్రబాబు ►టీవీల్లో వార్తలను కూడా ఫాలో అవుతున్న చంద్రబాబు. ►సోమవారం వరకు ములాఖత్‌కు లేని అవకాశం. ►రాజమండ్రి లోనే ఉంటూ చంద్రబాబుకు నైతిక మద్దతుగా ఆందోళనల్లో భువనేశ్వరి, బ్రాహ్మణి ►చంద్రబాబు అరెస్టుకు నిరసనగా క్యాండిల్స్ ర్యాలీలో భువనేశ్వరి, బ్రాహ్మణి ►ఢిల్లీలో జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించేందుకు లోకేశ్ తీవ్ర ప్రయత్నాలు. ఎల్లో మీడియా చెత్త ప్లాన్.. ►స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో సాక్ష్యాధారాలతో అడ్డంగా దొరికిపోయి రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు. ►అరెస్ట్‌పై ఎల్లో మీడియా ఫేక్ ప్రచారాలకు పదును. ►ప్రజలకు ఫోన్లు, ఐటీ ఉద్యోగుల పేరుతో ఆందోళనలు ►ప్రజలకు అదే పనిగా ఐవీఆర్ఎస్ ఫోన్‌కాల్స్ ఢిల్లీ: నేషనల్ మీడియాతో లోకేష్ ఇంటర్వ్యూలు చంద్రబాబు కేసుకు సంబంధించి మాట్లాడిన ముఖ్యాంశాలు లోకేష్ : ఎలాంటి తప్పు చేయకున్నా చంద్రబాబును లోపల పెట్టారు నేషనల్ మీడియా : మరి కోర్టులో మీరు వెంటనే బెయిల్ పిటిషన్ ఎందుకు దాఖలు చేయలేదు? లోకేష్ : అసలు చంద్రబాబుకు రిమాండ్ విధించడం తప్పు, ఆయనపై 17A సెక్షన్ పెట్టారు. అంటే చంద్రబాబును జైల్లో పెట్టాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి. నేషనల్ మీడియా : మేం తప్పు చేయలేదు, బెయిల్ ఇవ్వాలని అడగొచ్చు కదా లోకేష్ : అసలు రిమాండే తప్పయినప్పుడు బెయిల్ అన్న ప్రశ్నే లేదు నేషనల్ మీడియా : చాలా చోట్ల చంద్రబాబు సంతకాలు పెట్టారని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి, కావాల్సినన్ని సాక్ష్యాలున్నాయి లోకేష్ : సంతకాలు కాదు ముఖ్యం, చంద్రబాబు ఖాతాలోకి డబ్బులు వచ్చాయా? ఆరు రాష్ట్రాల్లో ఇదే ప్రాజెక్టు అమలయింది. అధికారుల పేర్లు ఎందుకు FIRలో లేవు? నేషనల్ మీడియా : అసలు స్కాం జరగలేదని అంటున్నారా? లేక స్కాం జరిగింది కానీ చంద్రబాబు పాత్ర లేదంటున్నారా? లోకేష్ : ఈ కేసును రెండేళ్ల నుంచి దర్యాప్తు చేస్తున్నారు. ED కూడా ఇప్పుడు దర్యాప్తు చేస్తోంది. అన్ని ఖాతాలు యాక్టివ్గానే ఉన్నాయి. వేగంగా ఫైళ్లు క్లియర్ చేస్తే నేరమంటారా? నేషనల్ మీడియా : వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు చూడవచ్చు? లోకేష్ : తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. 2024 ఎన్నికలను కలిసి ఎదుర్కోవాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పొత్తు ఉంటుంది. నేషనల్ మీడియా : మీరు ఎన్డీఏలో భాగస్వామ్యా? లోకేష్ : : మాతో పొత్తు పెట్టుకోవాలా లేదా అన్నది తేల్చుకోవాల్సింది బీజేపీనే. కానీ టిడిపి, జనసేన కలిసి ఉంటాయి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ఎవరితో పొత్తు పెట్టుకోవాలన్నది చంద్రబాబు నిర్ణయిస్తారు. అధికార పక్షం వైఎస్సార్‌సిపిని వ్యతిరేకించే ఏ పార్టీతోనైనా మేం కలిసి ముందుకెళ్తాం. -
టీడీపీ బండారు శ్రావణికి ఎదురుదెబ్బ
సాక్షి, అనంతపురం: శింగనమల నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి బండారు శ్రావణి శ్రీకి ఎదురుదెబ్బ తగిలింది. ఓ మహిళ ఆత్మహత్య కేసులో ఆమె తండ్రి బండారు రవికుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురంలో మూడు రోజుల క్రితం రాజమ్మ(45) ఆత్మహత్య చేసుకుంది. బండారు రవికుమార్ వేధింపులే కారణమంటూ రాజమ్మ సెల్ఫ్ విడియో తీసింది. భూ వివాదంలో బండారు రవికుమార్ వేధిస్తున్నారంటూ అందులో ఆరోపించింది బాధితురాలు. ఈ వీడియో బయటకు రావడంతో.. కేసు నమోదు చేసి టీడీపీ నేత రవికుమార్‌ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. -
చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం
సాక్షి, చిత్తూరు: జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్యాంకర్‌ను ఆంబులెన్స్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తవణంపల్లె మండలం తెల్లగుండ్ల పల్లి వద్ద ఘటన చోటు చేసుకుంది. వేలూరు నుంచి వస్తున్న కిమ్స్ హాస్పిటల్ అంబులెన్స్.. చిత్తూరు-తిరుపతి హైవే మీద ఆగి ఉన్న ట్యాంకర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ సహా నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో ఆంబులెన్స్‌లో ఏడుగురు ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడ్డ వాళ్లను చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, అన్నమయ్య: ఘోర ప్రమాదంతో జిల్లాలో రోడ్డు నెత్తురోడింది. తిరుమల నుంచి ఇంటికి వెళ్తున్న భక్తుల వాహనం.. లారీతో ఢీ కొట్టింది. ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. కొందరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. శనివారం తెల్లవారు ఝామున పీలేరు సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. మృతులు.. బాధితులను కర్ణాటక వాసులుగా పోలీసులు నిర్ధారించారు. కర్ణాటక బెల్గాం జిల్లా అత్తిని మండలం బడచిగ్రామానికి చెందిన 14 మంది.. తిరుమల దర్శనం కోసం ఓ తుఫాన్ వాహనంలో వచ్చారు. దర్శనం అనంతరం తిరిగి వెళ్తుండగా.. తెల్లవారు మూడు గంటల సమయంలో మఠంపల్లి క్రాస్(కె.వి పల్లి మండలం) వద్ద వాళ్ల వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని తొలుత పీలేరు ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం.. తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. -
