breaking news
-
వివేకా హత్య.. సునీత దంపతుల కుట్రే!
సాక్షి, అమరావతి: ‘వైఎస్ వివేకానందరెడ్డిని ఆయన కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డే హత్య చేయించి ఉండొచ్చు. ఈ హత్య వెనుకనున్న ఏదో విషయాన్ని దాచిపెట్టాలని వారు ప్రయత్నిస్తున్నారు. వివేకం సార్ రెండో పెళ్లితో ఆ ఇంట్లో తలెత్తిన ఆస్తి గొడవలకు ఆయన హత్యకు ఏదైనా సంబంధం ఉందా.. అనిపిస్తోంది. కూతురు, అల్లుడు, పెద్ద బావమరిదే ఈ దారుణానికి తెగించి ఉండొచ్చు’.. అని వైఎస్ వివేకానందరెడ్డి పీఏగా చేసిన ఎంవీ కృష్ణారెడ్డి వెల్లడించారు. ‘వివేకానందరెడ్డి రాసిన లెటర్ పోలీసులకు వెంటనే ఇచ్చేసి ఉంటే దర్యాప్తు సక్రమంగా సాగేది. కానీ, ఆ లెటర్‌ను దాచిపెట్టమని ఆయన అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఎందుకు చెప్పారు? ఈ కేసుతో సంబంధంలేని ఎంపీ అవినాశ్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిల పేర్లు చెప్పాలని నన్ను ఎందుకు బెదిరించారు? నేను అబద్ధం చెప్పకపోతే తన భర్త రాజశేఖర్‌రెడ్డి జైలుకు వెళ్లాల్సి ఉంటుంది’ అని సునీత ఎందుకు అన్నారని కూడా ఆయన వెల్లడించడం ప్రాధాన్యం సంతరించుకుంది. వివేకానందరెడ్డిని పాశవికంగా హత్య చేశానన్న దస్తగిరిని అప్రూవర్‌గా మార్చడం ఏమిటీ? అతను చెప్పే కట్టుకథలను పట్టుకుని సీబీఐ దర్యాప్తు చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. వైఎస్ వివేకానందరెడ్డి చివరివరకు కూడా వైఎస్ జగన్‌ను సీఎం చేయడానికి, వైఎస్ అవినాశ్‌రెడ్డిని ఎంపీగా గెలిపించడానికే కృషిచేశారని ఆయన స్పష్టంచేశారు. వివేకాకు పీఏగా దాదాపు 37ఏళ్ల పాటు పనిచేసిన కృష్ణారెడ్డి.. ఆయనకు అత్యంత సన్నిహితుడు, నమ్మకస్తునిగా గుర్తింపు పొందారు. ఆయన కుటుంబ వ్యవహారాలతో సహా అన్ని విషయాలు సమగ్రంగా తెలిసిన వ్యక్తి. 2019, మార్చి 15 ఉదయం వివేకానందరెడ్డి మృతిచెందిన విషయాన్ని కృష్ణారెడ్డే మొదటగా గుర్తించి ఆయన కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. టీడీపీ ప్రభుత్వంలో పోలీసులు, తరువాత సీబీఐ అధికారుల చేతిలో చిత్రహింసలకు గురైన బాధితుడు కూడా కృష్ణారెడ్డే. వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించిన అన్ని పరిణామాలను సమీపం నుంచి పరిశీలిస్తున్న కీలకవ్యక్తి అయిన కృష్ణారెడ్డి ‘సాక్షి’కి ఇచి్చన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విషయాలను వెల్లడించారు. సాక్షి: 2019, మార్చి 15న ఏ సమయంలో మీరు వివేకానందరెడ్డి ఇంటికి వెళ్లారు? కృష్ణారెడ్డి: రోజూ వెళ్లినట్లే ఆ రోజు కూడా ఉ.5.30కే వివేకం సార్ ఇంటికి వెళ్లాను. ఇంట్లో లైట్‌వేసి లేదు. అంటే సారు ఇంకా నిద్ర నుంచి లేవలేదని అనుకున్నా. బయట లైట్ దగ్గర కూర్చుని పేపర్ చదువుకుంటూ ఉన్నా. కాసేపటి తరువాత సౌభాగ్యమ్మకు ఫోన్‌చేసి సార్ ఇంకా నిద్ర లేవలేదు.. మీరు ఫోన్‌చేసి నిద్ర లేపుతారా అని అడిగాను. రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చి ఉంటారు.. కాసేపు నిద్రపోనీ అని ఆమె చెప్పారు. కాసేపటికే వంట మనిషి లక్ష్మమ్మను ఆమె కొడుకు ప్రకాశ్ తన బైక్ మీద తీసుకొచ్చాడు. ఆలస్యమైంది కిటికీ వద్దకు వెళ్లి సారును నిద్రలేపు అని చెప్పాను. ఆ సమయంలో వాచ్మెన్ రంగన్న మెయిన్ డోర్ ముందర నిద్రపోతూ ఉన్నాడు. లక్ష్మమ్మ వచ్చేసరికి రంగన్న నిద్రలేచి ఉత్తరం వైపు ఉన్న పార్కు వైపు వెళ్లాడు. ఇంతలో ‘సార్ పడిపోయాడు’ అని అరుచుకుంటూ రంగన్న వచ్చాడు. మేము ఆ వైపు పరిగెత్తి వెళ్లాం. ఇంటికి ఉత్తరం వైపు ఉన్న తలుపు తెరచి ఉంది. లోపలికి వెళ్లి చూస్తే సార్ హాల్లోగానీ బెడ్రూమ్లోగానీ లేరు. అక్కడ రక్తపు మరకలు ఉన్నాయి. బాత్రూమ్లో చూస్తే వివేకం సార్ రక్తపుమడుగులో పడి ఉన్నారు. నేను సార్ చేయిపట్టుకుని నాడి చూశాను. నాడి కొట్టుకోవడంలేదు. ఆయన చనిపోయారని నిర్ధారించుకున్నా. సాక్షి: ఆ వెంటనే మీరు ఏం చేశారు? కృష్ణారెడ్డి: నేను వెంటనే సార్ అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డికి ఫోన్ చేసి చెప్పాను. బావ మనకు లేరు.. ఎవరో ఏదో చేశారు. రక్తపు మడుగులో ఉన్నారు. తల మీద గాయం ఉంది అని చెప్పాను. సరే అని ఆయన ఫోన్ పెట్టేశారు. నేను 6.15కు కాల్ చేశాను. నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి నాతో 47 సెకన్లు మాట్లాడి ఫోన్ పెట్టేశారు. ఆ తరువాత సార్ పెద్ద బావమరిది శివప్రకాశ్‌రెడ్డికి కాల్ చేశాను. కానీ, ఆయన ఫోన్ కలవలేదు. నాకు సౌభాగ్యమ్మ ఫోన్ నుంచి కాల్ వచి్చంది. నేను మేడంకు కూడా విషయం చెప్పాను. సాక్షి: ఆ తరువాత ఏం జరిగింది? కృష్ణారెడ్డి: నేను, ప్రకాశ్ అక్కడ ఉండగా వీల్ చెయిర్ దగ్గర లెటర్ దొరికింది. ఆ లెటర్ చదివాను. తన మాజీ డ్రైవర్ తనను చంపినట్లు వివేకం సార్ ఆ లెటర్లో రాసి ఉంది. ఇంతలో సౌభాగ్యమ్మ నాకు ఫోన్ చేశారు. అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి ఫోన్ ఇమ్మన్నాను. ఆమె ఆయనకు ఫోన్ ఇస్తే ఆ లెటర్లో రాసింది చదివి వినిపించాను. ఆ లెటర్‌ను దాచిపెట్టు. ఎవరికి చెప్పొద్దు.. అని రాజశేఖర్‌రెడ్డి చెప్పారు. లెటర్ గురించి పోలీసులకు చెప్పకపోతే ఇబ్బంది అవుతుంది కదా అని అన్నాను. ఏం ఇబ్బంది అవ్వదు.. మేం చూసుకుంటాం.. ఆ లెటర్ జాగ్రత్తగా దాచిపెట్టు అని ఆయన చెప్పారు. దాంతో ఆ లెటర్ విషయం పోలీసులకుగానీ ఎవరికీగానీ చెప్పలేదు. వంట మనిషి లక్ష్మమ్మ కొడుకు ప్రకాశ్‌కు ఆ లెటర్ ఇచ్చి మా ఇంట్లో ఇచ్చి రమ్మన్నాను. ఇంతలో రాజశేఖరరెడ్డి మళ్లీ నాకు ఫోన్ చేశారు. అప్పటికే సీఐ శంకరయ్య వచ్చారని చెప్పాను. ఆయన నా ఫోన్‌తో సీఐ శంకరయ్యతో మాట్లాడారు. తరువాత శంకరయ్య చెప్పినట్లుగా పోలీసు కంప్లైంట్ ఇవ్వమని రాజశేఖరరెడ్డి నాతో చెప్పారు. నేను అలానే చేశాను. సాక్షి: ఆ లెటర్ అప్పుడే పోలీసులకు ఇచ్చేసి ఉంటే ఈ కేసు దర్యాప్తు వేరే విధంగా ఉండేది కదా? కృష్ణారెడ్డి: ఆ లెటర్ అప్పుడే పోలీసులకు ఇచ్చి ఉంటే కేసు దర్యాప్తు సరైన విధంగా జరిగేది. కానీ, నాకు ఇష్టంలేకపోయినా రాజశేఖరరెడ్డి చెప్పడంతోనే ఆ లెటర్‌ను దాచి ఉంచాల్సి వచి్చంది. సాక్షి: మిమ్మల్ని ఎందుకు అరెస్టు చేశారు? కృష్ణారెడ్డి: నన్ను పోలీసులు ఎందుకు అరెస్టుచేశారో నాకే తెలీదు. లెటర్ దాచిపెట్టమని రాజశేఖరరెడ్డి చెప్పాడు. పోలీసులతో ఇబ్బంది వస్తుందని చెప్పినా తాను చూసుకుంటానని లెటర్ దాచి పెట్టమన్నాడు. టీడీపీ ప్రభుత్వం ఒత్తిడో.. వీళ్లు వాళ్లూ లాలూచీ అయి కృష్ణారెడ్డిని అరెస్టుచేయిస్తే సరిపోతుందని అనుకున్నారో తెలీదు. సాక్షి: మిమ్మల్ని అరెస్టు చేశాక ఏం జరిగింది? కృష్ణారెడ్డి: నన్ను అదేరోజు సాయంత్రం పోలీసులు అరెస్టుచేసి డీటీసీలో 13 రోజులపాటు ఉంచారు. బాగా కొట్టారు. రాజశేఖర్‌రెడ్డి చేశాడా.. శివశంకర్‌రెడ్డి చేసి ఉంటాడా చెప్పు అని తీవ్రంగా కొట్టారు. నాకు తెలీదని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. సాక్షి: పోలీసులకు ముందు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి మీద అనుమానం కలిగిందా? కృష్ణారెడ్డి: పోలీసులు ముందు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డినే అనుమానించారు. వివేకం సార్‌ను ఆయనే హత్య చేయించి ఉంటాడా అని అడిగారు. నాకేమీ తెలీదని చెప్పాను. పోలీసులు కొట్టడంతో దాదాపు ఏడాదిపాటు నా చేతితో ఏమీ పట్టుకోలేకపోయాను. సాక్షి: లెటర్‌ను దాచి పెట్టమన్న రాజశేఖర్‌రెడ్డిని ఎందుకు ప్రశి్నంచరు అని మీరు పోలీసులను అడగలేదా? కృష్ణారెడ్డి: పోలీసులు నన్ను కొడుతూ ఉంటే నేనేం మాట్లాడను. నా మాట వాళ్లు వినిపించుకుంటే కదా. సాక్షి: రాజశేఖర్‌రెడ్డిని పోలీసులు ఎందుకు విచారించలేదు? కృష్ణారెడ్డి: ఎందుకు విచారించలేదో మరి. సీబీఐ వాళ్లకు కూడా అదే విషయం చెప్పాను. కానీ, వాళ్లు కూడా పట్టించుకోలేదు. వాళ్ల మధ్య ఏం ఒప్పందం ఉందో తెలీదు. సాక్షి: ఎంపీ అవినాశ్‌రెడ్డి సీఐ శంకరయ్యను బెదిరించారనే ఆరోపణ కూడా ఉంది కదా? కృష్ణారెడ్డి: సీఐ శంకరయ్య పక్కనే నేనున్నా. ఆయన్ని ఎవరూ బెదిరించనే లేదు. సాక్షి: సీబీఐ కేసు దర్యాప్తు చేపట్టిన తరువాత ఎంపీ అవినాశ్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి పేర్లు చెప్పమని మీ మీద ఒత్తిడి వచి్చందా? కృష్ణారెడ్డి: ఎంపీ అవినాశ్, శివశంకర్‌రెడ్డి పేర్లు చెప్పాలని రాంసింగ్ నన్ను బాగా వేధించారు. వాళ్లిద్దరూ నన్ను బెదిరించారని చెప్పమన్నారు. అలాంటిదేమీ లేదని నేను చెప్పడంతో నన్ను బాగా కొట్టారు. ఉన్నది ఉన్నట్లు చెబుతాగానీ అబద్ధం చెప్పనని నేను అంటే మరింత గట్టిగా కొట్టేవారు. కొట్టినా చంపినా నాకు తెలిసింది ఇంతే అని చెప్పాను. సాక్షి: ఎంపీ అవినాశ్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి పేర్లను ఇరికించాలని సీబీఐ అధికారి రాంసింగ్ ఎందుకు భావించారు? కృష్ణారెడ్డి: సునీత, రాజశేఖరరెడ్డితో రాంసింగ్ ఏం కమిట్ అయ్యారో.. వాళ్లద్దరి పేర్లు చెప్పాలనే వేధించారు. సాక్షి: సీబీఐ అధికారి రాంసింగ్ మీతో ఎలా వ్యవహరించారు? కృష్ణారెడ్డి: ఒకరోజు రాంసింగ్ ఫోన్‌చేశారు. తాము చెప్పినట్లు విన్నారు కాబట్టే రంగన్న, దస్తగిరిలను రక్షించాం. నేను కూడా చెప్పినట్లు వింటే రక్షిస్తామన్నారు. కడప సెంట్రల్ జైలు గెస్ట్‌హౌస్‌కు నా పిల్లలతో రమ్మని చెప్పారు. ఆ విషయాన్ని రాజశేఖర్‌రెడ్డికి చెబితే రాంసింగ్ చెప్పినట్లు చేయమన్నారు. మా ఇద్దరు కొడుకులతో సెంట్రల్ జైలు గెస్ట్‌హౌస్‌కు వెళ్లాం. వాళ్లు చెప్పినట్లు వినకపోతే జైలుకు పంపిస్తామని బెదిరించారు. తాము పెద్దపెద్ద వాళ్లనే జైలుకు పంపాం.. నువ్వెంత అని అన్నారు. నాకు తెలిసిందే చెబుతా తప్పా మీరు చెప్పమన్నట్లు అబద్ధం చెప్పలేనని నేను అన్నా. దాంతో కర్ర తీసుకుని నా కొడుకుల ముందే దాదాపు 20 సార్లు తీవ్రంగా కొట్టారు. సాక్షి: మీ అబ్బాయి పెళ్లిని చెడగొట్టారు అంటారు.. కృష్ణారెడ్డి: మేం సెంట్రల్ జైలు గెస్ట్‌హౌస్ నుంచి ఇంటికి వచి్చన మర్నాడే మా అబ్బాయికి సంబంధం కుదిరిన వారి నుంచి ఫోన్ వచి్చంది. పెళ్లి సంబంధం రద్దు చేసుకుంటున్నామని చెప్పారు. నా మీద కేసు ఉంది.. నేను జైలుకు వెళ్లాను.. మా ఆస్తులన్నీ తీసేసుకుంటామని సునీత, రాజశేఖర్‌రెడ్డి వారికి ఫోన్‌చేసి చెప్పారట. వాళ్లను హైదరాబాద్ పిలిపించుకుని మరీ బెదిరించి పెళ్లి సంబంధం రద్దుచేసుకునేలా చేశారు. వాళ్లు చెప్పినట్లు వినాలని నన్ను ఒప్పించేందుకు సునీత, రాజశేఖర్‌రెడ్డి అలా చేశారు. ఈ సంబంధం కాకపోతే మరో సంబంధం కుదురుతుందని నేను వారికి లొంగలేదు. సాక్షి: మీరు రాంసింగ్ మీద ఫిర్యాదు చేశారు కదా? కృష్ణారెడ్డి: నేను ఎంతమందితో చిత్రవధలకు గురయ్యేది. టీడీపీ ప్రభుత్వంలో ముందు పోలీసులు కొట్టారు. సునీత, రాజశేఖర్‌రెడ్డి హైదరాబాద్ పిలిపించుకుని బెదిరించారు. మా అబ్బాయి పెళ్లి సంబంధం చెడగొట్టారు. సీబీఐ అధికారి రాంసింగ్ నన్ను కడపలో కొట్టారు. ఢిల్లీ పిలిపించుకుని గొడ్డును బాదినట్లు కొట్టారు. ఇక ఎంతమందితో దెబ్బలు తినాలి.. అందుకే ఎస్పీకి ఫిర్యాదు చేశాను. నాకు ప్రాణహాని ఉంది.. భద్రత కల్పించాలని కోరాను. పులివెందుల కోర్టులో కూడా పిటిషన్ వేశాను. సాక్షి: వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని ఎంపీ అవినాశ్‌రెడ్డి చెప్పారని ఒక ఆరోపణ వచి్చంది. ఆయన అలా చెప్పారా? కృష్ణారెడ్డి: ఆ మాటే వినలేదు. అసలు ఆ విషయం ఎలా బయటకు వచి్చందో కూడా నాకు తెలీదు. సాక్షి: దస్తగిరి ఎలాంటి వ్యక్తి? కృష్ణారెడ్డి: దస్తగిరి డ్రైవర్‌గా ఉండేవాడు. ప్రవర్తన సరిగా లేదని తీసేశారు. వివేకం సార్‌ను ముసలోడా అనేవాడు. డ్యాన్స్ చేసేవాడు.. వెక్కిరించేవాడు. దాంతో సౌభాగ్యమ్మ అతనిని పని నుంచి తీసేశారు. అతని ఇంట్లో వాళ్లు వచ్చి బాధపడితే సౌభాగ్యమ్మను ఒప్పించి మళ్లీ పనిలో పెట్టించాను. కానీ, ఆ తరువాత దస్తగిరి మరింత మారిపోయాడు. వివేకం సార్ షమీమ్ ఇంటికి వెళ్లాలంటే ఇతనే డ్రైవర్. దాంతో దస్తగిరికే ఆయన ప్రాధాన్యం ఎక్కువ ఇచ్చేవారు. దస్తగిరి డబ్బు మనిషి. సాక్షి: హత్య ప్రదేశంలో సాక్ష్యాధారాలను చెరిపేయాలని ఎంపీ అవినాశ్‌రెడ్డి మీతో చెప్పారని కొందరు ఆరోపిస్తున్నారు? దీనిపై ఏమంటారు? కృష్ణారెడ్డి: అసలు వివేకం సార్ మృతదేహాన్ని బాత్రూమ్ నుంచి తీసుకువచి్చనప్పుడు ఎంపీ అవినాశ్‌రెడ్డి అక్కడ లేనేలేరు. అక్కడ సాక్ష్యాలను చెరిపి వేయించింది ఎర్ర గంగిరెడ్డే. ఎంపీ అవినాశ్‌రెడ్డిని రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికే ఆ ఆరోపణలు చేస్తున్నట్లుగా ఉంది. అక్కడ తుడిపించి వేసింది గంగిరెడ్డే. అక్కడున్న అందరూ అది చూశారు. సాక్షి: సీబీఐ అధికారులు పిలిస్తే మీరు ఢిల్లీ వెళ్లారు కదా.. అక్కడ ఏం జరిగింది? కృష్ణారెడ్డి: సీఐబీ అధికారులు నోటీసు ఇస్తే ఢిల్లీ వెళ్లాను. నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డికి చెప్పే వెళ్లాను. నన్ను ఢిల్లీలో నెలరోజులు ఉంచి తీవ్రంగా వేధించారు. ఎంపీ అవినాశ్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి పేర్లు చెప్పాలని అక్కడ కూడా రాంసింగే వేధించారు. నాకు తెలిసింది ఇప్పటికే చెప్పాను. లెటర్ దాచి పెట్టడమే నేను చేసిన తప్పు.. అది కూడా రాజశేఖర్‌రెడ్డి చెబితేనే చేశాను.. అంతకుమించి నాకేమీ తెలీదని చెప్పాను. దాంతో వాళ్లు నన్ను కొట్టేవారు. రోజూ రాత్రి సునీత, రాజశేఖర్‌రెడ్డి ఫోన్ చేసేవారు. నన్ను తీవ్రంగా కొడుతున్నారని వారికి నేను చెప్పేవాడిని.. నెల రోజులవుతోందని చెప్పినా వారు పట్టించుకోలేదు. సాక్షి: మామా అల్లుళ్ల మధ్య సంబంధాలు ఎలా ఉండేవి? కృష్ణారెడ్డి: నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి మీద వివేకం సార్‌కు మంచి అభిప్రాయంలేదు. అల్లుడు కాబట్టి తప్పదు కదా. ఆయన మీద సార్ తరచూ కోప్పడేవారు. ఆ కుటుంబంలో ఏం జరుగుతోందో నాకు తెలీదు. కానీ, అల్లుడి మీద సార్ గట్టిగా అరుస్తూ ఉండేవారు. వివేకం సార్ రెండో భార్య షమీమ్ విషయంలోనే వాళ్ల మధ్య గొడవలు జరిగేవి. సాక్షి: వివేకానందరెడ్డి రెండో పెళ్లి చేసుకోవడంతో ఆ కుటుంబంలో గొడవలు జరిగేవా? కృష్ణారెడ్డి: షమీమ్ అనే ఆవిడను వివేకం సార్ రెండో పెళ్లి చేసుకోవడంతో ఆ కుటుంబంలో గొడవలు జరిగేవి. ఒకరోజు సౌభాగ్యమ్మ, సునీత, రాజశేఖర్‌రెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి కలిసి వివేకం సార్‌తో గొడవ పడ్డారు. తాను షమీమ్‌ను పెళ్లి చేసుకోవడమే కాదు ఆమెతో తనకు ఒక అబ్బాయి కూడా ఉన్నాడని సార్ చెప్పారు. ఆ ఇద్దరి బాధ్యతతోపాటు ఆమెకున్న ఇద్దరు చెల్లెళ్లకు పెళ్లి చేయడం కూడా తన బాధ్యతేనని అన్నారు. సాక్షి: సునీత ఎందుకు అంతగా కేకలు వేశారు? కృష్ణారెడ్డి: నా మీద సునీత కోపంతో అరుస్తూ ఉంటే రాజశేఖర్‌రెడ్డి ఆమెను సముదాయించేందుకు యత్నించారు. ‘ఈ కేసు విషయంలో కృష్ణారెడ్డి సహకరించకపోతే రాజశేఖర్‌రెడ్డి జైలుకు వెళ్లాల్సి వస్తుంది’ అని సునీత ఆయనతో అంది. నాకేమీ అర్థం కాలేదు. వివేకం సార్ హత్యలో వీళ్ల పాత్ర ఉందేమోనని మొదటిసారి అనిపించింది. అంటే నాతో అబద్ధం చెప్పించి వేరెవరినో నాశనం చేయాలని సునీత భావిస్తోందని అర్థమైంది. సాక్షి: వివేకానందరెడ్డిని ఎవరు చంపి ఉంటారు? మీతో ఎందుకు అబద్ధం చెప్పించాలని చూస్తున్నారు? కృష్ణారెడ్డి: ఎంపీ అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి పేర్లు చెప్పాలని సునీత, రాజశేఖర్‌రెడ్డి ఎందుకు ప్రయత్నిస్తున్నారో అర్థంకావడంలేదు. నాతో ఒక అబద్ధం చెప్పించాలని ప్రయత్నిస్తున్నారంటే.. దాని వెనుక వాళ్లకేదో ఉద్దేశం ఉండే ఉంటుంది. ఎవర్నో కాపాడేందుకు.. ఏదో నిజాన్ని దాచేందుకే వాళ్లిద్దరూ ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తోంది. సీబీఐ అధికారి రాంసింగ్ కూడా నాతో అబద్ధాలు చెప్పాలని ఎందుకు పట్టుబట్టారో తెలీడంలేదు. కేసు దర్యాప్తు సక్రమంగా సాగితేనే వాస్తవాలు బయటకొస్తాయి. కానీ, సీబీఐ తీరు సక్రమంగాలేదు. అదే బాధేస్తోంది. సాక్షి: చివరగా.. వివేకా హత్య గురించి ఏమంటారు? కృష్ణారెడ్డి: జరుగుతున్నదంతా చూస్తే.. సునీత, రాజశేఖర్‌రెడ్డి, శివప్రకాశ్‌రెడ్డిల మీదే అనుమానం కలుగుతోంది. వీళ్లే వివేకం సార్‌ను ఏమైనా చేసి మరొకరి మీద నింద వేయాలని చూస్తున్నారా అనిపిస్తోంది. ఆస్తి గొడవలు, షమీమ్ విషయం.. ఆస్తి వేరొకరికి పోతుందనే చేశారా అనిపిస్తోంది. ఎందుకంటే అబద్ధం చెప్పమని నన్ను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఎవరైనా నిజం చెప్పాలని అంటారు. కానీ, అబద్ధం చెప్పమని వీళ్లు ఎందుకు అంటున్నారన్నది చూడాలి. అందుకే వివేకం సార్‌ను వీళ్లే ఏమైనా చేశారనిపిస్తోంది. నేను అబద్ధం చెప్పకపోతే తన భర్త రాజశేఖర్‌రెడ్డి జైలుకు పోతారని కూడా సునీత నా ముందే అంది. -