Live: చంద్రబాబు కేసు అప్డేట్స్.. Click & Refresh
Khaidi No 7691.. LIVE UPDATES 7:15 PM, సెప్టెంబర్ 15, 2023 రేపు జనసేన విస్తృతస్థాయి సమావేశం ► రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుతో ఏం మాట్లాడారు? ►జైలు బ్రీఫింగ్ను జనసేన కార్యవర్గానికి వివరించనున్న పవన్ కళ్యాణ్ ►చంద్రబాబు సూచనలు, పొత్తు అంశాలపై సుదీర్ఘ ప్రజంటేషన్‌కు రెడీ ►పొత్తు వల్ల ఎక్కడెక్కడ రాజీ పడాలో వివరించనున్న పవన్ కళ్యాణ్ ►మీరనుకున్నట్టు అందరికీ టికెట్లు ఇవ్వలేనని చెప్పనున్న పవన్ ►పొత్తులో టిడిపి ఎన్ని టికెట్లు ఇస్తే.. అక్కడ మాత్రమే జనసేన పోటీ ►ఏ ఏ స్థానాలన్నది ఉమ్మడి కార్యాచరణలో నిర్ణయించుకోనున్న పార్టీలు ►30 స్థానాలకు జనసేన పరిమితం అని రాజకీయవర్గాల్లో ప్రచారం ►ఇప్పటివరకు ఆశలు పెట్టుకుని నియోజకవర్గాల్లో తిరిగిన కొందరు ►తాజా పొత్తు నిర్ణయంతో ఖర్చు పెట్టుకున్న వారికి తీవ్ర నిరాశ ►రేపు మధ్యాహ్నం మంగళగిరిలో జనసేన విస్తృతస్థాయి సమావేశం ►టీడీపీతో కలిసి వెళ్లాల్సిందే, రాజీ పడదామని చెప్పనున్న పవన్ 7:10 PM, సెప్టెంబర్ 15, 2023 జైల్లో చంద్రబాబు.. ఏ ఏ సౌకర్యాలు ఉన్నాయంటే.? ► రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు అన్ని సౌకర్యాలు ► స్పెషల్ మెడికల్ టీం ను నియమించిన ప్రభుత్వం ►అత్యవసర ఔషధాలు ఓ పాజిటివ్ బ్లడ్, అంబులెన్స్ రెడీ ►అన్ని వేళల్లో సన్నద్ధంగా పదిమంది వైద్య నిపుణుల బృందం ►చంద్రబాబు ఆరోగ్య భద్రతకు సంబంధించి సకల ఏర్పాట్లు ►టీవీ, న్యూస్ పేపర్లు, ఇంటి భోజనం, వేడి నీళ్లు ఏర్పాటు 6:55 PM, సెప్టెంబర్ 15, 2023 సెలవుపై రాజకీయమా? ► రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ సెలవుపై జైళ్లశాఖ ప్రకటన ► రాహుల్ భార్య కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఉన్నారు ► రాహుల్ భార్య నిన్న ఉదయం ఆస్పత్రిలో చేరారు ►ఆస్పత్రిలో ఉన్న భార్యను చూసుకునేందుకు రాహుల్ సెలవు పెట్టారు ►4 రోజుల సెలవు అభ్యర్థనను జైళ్ల శాఖ అంగీకరించింది ►దీనిపైనా కొన్ని మీడియాలు రాజకీయం చేయడం అర్థరహితం 6:40 PM, సెప్టెంబర్ 15, 2023 కింకర్తవ్యం ? : లోకేష్ @ ఢిల్లీ ►మరో రెండు రోజులూ ఢిల్లీలోనే ఉండనున్న నారా లోకేష్ ►ఇవ్వాళ అంతగా సక్సెస్ కాని అపాయింట్మెంట్లు ►చంద్రబాబు అరెస్ట్‌పై జాతీయస్థాయిలో మద్దతు కూడగట్టేందుకు విశ్వ ప్రయత్నాలు ►పలువురు పార్టీల నేతలను కలవాలని ప్రయత్నాలు ►అపాయింట్మెంట్ల విషయంలో కలిసిరాని పరిచయాలు ►మొత్తం టిడిపి నేతలను, మద్ధతుదారులను ఉపయోగిస్తున్న లోకేష్ ►రేపు సుప్రీంకోర్టు న్యాయవాదులతో సమావేశమయ్యే ఛాన్స్ 5:24PM, సెప్టెంబర్ 15, 2023 వారంలో మూడో ములాఖత్ కుదరదు: జైళ్ల ఉప శాఖాధికారి, కోస్తా ఆంధ్ర ప్రాంతం, రాజమండ్రి ►నారా భువనేశ్వరి ములాఖత్ పై జైళ్ల శాఖ స్పష్టత ►వారంలో మూడో ములాఖత్ నిబంధనలు రీత్యా సాధ్యం కాదు ►అందుకే ఈరోజు నారా భువనేశ్వరి ములాఖత్ దరఖాస్తు తిరస్కరించాం ►ఈ వారం లో రిమాండ్ ఖైదీ నెంబర్ 7691 కి రెండు ములాఖత్ లు పూర్తయ్యాయి ►ఈ నెల 12 న నారా భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి లకు ములాఖత్ ఇచ్చాం ►ఈ నెల 14 న పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేష్ లు ములాఖత్ అయ్యారు ►అత్యవసర పరిస్థితులు ఉంటేనే వారంలో మూడో ములాఖత్‌కు అవకాశం ►ప్రస్తుతం రిమాండ్ ఖైదీ చంద్రబాబుకి అలాంటి అత్యవసర కారణాలు లేవు ►అందుకే నారా భూబనేశ్వరి ములాఖత్ దరఖాస్తు ని తిరస్కరించాం 4:50 PM, సెప్టెంబర్ 15, 2023 కింకర్తవ్యం ? : లోకేష్ @ ఢిల్లీ ►ఉదయం నుంచి బీజేపీ నేతల అపాయింట్మెంట్ల కోసం ప్రయత్నం ►బీజేపీ నుంచి రాని స్పందన, బీజేపీలో ఉన్న టిడిపి నేతలతో లాబీయింగ్ ►చంద్రబాబు కేసులపై పలువురు సుప్రీంకోర్టు న్యాయవాదులతో చర్చలు ►రఘురామ కృష్ణరాజుతో సుదీర్ఘ మంతనాలు ►రేపు టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించనున్న లోకేష్ 4:30 PM, సెప్టెంబర్ 15, 2023 టీడీపీ, జనసేన పొత్తు ప్రకటనపై సజ్జల కౌంటర్ ►రాజకీయాల్లో చంద్రబాబుకు పవన్ కల్యాణ్ డూప్ ►ఇంతకాలం విడివిడిగా ఉన్నట్లు నటించారు ►బీజేపీని తీసుకొచ్చే బాధ్యత పవన్‌కు బాబు అప్పగించారమో ►ఏపీలో అధికార పార్టీకి ఈసారి పాజిటివ్ ఓటు ఉంది ►ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధం 4:15 PM, సెప్టెంబర్ 15, 2023 నారాయణ పిటిషన్ 25కు వాయిదా ►నారాయణ క్వాష్, ముందస్తు బెయిల్ పిటిషన్ల పై విచారణ 25కి వాయిదా ►అసైన్డ్ భూముల స్కాంలో సీఐడీ నమోదు చేసిన 2 కేసులు క్వాష్ చేయాలని పిటిషన్ ►ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లు వేసిన మాజీ మంత్రి నారాయణ ► నారాయణతో పాటు ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన అంజనీకుమార్ ►విచారణను ఈ నెల 25కి వాయిదా వేసిన కోర్టు 3:15 PM, సెప్టెంబర్ 15, 2023 తాడేపల్లిగూడెం: ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ►జైలుకు వెళ్లి సాష్టాంగ నమస్కారంతో పవన్ కళ్యాణ్ ప్యాకేజీ మాట్లాడుకున్నాడు ►పవన్ కళ్యాణ్ ఇంతకాలం పెళ్లి ఒకరితో సంసారం ఒకరితో అన్నట్లుగా ఉన్నాడు ►పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఉండి సేవ చేయాలనుకున్న జనసైనికులు చంద్రబాబుకి సేవ చేయండని చెప్పగానే సగం మంది నీకు నీ పార్టీకి దండం అని జారిపోయారు ►జనసేనతో టీడీపీ కలవడం వల్ల చాలామంది తెలుగుదేశం పార్టీ నుండి బయటకు పోయేందుకు రెడీగా ఉన్నారు 1:15 PM, సెప్టెంబర్ 15, 2023 వివేకానంద, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, CID, సుదర్శన్ రెడ్డి, డైరక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ ►చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లకు విచారణ అర్హత లేదు ►రెండు బెయిల్ పిటిషన్లలో ఒకే సెక్షన్ల ద్వారా అప్లై చేశారు ►ఈ రెండు పిటిషన్లలో బెయిల్ కోసం నిర్ణీత కారణం చెప్పలేదు ►హైకోర్టులో సీఐడీ కస్టడీ పిటిషన్‌పై స్టే ఉండగా మళ్లీ ఇక్కడ బెయిల్ వేయటం విరుద్ధం ►నిందితుడి కుటుంబ సభ్యులకు ఏమైనా జరిగితేనే మధ్యంతర బెయిల్ అడుగుతారు ►మధ్యంతర బెయిల్ కూడా 24 లేదా 48గంటలు ఇస్తారు ►హైకోర్టులో వేసిన పిటిషన్ నే ఇక్కడ వేశారు ►నిందితుడు ఇప్పటికే రిమాండ్ లో ఉన్నారు ►ఇప్పుడు చెప్తున్న సెక్యూరిటీ రీజన్స్ రిమాండ్ టైంలోనే చెప్పారు ►కౌంటర్ దాఖలు చేయటానికి మంగళవారం వరకూ సమయం ఇచ్చారు ►కోర్టు ఏం చెప్తుందో 19వ తేదీ వరకూ వేచి చూడాలి 12:10PM, సెప్టెంబర్ 15, 2023 చంద్రబాబు పిటిషన్లపై విచారణ వాయిదా ►చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా ►ఈ పిటిషన్ విచారణ సైతం 19వ తేదీకే వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన కోర్టు ►హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్‌లో ఉండటాన్ని ప్రస్తావించిన న్యాయమూర్తి ►కస్డడీ పిటిషన్ ఏసీబీ కోర్టులో పెండింగ్ లో ఉందన్న న్యాయమూర్తి ►బెయిల్ పిటిషన్ నూ ఈనెల 19నే విచారిస్తామన్న న్యాయమూర్తి ►మధ్యంతర బెయిల్, బెయిల్ పిటిషన్లు రెండూ వాయిదా 12:00PM, సెప్టెంబర్ 15, 2023 మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా ► స్కిల్ స్కాం కేసులో ఏ1 చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా ►విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు 11:30 AM, సెప్టెంబర్ 15, 2023 బెయిల్ పిటిషన్ @ ACB కోర్టు, విజయవాడ ► చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో విచారణ ► బెయిల్ పై వాదనలు వినాలన్న చంద్రబాబు తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ ► కౌంటర్ దాఖలుకు సమయం కోరిన సీఐడీ తరపు న్యాయవాది 11:00 AM, సెప్టెంబర్ 15, 2023 బెయిల్ పిటిషన్ @ ACB కోర్టు, విజయవాడ ► చంద్రబాబుకు ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో పిటిషన్ ► బెయిల్ పిటిషన్‌పై కాసేపట్లో విచారణ ► స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు సంబంధించి ఈ బెయిల్ పిటిషన్ ► ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసిన న్యాయవాది సుబ్బారావు ► బాబు బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని CIDకి కోర్టు సూచన 10:30 AM, సెప్టెంబర్ 15, 2023 డామిట్.. కథ అడ్డం తిరిగిందా.? ► రాజమండ్రి సెంట్రల్ జైలు లోపల మాట్లాడింది వేరు, బయట జరిగింది వేరు ► ఇంకొన్నాళ్లు దొంగాట ఆడుకుందామని పవన్‌కు బాబు సూచించినట్టు సమాచారం ► ఇప్పుడే పొత్తు ప్రకటిస్తే బీజేపీకి కోపం వస్తుందని చెప్పిన చంద్రబాబు ► లోపల ఓకే చెప్పి బయట ప్లేటు ఫిరాయించిన పవన్ కళ్యాణ్ ► జైలు బయట ప్రెస్ మీట్లో ఫ్లోలో అసలు విషయం చెప్పేసిన పవన్ ► ఒక వైపు లోకేష్, మరో వైపు బాలయ్యను పెట్టుకుని పవన్ పొత్తు ప్రకటన ► పవన్ నోట పొత్తు వినగానే షాక్‌కు గురయిన బాలయ్య, లోకేష్ ► పవన్ మాట్లాడిన తర్వాత ఏం చేయాలో పాలుపోక బాలయ్య, లోకేష్ మౌనం ► ఇప్పటికిప్పుడు గట్టిగా గెలిచే స్థానాలు 20 కూడా లేకపోవడంతో కంగారు ► డ్యామేజీ కంట్రోల్ కోసం హడావిడి ప్రయత్నాలు మొదలెట్టిన లోకేష్, బాలయ్య ► సాయంత్రం తర్వాత ఢిల్లీ ప్లాన్ తెర మీదికి ► లోకేష్ ఢిల్లీ టూరు లక్ష్యం ఒకటే : ఎలాగైనా బీజేపీ నేతల అపాయింట్మెంట్ 09:30AM, సెప్టెంబర్ 15, 2023 విశ్వసనీయతకు యూటర్న్‌కు మధ్య యుద్ధం ► జైలు ముందు పొత్తు ప్రకటన చేసిన పవన్, లోకేష్ ► పవన్, లోకేష్ తీరు తప్పుబట్టిన విజయసాయిరెడ్డి ► ఈ యుద్ధం వైఎస్సార్సిపి x టిడిపి, జనసేన.... ► సింగిల్‌గా వచ్చే సింహాం x నక్కల గుంపు ► ప్రజా సంక్షేమం x అధికార దాహం ► విశ్వసనీయత x యూటర్న్ రాజకీయాలు ► స్థిరమైన పాలన x అస్థిరమైన నాయకత్వం ► నీతి నిజాయతీ x అవకాశవాదం ► సమైక్యత x కుల రాజకీయం The 2024 AP elections is going to be between TDP vs. YSRCP respectively which can be compared as a pack of wolves versus a lion, greed for power vs. public welfare, U-turn politics vs. credibility, instability vs. stability, opportunism vs. honesty, caste politics vs. unity,… — Vijayasai Reddy V (@VSReddy_MP) September 15, 2023 09:15AM, సెప్టెంబర్ 15, 2023 ఢిల్లీలో నారా లోకేష్ బిజీ బిజీ ► ఢిల్లీ పర్యటనలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ► చంద్రబాబు అరెస్ట్ గురించి జాతీయ మీడియాలో వార్తలు వచ్చేలా లాబీయింగ్ ► పలువురు సుప్రీంకోర్టు న్యాయవాదుల అపాయింట్మెంట్లు అడిగిన టీడీపీ టీం ► కక్ష రాజకీయంగా కలరింగ్ ఇచ్చేందుకు ఢిల్లీలో లోకేష్ మంతనాలు ► పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహణ ► లోక్‌సభలో బాబు అరెస్ట్‌పై చర్చ కోసం పట్టుబట్టాలని ఎంపీలకు హితబోధ 09:29AM, సెప్టెంబర్ 15, 2023 పొత్తు