1.81 కోట్లు సీజ్.. నారాయణ అల్లుడు పునీత్‌పై కేసు
సాక్షి, నెల్లూరు: నారాయణ విద్యాసంస్థల అధినేత, మాజీ మంత్రి పి నారాయణ అల్లుడు పునీత్‌పై పన్నుల ఎగవేత కేసు నమోదు అయ్యింది. అంతేకాదు ఈ కేసు విచారణలో భాగంగా బంధువుల ఇళ్లలో సైతం తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. కోటికి పైగా నగదు సైతం సీజ్ చేశారు. ఈ సోదాలపై జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి మీడియాకు వివరాలు తెలియజేశారు. ‘‘ఇన్స్పైర్ మేనేజ్మెంట్ సర్వీస్ పేరుతో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ జీఎస్టీ ఎగొట్టాడు. సుమారు 84 వాహనాలకు జీఎస్టీ కట్టకుండా ప్రభుత్వాన్ని మోసం చేశారు. రూ.10 కోట్ల 32 లక్షలు దాకా కట్టాల్సి ఉంటే.. రూ. 22 లక్షల మాత్రమే జీఎస్టీ కట్టారు. అంటే 10 కోట్ల పన్ను ఎగవేశారన్నమాట. ఇక నారాయణ సమీప బంధువుల నివాసాల్లో సోదాలు చేసి సరైన పత్రాలు చూపించనందున రూ. కోటి 82 లక్షలు నగదు సీజ్ చేశాం.. . పునీత్ డైరెక్టర్ గా ఉన్న ఇన్స్పైర్ మేనేజ్మెంట్ కేంద్రంగా రవాణా శాఖకు పన్నులు ఎగగొట్టారు. సొసైటీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రభుత్వానికి జీఎస్టీ కట్టలేదు. డీఆర్ఐ అధికారులు రవాణా శాఖకు ఫిర్యాదు చేయడంతో సోదాలు నిర్వహించాం. ఈ వ్యవహారంపై నారాయణ అల్లుడు పునీత్ పై కేసు నమోదు చేశాం. నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీకి అనుబంధంగా ఈ ఇన్స్పైర్ సొసైటీ ఉంది. అయితే బస్సులు కొనుగోలు సంబంధించి ఇన్వాయిస్ మాత్రం నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పైన రిజిస్ట్రేషన్ చేశారు. నారాయణ విద్యా సంస్థల నుంచి ప్రతి నెలా అద్దె కడుతున్నారు. అలాగే.. నారాయణ సంస్థలు కొన్నట్లు రవాణా శాఖకు చూపించారు’’ అని ఎస్పీ వివరించారు. -
చంద్రబాబు డైరెక్షన్.. నర్రెడ్డి సునీత యాక్షన్
'మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి మాట్లాడిన తీరు, ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీలోని వారికి, చివరికి పార్టీ ఆఫీస్ అటెండర్ స్థాయి ఉండే నేతలకు సైతం ఆమె ధన్యవాదాలు తెలియచేసిన వైనం, అలాగే ఆ మీడియా సమావేశానికి హాజరైన ప్రతినిధులు కేవలం టీడీపీకి ఉపయోగపడే ప్రశ్నలు వేసిన పద్ధతి.. ఇవన్నీ గమనిస్తే ఒక విషయం అర్థం అవుతుంది. సునీత కేవలం తన తండ్రి హత్య కేసు గురించి కన్నా, తెలుగుదేశం పార్టీకి ఏ రకంగా ఉపయోగపడాలన్న లక్ష్యంతోనే మాట్లాడారని తేలిపోతుంది. ఈనాడు పత్రికలో సునీత మీడియా సమావేశం వార్తను ఒక పేజీన్నర ప్రచురించారు. ఆ మొత్తం చదివితే ఆమె తెలివితక్కువగా చేసిన ప్రకటనలను ఎడిట్ చేసి పాఠకులను మోసం చేశారన్న సంగతి అర్ధం చేసుకోవచ్చు.' తన తండ్రి హత్య జరిగిన తర్వాత సునీత మాట్లాడిన మాటలకు, ఇప్పుడు చెబుతున్న అంశాలకు మధ్య ఎంతో తేడాను మనం గమనించవచ్చు. సునీత ఒక రాజకీయ దురుద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మాట్లాడుతున్నట్టు వినగానే మనకు అర్థమవుతుంది. వివేకా హత్య కేసు ఇప్పటికే తెలంగాణలోని సీబీఐ కోర్టులో విచారణలో ఉంది. దీనిలో ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకునే పరిస్థితి ఉండదు. కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రితో పాటు మరికొందరు జైలులో ఉన్నారు. సీబీఐ చార్జీషీట్ కూడా దాఖలు చేసింది. ఇక జరగవలసింది కోర్టు విచారణ మాత్రమే. దీనికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఏమి సంబంధం ఉంది? తనవద్ద ఆధారాలు లేవంటూ చెబుతూనే వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విచారణ జరపాలని కోరడం వింత విడ్డూరంగా కనిపిస్తోంది. ఎవరైనా ఒక మాట చెబితే అందులో విశ్వసనీయత ఉండాలి. ఒక చిత్తశుద్ది ఉండాలి. కానీ సునీత మాత్రం ఎందుకో తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు కొందరు చూపుతున్న ప్రలోభాలకు లొంగి, వారు మాట్లాడమన్నట్లు మాట్లాడుతూ, వారు చెప్పినట్లు చేస్తున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. ఈ మొత్తం వ్యవహారం చూస్తే ఆమెకు తన తండ్రి ప్రతిష్ట కన్నా, తనకు, తన భర్తకు ఏదో రాజకీయ పదవి కోసం పాకులాడుతున్నారన్న సందేహం వస్తుంది. అంతేకాక వివేకా హత్య కేసులో రెండో కోణంగా ఉన్న ఆయన వ్యక్తిగత జీవిత రహస్యాలను బహిర్గతం అవుతున్నా ఆమె ఫీల్ అవుతున్నట్లు కనిపించడం లేదు! తన తండ్రితో ఐదేళ్లుగా అంతగా సునీతకు సత్సంబంధాలు లేవని చెబుతున్నారు. అది నిజమా? కాదా? తండ్రి మరో మహిళను రెండో వివాహం చేసుకున్నారన్నది వాస్తవమా? కాదా? వారికి పుట్టిన బిడ్డకు ఆస్తి ఇవ్వకుండా సునీత అడ్డుపడే యత్నం చేశారన్నది కరెక్టా? కాదా? వివేకా హత్య జరిగినప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు ప్రభుత్వమే కదా! ఆ రోజుల్లో ఏ మాత్రం ఆధారం దొరికినా ఎంపీ అవినాశ్ రెడ్డిపైన కేసు పెట్టేవారు కదా! అప్పుడు ఎందుకు అలా చేయలేకపోయారో చంద్రబాబును సునీత ఎందుకు ప్రశ్నించలేదు? ఆనాడు టీడీపీ నేతలు ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవిలపై ఆరోపణలు చేసిన ఆమె ఎందుకు వారితో రాజీపడిపోయారు? అసలు వివేకాను తానే హత్య చేశానని చెబుతున్న దస్తగిరిని మాత్రం సునీత ఎందుకు రక్షిస్తున్నారు? అతనికి బెయిల్ వచ్చేందుకు ఎందుకు సహకరిస్తున్నారు? వివేకాను చంపినవారినే తన వద్ద పెట్టుకుని, ఇంకెవరిపైనో ఆరోపణలు చేయడం రాజకీయం కాకుండా ఉంటుందా? ఆమె తండ్రిపట్ల ఏ మాత్రం అభిమానం ఉన్నా ఇలా చేయగలుగుతారా? తన తండ్రి హత్య జరిగి ఐదేళ్లయినా విచారణ ఎందుకు పూర్తి కాలేదని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలోనే ఆమె దుర్బుద్ధి కనబడుతోంది. ఆమె కేంద్రాన్ని, భారతీయ జనతా పార్టీని లేదా సీబీఐని కదా అడగాల్సింది? లేదా హత్య జరిగిన సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబును విచారణ ఎందుకు పూర్తి కాలేదని అడగాలి కదా! హంతకులు పాలకులుగా ఉండరాదని ఆమె అంటున్నారు. అది నిజమే. అందుకే చంద్రబాబు ప్రభుత్వాన్ని అప్పట్లో ప్రజలు ఓడించారని అనుకోవాలి కదా! పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వాలని కోరుతూ తన అన్నకు ఓటు వేయవద్దని అంటున్నారంటేనే ఆమె ఎజెండా తెలిసిపోతుంది! వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నుంచి ఆమె గానీ, ఆమె కుటుంబం కానీ ఏదో ఆశించి ఉండాలి. అది నెరవేర్చడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధపడి ఉండకపోవచ్చు. ఆ కోపంతో టీడీపీ రాజకీయ ట్రాప్‌లోకి వెళ్లి, ఆ పార్టీ వారు సమకూర్చిన లాయర్ల సహకారంతో రకరకాల పిటిషన్లు వేసి ఇన్నాళ్లు సునీత కథ నడిపించారనిపిస్తుంది. వివేకా రాసిన లేఖను సునీత, ఆమె భర్త ఎందుకు దాచి ఉంచారు? బయటపెట్టొద్దని ముందే ఎందుకు హెచ్చరించారు.? ఈ విషయాలను కూడా సునీత ఎప్పుడూ బయటపెట్టలేదు. ఈమె మాదిరే సొంత చెల్లెలు షర్మిల కుటుంబం కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నుంచి ఏదో ఆశించిందని, కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి అంగీకరించలేదని, తత్ఫలితంగానే ఆమె కూడా ఇదే రీతిలో రోడ్డెక్కి రాజకీయం చేస్తున్నారని తెలంగాణ వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. ఇక్కడ ఒక విషయం అంగీకరించాలి. తన చెల్లెళ్లను వదలుకోవడానికి అయినా వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధపడ్డారు తప్ప, ప్రజా ధనాన్ని, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోలేదన్న విషయం స్పష్టంగా బోధపడుతుంది. ఇక ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి టీడీపీ మీడియా ప్రతినిధులు హాజరై వారికి కావాల్సిన ప్రశ్నలు వేసినట్లు ఇట్టే కనిపెట్టేయవచ్చు. వాటిలో కొన్నింటిని గమనించండి.. మీ నాన్న హత్య కేసులో నిందితులను రక్షించడానికే వైఎస్ జగన్ పరిమితం అయ్యారు. ఇందులో ఆయన పాత్ర కూడా ఉందని అనుమానిస్తున్నారా? అవినాశ్‌కు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌పై సీబీఐ సుప్రింకోర్టుకు ఎందుకు వెళ్లలేదు? హత్యకు ఏ ఆయుధం ఉపయోగించింది? జగనే ఎలా చెప్పగలిగారని అనుకుంటున్నారు? అవినాశ్ రెడ్డిని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎందుకు కాపాడుతున్నారు? తెలుగుదేశం ఏ ఆరోపణలు చేస్తుంటుందో వాటినే ప్రశ్నలుగా మలిచి ఈ మీడియా ప్రతినిధులు వేశారంటేనే వీరందరి రాజకీయ లక్ష్యం తెలుసుకోవచ్చు. అదే కాదు, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, రఘురామకృష్ణరాజుతో సహా పలువురు చోటా, మోటా టీడీపీ లీడర్లకు సైతం సునీత కృతజ్ఞతలు చెబితే, దానిని మాత్రం ఈనాడులో ఎడిట్ చేశారు. ఆ పాయింట్ వల్ల టీడీపీకి నష్టం కలుగుతుందని ఈనాడు రామోజీరావు భావించడమే అని వేరే చెప్పనవసరం లేదు. ఏతావాతా వీటన్నిటిని గమనిస్తే ఒక విషయం బోధపడుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన స్కీములు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఆయుధాలుగా మార్చుకుని ప్రజల మద్దతుతో ఎన్నికల యుద్ధంలో పాల్గొంటుంటే, చంద్రబాబు మాత్రం తన ఆయుధాలుగా పవన్ కళ్యాణ్, షర్మిల, సునీత, రఘురామకృష్ణరాజు, లాయర్లను మార్చుకుని కోర్టుల ద్వారా యుద్ధం చేయాలని భావిస్తున్నారు. ఆ ప్రక్రియలో సునీత కూడా ఒక భాగమే అని తేలడం లేదూ!. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
రాఫిసి: ఈనాడు ఆఫీసు పైనుంచి పడి మహిళ మృతి
సాక్షి,హైదరాబాద్: రాఫిసి(రామోజీఫిల్మ్‌సిటీ)లో ఈనాడు ఉద్యోగిని సాయికుమారి అనుమానస్పదంగా మరణించారు. రాఫిసిలోని ఈనాడు కార్యాలయం నాలుగో అంతస్తు నుంచి కింద పడి సాయికుమారి చనిపోయారు. ఈ ఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. మృతి చెందిన సాయికుమారి ఈనాడు కార్యాలయం కాల్సెంటర్లో ఉద్యోగిని. సాయికుమారి భర్త కూడా ఈనాడు సంస్థల్లోనే పనిచేస్తున్నారు. సాయికుమారికి ఇద్దరు పిల్లలు. మహిళ మృతి ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహిళది ఆత్మహత్యా కాదా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే హుటాహుటిన మహిళ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సాయికుమారి కుటుంబం పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మారెడ్డి పాలెంలో నివాసం ఉంటున్నారు. గత కొద్ది కాలంగా వీపరీతమైన పని ఒత్తిడి కారణంగా మనోవేదనకు గురైనట్టు సమాచారం. కొందరు రాఫిసి (రామోజీ ఫిల్మ్ సిటీ) ఉద్యోగులు ఇచ్చిన సమాచారం మేరకు మరణించిన మహిళా ఉద్యోగి పేరు సాయికుమారి అని తెలిసింది. ఈనాడు కార్యాలయంలోని కాల్ సెంటర్లో సాయికుమారి పని చేస్తున్నట్టు తెలిసింది. ఈ ఉదయం ఆఫీసుకు వచ్చిన సాయికుమారి.. అదే బిల్డింగ్ నాలుగో ఫ్లోర్ పైనుంచి పడి చనిపోవటం సంచలనంగా మారింది. సాయికుమారి భర్త కూడా రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఉద్యోగం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సాయికుమారి మృతికి గల కారణాలపై ఇతర ఉద్యోగులను ప్రశ్నించినట్టు తెలిసింది. ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేక ఏం జరిగిందో అన్న విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల రాఫిసి (రామోజీ ఫిల్మ్ సిటీ)లో జరిగిన ఓ ఘటన కూడా చర్చనీయాంశమయింది. ఘనంగా ఈవెంట్లు నిర్వహిస్తామని చెప్పుకునే రామోజీ ఫిలిం సిటీలో నిర్వాహకుల నిర్లక్ష్యంతో క్రేన్ వైర్ తెగిపోయింది. ఈ ఘటనలో వెస్టెక్స్ కంపెనీ సీఈవో సంజయ్‌షా మరణించగా, సంస్థ ప్రెసిడెంట్ విశ్వనాథ్ తీవ్రంగా గాయపడ్డారు. రాఫిసిలో ఏం జరిగినా.. మీడియాను గానీ ఇతరులను గానీ లోపలికి అనుమతించరని స్థానికులు చెబుతున్నారు. అక్కడ యాజమాన్యం వారిచ్చే సమాచారమే తప్ప .. ఏదీ బయటకు రానివ్వరన్న విమర్శలున్నాయి. ఇదీ చదవండి.. ఫొటోగ్రాఫర్ దారుణ హత్య -
ఫొటోగ్రాఫర్ దారుణ హత్య
ఆలమూరు/మధురవాడ/పీఎం పాలెం : సోషల్ మీడియాలో పరిచయం పెంచుకుని ఈవెంట్ చేద్దామని పిలిచి, స్నేహితుడితో కలిసి ఓ ఫొటోగ్రాఫర్‌ను హత్య చేసిన దారుణ ఘటన ఇది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. విశాఖ మధురవాడ సమీపంలోని బక్కన్నపాలేనికి చెందిన పోతిన సాయి(21)కి ఫొటోలు, వీడియోలు తీయడం హాబీ. అతడికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారం గ్రామానికి చెందిన షణ్ముఖ తేజతో సోషల్ మీడియాలో పరిచయమేర్పడింది. ఈ క్రమంలో సాయి వద్ద రూ.12.70 లక్షల విలువైన కెమేరాలు, ఇతర పరికరాలున్నాయని తేజ గుర్తించాడు. వాటిని ఎలాగైనా స్వా«దీనం చేసుకోవాలనే దుర్బుద్ధి పుట్టడంతో అతడు పన్నాగం పన్నాడు. ఈ క్రమంలో తాను కూడా ఫొటోగ్రాఫర్‌నని, ఏవైనా ఈవెంట్లు ఉంటే కలసి చేద్దామని సాయిని నమ్మించాడు. రాజమహేంద్రవరంలో ఈవెంట్ ఉందని సాయిని తేజ నమ్మించాడు. సాయి గత నెల 26వ తేదీ మధ్యాహ్నం విలువైన కెమేరాలు, పరికరాలతో రైల్లో రాజమహేంద్రవరం చేరుకున్నాడు. అప్పటికే తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం పొట్టిలంకకు చెందిన స్నేహితుడు వినోద్‌కుమార్‌తో తేజ రైల్వేస్టేషన్లో వేచి ఉన్నాడు. అద్దెకు తీసుకున్న కారులో సాయిని ఎక్కించుకుని, సొంతంగా డ్రైవింగ్ చేసుకుంటూ సాయంత్రానికి వేమగిరి చేరుకున్నారు. పథకం ప్రకారం అక్కడే సాయిని తేజ, వినోద్‌కుమార్‌లు హత్య చేసి మృతదేహాన్ని అదే రోజు అర్ధరాత్రి 216ఎ జాతీయ రహదారిపై ఉన్న జొన్నాడ గ్రామం వరకూ వచ్చి.. అక్కడి గౌతమీ గోదావరి తీరంలో పూడ్చివేశారు. అనుమానం వచ్చిందేమో! కారులో తనను ఇష్టానుసారంగా తిప్పడం వల్లో ఏమోగానీ తేజపై సాయికి అనుమానం వచ్చింది. మధ్యలో కారు ఫొటోతో పాటు తేజ ఫోన్ నంబర్‌ను కూడా తన తల్లి రమణమ్మకు వాట్సాప్‌లో పంపాడు. ఈ నేపథ్యంలో మూడు రోజులైనా సాయి ఇంటికి రాకపోవడం, అతడి ఫోన్, తేజ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ కావడంతో సాయి తల్లిదండ్రులు గత నెల 29న విశాఖపట్నం పోతినమల్లయ్యపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి కారు యజమానిని ప్రశి్నంచి కొంత సమాచారం రాబట్టారు. కాగా, విశాఖ కంచరపాలేనికి చెందిన యువతితో తేజ చాటింగ్ చేస్తున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. యువతిని విచారించగా.. ఈ హత్యాపన్నాగం బయట పడినట్లు తెలుస్తోంది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతదేహాన్ని పూడ్చిన ప్రదేశాన్ని గుర్తించిన పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
దస్తగిరి చెప్పేవన్ని అబద్ధాలే
పులివెందుల: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి చెప్పేవన్ని పూర్తి అవాస్తవాలని.. హత్య కేసులో రిమాండ్‌లో ఉన్న సునీల్‌యాదవ్ సమీప బంధువు భరత్‌యాదవ్ స్పష్టంచేశారు. ఆదివారం వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దస్తగిరి తనకు ప్రాణహాని ఉందని చెబుతూ రౌడీయిజం, గూండాయిజం, సెటిల్మెంట్లు ఎలా చేస్తున్నాడని ప్రశ్నించారు. అతను చేసిన దుర్మార్గపు పనిని గొప్పగా చెప్పుకుంటూ సమాజంలో రౌడీయిజంతో హల్చల్ చేస్తున్నాడన్నారు. ఉన్నతమైన వ్యక్తులను టార్గెట్ చేస్తూ అబద్ధపు మాటలతో సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాడని మండిపడ్డారు. నిజాన్ని కప్పిపుచ్చి దస్తగిరితో వెనుక ఉండి ఎవరు మాట్లాడిస్తున్నారో అందరికీ తెలుసునన్నారు. గతంలో సునీల్‌యాదవ్, దస్తగిరిలు తమ ఆర్థిక లావాదేవీల విషయంలో తనను సంప్రదించేవారని.. అప్పట్లో ఐస్ బండి వ్యాపారం చేస్తూ అప్పులతో ఉన్న దస్తగిరి ఇప్పుడు విలాసవంతమైన జీవితం ఎలా గడుపుతున్నాడని భరత్‌యాదవ్ ప్రశ్నించారు. తనకు కూడా డబ్బులు బాకీ ఉన్న దస్తగిరి తననూ దూషించాడన్నారు. వివేకా రెండో భార్య అయిన షమీమ్‌కు ఆస్తి పోతుందనే ఈ హత్య జరిగి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తంచేశారు. ఈ హత్యలో వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి కీలకపాత్ర పోషించాడన్నారు. అతను వెనుక ఉండి ఎర్రగంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్, దస్తగిరిల ద్వారా హత్య చేయించాడన్నారు. ఎర్రగంగిరెడ్డి నోరువిప్పితే అసలు విషయాలు వెల్లడి.. ఈ హత్యలో ఎర్రగంగిరెడ్డి నోరు విప్పితే పూర్తి విషయాలు బయటపడతాయని భరత్‌యాదవ్ చెప్పారు. తనకు సునీల్‌యాదవ్ రూ.16 లక్షలు ఇవ్వాలని, అప్పట్లో తాను డబ్బుల విషయం అడిగితే రాజశేఖర్ సార్ ఇవ్వాలని, డబ్బులు వచ్చిన వెంటనే ఇస్తానని చెప్పేవాడన్నారు. అలాగే, డబ్బుల విషయమై ఒకసారి ఎర్రగంగిరెడ్డి కూడా నీకు రావాల్సిన డబ్బులు ఎక్కడికీ పోవు, త్వరలోనే వస్తాయని తనతో చెప్పేవాడన్నారు. దస్తగిరి, దస్తగిరి భార్య ఎవరితో మాట్లాడుతున్నారో వారికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని భరత్‌యాదవ్ అభిప్రాయపడ్డారు. అసలు సునీతమ్మ తన తండ్రిని చంపిన దస్తగిరి కోసం ఎందుకు ఆరాటపడుతోందో ఆమెకే తెలియాలన్నారు. గతంలో తనను సీబీఐ ఎంక్వైరీకి పిలిచినప్పుడు అన్ని విషయాలు వారికి తెలిపానని, అయినా కూడా వారు తాను చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకోలేదన్నారు. ఎర్రగంగిరెడ్డి నోరువిప్పితే ఈ కేసులో నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి పాత్ర బయటపడుతుందని భరత్‌యాదవ్ స్పష్టంచేశారు. -
వైఎస్ వివేకాను చంపిందెవరు?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగినపుడు ముఖ్యమంత్రి స్థానంలో అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడే ఇప్పుడు అమాయకంగా... హత్య చేసిందెవరు? అని ప్రశ్నిస్తున్నారు. ఇది వారం రోజుల్లో తేల్చాల్సిన కేసు అని చెబుతున్న వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత... హత్య జరిగాక రెండు నెలలపాటు అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడిని ప్రశ్నించనే లేదు. అంతే కాదు.. హత్య చేశానని, తన తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు మరికొందరితో కలిసి వివేకాను తనే గొడ్డలితో నరికానని అంగీకరించిన దస్తగిరి ఇప్పుడు జైలు నుంచి విడుదలై దర్జాగా బయట తిరుగుతున్నాడు. సునీతకు, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి ఆత్మీయుడిగా మారాడు. చంద్రబాబు అనుకూల మీడియాకు వీఐపీ నాయకుడైపోయాడు. వివేకా గుండెపోటుతో చనిపోయారని సునీత బావగారు శివప్రకాశ్రెడ్డితో సహా పలువురికి ఫోన్లు చేసి చెప్పిన నాటి టీడీపీ మంత్రి ఆదినారాయణరెడ్డి.. తర్వాత ఓడిపోవటంతో బీజేపీలోకి ఫిరాయించారు. వీళ్లలో హత్య చేసిన వాళ్లు... చేయించిన వాళ్లు... దాన్ని కప్పిపుచ్చి రాజకీయ ప్రత్యర్థుల్ని ఇరికించడానికి ప్రయత్నిస్తున్న వారు... అంతా ఉన్నారు. అందరూ కలిసి లోతైన కుట్రతో కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డిపై, ఆయన కుటుంబంపై దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు ఈ కుట్రను మరింత లోతుకు తీసుకెళుతున్నారు. కుట్రలో భాగంగానే... చంద్రబాబు అనుకూల తోక పత్రికకు అధిపతిగా వ్యవహరిస్తున్న వ్యక్తి మూడు రోజుల కిందట నర్రెడ్డి సునీతతో సహా చంద్రబాబును కలిశారు. కడప ఎంపీగా సునీతను పోటీకి దింపటంపై అక్కడ చర్చ జరిగింది. చివరకు సునీతను పోటీ చేయించని పక్షంలో ఆమె చేత విస్తృతంగా ప్రచారం చేయించాలనే నిర్ణయానికి వచ్చారు. ప్రచారమంటే... నియోజకవర్గంలో తిరగటం మాత్రమే కాదు. జాతీయ స్థాయిలో మీడియా సమావేశాలు కూడా. అందులో భాగమే ఢిల్లీలో సునీత ప్రెస్ కాన్ఫరెన్స్. దానికి కొనసాగింపే శనివారం ‘హూ కిల్డ్ బాబాయ్’ అంటూ బహిరంగ సభలో చంద్రబాబు ఊగిపోవటం. ఇదంతా ఒక స్కెచ్. సూత్రధారి చంద్రబాబు. పాత్రధారులు సునీత నుంచి దస్తగిరి, బీటెక్ రవి వరకూ ఎందరో!!. వివేకా హత్యతో లాభమెవరికి? జాతీయ, అంతర్జాతీయ నేర పరిశోధన ప్రమాణాలు చెప్పేదొకటే.. ఒక నేరం వల్ల ఎవరికి లాభం ఉంటుందో వారే దోషులు, కుట్రదారులు. అలా చూసినప్పుడు వివేకా హత్యతో లాభమెవరికి? ఆయన్ను అడ్డు తొలగించుకోవాలనుకున్నది ఎవరు? ఈ కోణంలో పరిశీలించినప్పుడు వచ్చే సమాధానాలు రెండే. వివేకా సంపాదించిన ఆస్తులు తమకే దక్కాలని, ఆయన రాజకీయ వారసత్వమూ తమకే ఉండాలని వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి పంతం పట్టారు. కాకపోతే షమీమ్ అనే మహిళను వివేకా రెండో వివాహం చేసుకున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఆమెతో వివేకాకు ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఈ రెండో వివాహంతో వివేకా కుటుంబంలో తీవ్ర విభేదాలు తలెత్తాయి. వివాహాన్ని వివేకా మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు, చిన్న బావమరిది అయిన నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పటి నుంచి సౌభాగ్యమ్మ పులివెందులలో నివాసం ఉండకుండా హైదరాబాద్‌లో ఉన్న కుమార్తె సునీత వద్ద ఉంటున్నారు. సునీత నర్రెడ్డి ? ఆస్తి మొత్తం మాకే దక్కాలి.... వివేకా రెండో వివాహాన్ని ఆయన కుమార్తె సునీత తీవ్రంగా వ్యతిరేకించారు. తన తండ్రి యావదాస్తీ తమకే చెందాలని ఆమె పంతం పట్టారు. కానీ వివేకానందరెడ్డి తన రెండో భార్యకు ఆస్తిలో వాటా ఇస్తానన్నారు. ఓ ఇల్లు ఇచ్చేశారు. హైదరాబాద్‌లోనూ ఒక ఇల్లు కొనుగోలు చేసి తన కుమారుడిని అక్కడే ఉంచి బాగా చదివిస్తానని షమీమ్‌కు మాట ఇచ్చారు. దాన్ని వివేకా మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత తీవ్రంగా వ్యతిరేకించారు. వాగ్వాదానికి దిగారు. అక్కడితో ఆగకుండా కుటుంబానికి చెందిన కంపెనీల్లో ఆయనకున్న చెక్ పవర్‌ను రద్దు చేశారు. షమీమ్‌తో సునీత గొడవ పడ్డారు. పరస్పరం దారుణంగా దూషించుకుంటూ వారిద్దరి మధ్య సాగిన వాట్సాప్ చాటింగ్ వివరాలను కూడా దర్యాప్తు సంస్థలు వెలికి తీశాయి. సౌభాగ్యమ్మ, సునీత మొండి పట్టుదల చూశాక వివేకా కాస్త జాగ్రత్తపడ్డారు. తన ఆస్తిలో షమీమ్‌కు వాటా కల్పిస్తూ వీలునామా రాస్తానన్నారు. అందుకోసం స్టాంపు పేపర్లు కూడా తెప్పించుకున్నారు. అదిగో... అలా స్టాంపు పేపర్లు తెచ్చిన రోజుల వ్యవధిలోనే వివేకా హఠాత్తుగా హత్యకు గురయ్యారు. ఆయన్ను హత్య చేశాక దస్తగిరి సహా హంతకులు ఆ ఇంటిలో ఉన్న బీరువాలో ఏవో స్టాంపు పేపర్లు, రౌండ్ సీల్ కోసం వెతికారని ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగయ్య తన వాంగ్మూలంలో పేర్కొనడం ఇక్కడ ప్రస్తావనార్హం. పైపెచ్చు వివేకా హత్య జరిగిన కొన్ని నెలలకే కుటుంబానికి చెందిన భూములు, ఇతర ఆస్తులన్నింటినీ సునీత తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీన్ని బట్టి హత్య వల్ల ఎవరికి లబ్ధి కలిగిందో తెలుస్తోంది కదా!. మరి హత్య చేయించిందెవరో కనుక్కోవటానికి ఇంతకన్నా ఏం కావాలి? మాటమార్చి... చంద్రబాబు గూటిలోకి తన తండ్రి వివేకా హత్య వెనుక అప్పటి టీడీపీ ప్రభుత్వంలోని మంత్రి ఆదినారాయణ రెడ్డి, అప్పటి టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఉన్నారని సునీత 2019 మార్చిలో చెప్పారు. వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి విజయం కోసం తన తండ్రి చివరి వరకూ కృషి చేశారని కూడా చెప్పారు. 2019 మార్చి 21న హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించి మరీ ఇవన్నీ చెప్పిన సునీత... 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీని అఖండ మెజార్టీతో గెలిపించాలని, వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎంను చేసి తన తండ్రి కోరిక నెరవేర్చాలని ప్రజలను కోరారు. కానీ 2020లో స్థానిక సంస్థల ఎన్నికల తరువాత ఆమె పూర్తిగా ప్లేటు ఫిరాయించారు. సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, బావ శివప్రకాశ్‌రెడ్డి... చంద్రబాబు గుప్పిట్లోకి వెళ్లి టీడీపీ రాజకీయ కుట్రలో భాగస్వాములయ్యారు. చంద్రబాబు? రాజకీయ లబ్ధికి ఇదే అదను.. 2019 మార్చి 15న వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నిజానికి కడప జిల్లాలోను, పులివెందులలోను టీడీపీకి ప్రధాన అడ్డంకి వైఎస్ వివేకా. ఆయన అడ్డు తొలగింది. వైఎస్సార్సీపీ అధిపతి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉండే కడప ఎంపీ అవినాశ్‌రెడ్డిని దీనిలో ఇరికించి దుష్ప్రచారం సాగిస్తే... కడప జిల్లాలో తాము పాగా వేయొచ్చనేది బాబు దురాలోచన. అందుకే... మార్చి 15న వివేకా హత్య విషయం బయటకు వచ్చిన తరవాత బాబు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. తన సొంత మనిషి అయిన అప్పటి రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును రంగంలోకి దింపారు. ఆయన అందరినీ ప్రభావితం చేస్తూ దర్యాప్తును ఆదిలోనే తప్పుదోవ పట్టించారు. నిజానికి ఈ హత్య విషయంలో సునీత లక్ష్యం ఒక్కటే. హత్య వెనుకనున్న తన భర్త, బావగార్ల పేర్లు బయటకు రాకుండా ఉండటం. బాబు లక్ష్యమేమో తన ప్రత్యర్థులను ఇరికించటం. అందుకే ఈ విజాతి ధ్రువాలు రెండూ ఆకర్షించుకుని... ఒకరి లక్ష్యానికి మరొకరు సాయంగా నిలిచారని... రానురాను కుట్రను మరింత లోతుల్లోకి తీసుకెళుతున్నారని ఈ వ్యవహారాన్ని దగ్గర్నుంచి పరిశీలిస్తున్నవారు చెప్పే మాట. ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిలపై సందేహాలు రేకెత్తించేలా పచ్చ మీడియా ద్వారా అభూతకల్పనలతో దుష్ప్రచారం చేయటం... హత్య వెనుక ఉన్న కుట్రదారుల పాత్ర బయటకురాకుండా కేసును సంక్లిష్టంగా మార్చటం... ఇవన్నీ ఇందులో భాగంగానే జరిగిపోయాయి. చంద్రబాబు గ్యాంగ్‌కు కృతజ్ఞతలతో.. మీ సునీత బహుశా... నాలుగేళ్లుగా తాము సాగిస్తున్న కుట్రను మరింత పదునెక్కించాలనుకున్నారో, ఇకపై ముందుకు వెళ్లాలంటే ముసుగు తీయక తప్పదని భావించారో గానీ... సునీత ముసుగు తీశారు. రెండ్రోజుల కిందట ఢిల్లీలో బాబు స్క్రిప్టును చదువుతూ... ఆఖరికి టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభికి కూడా కృతజ్ఞతలు చెప్పారంటే టీడీపీ ఏ స్థాయిలో సునీతకు సహకరించిందో... ఈ కుట్ర ఎంత లోతైనదో తెలియకమానదు. వైఎస్సార్సీపీ టికెట్టుపై గెలిచి... ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని దూషిస్తూ సమాజంలో వర్గవిభేదాలు సృష్టించేందుకు కుట్రపన్నిన ఎంపీ రఘురామకృష్ణరాజు... ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను అత్యంత పరుషపదంతో దూషించిన టీడీపీ నేత పట్టాభి... సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతూ అత్యంత వివాదాస్పదుడిగా మారిన టీడీపీ నేత, పి.గన్నవరం అభ్యర్థి మహాసేన రాజేశ్.. తమ పార్టీ విధానాలతో నిమిత్తం లేకుండా చంద్రబాబు కోసమే పనిచేస్తున్న కాంగ్రెస్ నేత తులసిరెడ్డి, సీపీఐ నారాయణ... బీజేపీలో ఉంటూ బాబు ఎజెండాను అమలు చేస్తున్న సీఎం రమేశ్... బాబు లాయరు సిద్ధార్థ లూథ్రా... నిరపరాధులను హింసించి, వేధించి కేసు దర్యాప్తును పక్కదారి పట్టించిన సీబీఐ అధికారి రామ్‌సింగ్... సీఎం వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో దుష్ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియా... వీళ్లందరికీ సునీత కృతజ్ఞతలు తెలిపారు. అంటే తాను ఆ పచ్చ ముఠాలో సభ్యురాలినేనని విస్పష్టంగా ప్రకటించారు. విశేషమేంటంటే వీళ్లందరిలో ఓ ఉమ్మడి లక్షణం ఉంది. అది... తమ వృత్తులు, పార్టీలకు అతీతంగా చంద్ర బాబు కోసం పనిచేయటం. వైఎస్ జగన్‌ను తీవ్రంగా వ్యతిరేకించటం. అది చాలదూ... సునీత పాత్రను బయటపెట్టడానికి!!. ఇంకా వివేకా ఎవరెవరికి అడ్డంకిగా ఉన్నారు? ఆయన హత్యతో ఏ పాత్ర«ధారికి ఎలాంటి లాభం? ఇవన్నీ ఒకసారి చూద్దాం... ఆదినారాయణ రెడ్డి? గుండెపోటు అని మొదట చెప్పింది ఈయనే... వివేకా గుండెపోటుతో చనిపోయారని మీడియా సాక్షిగా బయటకు చెప్పింది నాటి మంత్రి ఆదినారాయణ రెడ్డి. వివేకా బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి తనకు ఫోన్ చేసి గుండెపోటుతో వివేకా మరణించారని చెప్పారని, సిగరెట్లు ఎక్కువ తాగుతారు కనక అలా జరిగి ఉండొచ్చని తాను కూడా అన్నానని ఆయన స్వయంగా మీడియాకు వెల్లడించారు. అంతేకాదు.. శివప్రకాశ్ రెడ్డి ఇదే విషయాన్ని ఎన్నికల ప్రచారం కోసం వెళుతున్న ఎంపీ అవినాశ్‌రెడ్డికి చెప్పటంతో... ఆయన తన వాహనాన్ని నిలిపేసి, వెనక్కు తిరిగి వివేకా ఇంటికి వచ్చారు. మరి గుండెపోటు అని ప్రచారం చేయాల్సిందిగా శివప్రకాశ్‌రెడ్డికి చెప్పిందెవరు? ఆదినారాయణ రెడ్డికి ఆయనే అడ్డంకి... 2014 ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణ రెడ్డి... టీడీపీకి అమ్ముడుపోయారు. వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా చేయకుండా అనైతికంగా టీడీపీ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. 2019 ఎన్నికల్లో ఆయన్ను కడప ఎంపీ అభ్యర్థిగా చంద్రబాబు నిర్ణయించారు. కానీ ఎంపీగా గెలవటానికి వివేకానందరెడ్డి ప్రధాన అడ్డంకిగా నిలిచారు. జిల్లాపై పూర్తి పట్టున్న వివేకా రంగంలో ఉంటే తాను ఎంపీగా గెలవడం అసాధ్యమని ఆది నారాయణ రెడ్డి గుర్తించారు. ఈ నేపథ్యంలో వివేకా హత్యకు గురయ్యారు. వివేకా హత్య ఆదినారాయణరెడ్డికి రాజకీయంగా ప్రయోజనం కలిగించేదే కదా? నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ? లేఖను దాచి... గుండెపోటని ప్రచారం చేసి వివేకా హత్య కేసు దర్యాప్తు పక్కదారి పట్టించడంలో సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, బావ నర్రెడ్డి శివప్రకాశ్రెడ్డిది కీలకపాత్ర. ఎందుకంటే హత్యకు గురైనప్పుడు వివేకా తన స్వదస్తూరితో రక్తంతో ఓ లేఖను రాశారు. ఆ లేఖను చూసిన ఎవరికైనా... అది మామూలు మరణం కాదని, ముమ్మాటికీ హత్యేనని తెలిసిపోతుంది. అలాంటి లేఖను ఆ రోజు (2019, మార్చి 15) ఉదయం 6.10 గంటలలోపే వివేకా పీఏ కృష్ణారెడ్డి చూశారు. ఆ విషయాన్ని వెంటనే సునీత భర్త రాజశేఖరరెడ్డికి ఫోన్లో చెప్పారు. ‘మేం వచ్చే వరకు ఆ లేఖను గానీ, వివేకా సెల్‌ఫోన్‌ను గానీ ఎవరికీ ఇవ్వవద్దు. పోలీసులకు కూడా చెప్పొద్దు’ అని వారు పీఏ కృష్ణారెడ్డిని ఆదేశించారు. ఆ లేఖను గనక వెంటనే పోలీసులకు ఇవ్వమని వారు చెప్పి ఉంటే... మొత్తం వ్యవహారం మరోలా ఉండేది. వివేకాది హత్య అని తేలిపోయేది. ఎవరూ మృతదేహం వద్దకు వెళ్లేవారు కాదు. పోలీసులు తమ పని తాము చేసేవారు. కానీ లేఖను ఉద్దేశపూర్వకంగా గోప్యంగా ఉంచటంతో... వ్యవహారం మొత్తం వారు ప్లాన్ చేసినట్టే సాగింది. బీటెక్ రవి... ? వివేకా ఉంటే ఇక అంతే.. పులివెందుల నియోజకవర్గంలో కనీసస్థాయిలోనైనా పట్టు సాధించాలన్నది టీడీపీ నేత బీటెక్ రవి లక్ష్యం. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో 2019 ఎన్నికల్లో యథేచ్చగా అక్రమాలు సాగించవచ్చనేది ఆయన పన్నాగం. కానీ వివేకా వైఎస్సార్సీపీకి పెద్దదిక్కుగా నిలబడటంతో బీటెక్ రవి ఆటలు సాగలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను దొంగదెబ్బ తీసిన బీటెక్ రవికి పులివెందుల అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కకుండా చేయాలని వివేకా పంతం పట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయన హత్యకు గురయ్యారు. హత్యకు ముందు రోజు కొమ్మారెడ్డి పరమేశ్వర రెడ్డి(ఈయనకు వివేకాతో ఆర్థిక విభేదాలు తలెత్తాయి)తో బీటెక్ రవి రెండుసార్లు సమావేశమయ్యారు. ఈ భేటీలో పాల్గొన్న శ్రీనివాసరెడ్డి తర్వాత కొద్ది రోజులకే అనుమానాస్పద రీతిలో మృతి చెందారు కూడా. సిట్ దర్యాప్తులో నార్కో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినా పరమేశ్వరరెడ్డి తిరస్కరించడం సందేహాలకు తావిచ్చేదే. రామ్‌సింగ్? చంద్రబాబు చేతిలో పావు... వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు ఎంతటి సిద్ధహస్తుడో వివేకా కేసులో సీబీఐ తీరే నిరూపిస్తోంది. వాస్తవానికి ఈ కేసులో నిశితమైన దర్యాప్తు జరిగి దోషులు బయటపడాలని మొదటి నుంచీ భావిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి... కేసును సీబీఐ దర్యాప్తు కోసం అప్పగించాలని సునీత కోరగానే సరేనన్నారు. సీబీఐకి అప్పగించారు. కాకపోతే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోగానే ముందస్తు కుట్రతో బీజేపీలోకి పంపిన తన మనుషులు సీఎం రమేశ్, సుజనా చౌదరి ద్వారా చంద్రబాబు చక్రం తిప్పటం మొదలెట్టారు. సీబీఐ దర్యాప్తు అధికారిగా నియమితుడైన రామ్‌సింగ్ వివాదాస్పద వ్యవహార శైలే అందుకు తార్కాణం. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాల్సిన ఆయన ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చేసినట్టుగా ఎంపీ అవినాశ్ రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డిలను లక్ష్యంగా చేసుకుని కేసును పక్కదారి పట్టించారు. దస్తగిరిని ఢిల్లీకి తీసుకువెళ్లి బెదిరించి... ప్రలోభాలకు గురిచేసి అప్రూవర్‌గా మార్చారు. తాము అనుకున్నది అతని అప్రూవర్ వాంగ్మూలంగా నమోదు చేశారు. పీఏ కృష్ణారెడ్డిని, మరికొందర్ని ఢిల్లీకి తీసుకువెళ్లి తీవ్ర చిత్రహింసలు పెట్టారు. తాను చెప్పిందే చెప్పాలని వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. వైఎస్సార్ జిల్లాలో పలువురిని అక్రమంగా నిర్బంధించి చిత్ర హింసలకు గురి చేయడంతో వారి కుటుంబాలు బెంబేలెత్తిపోయాయి. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు రామ్‌సింగ్ స్వయంగా అసత్య ఆరోపణలు చేశారు. కడపలో తాను కార్లో వెళ్తుంటే ఆగంతకులు వచ్చి హత్య చేస్తానని బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించగా ఆయన కారుపై ఎలాంటి దాడి జరగలేదని... ఎవరూ బెదిరించలేదని నిర్ధారణ అయ్యింది. అనేక ఫిర్యాదులు రావటంతో ఇంతటి వివాదాస్పదుడైన రామ్సింగ్ను న్యాయస్థానం ఆదేశాలతో కేంద్ర హోమ్ శాఖ ఈ కేసు దర్యాప్తు నుంచి తప్పించింది. నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి? రాజకీయ వారసత్వం మాకే దక్కాలి.. వివేకానందరెడ్డి రాజకీయ వారసత్వంపై ఆయన అల్లుడు, చిన బావమరిది నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి కన్నేశారు. ఆయన తరువాత రాజకీయ వారసత్వంగా తమకే పదవులు దక్కాలని భావించారు. కానీ వివేకానందరెడ్డి తన రెండో భార్య షమీమ్‌తో తనకు కలిగిన కుమారుడిని రాజకీయ వారసుడిగా ప్రకటించాలని నిర్ణయించారు. దాంతో రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి కంగుతిన్నారు. షమీమ్ ఇంటికి వెళ్లి ఆమెను తీవ్రంగా హెచ్చరించారు. ఆమె కుమారుడిని కిడ్నాప్ చేస్తామని కూడా బెదిరించారు. వారిద్దరికి భయపడి ఆమె పులివెందుల నుంచి హైదరాబాద్ వెళ్లిపోయి ఓ అజ్ఞాత ప్రదేశంలో ఉండేవారు. అంటే వివేకానందరెడ్డి రాజకీయ వారసత్వం తమకే దక్కాలని నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడ్డారన్నది సుస్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే వివేకానందరెడ్డి 2019 ఎన్నికల ముందు హత్యకు గురయ్యారు. దస్తగిరి? హత్య చేసి... హైడ్రామా తండ్రిని చంపినవారిపై ఎవరికైనా కోపం, కక్ష ఉంటాయి. కానీ వివేకానందరెడ్డిని ఎంత పాశవికంగా హత్య చేసిందీ వెల్లడించిన దస్తగిరితో వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి అత్యంత సన్నిహితంగా ఉండటం విస్మయం కలిగించేదే. వివేకాను హత్య చేసిన నలుగురిలో దస్తగిరి ఉన్నారన్నది నిర్ధారణ అయ్యింది. కానీ అదే దస్తగిరిని అప్రూవర్‌గా మార్చి ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డిపై నిరాధారణ ఆరోపణలు చేయిస్తున్నారంటే... వెనుక ఎవరున్నారన్నది కీలకం. చంద్రబాబు, ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి, సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి...ఇలా అందరూ దస్తగిరికి బహిరంగంగానే సహకరిస్తున్నారు. వివేకా హత్యకు ముందు రూ.500 కు కూడా అప్పులు చేసిన దస్తగిరి ప్రస్తుతం ఓ కాన్వాయ్‌తో కూడిన బొలేరో వాహనాలను కొనుగోలు చేసి దర్జాగా తిరుగుతున్నారు. ఇక దస్తగిరి చేస్తున్న దుష్ప్రచారాన్ని పదే పదే టీడీపీ అనుకూల మీడియా ప్రసారం చేస్తోంది. ఆయన ఇంటర్వ్యూలు ప్రసారం చేస్తోంది. అంటే దస్తగిరి ఇష్టానుసారంగా చెబుతున్న కట్టుకథలు, చేస్తున్న అసత్య ఆరోపణల వెనుక చంద్రబాబు ముఠా, సునీత కుటుంబమే ఉందన్నది స్పష్టమవుతోంది కదా!. సెల్ఫోన్లో డేటా డిలీట్ చేశారెందుకు? ఆ రోజు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పులివెందుల చేరుకున్న సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డికి వివేకా రాసిన లేఖను, సెల్‌ఫోన్‌ను కృష్ణారెడ్డి అందజేశారు. వారు ఆ సెల్‌ఫోన్‌లోని డేటాను డిలీట్ చేశారు. సునీత ఆదేశాలతో సాయంత్రం 5 గంటలకు కృష్ణారెడ్డి ఆ లేఖను, సెల్‌ఫోన్‌ను పోలీసులకు ఇచ్చారు. ‘‘ఆ రోజు ఉదయం పీఏ కృష్ణా రెడ్డి ఫోన్ చేసి గాయాలతో వివేకా బాత్రూమ్లో పడి ఉన్నారని చెప్పారు. మా నాన్నకు గతంలో కూడా గుండె సమస్య ఉన్నందున బాత్రూమ్లో పడి తలకు బలమైన గాయం అయి ఉండొచ్చని భావించా. అందుకే పోలీసులకు అలాగే ఫిర్యాదు చేయమని కృష్ణారెడ్డితో చెప్పా’’ అని సిట్ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో సునీత పేర్కొన్నారు. లేఖను చూశాకైనా... వివేకా మృతదేహాన్ని చూశాకైనా ఒక డాక్టరైన సునీతకు ఎలాంటి అనుమానమూ రాలేదంటే ఏమనుకోవాలి? ఉద్దేశపూర్వకంగా నిజాలు దాటిపెట్టారని భావించనవసరం లేదా? తండ్రిని ఓడించినా... సునీతకు ఇష్టులే వివేకానందరెడ్డిని 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే చంద్రబాబు దొంగదెబ్బ తీసి ఓడించారు. 2017లో వైఎస్సార్ జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా వైఎస్ వివేకాను పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎంపిక చేశారు. జిల్లాలో మెజార్టీ ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు వైఎస్సార్సీపీ వారే కావడంతో ఆయన గెలుపు నల్లేరుపై నడకేనని భావించారు. వివేకా ఎమ్మెల్సీగా ఎన్నికైతే జిల్లాలో టీడీపీకి ఉనికే ఉండదని చంద్రబాబు భావించారు. అందుకే వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను ప్రలోభాలకు గురి చేసి వివేకాను కుట్రతో ఓడించారు. అక్రమాలకు పాల్పడి బీటెక్ రవి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ కుట్రలో చంద్రబాబు, ఆయన ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డి సర్వంతామై వ్యవహరించారు. కానీ ఆ ముగ్గురూ సునీతకు, ఆమె భర్త, బావగారికిçప్పుడు అత్యంత సన్నిహితులైపోవటమే విచిత్రం. – సాక్షి, అమరావతి -
రూ.8 లక్షల విలువైన గంజాయి పట్టివేత
ఆనందపురం (విశాఖ జిల్లా): కంటెయినర్లో తరలిస్తున్న రూ.8 లక్షల విలువైన గంజాయిని ఆనందపురం పోలీసులు పట్టుకున్నారు. డీసీపీ–1 విజయ్ మణికంఠ ఆదివారం ఆనందపురం పోలీస్ స్టేషన్లో మీడియాకు వివరాలు వెల్లడించారు. జేసీపీ స్పేర్ పార్టుల లోడుతో హరియాణ వెళ్లడానికి బయలుదేరిన కంటెయినర్లో గంజాయి రవాణా జరుగుతోందని శ్రీకాకుళం పోలీసులకు సమాచారం అందించింది. అక్కడ చెక్ పోస్టు వద్ద కంటెయినర్‌ను ఆపి తనిఖీ చేస్తుండగా అక్కడ సిబ్బందిని, డివైడర్‌ను ఢీకొట్టి కంటైనర్‌ను ముందుకు దూసుకెళ్లింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు విజయనగరం, విశాఖ పరిధిలోని అన్ని చెక్ పోస్టులకు సమాచారమిచ్చారు. ఈ మేరకు ఆనందపురం పోలీసులు భీమిలి క్రాస్ రోడ్డు వద్ద కంటెయినర్‌ను ఆపేందుకు యత్ని0చగా.. కంటైనర్‌ను ఆపకుండా ముందుకు పోనిచ్చారు. పోలీసు సిబ్బంది మోటార్ బైక్‌ల సాయంతో సినీ ఫక్కీలో వెంబడించి బోయిపాలెం సమీపంలో కంటెయినర్‌ను నిలువరించారు. ఈ లోగా కంటెయినర్లో ఉన్న వారు పరారయ్యారు. సీఐ టీవీ తిరుపతిరావు కంటెయినర్ తాళాలను పగలుగొట్టి లోపల పరిశీలించారు. అందులో స్పేర్ పార్టులతో పాటు 13 గంజాయి బ్యాగ్‌లు బయటపడ్డాయి. దీంతో కంటెయినర్‌ను ఆనందపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. డీసీపీ–1 విజయ్ మణికంఠ, ఏసీపీ(నార్త్) సునీల్‌లు కంటెయినర్‌ను పరిశీలించి 13 బ్యాగ్‌లలో ఉన్న 80 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న 386 కిలోల గంజాయి విలువ రూ.8 లక్షలుగా తేల్చారు. గంజాయిని ఒడిశాలో లోడు చేసినట్టు సమాచారం ఉందని, నిందితులను త్వరలో పట్టుకుంటామని డీసీపీ విజయ్ మణికంఠ చెప్పారు. -
మహాబలిపురం బీచ్‌లో తెలుగు విద్యార్థుల గల్లంతు
చిత్తూరు, సాక్షి: తమిళనాడు మహాబలిపురం బీచ్ వద్ద ఆందోళనకర వాతావరణం నెలకొంది. ముగ్గురు తెలుగు విద్యార్థులు సముద్రంలో గల్లంతు అయ్యారు. దీంతో గజ ఈతగాళ్లు రంగంలోకి దిగారు. ఈ ముగ్గురూ చిత్తూరు జిల్లా పలమనేరు ప్రభుత్వ కాలేజ్‌లో చదివే విద్యార్థులుగా తెలుస్తోంది. కాలేజీ తరఫున తమిళనాడు టూర్‌కి వెళ్లింది 18 మంది విద్యార్థుల బృందం. సరదాగా ఈత కోసం సముద్రంలో దిగారు విద్యార్థులు. ఇందులో మౌనిష్, విజయ్, ప్రభు అనే ముగ్గురు ఒక్కసారిగా గల్లంతైనట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. గల్లంతైన విద్యార్థుల ఆచూకీ కోసం గజ ఈతగాళ్లు ప్రయత్నిస్తున్నారు. ఈ ముగ్గురి స్వస్థలాలు.. మౌనిష్-బంగారుపాలెం, విజయ్- సదుం, ప్రభు-పులిచెర్ల గ్రామంగా తెలుస్తోంది. విద్యార్థుల గల్లంతు సమాచారంతో తల్లిదండ్రుల్లో..బంధువుల్లో ఆందోళన నెలకొంది. -
ఏసీబీకి చిక్కిన పెదకాకాని ఏఈ
నగరంపాలెం: మంజూరైన బిల్లులను ప్రాసెస్ చేసేందుకు లంచం తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కారు. ఏసీబీ ఏఎస్పీ మహేంద్ర మత్తే మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా పెదకాకాని పంచాయతీ పరిధిలో సమ్మర్ స్టోరేజీ (ఎస్ఎస్) ట్యాంకర్‌కు సంబంధించి మంచినీటి చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, ఫెన్సింగ్ పనులను గుంటూరు రూరల్ మండల పరిధిలోని నల్లపాడు గ్రామానికి చెందిన శ్యామల రవికిషోర్‌రెడ్డి అనే కాంట్రాక్టర్ పూర్తి చేశారు. అందుకుగాను మూడు బిల్లుల్లోనూ దాదాపు రూ.42 లక్షలు మంజూరయ్యాయి. అయితే మంజూరైన బిల్లులను ప్రాసెస్ చేసేందుకు రూరల్ వాటర్ సప్లయి/శానిటేషన్ గుంటూరు డివిజన్ పరిధిలోని పెదకాకాని ఏఈ పి.శివరామకృష్ణ కాంట్రాక్టర్ రవికిషోర్‌రెడ్డిని లంచం డిమాండ్ చేశారు. రూ.42 లక్షల బిల్లులకు నాలుగు శాతం చొప్పున రూ.1.68 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో కాంట్రాక్టర్ రవికిషోర్‌రెడ్డి టోల్‌ఫ్రీ నంబర్ 14400ను సంప్రదించారు. ఏసీబీ వారి సూచనల మేరకు నగదు ఇవ్వడానికి రవికిషోర్‌రెడ్డి ఒప్పకున్నాడు. దీంతో శుక్రవారం సాయంత్రం జెడ్పీ ప్రాంగణంలో ఉన్న పీఆర్ (ఆర్డబ్ల్యూఎస్) డివిజన్ కార్యాలయం వద్దకు రావాలని కాంట్రాక్టర్‌కు ఏఈ శివరామకృష్ణ సూచించారు. దీంతో అక్కడకు వెళ్లిన కాంట్రాక్టర్ నుంచి రూ.1.68 లక్షల లంచం తీసుకుంటున్న శివరామకృష్ణను గుంటూరు ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పలకలూర్‌రోడ్‌లోని ఏఈ నివాసంలో తనిఖీలు నిర్వహించనున్నారు. ఈ దాడిలో డీఎస్పీలు టీవీవీ ప్రతాప్ కుమార్, ఎన్.సత్యానందం, సీఐలు రవిబాబు, నాగరాజు, అంజిబాబు, సురేష్ బాబు, నరసింహా రెడ్డి, ఎస్ఐ మూర్తి పాల్గొన్నారు. -
AP: ప్రత్తిపాటి కుమారుడికి రిమాండ్.. జైలుకు తరలింపు
సాక్షి,ఎన్టీఆర్ జిల్లా : జీఎస్టీ ఎగవేత ఆరోపణలపై అరెస్టయిన మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు శరత్‌ను శుక్రవారం తెల్లవారుజామున విజయవాడ సబ్ జైలుకు తరలించారు. గురువారం రాత్రి అరెస్టు అనంతరం శరత్‌ను పోలీసులు విజయవాడలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. శరత్ రిమాండ్ పై రెండు గంటలపాటు వాదనలు కొనసాగాయి. ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి శరత్‌కు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. శరత్ తరపున ఆయన న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇదే తరహా కేసు తెలంగాణలో కూడా నమోదు చేసినట్లు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఒకే తరహా నేరంపై రెండు ఎఫ్.ఐ.ఆర్ లు పెట్టడం నిబంధనలకు విరుద్దమని తెలిపారు. కాగా, జీఎస్టీ ఎగవేత కేసులో గురువారం రాత్రి శరత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మాచవరం పోలీసుస్టేషన్లో శరత్‌పై కేసు నమోదు అయింది. ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. నిధులు మళ్లించి పన్ను ఎగవేసారనే ఆరోపణలపై శరత్‌తో సహా మొత్తం ఏడుగురుపై పోలీలు కేసు నమోదుచేశారు. వీరిలో పుల్లారావు భార్య, బావమరిది ఉన్నారు. ఇదీ చదవండి.. అమరావతిలో ప్రత్తిపాటి దోపిడీ -
అమరావతిలో ‘ప్రత్తిపాటి’ దోపిడీ
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతిలో జరిగిన కుంభకోణాల్లో మరో భారీ అవినీతి బయటపడింది. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం రాజధానిలో మౌలిక సదుపాయాల కాంట్రాక్టుల పేరిట రూ.66.03 కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్లు వెల్లడైంది. ప్రత్తిపాటి కుటుంబానికి చెందిన అవెక్సా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టుల పేరుతో బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి నిధులు కొల్లగొట్టి.. షెల్‌కంపెనీల ద్వారా దారి మళ్లించినట్టు ఆధారాలతోసహా బట్టబయలైంది. కేంద్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ), రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (ఏపీ డీఆర్ఐ) సోదాల్లో ఈ వ్యవహారం మొత్తం బయటకొచ్చింది. ఈ కంపెనీ కేంద్ర జీఎస్టీ విభాగాన్ని బురిడీ కొట్టించడంతోపాటు రాష్ట్ర ఖజానాకు గండి కొట్టి యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడినట్లు తేటతెల్లమైంది. దీంతో డీఆర్ఐ ఫిర్యాదు మేరకు విజయవాడ పోలీసులు కేసు నమోదు చేసి అవెక్సా కార్పొరేషన్ డైరెక్టర్‌గా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను గురువారం అరెస్టు చేశారు. ఆయనతోపాటు మరో ఆరుగురిపై ఐపీసీ సెక్షన్లు 420, 409, 467, 471, 477(ఎ), 120 (బి) రెడ్‌విత్ 34 కింద కేసు నమోదు చేశారు. ఆయన్ని న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. తీగ లాగితే కదిలిన డొంక ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబానికి చెందిన అవెక్సా కార్పొరేషన్‌కు హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయం, నెల్లూరు, విజయనగరం జిల్లా మానాపురంలలో బ్రాంచి కార్యాలయాలున్నాయి. ప్రత్తిపాటి పుల్లారావు భార్య తేనే వెంకాయమ్మ డైరెక్టర్‌గా, ఆయన కుమారుడు ప్రత్తిపాటి శరత్ అదనపు డైరెక్టర్‌గా ఉన్నారు. ఆ కంపెనీకి టీడీపీ ప్రభుత్వం అడ్డగోలుగా కాంట్రాక్టులు కట్టబెట్టింది. వాటి పనులు చేయకపోయినప్పటికీ, చేసినట్లు గా బోగస్ ఇన్వాయిస్లు సమర్పించిన అవెక్సా కంపెనీ బిల్లులు డ్రా చేసుకోవడంతోపాటు జీఎస్టీ విభాగం నుంచి అడ్డగోలుగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ని కూడా పొందింది. దేశవ్యాప్తంగా అక్రమంగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందిన కంపెనీలపై డీజీజీఐ విచారణ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అవెక్సా కంపెనీ అక్రమంగా ఐటీసీ పొందిందని వెల్లడి కావడంతో ఆ కంపెనీకి డీజీజీఐ రూ.16 కోట్ల జరిమానా విధిస్తూ షోకాజ్ కమ్ డిమాండ్ నోటీసు జారీ చేయాలని ప్రతిపాదించింది. అసలు అవెక్సా కార్పొరేషన్ వ్యవహారాలు, కాంట్రాక్టులు, బిల్లుల చెల్లింపులపై డీజీజీఐ, ఏపీ డీఆర్ఐ దృష్టిసారించాయి. ఆ కంపెనీ కార్యాలయాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించడంతో మొత్తం బాగోతం బట్టబయలైంది. షెల్ కంపెనీలను సబ్ కాంట్రాక్టర్లుగా చూపించి రూ.21.93 కోట్లు అవెక్సా కార్పొరేషన్ ముసుగులో ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం ప్రజాధనాన్ని ఎలా కొల్లగొట్టిందీ అధికారుల విచారణలో వెలుగులోకి వచ్చింది. 