ప్రకటన చెప్పేశా.. ఇక ఏం చేద్దాం! ► రాజమండ్రి సెంట్రల్ జైలు బయట శుక్రవారం టీడీపీ పొత్తు ప్రకటన చేసిన పవన్ ► పవన్ ప్రకటనపై పార్టీలో ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు శనివారం(రేపు) జనసేన విస్తృత స్థాయి సమావేశం ► నెక్ట్స్ ఏంటన్న దానిపైనా భేటీలో చర్చించే అవకాశాలు ► మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ అధ్యక్షతన భేటీ ► పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుల దగ్గరి నుంచి సంయుక్త కార్యదర్శుల దాకా అంతా హజరయ్యే ఛాన్స్ ► ఇప్పటివరకు టికెట్ ఆశ చూపెట్టి ఇప్పుడు పొత్తు అంటే ఎలా అని జనసేన కార్యవర్గం అసంతృప్తి 09:21AM, సెప్టెంబర్ 15, 2023 చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై వాదనలు ఆలస్యం? ►ఏసీబీ కోర్టులో బాబు తరపున రెండు పిటిషన్లు దాఖలు ►స్కిల్ స్కాం కేసులో బెయిల్, మధ్యంతర బెయిల్ కోరుతూ పిటిసషన్లు ►బెయిల్‌పై ఇప్పటికే సీఐడీకి కోర్టు నోటీసులు ►పూర్తి వివరాలు ఉంచేందుకు సమయం కోరనున్న సీఐడీ ►పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసిన తర్వాతే.. ఇరువైపులా వాదనలు మొదలయ్యే అవకాశం 08:00AM, సెప్టెంబర్ 15, 2023 జైలులో చంద్రబాబు @6వరోజు ► రాజమండ్రి సెంట్రల్ జైలు సమీపంలోనే చంద్రబాబు భార్య భువనేశ్వరి బస ► ఈ వారం ముగిసిన చంద్రబాబు ములాఖత్‌లు 06:44am, సెప్టెంబర్ 15, 2023 చంద్రబాబు పిటిషన్లపై సీఐడీ కౌంటర్ ►చంద్రబాబు పిటిషన్లపై నేడు విజయవాడ ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ కౌంటర్ ►బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లు వేసిన చంద్రబాబు లాయర్లు ► ఏసీబీ కోర్టులో కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయనున్న సీఐడీ తరపు న్యాయవాదులు 5:15am, సెప్టెంబర్ 15, 2023 చంద్రబాబు అరెస్టుపై ఢిల్లీకి లోకేష్ ►చంద్రబాబు అరెస్టుకు విస్తృత ప్రచారం చేయాలని ఢిల్లీకి లోకేష్ ►నిన్న రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరిక లోకేష్ ►లోకేష్ కోసం జాతీయ పార్టీల నేతల అపాయింట్మెంట్ ప్రయత్నం చేస్తున్న టీడీపీ లీడర్ లు ► నిన్న చంద్రబాబుతో పవన్ ములాఖత్ తర్వాతనే ఈ నిర్ణయం 5:05am, సెప్టెంబర్ 15, 2023 మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ ► రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో తనపై పెట్టిన 2 కేసులు కొట్టివేయాలని పిటిషన్ ►విచారణ ను ఈ నెల 25 కు వాయిదా వేసిన న్యాయస్థానం ►మధ్యంతర ఉత్తర్వులు పొడిగించిన న్యాయస్థానం 5:00am, సెప్టెంబర్ 15, 2023 చంద్రబాబుకు బెయిల్ కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ ►విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ వేసిన న్యాయవాది సుబ్బారావు ►పిటిషన్ ను విచారణకు స్వీకరించిన విజయవాడ ఏసీబీ కోర్టు ►పిటిషన్ పై నేడు విచారణ చేపట్టనున్న ఏసీబీ కోర్టు. -
స్కామ్ కారకులనే నాడు అప్రమత్తం చేశారు
సాక్షి, విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ స్కాంను చాలా స్కిల్ ఫుల్‌గా జరిపించి.. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి లూటీ చేశారని అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తెలిపారు. గురువారం స్కిల్‌డెవలప్‌మెంట్ స్కామ్ కేసుకు సంబంధించి సీఐడీ నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన కూడా పాల్గొని మాట్లాడారు. సీమెన్స్ ఏజీ అనే జర్మన్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమతో.. స్కిల్ డెవలప్మెంట్ కోసం రూ. 3,300 కోట్లు ఫ్రీగా ఇస్తుందని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ ప్రాజెక్టులో 90 శాతం సీమెన్స్ కంపెనీ ఇస్తుందని.. ప్రభుత్వం కేవలం 10 శాతం ఇస్తే సరిపోతుందన్నారు. రూల్స్ ప్రకారం అది వీలుకాదని అధికారులు అప్పటి టీడీపీ ప్రభుత్వానికి అధికారులు చెప్పారు. అయితే పైలట్ ప్రాజెక్ట్ అమలు చేయాలన్న అధికారుల వాదనను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదు. పైగా ఏపీ ఖజానా నుంచి రూ.371 కోట్లు డిజైన్‌టెక్‌కు చెల్లించారు. చాలా నైపుణ్యంగా జరిగిన స్కామ్ ఇది. ప్రభుత్వ సంపదను చాలా సులభంగా దోచేశారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఏర్పాటైన.. స్కిల్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అవకతవకల గురించి పుణే నుంచి జీఎస్టీ అధికారులు అప్పటి ఏపీ ప్రభుత్వానికి లేఖ ద్వారా అప్రమత్తం చేశారు. 2018, మే 14వ తేదీన ఏపీ ఏసీబీ డీజీకి లేఖ రాశారు. అంటే.. పుణే నుంచి ఈ స్కామ్ బయటపడింది. చూస్కోండి బాబూ.. రూ. 371 కోట్లు హాంఫట్ అయ్యాయని లేఖ ద్వారా అలర్ట్ చేశారు. అప్పుడు ఏ ప్రభుత్వం అయితే ఈ స్కాంకు కర్తనో.. ఆ ప్రభుత్వానికే ఆ లేఖ అందింది. అంటే.. కారకులనే పుణే జీఎస్టీ విభాగం అప్రమత్తం చేసిందన్నమాట. అందుకే వ్యవహారం ముందుకు సాగలేదు. ఆ తర్వాత ప్రభుత్వం మారింది అని ఏఏజీ సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో మీడియా ప్రశ్నలు అడగబోతుండగా.. తానేం దర్యాప్తు అధికారిని కానని.. కేవలం ప్రభుత్వ ప్రతినిధిగా వాదనలు మాత్రమే వినిపిస్తున్నానని.. అందుకే తనకు చేరిన పత్రాలు, వివరాల ఆధారంగా మీడియాకు సమాచారం ఇస్తున్నానని ఆయన తెలిపారు. -
బైక్ లిఫ్ట్ అడగడమే ఆమెకు శాపమైంది.. ఫొటోలు తీసి..