2017 నుంచి అవెక్సా కార్పొరేషన్ పేరుతో ప్రత్తిపాటి కుటుంబం అమరావతిలో కాంట్రాక్డు సంస్థలను బెదిరించి సబ్ కాంట్రాక్టులు తీసుకుంది. పనులు చేయకుండానే అక్రమంగా నిధులు కొల్లగొట్టింది. జాక్సన్ ఎమినెన్స్ (ప్రస్తుత పేరు జైశ్నవి ఎమినెన్స్) అనే కంపెనీ అమరావతిలో మౌలిక సదుపాయాల కాంట్రాక్టును పొందింది. ఆ కంపెనీ నుంచి రూ.37.39 కోట్ల విలువైన పనులను అవెక్సా కార్పొరేషన్ సబ్ కాంట్రాక్టుకు తీసుకుంది. సీఆర్డీయే పరిధిలో రోడ్లు, వరదనీటి కాలువలు, కల్వర్టులు, సివరేజ్ పనులు, వాకింగ్ ట్రాక్‌లు, పచ్చదనం తదితర పనులు అవెక్సా కార్పొరేషన్ చేయాల్సి ఉంది. అయితే, ఈ సంస్థ తానిషా ఇన్ఫ్రా, రాలాన్ ప్రోజెక్ట్స్, అనయి ఇన్ఫ్రా అల్వేజ్ టౌన్ ప్లానర్స్ అనే నాలుగు కంపెనీలకు రూ.21.93 కోట్లకు సబ్ కాంట్రాక్టుకు ఇచ్చినట్టు చూపించింది. ఆ సబ్ కాంట్రాక్టుల ముసుగులోనే అవెక్సా కంపెనీ ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్లు డీఆర్ఐ సోదాల్లో వెల్లడైంది. సబ్ కాంట్రాక్టుకు ఇచ్చామని చెప్పిన నాలుగు కంపెనీల నుంచి బోగస్ ఇన్వాయిస్లు, బిల్లులు పొంది ఆ మేరకు పనులు చేసినట్టుగా కనికట్టు చేసింది. ప్రభుత్వ ఖజానా నుంచి బిల్లుల సొమ్ము పొందింది. కేంద్ర జీఎస్టీ నుంచి అక్రమంగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను కూడా తీసుకుంది. వాస్తవానికి సబ్ కాంట్రాక్టు సంస్థల నుంచి అవెక్సా కంపెనీ ఎలాంటి సేవలూ పొందలేదు. అవి ఏ పనులూ చేయలేదు. ఆ నాలుగు కంపెనీలూ షెల్ కంపెనీలే. వాటి పేరుతో మొత్తం రూ.21,93,08,317 నిధులను ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం అక్రమంగా తరలించింది. రహదారి కాంట్రాక్టుల ముసుగులో రూ.26.25 కోట్లు దోపిడీ అంతటితో అవెక్సా కంపెనీ అక్రమాలు ఆగలేదు. అమరావతిలోని ఉద్దండరాయపురం నుంచి నిడమర్రు వరకు ఎన్ 9 రోడ్డు నిర్మాణ కాంట్రాక్టును బీఎస్ఆర్ ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్ కంపెనీ నుంచి సబ్ కాంట్రాక్టుకు తీసుకుంది. కానీ ఎలాంటి రోడ్డు పనులు చేయకుండానే అక్రమంగా బిల్లులు సమర్పించి ప్రజాధనాన్ని సొంత ఖాతాలోకి మళ్లించుకుంది. రహదారి నిర్మాణం కోసం మెటీరియల్ కొనుగోలు చేసినట్టు, వివిధ వృత్తి నిపుణుల సేవలు పొందినట్టు బీఎస్ఆర్ కంపెనీ పేరిట బోగస్ బిల్లులు సమర్పించి కనికట్టు చేసింది. అందుకోసం క్వాహిష్ మార్కెటింగ్ లిమిటెడ్, నోయిడా ఎస్పాత్ లిమిటెడ్, ప్రశాంత్ ఇండస్ట్రీస్, గోల్డ్ ఫినెక్స్ ఐరన్ – స్టీల్ కంపెనీల నుంచి మెటీరియల్ కొనుగోలు చేసినట్టు బోగస్ బిల్లులు సమర్పించింది. ఆ విధంగా ఏ పనీ చేయకుండానే వివిధ దశల్లో రూ.26,25,19,393 దోపిడీ చేసింది. గృహ నిర్మాణ ప్రాజెక్టుల పేరిట అక్రమంగా రూ.17.85 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పేదల గృహ నిర్మాణ ప్రాజెక్టులోనూ అవెక్సా కంపెనీ అడ్డగోలుగా నిధులు కొల్లగొట్టింది. ఏపీ టిడ్కో కింద జి+3 గృహ నిర్మాణ ప్రాజెక్టు, విశాఖపట్నంలో హుద్‌హుద్ తుపాను బాధితులకు 800 గృహాల నిర్మాణ ప్రాజెక్టు, మిడ్ పెన్నార్ ప్రాజెక్టు ఆధునీకరణ సబ్ కాంట్రాక్టులు పొందింది. ఆ ప్రాజెక్టుల బిల్లుల కింద బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి ప్రభుత్వ ఖజానా నుంచి సొమ్ము పొందింది. ఈమేరకు ఆధ్యా ఎంటర్‌ప్రైజస్, మెస్సెర్స్ సంజయ్ కుమార్ భాటియా, తనిష్క్ స్టీల్ లిమిటెడ్, మౌంట్ బిజినెస్ బిల్డ్ లిమిటెడ్ కంపెనీల నుంచి మెటీరియల్ కొన్నట్లు బోగస్ ఇన్వాయిస్లు, బిల్లులు సమర్పించింది. ఆ పేరుతో ఏకంగా రూ.17,85,61,864 ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను పొందింది. ఈ విధంగా అవెక్సా కార్పొరేషన్ కంపెనీ ద్వారా ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం మొత్తం రూ.66,03,89,574 ప్రజాధనాన్ని కొల్లగొట్టింది. అవును ...భోగస్ బిల్లులతో నిధులు కొల్లగొట్టాం – అవెక్సా కంపెనీ డైరెక్టర్ కుర్ర జగదీశ్వరరావు ఈ వ్యవహారంపై డీజీజీఐ, ఏపీ డీఆర్ఐ విచారణలో మొత్తం లోగుట్టు బట్టబయలైంది. అవెక్సా కంపెనీ డైరెక్టర్‌గా ఉన్న కుర్ర జగదీశ్ తాము బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి అక్రమంగా బిల్లులు డ్రా చేసుకున్నామని అంగీకరించారు. ఈ కుంభకోణానికి ఎలా పాల్పడిందీ ఆయన సవివరంగా వెల్లడించారు. దాంతో అవెక్సా కంపెనీ ముసుగులో ప్రత్తిపాటి కుటుంబం అవినీతి బాగోతం ఆధారాలతోసహా బట్టబయలైంది. తనయుడి కోసం తండ్రి పుల్లారావు చక్కర్లు విజయవాడ స్పోర్ట్స్/గుణదల (విజయవాడ తూర్పు): అమరావతి పనుల కుంభకోణంలో దొరికిపోయిన ప్రత్తిపాటి శరత్ కోసం అతని తండ్రి, టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి పత్త్రిపాటి పుల్లారావు విజయవాడలో చక్కర్లు కొట్టారు. డీఆర్ఐ ఫిర్యాదుపై శరత్‌ను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్, సీసీఎస్ పోలీసులు అత్యంత గోప్యంగా విచారణ చేపట్టారు. దీంతో శరత్ జాడ కోసం అతని తండ్రి పుల్లారావు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, ఇతర టీడీపీ నాయకులను వెంటేసుకుని పోలీస్ స్టేషన్ల చుట్టూ ప్రదక్షణలు చేశారు. ముందుగా గురునానక్ కాలనీలోని ఏసీపీ కార్యాలయానికి, అక్కడ లేకపోవడంతో మాచవరం పోలీస్ స్టేషన్‌కు, ఆ తర్వాత టాస్‌్కఫోర్స్ కార్యాలయానికి వెళ్లారు. సాయంత్రం తన అనుచరులను నగరం నలుదిక్కులకు పంపారు. ఆ తరువాత సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో విచారణ జరుగుతోందని తెలుసుకుని అక్కడకు చేరుకున్నారు. అక్కడా లేకపోవడంతో టీడీపీ కార్యాలయానికి వచ్చారు. రాత్రి 8.30 గంటల సమయంలో పుల్లారావు, పట్టాభి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తదితరులతో కలిసి పోలీసు కమిషనరేట్‌కు చేరుకొని తన కొడుకును చూపించాలంటూ ఆందోళనకు దిగారు. కొద్ది సేపటి తరువాత రూరల్ డీసీపీ కె.శ్రీనివాసరావు వచ్చి ఓ గంటలో న్యాయమూర్తి వద్ద నిందితుడు శరత్‌ను ప్రవేశపెడతామని చెప్పడంతో ఆందోళన విరమించి మాచవరంలోని జడ్జి క్వార్టర్స్‌కు వెళ్లారు. -
చందాదారుల ఆస్తులు కొల్లగొడుతున్న గజదొంగ రామోజీ
సాక్షి, అమరావతి: ‘మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఓ బందిపోటు సంస్థ. పేదలు, మధ్య తరగతివర్గాల ఆస్తులు కొల్లగొడుతున్న గజదొంగ రామోజీరావు’ అని మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితుల సంఘం ధ్వజమెత్తింది. ‘ష్యూరిటీలు ఇచ్చినా కొర్రీలు వేస్తోంది. చిట్టీల ఉచ్చులో బిగించి మా ఆస్తులు కొల్లగొడుతోంది. ప్రైజ్‌మనీ ఇవ్వకుండా మా అనుమతి లేకుండానే రశీదు డిపాజిట్లుగా అట్టిపెట్టుకుంటోంది. గట్టిగా అడిగితే లక్షల్లో చిట్టీలు కడితే వందలు చేతిలో పెడుతోంది’ అని దుయ్యబట్టింది. ‘మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలను ఇక సహించేది లేదు. సంఘటితంగా పోరాడతాం. సీఐడీ దర్యాప్తునకు సహకరిస్తాం. రాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటాం. రామోజీరావు అక్రమాలపై ఉమ్మడిగా న్యాయ పోరాటం చేస్తాం’ అని స్పష్టం చేసింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలకు వ్యతిరేకంగా బాధితులు బుధవారం విజయవాడలో సంఘటితమయ్యారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ఈ సమావేశానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో చందాదారులు తరలివచ్చారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో చిట్టీ కట్టి మోసపోయిన విధానం, తాము పడుతున్న ఇబ్బందులు, పోగొట్టుకున్న ఆస్తులను ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితుల సంఘం అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ పేదలు, మధ్యతరగతివర్గాల ఆదాయ వనరులను పరిగణనలోకి తీసుకోకుండా తలకు మించి చిట్టీలు కట్టిస్తూ రామోజీరావు వారిని చిట్టీల ఊబిలోకి నెట్టివేసి, వారి ఆస్తులు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. నిబంధనల ప్రకారం ష్యూరిటీలు సమ ర్పించినవారికి కూడా చిట్టీ ప్రైజ్‌మనీ ఇవ్వకుండా అక్రమ డిపాజిట్లుగా మళ్లిస్తున్నారన్నారు. రామోజీరావు అక్రమాలతో సామాన్యులు ఆస్తులు కూడా అమ్ముకుంటున్నారని, అయినా అప్పులు తీరక మానసిక క్షోభ అనుభవిస్తున్నారని తెలిపారు. విజయవాడలో ఓ ట్యాక్సీ డ్రైవర్‌తో రూ.20 లక్షల చిట్టీ కట్టించి వేధిస్తున్నారన్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ గూండాలు ఇంటిపైకి వచ్చి వేధింపులకు గురిచేయడంతో కర్నూలులో ఒకరు తీవ్ర మానసిక క్షోభతో పక్షవాతం బారిన పడ్డారని తెలిపారు. రామోజీరావు ఉద్దేశపూర్వకంగానే పేద, మధ్య తరగతి వర్గాల వారిని ఒక చిట్టీతో మొదలుపెట్టి అయిదు.., పది.., ఇరవై వరకు చిట్టీల్లో సభ్యులుగా చే ర్పించి వారు అప్పులు, వాయిదాల ఉచ్చు నుంచి బయటకు రాలేని దుస్థితి కల్పిస్తున్నారని వివరించారు. ఒక చిట్టీ ప్రైజ్‌మనీని మరో చిట్టీలోకి సర్దుబాటు చేస్తూ చందాదారులకు చేతికి మాత్రం చిల్లిగవ్వ ఇవ్వడంలేదని తెలిపారు. చందాదారులందరినీ సంఘటితం చేసేందుకే ఈ సంఘం మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారులు కొన్ని వేల మంది ఉన్నారని, వారందరినీ సంఘటితం చేసేందుకు ఈ సంఘాన్ని ఏర్పాటు చేశామని శ్రీనివాస్ చెప్పారు. కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టంలోని సెక్షన్ 22, 66 ప్రకారం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బాధితులకు న్యాయం చేసేందుకు సమష్టిగా పోరాడతామన్నారు. అందుకు సీఐడీ, రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తున్నాయని చెప్పారు. కాల్‌మనీ రాకెట్‌ను తలదన్నేలా రామోజీ అక్రమాలు సంఘం ఉపాధ్యక్షుడు సాంబశివరావు మాట్లాడుతూ కాల్‌మనీ రాకెట్‌ను తలదన్నే రీతిలో రామోజీరావు అరాచకాలకు పాల్పడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. చందాదారుల సంతకాలను కూడా ఫోర్జరీ చేసి ఎన్నో చిట్టీ గ్రూపుల్లో సభ్యులుగా చేర్పిస్తూ వారిని శాశ్వతంగా రుణగ్రస్తులుగా ఉండేట్టు కుట్ర పన్నుతున్నారన్నారు. తమ కుటుంబం రెండు చిట్టీలతో మొదలు పెడితే.. తరువాత ఏకంగా 40 చిట్టీల వరకు చేర్చించి మోసం చేశారన్నారు. రూ.80 లక్షల చిట్టీ పాట పాడితే రూ.215 మాత్రమే ఇచ్చారని, రూ.40 లక్షలు, రూ.20 లక్షలు, రూ.10 లక్షలు చిట్టీలు పాడినా ఒక్క దానికి కూడా రూ.200కు మించి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర చిట్‌ఫండ్ చట్టం చందాదారులకు కల్పిస్తున్న రక్షణ పట్ల చాలామందికి అవగాహన లేకపోవడాన్ని రామోజీరావు తన దుర్మార్గాలకు అనుకూలంగా మలచుకుంటున్నారని అన్నారు. అందుకే చందాదారుల్లో చైతన్యం తీసుకొచ్చి మార్గదర్శి చిట్‌ఫండ్స్ దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఈ సంఘాన్ని ఏర్పాటు చేశామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారులకు అండగా నిలుస్తామని చెప్పారు. – సంఘం ఉపాధ్యక్షుడు సాంబశివరావు ఇళ్లపై పడి వేధిస్తున్నారు.. ఆస్తులు గుంజుకున్నారు ‘మా సంతకాలు ఫోర్జరీ చేసి కొత్త చిట్టీ గ్రూపుల్లో చే ర్పించారు. మాకు తెలియకుండానే పాట పాడి ఆ మొత్తాన్ని అప్పుల కింద జమ చేసుకున్నామని చెప్పారు. 90 చిట్టీల్లో చే ర్పించి మమ్మల్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు. అవి తీర్చడం కోసం మా ఇల్లు, స్థలాలు తీసుకున్నారు. విదేశాల్లో ఉన్న మా అమ్మాయి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి ఆమెను కూడా చందాదారుగా చే ర్పించారు. ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి ప్రైజ్‌మనీ డబ్బును వాళ్లే తీసుకున్నారు. ఇదెక్కడి అన్యాయం అని ప్రశ్నిస్తే ఇంటి మీదకు గూండాలను పంపించి తీవ్రంగా వేధిస్తున్నారు’ అని సంఘం కార్యదర్శి అన్నపూర్ణాదేవి ఆవేదనతో చెప్పారు. – సంఘం కార్యదర్శి అన్నపూర్ణాదేవి నా అనుమతి లేకుండానే నా డబ్బు డిపాజిట్ చేసేశారు నేను చిట్టీ పాడి నిబంధనల ప్రకారం నలుగురు ప్రభుత్వ ఉద్యోగులతో ష్యూరిటీలు ఇప్పించాను. అయినా ప్రైజ్‌మనీ ఇవ్వడంలేదు. నా అనుమతి లేకుండానే డిపాజిట్‌గా జమ చేసేశారు. అలా ఎందుకు చేశారు అని గట్టిగా అడిగితే భవిష్యత్ చందాల కోసం డిపాజిట్ చేశామని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. అలా ప్రతి ఆరు నెలలకు వాళ్లే డిపాజిట్లను రెన్యూవల్ చేస్తూ రెండేళ్లుగా ప్రైజ్‌మనీ ఇవ్వకుండా వేధిస్తున్నారు. నాలా వేలాదిమంది మార్గదర్శి చిట్‌ఫండ్స్ మోసాల బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. – విశ్వప్రసాద్, బాధితుడు ష్యూరిటీలు ఇచ్చినా వేధిస్తున్నారు మేము చిట్టీ పాడితే, ఆ ప్రైజ్ మనీ ఇవ్వడానికి నలుగురు ప్రభుత్వ ఉద్యోగులతో ష్యూరిటీలు కావాలని చెప్పారు. నేను నలుగురితో ష్యూరిటీలు ఇప్పించాను. అయినా చాలదు అన్నారు. ఆరుగురు.. తరువాత ఎనిమిది మంది ప్రభుత్వ ఉద్యోగులతో ష్యూరిటీలు ఇప్పించినా మా ప్రైజ్‌మనీ మాత్రం ఇవ్వలేదు. పైగా ష్యూరిటీ ఇచ్చిన వారిని వేధిస్తున్నారు. దీనిపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. న్యాయం కోసం ఈ సంఘంలో సభ్యునిగా చేరాను. – నందిగం వరప్రసాద్, హైదరాబాద్ ‘మార్గదర్శి’పై కఠిన చర్యలు తీసుకోండి హోం శాఖ, సీఐడీకి బాధితుల విజ్ఞప్తి సాక్షి, అమరావతి: చందాదారులను మోసగిస్తున్న మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ సంస్థ మోసాలకు అడ్డుకట్ట వేసి చందాదారులకు న్యాయం చేయాలని మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితుల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితుల సంఘం అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు వి.సాంబశివరావు, కార్యదర్శి వి.అన్నపూర్ణమ్మ, ఇతర ప్రతినిధులు హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్‌కుమార్ గుప్తా, సీఐడీ అదనపు డీజీ సంజయ్‌కు బుధవారం విడివిడిగా వినతిపత్రాలు సమ ర్పించారు. ష్యూరిటీలు సమ ర్పించినా చందాదారులను ఇబ్బంది పెడుతున్నారని వివరించారు. చందాదారుల సొమ్మును రామోజీరావు సొంత వ్యాపారాల్లో పెట్టుబడులుగా మళ్లిస్తూ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని చెప్పారు. కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టంలోని సెక్షన్లు 22, 64 ప్రకారం మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై కఠిన చర్యలు తీసుకుని చందాదారులకు అండగా నిలవాలని కోరారు. -
రామోజీ మోసాలు.. మార్గదర్శి బాధితుల సంఘం ఏర్పాటు
సాక్షి, విజయవాడ: చిట్‌ఫండ్స్ పేరిట రామోజీరావు మోసాల నేపథ్యంలో మార్గదర్శి బాధితుల సంక్షేమ సంఘం ఏర్పాటైంది. ఈ మేరకు సంక్షేమ సంఘాన్ని బాధితులు రిజిస్టర్ చేశారు. ఈ క్రమంలో బాధితులు.. ప్రెసిడెంట్, వైఎస్ ప్రెసిడెంట్, కార్యదర్శులను ఎన్నుకున్నారు. అనంతరం, మీడియా ముందు రామోజీ మోసాలను బాధితులు ఎండగట్టారు. ఆధారాలతో మార్గదర్శి మోసాలను బాధితులు బయటపెట్టారు. ఈ సందర్భంగా మార్గదర్శి బాధితుల సంఘం ప్రెసిడెంట్ ముష్టి శ్రీనివాస్ మాట్లాడుతూ..‘మార్గదర్శిలో నేను మోసపోయాక గళం విప్పడం ప్రారంభించాను. పేద, మధ్య తరగతి ప్రజలకు మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేస్తున్నారు. షూరిటీస్ నెపంతో డబ్బు ఎగ్గొడుతున్నారు. చాలా పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్నారు. మార్గదర్శి ఎప్పుడు దివాళా తీస్తుందో తెలియట్లేదు. కర్నూలులో ఒక వ్యక్తికి మార్గదర్శి బెదిరింపుల కారణంగా పక్షవాతం వచ్చింది. మార్గదర్శిపై పోరాడుతున్న నాపైన కూడా కేసులు పెడుతున్నారు. నేను కోర్టుకు వెళ్తానంటే నువు బ్రాహ్మణుడివి ఏమీ చేయలేవు అని బెదిరించారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు.. మార్గదర్శి బాధితుల సంఘం వైస్ ప్రెసిడెంట్ సాంబశివరావు మాట్లాడుతూ..‘మార్గదర్శి అనైతికంగా వ్యవహరిస్తోంది. కస్టమర్ల ఆస్తులు కొల్లగొడుతున్నారు. 43 చిట్లలో కేవలం నాకు వచ్చింది 8వేలు మాత్రమే. ఒక్కో చిట్‌కి 210 రూపాయలు ఇచ్చారు. నెలకు 40 నుండి 50 లక్షల ఇన్స్టాల్మెంట్ కట్టాల్సిన పరిస్థితికి తీసుకెళ్లారు. చిట్ డిఫాల్ట్ అయితే ఆస్తులు అమ్ముకుంటారని మాకు తెలియదు. కోర్టుకు వెళ్తారనే భయంతో అప్పులు చేసి చిట్లు కట్టాము. కాల్ మనీ గుండాల్లా మా ఇంటికి వచ్చి కూర్చునే వారు. ఇంట్లోని బంగారం అమ్ముకున్నాం. డిఫాల్ట్ అయితే ఇంత దారుణంగా ఇబ్బందులకు గురి చేస్తారని మాకు తెలియదు’ అని కామెంట్స్ చేశారు. మార్గదర్శి బాధితుల సంఘం సెక్రటరీ అన్నపూర్ణ దేవి మాట్లాడుతూ..‘చిట్ కట్టలేని స్థితికి తీసుకెళ్లి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. వాళ్ళ టార్గెట్ కోసం ఎక్కువ చిట్లు కట్టేలా ఒప్పించారు. ఎంత కట్టినా డిఫాల్ట్ ఉందంటూ మమ్మల్ని బెదిరిస్తున్నారు. మా కాపురాన్ని నాశనం చేశారు. మా ఇంటిని అటాచ్ చేశారు. ఆర్ధిక స్థోమత లేనివారిని కూడా చిట్లలో ఇరికిస్తున్నారు’ అని అన్నారు. -
ఫిర్యాదు చేస్తే అంతు చూస్తాం
‘మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పైనే ఫిర్యాదు చేస్తారా ... మీ సంగతి తేలుస్తాం’ ‘మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితులు.. అని సంఘం పెట్టేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది’ ‘మీ ష్యూరిటీ పత్రాలు మా దగ్గర ఉన్నాయి.. మీ ఆస్తులు వేలం వేయిస్తాం..’ ఇవీ రాజగురివింద రామోజీరావు ఆర్థిక అక్రమాల పుట్ట.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ నుంచి చందాదారులకు కొన్ని నెలలుగా వస్తున్న బెదిరింపులు. నేరుగా చందాదారుల ఇళ్లకే వచ్చి బెదిరిస్తుండటంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. మరికొందరికి రామోజీ ముఠా ఫోన్లు చేసి వేధిస్తోంది. కొందరిని తమ చిట్‌ఫండ్ కార్యాలయాలకు పిలిపించుకుని మరీ బెదిరిస్తోంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాల పుట్ట బద్దలు కావడంతో రామోజీరావు బెంబేలెత్తుతున్నారు. దశాబ్దాల తరబడి ఆయన, ఆయన కోడలు శైలజ వేధింపులు భరించిన చందాదారులు ప్రస్తుతం ధైర్యం చేసి ఫిర్యాదులు చేస్తుండటంతో రామోజీ ముఠా బెదిరింపుల పర్వానికి బరితెగించింది. దీంతో చందాదారుల భద్రతే లక్ష్యంగా ఫిర్యాదులు చేసేందుకు సీఐడీ ప్రత్యేక వాట్సాప్ నంబరును అందుబాటులోకి తెచ్చింది. తాజాగా కొందరు చందాదారులు ‘మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితుల సంఘాన్ని’ ఏర్పాటు చేసి రిజిస్టర్ చేయించడంతో ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ధైర్యంగా బాధితుల ముందడుగు.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసును విచారిస్తున్న సీఐడీ.. బాధితులు ఫిర్యాదు చేసేందుకు 94931 74065తో వాట్సాప్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ వాట్సాప్ నంబరుకు ఇప్పటికే వేల సంఖ్యలో చందాదారులు ఫిర్యాదులు చేశారు. తమ అనుమతి లేకుండా చిట్టీలు పాడటం, చిట్ పాడుకున్న నగదు ఇవ్వకుండా రశీదు డిపాజిట్లుగా జమ చేయడం, ష్యూరిటీలు ఇచ్చినా తిరస్కరించి వేధించడం, తమ సంతకాలు ఫోర్జరీ చేయడం వంటి అక్రమాలపై బాధితులు ఆధారాలతో సహా ఫిర్యాదులు చేస్తున్నారు. వీటిని సీఐడీ ప్రత్యేక విభాగం నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. వేధింపులకు పాల్పడ్డ పలువురు మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచ్ మేనేజర్లు, ఇతర సిబ్బందిని సీఐడీ విచారిస్తుండటంతో రామోజీ బెంబేలెత్తుతున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ కార్యాచరణతో చందాదారులు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. విజయవాడ కేంద్రంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. బాధితులు తమ సమస్యలను చెప్పుకునేందుకు ప్రత్యేకంగా 99481 14455 ఫోన్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీంతో కేవలం మూడు రోజుల్లోనే వందల సంఖ్యలో బాధితులు ఈ సంఘాన్ని సంప్రదించి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అందరి ఫిర్యాదులను నమోదు చేస్తూ అటు సీఐడీ ద్వారా, ఇటు న్యాయపరంగా చర్యలు తీసుకునేందుకు ఆ సంఘం సన్నద్ధమవుతోంది. బాధితులపై మార్గదర్శి వేధింపుల పర్వం మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాల పుట్ట బద్దలు కావడంతో రామోజీరావు హడలిపోతున్నారు. సీఐడీ అధికారులు కేసు నమోదు చేయడం, ఏకంగా తన ఇంటికే వచ్చి మరీ విచారించడంతో ఆయన బెంబేలెత్తుతున్నారు. ఇవి చాలవన్నట్టు ఇప్పుడు బాధితులు కూడా దూకుడు పెంచడంతో ఏక్షణం ఏం జరుగుతుందోనని రామోజీ బేజారెత్తుతున్నారు. దీంతో కేసు దర్యాప్తును ప్రభావితం చేసేందుకు తన ముఠాలను ఆయన రంగంలోకి దించారు. సీఐడీ అధికారులు, బాధితుల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నవారిని లక్ష్యంగా చేసుకుని వారికి ఫోన్లు చేసి రామోజీ ముఠా వేధిస్తోంది. సీఐడీకి ఫిర్యాదు చేసిన చందాదారులను మొదట లక్ష్యంగా చేసుకుంది. సీఐడీ దర్యాప్తునకు సహకరించవద్దని వారిని బెదిరిస్తోంది. ఏకంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజ కిరణ్ ఆఫీసు నుంచే చందాదారులకు ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతుండటం గమనార్హం. రామోజీ కోడలు శైలజ కిరణ్ పీఏ శశికళ, మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్లు స్వయంగా ఫోన్లు చేసి మరీ బెదిరిస్తుండటం ఆ సంస్థ దిగజారుడుతనానికి నిదర్శనం. మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితుల సంఘం అందుబాటులోకి తెచ్చిన ఫోన్ నంబరుకు కూడా ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. ‘అసలు సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు.. మీ వెనుక ఎవరు ఉన్నారు.. ఎవరున్నాసరే మిమ్మల్ని కాపాడలేరు.. మీ సంగతి చూస్తాం.. అంతు తేలుస్తాం’ అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. – సాక్షి, అమరావతి న్యాయపోరాటానికి బాధితులు సిద్ధం.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ సిబ్బంది కాల్‌మనీ రాకెట్ గూండాల మాదిరిగా చందాదారుల ఇళ్లపై పడుతున్నారు. వారి ఇళ్లకు వెళ్లి మరీ బెదిరిస్తున్నారు. ప్రధానంగా ప్రైవేటు వ్యక్తులకే తెలియకుండా తాము ఘోస్ట్ చందాదారులుగా నమోదు చేసిన వారి ఇళ్లకు వెళ్లి దౌర్జన్యం చేస్తున్నారు. అసలు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో తాము చందాదారులుగా చేరిన విషయమే తమకు తెలియదనివారు ఎంతగా చెబుతున్నా వినిపించుకోవడం లేదు. ‘సీఐడీ అధికారులు అడిగితే మీరే చందాదారులుగా చేరారని చెప్పండి.. మీకు ఇబ్బందిరాకుండా చూస్తాం.. అంతేగానీ తెలియదని చెబితే మాత్రం మీరు మాకు భారీగా బకాయిలు ఉన్నారని కోర్టులో కేసులు వేస్తాం’ అని హడలెత్తిస్తున్నారు. దాంతో తమకు తెలియకుండానే తమ పేరుతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ సాగిస్తున్న ఆర్థిక అవకతవకలపై వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక చందాదారుల కోసం ష్యూరిటీ సంతకాలు చేసిన వారి ఇళ్లకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ సిబ్బంది వెళ్లి వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ‘మీరు ఇచ్చిన ఖాళీ చెక్కులు మా వద్ద ఉన్నాయి.. వాటిపై భారీ మొత్తం రాసి బ్యాంకులో జమ చేసి బౌన్స్ అయ్యేలా చేస్తాం. తరువాత కేసు పెట్టి అరెస్ట్ చేయిస్తాం’ అని కొందరిని బెదిరించడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరికొందరు చందాదారుల ఇళ్లకు వెళ్లి ‘మీరు భారీగా బకాయి పడ్డారు...అందుకు ప్రతిగా మీ ఇళ్లు, ఆస్తులు వేలం వేయిస్తాం’ అని వేధింపులకు దిగారు. చందాదారుల తరపున మార్గదర్శి చిట్‌ఫండ్స్ సిబ్బందే ఫోర్జరీ సంతకాలు చేసేసి.. తిరిగి చందాదారులపైనే ఫోర్జరీ కేసు పెడతామని బెదిరిస్తున్నారు. ఈ పరిణామాలతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితుల సంఘం ద్వారా అటు సీఐడీని ఆశ్రయించడంతోపాటు మరోవైపు న్యాయపోరాటం చేసేందుకు ఉద్యుక్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో కీలక పరిణామాలు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
మరిదితో వివాహేతర సంబంధం... మరికొందరితో చనువుగా ఉంటోందని....
పోలవరం రూరల్: కొత్తరామయ్యపేట పునరావాస కేంద్రంలో మేడూరి దుర్గ (28) అనే వివాహిత హత్య కేసులో నిందితుడిని మంగళవారం పోలవరం పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు పోలవరం డీఎస్పీ కార్యాలయంలో హత్యకు సంబంధించిన కారణాలను విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఎం.సురేష్‌కుమార్ రెడ్డి వివరించారు. కొత్తరామయ్యపేట పునరావాస కేంద్రం ప్రాంతానికి చెందిన మేడూరి దుర్గ (28)కు, సమీప బంధువు, వరుసకు మరిది అయిన మేడూరి ప్రసాద్ మధ్య గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతుంది. అయితే నెల రోజుల నుంచి దుర్గ వేరే వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతున్నట్లు అనుమానంతో ప్రసాద్ ఆమెతో గొడవ పడుతున్నాడు. ఆదివారం రాత్రి ప్రసాద్ దుర్గకు అనేకమార్లు ఫోన్ చేయగా, దుర్గ వేరే వారితో మాట్లాడుతుడంతో ఫోన్ కలవలేదు. ఫోన్ తీయడం లేదనే కోపంతో ప్రసాద్ దుర్గ ఇంటికి వెళ్లి గొడవ పడ్డాడు. వెంటనే ప్రసాద్ తన వెంట తెచ్చుకున్న చాకుతో దుర్గ కంఠం కోసి, ఇంటి వెనుక వైపున మామిడి తోట నుంచి బయటకు వెళ్లిపోయాడు. అయితే గాయం తీవ్రంగా కావడంతో దుర్గ అక్కడికక్కడే మృతి చెందింది. ప్రసాద్ హత్య చేసిన అనంతరం దుర్గ ఫోన్‌ను తీసుకుని వెళ్లిపోయాడు. సమీపంలోని మొక్కజొన్న చేలో ప్రసాద్ బట్టలు, ఫోన్, చాకు దాచి ఉంచాడు. ఘటన జరిగిన వెంటనే పోలవరం సీఐ కె.మధు బాబు, ఎస్సై ఎస్ఎస్ పవన్‌కుమార్, సిబ్బంది సంఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌తో పరిశీలించారు. మృతురాలి ఫోన్ కనబడకపోవడంతో అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. ఘటన జరిగిన రెండు రోజుల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించడంతో వాస్తవాలు తెలిశాయన్నారు. నిందితుడిని మంగళవారం కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ప్రతిష్టాత్మకంగా దర్యాప్తు చేయడంపై జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి అభినందించినట్లు చెప్పారు. ఈ కేసులో నిందితుడిని త్వరితగతిన పట్టుకున్నందుకు రివార్డులు కూడా ప్రకటిస్తామని డీఎస్పీ తెలిపారు. -
ఆశలతో ఉచ్చు.. ఎన్నో ఇళ్లలో చిచ్చు
సాక్షి, అమరావతి: ‘మార్గదర్శి తోడుంటే ఆనందం మీవెంటే.. ఇళ్లు, కార్లు, ఫర్నీచర్, నగలు అన్నీ కొనుక్కోవచ్చు..’ ఇదీ టీవీ చానళ్లలో, హోర్డింగుల్లో మార్గదర్శి చిట్ ఫండ్స్ ఊదరగొట్టే ప్రచారం. అది నిజమేనని నమ్మి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో చేరిన చందాదారుల ఇళ్లల్లో ఆనందం ఆవిరవుతోందన్నది పచ్చి నిజం. కొత్త ఇళ్లు, కార్లు కొనుక్కోవడం దేవుడెరుగు.. ఉన్న ఇళ్లు, భూములు, బంగారం అమ్ముకుంటున్నా అప్పుల ఊబి నుంచి బయట పడటం లేదు. అందమైన కలలు చూపిస్తూ రామోజీరావు సామాన్యుల మెడకు చిట్టీల ఉచ్చు బిగిస్తున్నారు. ఒక చిట్టీ అప్పు తీర్చడం పేరిట మరో చిట్టీలో చేర్పిస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తున్నారు. ఆస్తులు తెగనమ్ముకున్నా అప్పులు తీరవు.. సరికదా కాల్‌మనీ రాకెట్‌ను తలపిస్తూ మార్గదర్శి సిబ్బంది వేధింపులతో చందాదారుల కుటుంబాలు మానసిక క్షోభ అనుభవిస్తుండటం రామోజీ ఆర్థిక అరచాకాలకు నిదర్శనం. విజయవాడకు చెందిన ఓ ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్ కుటుంబానికి ఇలాంటి క్షేభే మిగిలింది. ఈ వెటర్నరీ వైద్యుడి కుటుంబ సభ్యులు కోళ్ల ఫారం నిర్వహిస్తున్నారు. ఆయన భార్య మార్గదర్శి చిట్ ఫండ్స్‌లో ఒక గ్రూపులో చందాదారుగా చేరారు. ఆ తర్వాత ఆమెకు తెలియకుండానే మరికొన్ని చిట్టీ గ్రూపుల్లో సభ్యురాలిగా చేర్చారు. ఆ చిట్టీ గ్రూపుల చందాలు చెల్లించడం కోసమంటూ మరికొన్ని చిట్టీ గ్రూపుల్లో చేర్పిస్తూ ఏకంగా 90 చిట్టీ గ్రూపుల్లో సభ్యురాలిగా చూపించారు. నిబంధనల ప్రకారం ఇచ్చిన ష్యూరిటీలను కూడా గుర్తించకుండా ఏకంగా 17 చిట్టీ గ్రూపుల్లో డిఫాల్టర్‌గా చూపించారు. అనంతరం ఆ కుటుంబం ఆస్తులను గుంజుకున్నారు. ఆ వెటర్నరీ వైద్యుడు జీపీఎఫ్ డబ్బులు రూ.35 లక్షలతోపాటు పిల్లల పెళ్లి కోసం దాచుకున్న బంగారం కూడా అమ్మి చెల్లించినా ఇంకా అప్పులు తీరనే లేదు. కాల్‌మనీ రాకెట్ గుండాల మాదిరిగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ సిబ్బంది వచ్చి అల్లరి చేసి మరీ వారి ఇంటిని వేలం వేయించారు. అంతటితో రామోజీ ఆగడాలు ఆగలేదు. విదేశాల్లో చదువుతున్న ఆ వెటర్నరీ డాక్టర్ కుమార్తె సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి చందాదారుగా చేర్చారు. ఆమె చిట్టీ పాట పాడినట్టు చూపించారు. రూ.9 లక్షల నష్టానికి చిట్టీ పాట పాడినట్టు చూపించి బకాయిలు మినహాయించుకుని కేవలం రూ.210 మాత్రమే ఇస్తామని రికార్డుల్లో సర్దుబాటు చేశారు. ఆ చిట్టీ గ్రూపునకు సంబంధించి వాయిదాల బకాయిలు చెల్లించాలని మళ్లీ వేధింపులు మొదలు పెట్టారు. అసలు ఈ దేశంలోనే లేని మా కుమార్తె ఎలా చందాదారుగా చేరింది.. ఎలా వేలం పాటలో పాల్గొంది.. అసలు తను వచ్చి ఎప్పుడు సంతకం చేసింది.. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే లేదు. ఆమె పేరుతో మార్గదర్శి చిట్ ఫండ్స్ ఉద్యోగులే మోసం చేశారు. తలలు అమ్ముకున్నా తీరని అప్పులు జాతీయ బ్యాంకులుగానీ ప్రైవేటు బ్యాంకులుగానీ తమ ఖాతాదారుల ఆర్థిక పరిస్థితిని సహేతుకంగా అంచనా వేసి తదనుగుణంగా రుణాలు ఇస్తాయి. రుణాలు చెల్లించే స్థోమతను బట్టి ఒక పరిమితి విధిస్తాయి. దేశంలో ఏ ఆర్థిక సంస్థ అయినా ఈ నిబంధనను పాటించాలి. కానీ మార్గదర్శి చిట్‌ఫండ్స్ మాత్రం అవేవీ పట్టించుకోదు. చిరు వ్యాపారులు, చేతి వృత్తుల వారికి కూడా వారి ఆదాయం, ఆర్థిక స్థోమతను మించి ఎన్నో చిట్టీ గ్రూపుల్లో సభ్యులుగా చేర్పిస్తోంది. దాంతో వాయిదాలు చెల్లించలేక వారు అప్పుల ఊబిలో కూరుకుపోయి తమకున్న కొద్దిపాటి ఆస్తులను తమకు ధారాదత్తం చేసే పరిస్థితిని సృష్టిస్తున్నారు. అందుకు విజయవాడకు చెందిన ఓ టాక్సీ డ్రైవర్ దీనగాధే తార్కాణం. ఇతను మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో రూ.2 లక్షల చిట్టీ గ్రూపులో సభ్యునిగా చేరారు. తర్వాత మరిన్ని చిట్టీ గ్రూపుల్లో చేరితే ఆర్థికంగా కలసి వస్తుందని చెప్పడంతో మరో రెండు గ్రూపుల్లో సభ్యుడిగా చేరాడు. తర్వాత ఆయనకు తెలియకుండానే ఏకంగా 20 గ్రూపుల్లో సభ్యునిగా చేర్పించేశారు. నెలకు రూ.50 వేలు వాయిదాల కిందే చెల్లించాల్సిన పరిస్థితి సృష్టించారు. చిట్టీ పాట పాడిన తర్వాత ప్రైజ్‌మనీ తీసుకునేందుకు ఆయన ఇచ్చిన ష్యూరిటీలను మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఉద్దేశ పూర్వకంగానే కొర్రీలు వేసి తిరస్కరించింది. వాయిదాల బకాయిలు చెల్లించేందుకు తమకున్న ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి సృష్టించారు. అసలు ఓ టాక్సీ డ్రైవర్ నెలకు రూ.50 వేలు చిట్టీ వాయిదాలు ఎలా చెల్లించగలరని మార్గదర్శి చిట్‌ఫండ్స్ విచక్షణతో యోచించి ఉంటే ఆయనకు అంతటి దుస్థితి ఏర్పడేది కాదు. కానీ రామోజీ లక్ష్యం ఆయనకు ఉన్న ఒక్క ఇంటిని గుంజుకోవడమే. బరితెగించి రామోజీ ఆర్థిక ఆగడాలు మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారుల్లో అత్యధికులది ఇలాంటి దుస్థితే. రాజకీయంగా ఎలాంటి అండాదండా లేని వారు, ప్రభుత్వ ఉద్యోగులు, చిరు వ్యాపారులు, ఇతర మధ్య తరగతి వర్గాలను లక్ష్యంగా చేసుకుని రామోజీరావు పక్కాగా తన కుట్రను అమలు చేస్తూ వారి ఆస్తులను కొల్లగొడుతున్నారు. అటువంటి చందాదారుల్లో చిట్టీల చందాలు చెల్లింపులో ఇబ్బంది పడుతున్న వారిని గుర్తించి, వారిని మరికొన్ని చిట్టీ గ్రూపుల్లో సభ్యులుగా చేర్పిస్తున్నారు. కొత్త చిట్టీ గ్రూపులో ప్రైజ్ మనీతో పాత చిట్టీ గ్రూపు వాయిదాలు చెల్లించవచ్చని ఆశ చూపిస్తున్నారు. మళ్లీ కొత్త చిట్టీ దగ్గరకు వచ్చేసరికి ష్యూరిటీల పేరుతోనో మరో రకంగానో కొర్రీలు వేసి మరిన్ని చిట్టీ గ్రూపుల్లో చేర్పిస్తున్నారు. చాలా మంది చందాదారులకు తెలియకుండానే వారి పేరిట మార్గదర్శి చిట్‌ఫండ్స్ మేనేజర్లు చిట్టీ పాటలు పాడేస్తున్నారు. ఆ ప్రైజ్‌మనీని మరో చిట్టీ గ్రూపులో సర్దుబాటు చేసినట్టు రికార్డుల్లో చూపిస్తున్నారు. అలా చందాదారులు తమకు తెలియకుండానే లెక్కకు మించి చిట్టీ గ్రూపుల్లో సభ్యులుగా చేరి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇక అప్పులు తీర్చడం వారి తరం కాదని నిర్ధారించుకున్న తర్వాత వారి ఇళ్లపై మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఉద్యోగులు దాడులు చేస్తున్నారు. వారిని వేధిస్తూ.. సామాజిక గౌరవానికి భంగం కలిగిస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. దాంతో తమ ఆస్తులను మార్గదర్శి చిట్‌ఫండ్స్ పరం చేసి కట్టుబట్టలతో బయటకు వెళ్లిపోవాల్సిన అనివార్యత సృష్టిస్తున్నారు. కొందరి నుంచి ఆస్తి పత్రాలు, ఎల్ఐసీ బాండ్లు తీసుకుని మరీ డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నారు. మరికొందరిని.. చిట్టీలు పాడినా పాట మొత్తం (ప్రైజ్‌మనీ) ఇచ్చేందుకు నెలల తరబడి తిప్పుతున్నారు. ఇంకొందరి సంతకాలను ఫోర్జరీ చేసి మరొకరికి ష్యూరిటీలో చూపిస్తూ చిట్టీ మొత్తం ఇవ్వకుండా వేధిస్తున్నారు. చిట్టీ వాయిదా ఒక్క రోజు ఆలస్యమైనా రూ.500 జరిమానా వసూలు చేస్తున్న మార్గదర్శి చిట్‌ఫండ్స్.. తాము చెల్లించాల్సిన చిట్టీ పాట మొత్తాన్ని మాత్రం నెలల తరబడి జాప్యం చేస్తున్నా సరే ఒక్క రూపాయి వడ్డీ చెల్లించడం లేదు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు.. వేలాది మంది మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారులు గగ్గోలు పెడుతున్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో 50 శాతం వరకు ఇటువంటి బాధితులే ఉండటం రామోజీ మోసాల తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది. యథేచ్ఛగా చట్టం ఉల్లఘన ► ఎవరైనా ఓ చందాదారుడు చిట్టీ పాట పాడిన తర్వాత తగిన ష్యూరిటీలు చూపించకపోతే... ఆ చిట్టీ పాటను రద్దు చేయాలి. ఆ చిట్టీ గ్రూపునకు మళ్లీ పాట(వేలం) నిర్వహించాలి. కానీ మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆ నిబంధనను పాటించడం లేదు. ఆ చిట్టీ పాటను రద్దు చేయడం లేదు. కొత్తగా పాటను నిర్వహించడమూ లేదు. ఆ చిట్టీ పాట సక్రమంగా నిర్వహించినట్టు చూపిస్తూ ఆ ప్రైజ్‌మనీని వేరే ఖాతాల్లోకి మళ్లించేస్తోంది. ఆ చిట్టీ గ్రూపును యథావిథిగా కొనసాగిస్తోంది. దాంతో ఆ డిఫాల్టర్ చందాదారుడు తర్వాత నెలల వాయిదాలు కూడా చెల్లించాల్సినట్టు చూపిస్తూ అప్పుల ఊబిలోకి కురుకుపోయేలా చేస్తోంది. ► వాయిదాలు చెల్లించలేని చందాదారుడిని డిఫాల్టర్‌గా చూపించాలి. అంతవరకు ఆ చందాదారు చెల్లించిన మొత్తాన్ని ప్రత్యేక ఖాతాలో వేసి కమీషన్ పోగా వెనక్కి ఇచ్చేయాలి. కానీ మార్గదర్శి చిట్‌ఫండ్స్ అలా చేయడం లేదు. ఆ డిఫాల్టర్ చందాదారు మొత్తాన్ని మరో చిట్టీ బకాయి కింద జమ చేసినట్టు చూపిస్తూ.. ఇంకా బకాయిలు చెల్లించాలని రికార్డుల్లో ఆ చందాదరుని రుణగ్రస్తునిగా చూపిస్తోంది. ► ఎవరైనా ప్రైజ్‌మనీ తీసుకోని చందాదారు వాయిదాలు చెల్లించలేకపోతే డిఫాల్టర్‌గా ప్రకటించాలి. ఆ చందాదారునికి 14 రోజుల నోటీసు ఇచ్చి డిఫాల్టర్‌గా ప్రకటించినప్పటి వరకు చెల్లించిన వాయిదాలను ప్రత్యేక బ్యాంకు ఖాతాలో జమ చేయాలి. ఆ తర్వాత ఏడు రోజుల్లో ఆ మొత్తాన్ని నిర్దేశిత వడ్డీ రేటుతో కలిపి చెల్లించాలి. కానీ మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఈ నిబంధనను పాటించడం లేదు. అటువంటి చందాదారులను ఉద్దేశ పూర్వకంగా డిఫాల్టర్లుగా ప్రకటించకుండా కొనసాగిస్తూ వారు మరింతగా అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తోంది. ► చిట్‌ఫండ్ చట్టం ప్రకారం ప్రతి చిట్టీ గ్రూపు దేనికదే ప్రత్యేకం. ప్రతి చిట్టీ గ్రూపు ఒక ప్రత్యేక కంపెనీ వంటిది. ఒక చిట్టీ గ్రూపు చందాదారుగా చెల్లించిన మొత్తాన్ని మరో చిట్టీ గ్రూపులో సర్దుబాటు చేసినట్టు చూపించకూడదు. ఈ నిబంధనను మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఉల్లంఘిస్తూ చందాదారులను ఎన్నో చిట్టీ గ్రూపుల్లో సభ్యునిగా చూపిస్తూ... అన్ని చిట్టీ గ్రూపుల మొత్తాన్ని ఒకదానికి ఒకటి అనుసంధినిస్తూ చందాదారులను ఉద్దేశ పూర్వకంగా అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తోంది. బాధితులకు అండగా చట్టం, ప్రభుత్వం చిట్‌ఫండ్ కంపెనీల మోసాలు, ఆగడాల నుంచి బాధితులకు రక్షణ కల్పించి న్యాయం చేసేందుకు కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం సరైన వ్యవస్థను ఏర్పాటు చేసింది. చిట్టీ గ్రూపుల డిఫాల్టర్ సభ్యుల విషయంలో అనుసరించాలిన నిబంధనలను కేంద్ర చిట్‌ఫండ్ చట్టంలోని సెక్షన్ 22లో విస్పష్టంగా పేర్కొంది. అయితే దశబ్దాలుగా ప్రభుత్వాలు పట్టించుకోని ఆ చట్టాన్ని వైఎస్సార్సీపీ పటిష్టంగా అమలు చేస్తోంది. చిట్ రిజిస్ట్రార్లతోపాటు ప్రభుత్వం వరకు వివిధ స్థాయిల్లో అప్పీలు చేసుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మార్గదర్శి అక్రమాలు, వేధింపులకు చెక్ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మార్గదర్శి చిట్ఫండ్స్తోపాటు ఇతర చిట్‌ఫండ్ కంపెనీల బాధితులు తమ సమస్యను తెలియజేసి న్యాయం పొందేందుకు ప్రత్యేక వ్యవస్థే ఉంది. కేంద్ర చిట్‌ఫండ్ చట్టంలోని సెక్షన్ 64 నుంచి 68 వరకు జిల్లా అసిస్టెంట్ చిట్ రిజిస్ట్రార్‌కు విస్తృత అధికారాలున్నాయి. ఆయనకు జ్యుడీషియరీ అధికారాలను చట్టం కల్పించింది. చందాదారులు తమకు చిట్‌ఫండ్ కంపెనీ మోసం చేసిందీ.. వేధిస్తోంది.. అని భావిస్తే తగిన ఆధారాలతో జిల్లా అసిస్టెంట్ చిట్ రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేయవచ్చు. తాము సరైన ష్యూరిటీలు సమర్పించినా ఆమోదించడం లేదని, తమను డిఫాల్టర్‌గా ప్రకటించి అప్పటి వరకు చెల్లించిన వాయిదాలను వెనక్కి ఇవ్వాలని.. తమ సమ్మతి లేకుండానే ఎన్నో చిట్టీ గ్రూపుల్లో సభ్యులుగా చేర్పించారని... తమ సంతకాలను ఫోర్జరీ చేశారని.. ఇలా ఎటువంటి సమస్యలపైన అయినా ఫిర్యాదు చేయవచ్చు. దానిపై జిల్లా అసిస్టెంట్ రిజిస్ట్రార్ విచారించి తగిన చర్యలు తీసుకుంటారు. ఆమేరకు ఆదేశాలు జారీ చేస్తారు. జిల్లా అసిస్టెంట్ చిట్ రిజిస్ట్రార్ ఇచ్చిన ఆదేశాలతో సంతృప్తి చెందకపోతే బాధితులు రాష్ట్ర స్థాయిలో కూడా ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించారు. చిట్‌ఫండ్ చట్టంలోని సెక్షన్లు 69, 70 ప్రకారం రాష్ట్ర చిట్స్ రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేయవచ్చు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆదేశాలు ఇచ్చిన రెండు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ చేసి తగిన న్యాయం పొందవచ్చు. -
కాకినాడ: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
సాక్షి, కాకినాడ: జిల్లాలోని ప్రత్తిపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై ఉన్న వారిని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. ఇక, మృతులను బాపట్ల జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం.. ప్రత్తిపాడు మండలంలోని పాదాలమ్మ గుడి వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కాగా, లారీ పంక్చర్ కావడంతో నలుగురు వ్యక్తులు టైర్ మారుస్తున్నారు. ఈ క్రమంలో అతి వేగంతో అటుగా వస్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు దాసరి ప్రసాద్, దాసరి కిషర్, క్లీనర్ నాగయ్య, స్థానికుడు రాజు మృతిచెందారు. మృతులను బాపట్ల జిల్లా నక్క బొక్కలపాలెంకు చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
అన్నమయ్య జిల్లా: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
సాక్షి, అన్నమయ్య జిల్లా: మదనపల్లి-బెంగుళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కార్పియో వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఐదుగురి మృతి చెందారు. మదనపల్లి మండలం బార్లపల్లి వద్ద ఘటన జరిగింది. -
సంతకాలు చేస్తారా.. చస్తారా?
సాక్షి, అమరావతి: ఆదరించినవారికి ద్రోహ చేయడం, ఆశ్రయం కల్పించిన వారిని ముంచేయడం అంటే ఠక్కున చంద్రబాబే గుర్తుకు వస్తారు. కానీ ఆయన రాజగురువు రామోజీరావు కూడా ఆ విషయంలో రెండాకులు ఎక్కువే చదివారు. రామోజీ వ్యాపార సామ్రాజ్యానికి నల్లధనం సరఫరా యూనిట్‌గా నిలుస్తున్న మార్గదర్శి చిట్‌ఫండ్సే నమ్మక ద్రోహం, మోసాల పునాదుల మీద ఏర్పడింది. నమ్మి ఆశ్రయం కల్పించిన మిత్రుడు, భాగస్వామి జీజే రెడ్డి కుటుంబాన్ని నిలువునా మోసం చేసి, వారి షేర్లను కొల్లగొట్టి.. తుపాకీతో బెదిరించి మరీ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ను హస్తగతం చేసుకోవడం రామోజీ వికృత వ్యాపారానికి నిదర్శనం. రామోజీ చేసిన ద్రోహంపై జీజే రెడ్డి వారసులు సీఐడీకి ఫిర్యాదు చేయడంతోపాటు న్యాయ పోరాటం చేయాల్సి వస్తోంది. పాయింట్ బ్లాంక్‌లో తుపాకి గురిపెట్టి రామోజీ చేసిన మైండ్ బ్లోయింగ్ దుర్మార్గం ఇదిగో ఇలా ఉంది.. ఆదరించిన చేయినే కాటేసిన రామోజీ.. కృష్ణాజిల్లా జొన్నలపాడుకు చెందిన జీజే రెడ్డి చెకొస్లెవేకియాలో ఉన్నత విద్య పూర్తి చేసిన అనంతరం ఢిల్లీలో నవభారత్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. అదే జిల్లా పెదపారుపూడికి చెందిన రామోజీరావు అప్పట్లో నిరుద్యోగి. 1960లో కమ్యూనిస్ట్ పార్టీ నేత కొండపల్లి సీతారామయ్య సిఫార్సు చేయడంతో రామోజీకి జీజే రెడ్డి తన కంపెనీలో టైపిస్టుగా ఉద్యోగం ఇచ్చారు. అంతేకాదు.. రెండేళ్లకే అంటే 1962లో మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయడం కోసం రామోజీరావుకు జీజే రెడ్డి ఆర్థిక సహకారం అందించారు. ఆ కంపెనీలో జీజే రెడ్డికి 288 షేర్లు ఉన్నాయి. తదనంతర పరిణామాల్లో జీజే రెడ్డి చెకొస్లెవేకియాలో స్థిరపడి 1985లో అక్కడే చనిపోయారు. ఆయన భార్య కూడా 1986లో మరణించారు. కాగా జీజే రెడ్డి ఇద్దరు కుమారులు మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో తమ తండ్రి వాటా షేర్లను తమ పేరిట బదిలీ చేయాలని చాలాసార్లు కోరినా రామోజీరావు ససేమిరా అన్నారు. ఆ షేర్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. తుపాకీతో బెదిరించిన రామోజీ 2014లో పత్రికల్లో వచ్చిన వార్తలు, నోటిఫికేషన్ల ద్వారా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో షేర్ల వివరాలను మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డి తెలుసుకున్నారు. అప్పటి నుంచి తమ తండ్రి పేరిట ఉన్న షేర్ల కోసం రామోజీరావును కలిసేందుకు రెండేళ్లపాటు ప్రయత్నించిన తరువాత... 2016 సెప్టెంబరు 29న రామోజీరావు ఆ సోదరులిద్దరికీ అపాయింట్మెంట్ ఇచ్చారు. తమ తండ్రి పేరిట ఉన్న షేర్లకు సంబంధించి షేర్ సర్టిఫికెట్ ఇవ్వాలని మార్టిన్ రెడ్డి రామోజీని కోరారు. అప్పుడు 2007–08 వార్షిక సంవత్సరానికి సంబంధించి షేర్లపై డివిడెండ్ కింద రూ.39,74,400 విలువైన యూనియన్ బ్యాంక్ చెక్ (నంబరు 137991)ను ఆయన వారికిచ్చారు. మిగిలిన సంవత్సరాల డివిడెండ్ కూడా చెల్లించాలని యూరీ రెడ్డి కోరారు. అవన్నీ సెటిల్ చేస్తానని చెప్పి రామోజీరావు వెళ్లిపోయారు. అనంతరం.. రామోజీరావు సిబ్బంది మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డిని ఓ గదిలో కూర్చోమని చెప్పి వెళ్లారు. కాసేపటికి రామోజీ ఆ గదిలోకొచ్చి ఓ రూ.100 విలువైన స్టాంపు పేపర్‌పై రాసిన అఫిడవిట్ మీద సంతకం చేయమని మార్టిన్ రెడ్డికి చెప్పారు. తన వాటా షేర్లను తన సోదరుడు యూరి రెడ్డి పేరిట మార్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని అందులో రాసి ఉంది. అదే సమయంలో 2016 అక్టోబరు 5 వ తేదీతో ఉన్న రూ.2,88,000 పోస్ట్ డేటెడ్ చెక్ (నంబరు 296460)ను యూరి రెడ్డికి ఇచ్చి తేదీ లేని ఫామ్ ఎస్‌హెచ్–4పై సంతకం చేయమని రామోజీరావు చెప్పారు. కానీ, దీనిపై సంతకం చేసేందుకు యూరి రెడ్డి నిరాకరించారు. దాంతో రామోజీరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. తుపాకీ తీసి అన్నదమ్ములు మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డిల తలకు గురిపెట్టారు. ‘మిమ్మల్ని కాపాడటానికి ఇక్కడ ఎవరూ లేరు. సంతకాలు చేయకపోతే కాల్చి పారేస్తా’ అని బెదిరించారు. దాంతో ప్రాణభయంతో ఆ ఫామ్‌పై యూరి రెడ్డి సంతకం చేశారు. తమ షేర్లను ఎవరి పేరిట బదిలీ చేస్తోందని గానీ, తేదీ గానీ ఆ ఫామ్‌పై లేవు. తుపాకితో బెదిరించడంతో కేవలం ప్రాణభయంతోనే ఆ ఫామ్‌పై సంతకాలు చేసి అక్కడి నుంచి బయటపడ్డారు. షేర్ల బదిలీకి సమ్మతించని సోదరులు ప్రాణభయంతో ఆ ఫామ్‌పై సంతకం చేసినప్పటికీ తమ వాటా షేర్లను బదిలీ చేసేందుకు యూరి రెడ్డి, మార్టిన్ రెడ్డి సమ్మతించలేదు. అందుకే వారు రామోజీరావు ఇచ్చిన చెక్కును నగదుగా మార్చుకోలేదు. ఆ చెక్కును నగదుగా మారిస్తే షేర్ల బదిలీకి సమ్మతించినట్టు అవుతుంది. అందుకే వారు ఆ చెక్కును నగదుగా మార్చకుండా అలానే ఉంచారు. నిజానికి.. షేర్లు బదిలీ చేయాలంటే ఒక్క పత్రంపై సంతకం చేస్తే సరిపోదు. అందుకు సంబంధించిన చాలా పత్రాలపై సంతకాలు చేయాలి. చిట్‌ఫండ్స్ చట్టం, కంపెనీల చట్టం ప్రకారం నిర్దేశించిన అన్ని పత్రాలపై తాను సంతకాలు చేయలేదు కాబట్టి తాను షేర్లు బదిలీ చేసినట్లు కాదని యూరి రెడ్డి ధీమాగా ఉన్నారు. రామోజీరావు ఇచ్చిన చెక్కును నగదుగా మార్చుకోలేదు కాబట్టి షేర్ల బదిలీకి అంగీకరించలేదనడానికి బలమైన సాక్ష్యంగా ఉందని ఆయన భావించారు. ప్రాణభయంతో మరోసారి రామోజీని సంప్రదించేందుకు సాహసించలేదు. తమ షేర్లపై రావల్సిన డివిడెండ్‌ను కూడా అడగలేకపోయారు. దీంతో 2016 నాటికి ఒక్కోటి రూ.55,450 విలువ చేసే 288 షేర్లు అంటే రూ.1,59,69,600 మూలధన విలువైన షేర్లు ఆయన పేరిట ఉన్నాయి. ఫోర్జరీ సంతకాలతో అక్రమంగా బదిలీ కానీ అక్రమాల్లో ఆరితేరిన రామోజీ మాత్రం ఫోర్జరీ సంతకాలతో జీజే రెడ్డి షేర్లను తన కోడలు శైలజ కిరణ్ పేరిట బదిలీ చేసేశారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలపై ఇటీవల ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాంతో కాస్త ధైర్యం చేసుకుని యూరి రెడ్డి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో తన షేర్ల గురించి తెలుసుకోవాలని భావించారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయంలో పరిశీలించగా ఆయన పేరిట ఒక్క షేర్ కూడా లేదని తెలుసుకుని విస్తుపోయారు. ఆయన పేరిట ఉన్న 288 షేర్లను 2016లోనే శైలజ కిరణ్ పేరిట బదిలీ చేసినట్లు రికార్డుల్లో ఉంది. తాను సంతకాలు చేయకుండా ఎలా బదిలీ చేశారా అని పరిశీలిస్తే అసలు బాగోతం బయటపడింది. యూరి రెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసి మరీ ఆయన వాటా షేర్లను శైలజ కిరణ్ పేరిట అక్రమంగా బదిలీ చేసేసినట్లు వెల్లడైంది. షేర్ల బదిలీకి కంపెనీల చట్టంలో నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించకుండానే రామోజీరావు ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో కథ నడిపించేశారు. రామోజీ, శైలజలపై సీఐడీ కేసు జీజే రెడ్డి పెద్ద కుమారుడు మార్టిన్ రెడ్డి ప్రస్తుతం విదేశాల్లో ఉండగా.. రెండో కుమారుడు యూరి రెడ్డి భారత్‌లో నివసిస్తూ తమ కుటుంబ ఆస్తి వ్యవహా రాలను పర్యవేక్షిస్తున్నారు. తమ షేర్లను రామోజీ రావు, శైలజ కిరణ్ ఫోర్జరీ పత్రాలతో అక్రమంగా బదిలీ చేసుకున్నారని యూరి రెడ్డి ఏపీ సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎందుకంటే కృష్ణా జిల్లాలోని తమ స్వగ్రామంలోని ఆస్తుల నుంచి సేకరించిన నిధులనే జీజే రెడ్డి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టారు. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లో 37 బ్రాంచి కార్యాలయాల ద్వారా మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దీనిపై న్యాయ నిపుణులను సంప్రదించిన తరువాతే యూరి రెడ్డి తన షేర్ల అక్రమ బదిలీపై ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిర్థారించుకున్న తరువాత సీఐడీ విభాగం కేసు నమోదు చేసింది. ఏ–1గా చెరుకూరి రామోజీరావు, ఆయన కోడలు చెరుకూరి శైలజ కిరణ్‌ను ఏ–2గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వారిపై ఐపీసీ సెక్షన్లు 420, 467, 120–బి రెడ్‌విత్ 34 కింద అభియోగాలు నమోదు చేసింది. -