సాక్షి, ఏలూరు: మహిళలు, యువతులపై వేధింపులు తగ్గించేందుకు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా కొందరు మృగాలు మాత్రం మారడం లేదు. చట్టాలు తమకు వర్తించవు అనే రకంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా కొందరు ఆకతాయిల వేధింపుల కారణంగా ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. దీంతో, ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఈ విషాదకర ఘటన ఏలూరులో చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటనపై ఎస్ఐ చావా సురేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. భీమడోలు మండలం లక్ష్మీపురానికి చెందిన సుంకర లక్ష్మణరావుకు దెందులూరుకు చెందిన పావని (35)కి 2007లో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. పిల్లల చదువుల నిమిత్తం గుండుగొలనులోని గంగానమ్మ గుడి సమీపంలోని ఓ అద్దె ఇంట్లో గత రెండేళ్లుగా నివాసం ఉంటున్నారు. అయితే గత నెల 15న పావని ద్వారకాతిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్తూ అటుగా వస్తున్న ఓ మోటార్ స్లైక్లిస్ట్‌ను లిఫ్ట్ అడిగి వెళుతోంది. అయితే, ఆ సమయంలో లక్ష్మీపురానికి చెందిన పాత నేరస్తుడు బోను శివకృష్ణ ఆమె బండి ఎక్కి వెళుతున్న దృశ్యాన్ని తన సెల్ఫోన్లో వీడియో తీసి తన సహచరులైన బోను పవన్, సుంకర యశ్వంత్, శనపతి రాజబాబులతో కలిసి ద్వారకాతిరుమల వరకు వారిని వెంబడించారు. అక్కడ వారిని అడ్డగించి తమ కోరిక తీర్చాలని లేదంటే వీడియో వైరల్ చేసి అల్లరి పాలు చేస్తామని బెదిరించారు. అయినా ఆమె వారికి లొంగలేదు. కాగా, ఈనెల 10న బోను శివకృష్ణ సదరు మహిళ బైక్ ఎక్కి వెళ్లిన వీడియోను గ్రామంలో అందరికి షేర్ చేశాడు. వ్యభిచారిణిగా చిత్రీకరిస్తూ ప్రచారం చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సదరు వివాహిత అదేరోజు ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. మృతదేహానికి వీఆర్వోలు వి.వెంకటేశ్వరరావు, కందులపాటి శంకర్ పంచనామా నిర్వహించారు. పావని మృతికి కారణమైన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి వీడియోలను తీసిన సెల్ఫోన్లను కూడా సీజ్ చేశామని చెప్పారు. నిందితులను భీమడోలు కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించినట్లు తెలిపారు. చేపల పట్టుబడికి వెళుతూ జీవనం పొందుతున్న భర్త, పిల్లలు పావని ఆత్మహత్యతో తల్లడిల్లిపోయారు. ఇది కూడా చదవండి: రోడ్డు ప్రమాదంలో యువ జంట దుర్మరణం -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే వీఆర్ఓ హత్య
రాయచోటిటౌన్ : తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య ప్రియుడితో పాటు మరొక వ్యక్తి సాయం తీసుకుని భర్తను అంతమొందించింది. ఆ తర్వాత తన భర్త బాత్రూంలో పడి చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది. ఎట్టకేలకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులు ముగ్గురిని అరెస్టు చేశారు. బుధవారం రాయచోటి డీఎస్పీ మహబూబ్ బాషా విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సంబేపల్లె మండలం శెట్టిపల్లెకు చెందిన అంజి అలియాస్ ఆంజనేయులు నాయుడు రాయచోటి పట్టణంలో నివాసం ఉంటూ వీరబల్లె మండల కేంద్రంలో వీఆర్ఓగా విధులు నిర్వర్తించేవాడు. ఆయనకు భార్య నందిని, ఇద్దరు మగపిల్లలు సంతానం ఉన్నారు. అయితే నందినికి గొర్లమొదివీడుకు చెందిన మహదేవపల్లె చిన్నప్పరెడ్డితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తన భర్తకు తెలియడంతో ఆమెను వారించేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు చోటు చేసుకొనేవి. తన భర్త తనను వేధిస్తున్నాడని ఎలాగైనా అంతమొందించాలని చిన్నప్పరెడ్డికి చెప్పింది. వెంటనే పథకం రచించారు. ఈనెల 9వ తేదీ శనివారం రాత్రి ఇంటికి రాగానే భోజనం వడ్డించింది. మజ్జిగలో నిద్రమాత్రలు కలపడంతో అతను భోజనం చేసిన కాసేపటికి మత్తులోకి జారుకున్నాడు. ఇదే అదునుగా భావించిన నందిని అప్పటికే సిద్ధంగా ఉన్న చిన్నప్పరెడ్డి, అతని స్నేహితుడు గొర్లమొదివీడు గ్రామానికి చెందిన మహదేవపల్లె సురేంద్రారెడ్డితో పాటు తాను కూడా బెడ్రూంలోకి వెళ్లి ముఖంపై దిండు ఉంచి గట్టిగా అదిమి పట్టుకున్నారు. అయితే అంజి నిద్రమత్తు నుంచి లేచి తేరుకొని గట్టిగా కేకలు వేశాడు. ఆ సమయలో వారిమధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇక చేసేది లేక ముగ్గురు కలిసి బలవంతంగా అతని ముఖంపై దిండు వేసి గట్టిగా అదిమి పట్టుకున్నారు. కొద్దిసేపటి తరువాత ఊపిరి ఆగిపోయింది. మృతి చెందాడని నిర్ధారించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే హత్య కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో చిన్నప్పరెడ్డి తన చేతులకు గ్లౌజులు ధరించాడు. అలాగే పట్టణంలో సీసీ కెమెరాల కంటబడకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో మృతుడి భార్య నందిని తన భర్త బాత్ రూంలో పడి చనిపోయాడని చెప్పి పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టడంతో నిజాలు వెలుగు చూశాయి. హత్యకు పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచారు. ఈ కేసును అత్యంత చాకచక్యంగా ఛేదించిన అర్బన్ సీఐ సుధాకర్‌రెడ్డి, అర్బన్ ఎస్ఐ నరసింహారెడ్డిలకు రివార్డు కోసం జిల్లా ఎస్పీకి సిఫార్సు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ తులశీరాం పాల్గొన్నారు. -
‘స్కిల్’ కుంభకోణం కుట్రదారు చంద్రబాబే
సాక్షి, అమరావతి: ‘టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణం ప్రధాన కుట్రదారుడు చంద్రబాబు నాయుడే. సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరుతో ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా మోసపూరితంగా వ్యవహరించారు. కేబినెట్ ఆమోదం లేకుండా ఏపీఎస్ఎస్డీసీ ఏర్పాటు నుంచి నిబంధనలకు విరుద్ధంగా నిధుల విడుదల వరకు ఆయనే సర్వం తానై వ్యవహరించారు. ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫైళ్లలో ఏ–1 చంద్రబాబు 13 చోట్ల సంతకాలు చేశారు. ఏ–2 అప్పటి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సంతకాలు అయిదు చోట్ల ఉన్నాయి’ అని సీఐడీ అదనపు డీజీ సంజయ్ వెల్లడించారు. వెలగపూడిలోని సచివాలయంలో సీఐడీ ఎస్పీ ఫక్కీరప్పతో కలసి బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ గురించిగానీ ఒప్పందం గురించిగానీ తమకు తెలియదని సీమెన్స్ కంపెనీయే ఈ మెయిల్ ద్వారా న్యాయస్థానంలో 164 సీఆర్పీసీ వాంగ్మూలం ద్వారా స్పష్టం చేసిందని తెలిపారు. ఈ కుంభకోణం ద్వారా అక్రమంగా మళ్లించిన రూ.371 కోట్లలో షెల్ కంపెనీల ద్వారా రూ.241 కోట్లు చంద్రబాబుకే చేరాయన్నారు. సీఐడీతోపాటు సమాంతరంగా దర్యాప్తు జరిపిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ ప్రాజెక్ట్ పేరిట షెల్ కంపెనీల ద్వారా నిధులు కొల్లగొట్టారని నిర్ధారించిందని చెప్పారు. విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం ఈ కేసును పది గంటలపాటు సుదీర్ఘంగా విచారించి.. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని పూర్తి ఆధారాలు ఉన్నాయని సంతృప్తి చెందాకే ఆయనకు రిమాండ్ విధించిందన్నారు. సీఐడి అదనపు డీజీ సంజయ్ ఇంకా ఏం చెప్పారంటే.. కుంభకోణం సూత్రధారి చంద్రబాబే ♦ కేబినెట్ ఆమోదం లేకుండానే రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ)ను చంద్రబాబు ఏర్పాటు చేశారు. ఆ కార్పొరేషన్ పేరిట ప్రజాధనం కేటాయింపు అంతా గంటా సుబ్బారావు అనే ప్రైవేటు వ్యక్తి చేతిలో పెట్టారు. అందుకోసం ఆయనకు ఏకంగా నాలుగు పోస్టులు కట్టబెట్టారు. ఏపీఎస్ఎస్డీసీ ఎండీ–ఈసీవోగా మొదట నియమించి, అనంతరం ఉన్నత విద్యా శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి, స్కిల్ డెవలప్మెంట్–ఇన్నోవేషన్ శాఖ కార్యదర్శి పోస్టుతోపాటు ఏకంగా సీఎం ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా కూడా నియమించారు. ♦ డిప్యూటీ సీఈవోగా అపర్ణను నియమించారు. ఆమె భర్త సీమెన్స్ కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్నారు. ఇది పరస్పర ప్రయోజనాల కిందకు వస్తుంది. ఇక టీడీపీకే చెందిన జె.వెంకటేశ్వర్లు అనే చార్టెడ్ అకౌంటెంట్‌కు ఏపీఎస్ఎస్డీసీలో పోస్టు కట్టబెట్టారు. ఉన్నత విద్యా శాఖను బైపాస్ చేశారు. ఎలాంటి ప్రాతిపదిక లేకుండా బడ్జెట్‌ను ఆమోదించారు. పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాలన్న ప్రతిపాదనను బేఖాతరు చేస్తూ ఏకపక్షంగా ఆరు చోట్ల సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. సీమెన్స్ కంపెనీ పేరుతో మోసం ♦ టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్, అందుకోసం ఒప్పందం గురించి సీమెన్స్ కంపెనీకి తెలియనే తెలీదు. చంద్రబాబు కేవలం నిధులు కొల్లగొట్టడానికే ఆ కంపెనీ పేరును వాడుకుని మోసానికి పాల్పడ్డారు. జర్మనీలోని సీమెన్స్ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించగా అసలు ఆ జీవో గురించి, ఆ ఒప్పందం గురించి తమకు ఏమాత్రం తెలియదని వెల్లడించింది. ♦ ఏపీఎస్ఎస్డీసీ చెబుతున్న రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్‌తో తమకు సంబంధం లేదని, ఆ ఒప్పందం గురించి తమకు ఏమాత్రం తెలియదని స్పష్టం చేసింది. తాము 90 శాతం నిధులను గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా ఇస్తామని ఎవరికీ చెప్పలేదని.. అసలు ఆ వ్యవహారంతో సీమెన్స్ కంపెనీకి సంబంధం లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు సీమెన్స్ కంపెనీ ఈ మెయిల్ ద్వారా వివరించడంతోపాటు న్యాయస్థానంలో 164సీఆర్పీసీ కింద వాంగ్మూలం కూడా ఇచ్చింది. ♦ సీమెన్స్ కంపెనీ అంతర్గతంగా కూడా దర్యాప్తు నిర్వహించి వాస్తవాలను ఏపీఎస్ఎస్డీసీ, సీఐడీలకు అందించింది. భారత్‌లో సీమెన్స్ కంపెనీ ప్రతినిధిగా ఉన్న సుమన్ బోస్ మరికొందరు నిందితులతో కలసి జర్మనీలోని ప్రధాన కార్యాలయానికి తెలియకుండా ఈ కుట్రలో భాగస్వాములయ్యారని నిర్ధారించింది. ఈ మేరMý ు సుమన్‌బోస్, ఇతరులు డిలీట్ చేసిన ఈ మెయిల్స్, వాట్సాప్ మెసేజ్‌లు, మెసేజ్‌లు, ఇతర డాటాను రిట్రైవ్ చేసి సీఐడీకి అందించింది. ♦ డిజైన్ టెక్ కొరితే తాము రూ.58.80 కోట్ల విలువైన సాఫ్ట్‌వేర్‌ను మాత్రమే ఆ కంపెనీకి విక్రయించామని తెలిపింది. ఎవరైనా తమ వద్ద నుంచి సాఫ్ట్వేర్ కొనుగోలు చేసుకోవచ్చని, అంత మాత్రాన తాము ఆ ఒప్పందంలో భాగస్వాములమైనట్టు కాదని వెల్లడించింది. రూ.3,300 కోట్లు ప్రాజెక్ట్‌గా నకిలీ ఒప్పందం ♦ సీమెన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయం ఇచ్చిన వాంగ్మూలంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేవలం రూ.58 కోట్ల ప్రాజెక్ట్‌ను రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్‌గా చూపిస్తూ చంద్రబాబు భారీగా ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు పన్నాగం పన్నారు. అందుకోసమే జీవోకు విరుద్ధంగా నకిలీ ఒప్పందాన్ని తీసుకువచ్చారు. డిజైన్ టెక్ అనే కంపెనీని భాగస్వామిని చేశారు. ♦ సీమెన్స్ కంపెనీ నుంచి 90 శాతం నిధులు రావని తెలుసు. ఎందుకంటే వారికి అసలు ఒప్పందం గురించే తెలియదు. అందుకే ప్రభుత్వ వాటా 10 శాతం నిధులను నిబంధనలకు విరుద్ధంగా డిజైన్‌టెక్ కంపెనీకి చెల్లించి.. పీవీఎస్పీ అనే షెల్ కంపెనీకి మళ్లించి.. అక్కడి నుంచి వివిధ షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు రూ.241 కోట్లు దక్కించుకున్నారు. చంద్రబాబు ఒత్తిడితోనే రూ.371 కోట్లు విడుదల ♦ జీవోలో పేర్కొన్నట్టు రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్‌లో గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా 90 శాతం వాటాలో ఒక్క రూపాయి కూడా రాలేదు. కానీ ప్రభుత్వ వాటా 10 శాతం జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లను డిజైన్ టెక్ కంపెనీకి ఏకపక్షంగా విడుదల చేశారు. దీనిపై అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ విషయాన్ని నోట్ ఫైళ్లలో స్పష్టంగా పేర్కొన్నారు. ♦ కానీ నిబంధనలకు విరుద్ధంగా రూ.371 కోట్లు విడుదల చేయాలని అప్పటి సీఎం హోదాలో చంద్రబాబు ఆదేశించారు. అదే విషయాన్ని అధికారులు నోట్ ఫైళ్లలో స్పష్టంగా పేర్కొంటూ.. సీఎం చంద్రబాబు ఆదేశాలతోనే నిధులు విడుదల చేస్తున్నట్టు స్పష్టం చేశారు. అనంతరమే నిధులు విడుదల చేశారు. షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకు రూ.241 కోట్లు ♦ డిజైన్ టెక్ కంపెనీకి విడుదల చేసిన రూ.371 కోట్లలో ఆ కంపెనీ సీమెన్స్ కంపెనీ నుంచి రూ.58.80 కోట్ల సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసి అందించింది. మిగిలిన రూ.311 కోట్లను డిజైన్ టెక్ కంపెనీ వివిధ షెల్ కంపెనీలకు మళ్లించింది. ♦ వాటిలో షెల్ కంపెనీలకు కమీషన్లు పోగా, మిగిలిన రూ.241 కోట్లు చంద్రబాబుకు చేర్చారు. అంటే ఈ కుంభకోణం ద్వారా చంద్రబాబు రూ.241 కోట్లు అక్రమంగా కొల్లగొట్టారన్నది ఆధారాలతోసహా నిర్ధారణ అయ్యింది. గుజరాత్ మోడల్ కాదు.. ♦ యువతకు నైపుణ్యాభివృద్ధి కోసం గుజరాత్లో అమలు చేస్తున్న ప్రాజెక్ట్‌నే ఏపీలో అమలు చేశామని టీడీపీ చెబుతుండటం సరికాదు. అధికారుల బృందం గుజరాత్లో పర్యటించి అక్కడి ప్రాజెక్ట్‌ను పరిశీలించింది. కానీ అందుకు విరుద్ధంగా ఏపీలో ప్రాజెక్ట్‌ను రూపొందించింది. ♦ 90 శాతం గ్రాంట్ ఇన్ ఎయిడ్ అన్నది జీవోలో చూపించారు గానీ ఒప్పందంలో లేదు. ఇక పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేసి ఫలితాలను చూసి నిర్ణయం తీసుకుందామన్న అధికారుల ప్రతిపాదనను పట్టించుకోలేదు. కేవలం రూ.371 కోట్లు కొల్లగొట్టడానికే ఈ ప్రాజెక్ట్‌ను తెరపైకి తెచ్చారు. నోట్ ఫైళ్లు మాయం ♦ ఈ కుంభకోణం బయట పడకూడదనే ఉద్దేశంతో ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన నోట్ ఫైళ్లను ఉద్దేశ పూర్వకంగా గల్లంతు చేశారు. ఏపీఎస్ఎస్డీసీ ఏర్పాటు జీవోకు సంబంధించిన నోట్ ఫైళ్లు, నిధుల విడుదలకు సంబంధించిన ఆదేశాల నోట్ ఫైళ్లను మాయం చేశారు. కానీ సీఐడీ వాటిని రిట్రైవ్ చేసింది. ♦ ఏపీఎస్ఎస్డీసీ ఏర్పాటు గురించి జీవో 4, సీమెన్స్‌తో ఒప్పందం గురించి జీవో 5 జారీ చేశారు. కానీ ఆ రెండు జీవోలకు సంబంధించిన నోట్ ఫైళ్లను మాయం చేశారు. కానీ జీవో 8 ద్వారా అంతకు ముందు ఇచ్చిన జీవోలు 4, 5 లోని అంశాలను సీఐడీ గుర్తించి వెలికి తీయడంతో ఈ కుంభకోణం వెనుక ఉన్న కుట్ర బయటపడింది. చంద్రబాబు ముఠా ద్వారా అక్రమ నిధుల తరలింపు ♦ షెల్ కంపెనీల ద్వారా దారి మళ్లించిన నిధులు చంద్రబాబు తన ముఠా మనుషుల ద్వారా పొందారు. చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని, షెల్ కంపెనీల సృష్టికర్త యోగేశ్ గుప్తా ఇందులో కీలక పాత్ర పోషించారు. ♦ డిజైన్‌టెక్‌కు చెల్లించిన రూ.371 కోట్లలో రూ.241 కోట్లు వివిధ షెల్ కంపెనీల ద్వారా యోగేశ్ గుప్తాకు చేరాయి. ఆయన ఆ రూ.241 కోట్లు డ్రా చేసి నగదును మనోజ్ పార్థసానికి ముంబయిలో అందించారు. మనోజ్ పార్థసాని ఆ రూ.241 కోట్ల నగదును హైదరాబాద్ తీసుకువచ్చి చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు అందించారు. ఆయన ఆ నగదును చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ♦ నిధుల తరలింపులో పాత్రధారులుగా వ్యవహరించిన పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసాని, యోగేశ్ గుప్తాలే చంద్రబాబు ఇతర కుంభకోణాల్లోనూ నిధుల తరలింపులో కీలకంగా వ్యవహరించారు. అమరావతిలో తాత్కాలిక రాజధాని భవనాల నిర్మాణం, రాష్ట్రంలో టిడ్కో ఇళ్ల కాంట్రాక్టులు కట్టబెట్టిన కుంభకోణంలో నిధులను షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకు చేర్చారు. ♦ ఆ విషయం ఆదాయ పన్ను శాఖ దర్యాప్తులో వెల్లడైంది. దాంతో ఆదాయ పన్ను శాఖ మనోజ్ పార్థసాని, యోగేశ్ గుప్తా, పెండ్యాల శ్రీనివాస్‌లకు నోటీసులు జారీ చేసి వారి వాంగ్మూలాలను నమోదు చేసింది. తాము అక్రమ నిధులను చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కే అందించామని మనోజ్ పార్థసాని, యోగేశ్ గుప్తా వాంగ్మూలంలో స్పష్టం చేశారు. షెల్ కంపెనీల ద్వారా మళ్లించిన నిధులను వారిద్దరి నుంచి చంద్రబాబు తరఫున తాను స్వీకరించానని పెండ్యాల శ్రీనివాస్ కూడా అంగీకరిస్తూ వాంగ్మూలం ఇవ్వడం గమనార్హం. ఈడీ దర్యాప్తులోనూ ‘స్కిల్’ కుంభకోణం బట్టబయలు ♦ ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ పేరిట షెల్ కంపెనీల ద్వారా నిధులు అక్రమంగా తరలించిన అంశంపై కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కూడా దర్యాప్తు చేపట్టింది. ఈ ప్రాజెక్ట్‌లో భారీగా అవినీతి జరిగిందని నిర్ధారించి ఇప్పటి వరకు డిజైన్‌టెక్ కంపెనీ ఎండీ వికాస్ వినాయక్ ఖన్వేల్కర్, సీమెన్స్ కంపెనీ భారత ప్రతినిధిగా గతంలో వ్యవహరించిన సుమన్బోస్లతోపాటు నలుగురిని అరెస్ట్ చేసింది. ♦ డిజైన్ టెక్ కంపెనీకి చెందిన రూ.31.32 కోట్ల బ్యాంకు ఖాతాలను జప్తు చేసింది. ఈ మేరకు ఈడీ పత్రికా ప్రకటన జారీ చేయడంతోపాటు ట్వీట్ కూడా చేసింది. డిజైన్ టెక్ కంపెనీ ఎండీ వికాస్ వినాయక్ ఖన్వేల్కర్‌ను ఈడీ ఈ ఏడాది మార్చి 10న అరెస్ట్ చేస్తే, మే 12 వరకు జైలులో ఉండి బెయిల్‌పై విడుదలయ్యారు. ♦ ఈ కుంభకోణంలో చంద్రబాబు భాగస్వామి అయిన ఆయన ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌లో అసలు అక్రమాలే జరగలేదని వీడియోలు విడుదల చేయడం విడ్డూరం. అక్రమాలు చేయకపోతే ఈడీ ఆయనపై కేసు పెట్టి ఎందుకు అరెస్ట్ చేసి జైలుకు పంపిందో సమాధానం చెప్పాలి. సీఐడీ కూడా చంద్రబాబుతోపాటు ఇప్పటికే వికాస్ వినాయక్ ఖన్వేల్కర్‌తోపాటు మొత్తం 9 మందిని అరెస్ట్ చేసింది. ♦ సీఐడీ నమోదు చేసిన కేసుపై విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం పది గంటలపాటు సుదీర్ఘంగా విచారించింది. ఇరుపక్షాల వాదనలను పూర్తిగా ఆలకించింది. అనంతరం ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్టులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారనడానికి పూర్తి ఆధారాలు ఉన్నాయని సంతృప్తి చెందడంతోనే ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. -
చంద్రబాబు పిటిషన్లో కౌంటర్ వేయండి
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో సీఐడీ పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్లో హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది. చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం వరకు విచారణ చేపట్టవద్దని విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయ మూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఐడీ వాదన వినకుండా ఈ కేసులో ప్రస్తుత దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడం సాధ్యం కాదని న్యాయ మూర్తి స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్టయిన చంద్రబాబు నాయుడు జ్యుడీషి యల్ రిమాండ్‌లో భాగంగా ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ మంగళవారం ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఈ కేసు ఆధారంగా విజయవాడ ఏసీబీ కోర్టు తనకు రిమాండ్ విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సైతం కొట్టేయాలని తన పిటిషన్లో కోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై బుధవారం న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి విచారణ జరిపారు. మీరు ఈ వ్యాజ్యంపై విచారించేందుకు అభ్యంతరం లేదు విచారణ ప్రారంభం కాగానే వాదనలు వినిపించేందుకు చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా సిద్ధమవుతుండగా, న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. వాదనలు వినిపించే ముందు తాను ఓ విషయం చెప్పదలచుకున్నానని తెలిపారు. తాను పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ)గా ఉన్న సమయంలో కొన్ని కేసుల్లో పిటిషనర్ చంద్రబాబుకు వ్యతిరేకంగా హాజరయ్యానని, దీనిపై మీకు అభ్యంతరం ఉంటే విచారణ నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. దీనిపై లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు స్పందిస్తూ, తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ గట్టిగా చెప్పారు. ఈ వ్యాజ్యాన్ని మీరే వినాలని కోరారు. దీంతో న్యాయమూర్తి విచారణను కొనసాగించారు. లూథ్రా వాదనలు మొదలు పెడుతుండగా, సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ, ఈ వ్యాజ్యంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని, ఇందుకు తమకు కొంత గడువు కావాలని కోర్టుకు స్పష్టం చేశారు. కౌంటర్ దాఖలుకు ఆదేశాలిస్తానని చంద్రబాబు న్యాయవాదులను ఉద్దేశించి న్యాయమూర్తి చెప్పగా, తాము వాదనలు వినిపిస్తామని వారు తెలిపారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరించారు. చంద్రబాబు రిమాండ్ చెల్లదు.. సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు అరెస్ట్ అక్రమమన్నారు. అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్)లోని సెక్షన్ 17ఏ ప్రకారం పబ్లిక్ సర్వెంట్‌ను విచారించాలన్నా, కేసు నమోదు చేయాలన్నా అందుకు గవర్నర్ నుంచి అనుమతి తప్పనిసరి అని తెలిపారు. ఈ కేసులో అలాంటి అనుమతి ఏదీ తీసుకోలేదన్నారు. ఇది చట్ట విరుద్ధమని తెలిపారు. గవర్నర్ అనుమతి తప్పనిసరి అని సుప్రీంకోర్టు కూడా చెప్పిందన్నారు. సెక్షన్ 17ఏను ఏసీబీ ప్రత్యేక కోర్టు సరైన కోణంలో అర్థం చేసుకోలేదన్నారు. 2018 జూలై తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 2018 తర్వాత నమోదైన కేసులకు గవర్నర్ అనుమతి తప్పనిసరి అని తెలిపారు. గవర్నర్ అనుమతి తీసుకోకుండా నమోదు చేసిన కేసు, అరెస్ట్, రిమాండ్ ఇవన్నీ కూడా చెల్లవన్నారు. అదువల్ల చంద్రబాబు రిమాండ్ ఉత్తర్వులను నిలుపుదల చేయాలని కోరారు. నిబంధనల ప్రకారమే కస్టడీ పిటిషన్ వేశాం ఈ సమయంలో అదనపు ఏజీ సుధాకర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ, లూథ్రా పూర్తి స్థాయిలో వాదనలు వినిపిస్తున్నారని, తాము కౌంటర్ దాఖలు చేసిన తర్వాత వాదనలు వినిపించుకోవచ్చన్నారు. సెక్షన్ 17ఏ విషయంలో చట్టం చాలా స్పష్టంగా ఉందని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవా లని లూథ్రా కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. అవతలి పక్షానికి సైతం అవకాశం ఇద్దామని తెలిపారు. కౌంటర్ల దాఖలకు ఎంత సమయం కావాలని ప్రశ్నిస్తూ.. తొలుత శుక్రవారం కల్లా కౌంటర్ దాఖ లు చేయాలని అదనపు ఏజీకి చెప్పారు. అంత తక్కువ సమయం సరిపోదని అదనపు ఏజీ తెలిపారు. నిబంధనల ప్రకారం రిమాండ్ విధించిన మొదటి 14 రోజుల లోపు పోలీసు కస్టడీ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుందని, అందుకు అనుగుణంగానే ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశామని చెప్పారు. అయితే విచారణను సోమవారానికి వాయిదా వేస్తానని, అప్పటి లోపు కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. సోమవారం వినాయక చవితి సెలవు అని సుధాకర్‌రెడ్డి చెప్పడంతో అలా అయితే మంగళవారం విచారణ చేపడతానని న్యాయమూర్తి స్పష్టం చేశారు.