అయినా రామోజీ మారలేదు... అక్రమ డిపాజిట్లు ఆగలేదు
సాక్షి, అమరావతి : ఈనాడు పత్రికాధిపతిగా శ్రీరంగ నీతులు వల్లించే చెరుకూరి రామోజీరావు.. ‘మార్గదర్శి’ అధినేతగా యథేచ్ఛగా ఆర్థిక దోపిడీకి పాల్పడుతుంటారు. చట్టాలను ఎడాపెడా ఉల్లంఘిస్తూ ఆయన సాగించే ఆర్థిక దోపిడీకి ఈనాడు పత్రికను రక్షా కవచంగానే వాడుకుంటున్నారన్నది నగ్న సత్యం. మరోవైపు చంద్రబాబుకు రాజగురువు కాబట్టి తాను చట్టాలకు అతీతమని భావిస్తూ ఉంటారు. పత్రికాధిపతి కాబట్టి ఆయన అక్రమాలను ఎవరూ ప్రశ్నించకూడదని వాదిస్తూ ఉంటారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం చేపట్టిన కఠిన కార్యాచరణతో ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ను మూసివేసుకోవాల్సి వచ్చినా, అక్రమ డిపాజిట్ల దందాను మాత్రం విడిచిపెట్టలేదు. ‘మార్గదర్శి చిట్‌ఫండ్స్’ పేరిట డిపాజిట్లు యథేచ్చగా వసూలు చేస్తూ భారీగా ఆర్థిక అక్రమాలను కొనసాగించారు. కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం, రాష్ట్ర డిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ చట్టాలను దర్జాగా ఉల్లంఘిస్తూ అక్రమ డిపాజిట్లు వసూలు చేసి ఆ నిధులను సొంత ప్రయోజనాల కోసం దారి మళ్లించారు. గత ఏడాది స్టాంపులు, రిజిస్ట్రేషన్లు శాఖ, సీఐడీ అధికారులు రాష్ట్రంలోని 38 మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో చేసిన సోదాలతో ఈ ఆర్థిక దోపిడీ ఆధారాలతో సహా బట్టబయలైంది. దాంతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ చైర్మన్ చెరుకూరి రామోజీరావు ఏ–1గా, ఆయన పెద్ద కోడలు, మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ చెరుకూరి శైలజ ఏ–2గా, మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచి మేనేజర్లను ఏ–3గా సీఐడీ కేసు నమోదు చేసింది. వారిపై సెక్షన్లు 120 (బి), 409, 420, 477 (ఎ) రెడ్‌విత్ 34 సీఆర్సీపీ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే మార్గదర్శి చిట్‌ఫండ్స్ మేనేజర్లను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. రామోజీరావు, శైలజ కిరణ్‌ను విచారించి కీలక సమాచారాన్ని రాబట్టారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ముసుగులో రామోజీరావు సాగించిన ఆర్థిక దోపిడీ తీరు ఇదిగో ఇలా ఉంది... భారీగా అక్రమ డిపాజిట్ల సేకరణ కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం–1982, బ్యానింగ్ ఆఫ్ నాన్ రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్స్( బీఎన్డీఎస్)–1999 చట్టాలను ఉల్లంఘిస్తూ మార్గదర్శి చిట్‌ఫండ్స్ ముసుగులో రామోజీరావు యథేచ్ఛగా అక్రమంగా డిపాజిట్లను సేకరించారు. ఆ రెండు చట్టాల ప్రకారం చిట్‌ఫండ్ కంపెనీలు వాటి ఖాతాదారులు, ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించకూడదు. కానీ ఈ చట్టాన్ని రామోజీరావు ఏమాత్రం పట్టించుకోకుండా యథేచ్ఛగా అక్రమ డిపాజిట్లు సేకరించారు. రశీదు రూపంలో డిపాజిట్లు సేకరించారు. యాజమాన్య కోటా టికెట్ల పేరుతో అక్రమాలకు పాల్పడ్డారు. చందాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా రామోజీ సొంత కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్‌లో అక్రమ పెట్టుబడులుగా పెట్టి భారీగా సొంత ఆస్తులు పెంచుకున్నారు. రశీదుల ముసుగులో అక్రమ డిపాజిట్లే రశీదులు, భవిష్యత్ చిట్టీలకు ష్యూరిటీల పేరుతో రామోజీరావు అక్రమ డిపాజిట్ల దందా కొనసాగిస్తున్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థలో చిట్టీ పాడిన చందాదారులకు వారికి రావాల్సిన సొమ్ములో మొత్తం చెల్లించడంలేదు. అందులో కొంత సొమ్మును సంస్థ వద్ద డిపాజిట్‌గా ఉంచుకుంటోంది. ఆమేరకు ఓ రశీదు ఇస్తోంది. అలా రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు చందాదారుల నుంచి రశీదు రూపంలో డిపాజిట్లు సేకరిస్తోంది. ఆ డిపాజిట్లపై 4 శాతం, 5 శాతం వడ్డీ చెల్లిస్తామని చెబుతోంది. ఏదైనా ఆర్థిక సంస్థ ఖాతాదారుల నగదును దాని వద్ద అట్టిపెట్టుకుని దానిపై వడ్డీ చెల్లిస్తామని లిఖితపూర్వకంగా తెలిపితే దానిని డిపాజిట్‌గానే పరిగణిస్తారు. అలా డిపాజిట్లు సేకరించాలంటే ఆర్బీఐ నిబంధనలను అనుసరించాలి. ఆర్బీఐ నిబంధన ప్రకారం చిట్‌ఫండ్స్ సంస్థలు డిపాజిట్లు వసూలు చేయకూడదు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ రశీదు ముసుగులో డిపాజిట్లు సేకరిస్తోంది. ఇక చందాదారుల నుంచి ష్యూరిటీ తీసుకోవడానికి కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం నిర్దేశించిన విధానాలకు విరుద్ధంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ వ్యవహరిస్తోంది. జాతీయ/షెడ్యూల్డ్ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల పత్రాలు, బంగారు ఆభరణాలు, లైఫ్ ఇన్సూ్యరెన్స్ పత్రాలు, స్థిరాస్తి పత్రాలు గానీ ముగ్గురు వ్యక్తుల హామీ గానీ ష్యూరిటీగా తీసుకోవాలని చట్టం నిర్దేశించింది. అంతే కానీ, చిట్టీ పాట కింద చెల్లించాల్సిన మొత్తంలోనే కొంత ష్యూరిటీగా అట్టిపెట్టుకోడానికి అవకాశం లేదు. కానీ రామోజీరావు తమ చందాదారుల చిట్టీ పాట మొత్తం నుంచి కొంత భాగాన్ని ష్యూరిటీ పేరుతో అట్టిపెట్టుకుంటున్నారు. ఆ పేరుతో అక్రమంగా డిపాజిట్లు వసూలు చేస్తున్నారు. యాజమాన్య టికెట్ల పేరుతో దందా యాజమాన్య కోటా పేరుతో చిట్టీ గ్రూపుల్లోని టికెట్ల ముసుగులో రామోజీరావు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. చిట్‌ఫండ్ కంపెనీలు వేసే చిట్టీలలో నిర్ణీత చందాదారుల సంఖ్య (వీటిని టికెట్స్ అని వ్యవహరిస్తారు)లో కొన్ని ఖాళీగా ఉండిపోతాయి. అలా ఖాళీగా ఉండిపోయే టికెట్స్‌ను ఆ కంపెనీ తీసుకోవాలి. ఆ టికెట్స్‌పై చందాను కంపెనీయే చెల్లించాలి. తరువాత కొత్త చందాదారులు వస్తే వాటితో ఆ టికెట్స్‌ను భర్తీ చేయవచ్చు. చిట్‌ఫండ్ చట్టంలోని సెక్షన్లు 27, 32లలో స్పష్టంగా నిర్దేశించిన ఈ నిబంధనలను రామోజీరావు ఏనాడూ పట్టించుకోలేదు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఏర్పాటు చేసినప్పుడు ప్రతి చిట్టీలోనూ కనీసం ఒకటి నుంచి 50శాతం టికెట్లను సొంతంగా కలిగి ఉంటామని పేర్కొంది. కానీ, తమ పేరుతో ఉన్న టికెట్లపై చందాను ఏనాడూ చెల్లించలేదు. కేవలం ఒక చిట్టీలోని తమ పేరుతో ఉన్న టికెట్లకు చెల్లించాల్సిన మొత్తాన్ని మరో చిట్టీలోని టికెట్లపై డిస్కౌంట్ మొత్తం నుంచి.., మళ్లీ ఆ చిట్టీలోని తమ టికెట్లను మరో చిట్టీలోని డిస్కౌంట్ మొత్తం నుంచి మళ్లించినట్టు రికార్డుల్లో కనికట్టు చేసింది. అంటే సంస్థ పేరిట ఉన్న టికెట్లపై మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందా ఏనాడూ చెల్లించలేదు. కేవలం రికార్డుల్లో జంబ్లింగ్ అంటే బుక్ అడ్జస్ట్మెంట్స్ ద్వారా చూపించి చందాదారులను మోసం చేసింది. మళ్లీ తమ టికెట్లపై చందా పాట మొత్తాన్ని మాత్రం వసూలు చేసుకుంటోంది. ఆ విధంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఒక్క రూపాయి కూడా చందాగా పెట్టకుండానే భారీగా చందాదారుల సొమ్మును దాని ఖాతాల్లోకి మళ్లించుకుంటోంది. ఆ ఒక్క బ్యాంకు ఖాతా... రామోజీ దోపిడీకి కేంద్ర బిందువు బ్యాంకు ఖాతాల నిర్వహణలోనూ రామోజీరావు నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. చిట్‌ఫండ్ సంస్థలు ప్రతి చిట్టీకి ఓ ప్రత్యేక బ్యాంకు ఖాతా నిర్వహించాలి. ఆ చిట్టీకి సంబంధించిన చందాల వసూళ్లు, చెల్లింపులు దాని ద్వారానే జరగాలి. ఇలా ఏ ఏ బ్యాంకు ఖాతాల ద్వారా చిట్టీలు నిర్వహిస్తారో వెల్లడించాలి. ఈ నిబంధనలను మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఉల్లంఘిస్తోంది. అన్ని చిట్టీల చందా మొత్తాలను ఒకే బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది. చిట్టీల ఒప్పందాల్లో కేవలం బ్యాంకు పేరునే పేర్కొంటోంది గానీ, బ్యాంకు ఖాతాల నంబర్లు, ఇతర వివరాలను ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తోంది. తద్వారా ఒక బ్యాంకు ఖాతాలో భారీ మొత్తాన్ని పోగేస్తోంది. రామోజీరావు ఇలా చేయడం వెనుక అతి పెద్ద ఆర్థిక కుతంత్రం దాగుంది. నిబంధనల ప్రకారం చిట్టీల బ్యాంకు ఖాతాలపై చిట్çœండ్ సంస్థ బ్రాంచి మేనేజర్ (ఫోర్మేన్)కు చెక్ పవర్ ఉండాలి. ఆ మేనేజరే చందాదారులకు చిట్టీ మొత్తాన్ని చెల్లించడంతోపాటు ఆన్లైన్ వ్యవహారాలు నిర్వహించాలి. కానీ మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థలో ఏ బ్రాంచి మేనేజర్‌కూ చెక్ పవర్ ఇవ్వలేదు. చెక్ పవర్ అంతా ప్రధాన కార్యాలయం వద్దే అట్టిపెట్టారు. రామోజీరావు, శైలజ కిరణ్‌తోపాటు ప్రధాన కార్యాలయంలో ఉన్న కొద్దిమందికే చెక్ పవర్ కల్పించారు. సొమ్ము చందాదారులది.. సోకు రామోజీది కేంద్ర చట్టం ప్రకారం చిట్‌ఫండ్ కంపెనీలు చందాదారుల సొమ్మును ఇతర కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టకూడదు. కానీ రామోజీరావు మాత్రం చందాదారుల సొమ్మును సొంత ఆర్థిక ప్రయోజనాల కోసం అక్రమ పెట్టుబడులుగా మళ్లిస్తున్నారు. తమ కుటుంబ సభ్యులే డైరెక్టర్లుగా ఉన్న ఉషా కిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఉషోదయ ఎంటర్‌ప్రైజస్, మార్గదర్శి చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్–చెన్నై, మార్గదర్శి చిట్స్ (కర్ణాటక) ప్రైవేట్ లిమిటెడ్–బెంగళూరులో అక్రమ పెట్టుబడులుగా తరలించారు. ఆ కంపెనీల్లో ఏకంగా 88.5% వాటా పెట్టుబడిగా పెట్టడం గమనార్హం. దాంతోపాటు ముంబయిలోని పలు మ్యూచువల్ ఫండ్స్‌లో అక్రమ పెట్టుబడులు పెట్టారు. రామోజీరావు సొంతంగా ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా చందాదారుల సొమ్మును అక్రమంగా పెట్టుబడులుగా మళ్లిస్తూ భారీగా అక్రమ ఆదాయాన్ని పొందుతున్నారు. -
ముమ్మాటికీ ఆర్థిక నేరస్తుడే
ఈనాడు పత్రికాధిపతి చెరుకూరి రామోజీరావు ఆర్థిక నేరస్తుడే అన్నది నిగ్గు తేలింది. టీడీపీ అధినేత చంద్రబాబు రాజగురువు రామోజీ ఆర్థిక ఉగ్రవాదేనన్నది స్పష్టమైంది. ‘మార్గదర్శి’ ముసుగులో భారీగా నల్లధనం దందా నిర్వహిస్తున్నారన్నదీ రూఢీ అయ్యింది. అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు తొడుక్కున్న ‘పత్రికా స్వేచ్ఛ’ అనే ముసుగు తొలగిపోయింది. చట్టాలను ఉల్లంఘిస్తూ ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డ రామోజీ నిజ రూపంలో అవినీతి దిగంబరుడుగా నిలబడ్డారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్లు వసూలు చేసిందని ఆర్బీఐ స్పష్టం చేయడంతో ఈ కేసులో తరువాత పరిణామాలు ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. అక్రమ డిపాజిట్ల కేసు నిరూపితమైతే ఏకంగా రెట్టింపు జరిమానా అంటే రూ.5,200 కోట్ల జరిమానాతోపాటు కనీసం రెండేళ్ల నుంచి యావజ్జీవ జైలు శిక్ష విధించే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో గుట్టుచప్పుడు కాకుండా ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ పేరిట ఏళ్ల తరబడి సాగించిన అక్రమ డిపాజిట్ల వసూళ్లు.. నల్లధనం దందాపై 2006లో అప్పటి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఎట్టకేలకు ఫలించాయి. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట రామోజీరావు అక్రమ డిపాజిట్లు వసూలు చేశారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సుప్రీంకోర్టుకు విస్పష్టంగా నివేదించింది. దాంతో రామోజీ అవినీతి ఆట కట్టిందని, ఇక శిక్ష పడటమే మిగిలిందని నిపుణులు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కనీసం రెండేళ్ల నుంచి గరిష్టంగా యావజ్జీవ జైలు శిక్ష పడే అవకాశం ఉందని కూడా చెబుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. దాంతో మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట రామోజీరావు సాగించిన ఆర్థిక అక్రమాల కథ కమామీషు మరోసారి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 2006లో అప్పటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ప్రశి్నంచే వరకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ అనే సంస్థ ఉన్నట్టు కూడా సామాన్యులకు తెలియదు. రాష్ట్రం అంతటా ‘మార్గదర్శి చిట్ ఫండ్స్’ కార్యాలయాలే కనిపిస్తూ ఉండేవి. కానీ ఆ కార్యాలయాల్లోనే గుట్టు చప్పుడు కాకుండా ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ పేరిట మరో కంపెనీ ఆర్థిక కార్యకలాపాలు సాగించేదనే విషయం బయటి ప్రపంచానికి తెలీదు. అలా 1997 నుంచి 2006 వరకు మార్గదర్శి ఫైనాన్సియర్స్ యథేచ్ఛగా కార్యకలాపాలు సాగించింది. భారీగా అక్రమ డిపాజిట్లు సేకరణ ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా రామోజీరావు మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట భారీగా అక్రమ డిపాజిట్లు సేకరించారు. డిపాజిట్ల సేకరణ పేరిట ప్రజలను మోసం చేయకుండా కట్టడి చేసేందుకు ఆర్బీఐ స్పష్టమైన విధి విధానాలను నిర్దేశించింది. ఆర్బీఐ చట్టంలోని 45ఎస్ ప్రకారం కంపెనీల చట్టం ప్రకారం నమోదైన ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు మాత్రమే ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించాలి. రామోజీరావు తన గ్రూపు సంస్థలను ‘హిందూ అవిభాజ్య కుటుంబం(హెచ్‌యూఎఫ్) కింద నమోదు చేసినట్టుగా పేర్కొన్నారు. హెచ్‌యూఎఫ్ కింద నమోదైన కంపెనీలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయకూడదు. కానీ చట్టానికి తాను అతీతం అని భావించే రామోజీ ఈ నిబంధనను నిర్భీతిగా బేఖాతరు చేశారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట యథేచ్ఛగా డిపాజిట్లు వసూలు చేశారు. 2006లో మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చే నాటికి ఏకంగా రూ.2,600 కోట్ల అక్రమ డిపాజిట్లను సేకరించడం విభ్రాంతికర వాస్తవం. కాగా మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై కేసు న్యాయస్థానంలో విచారణలో ఉండగా మరో రూ.2 వేల కోట్ల వరకు అక్రమ డిపాజిట్లు సేకరించారని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది నిరంజన్ రెడ్డి సుప్రీంకోర్టుకు నివేదించడం ప్రాధాన్యం సంతరించుకుంది. తప్పు ఒప్పుకోక తప్పని రామోజీ మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల దందా బయటపడటంతో రామోజీరావు కంగుతిన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమాలపై దర్యాప్తు చేసేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు రంగాచారిని విచారణ అధికారిగా నియమించింది. ఈ అక్రమాలపై సీఐడీ తరపున న్యాయ స్థానాల్లో కేసులు దాఖలు చేసేందుకు టి.కృష్ణంరాజును అధీకృత అధికారిగా నియమించింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట ఏకంగా రూ.2,600 కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించినట్టు వీరు గుర్తించారు. కాగా తాము చట్టాన్ని ఉల్లంఘించలేదని బుకాయించేందుకు రామోజీ యత్నించారు. హెచ్యూఎఫ్గా తాము ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించవచ్చని అడ్డగోలుగా వాదించారు. కానీ సెక్షన్ 45 ఎస్ ప్రకారం హెచ్‌యూఎఫ్‌లు డిపాజిట్లు సేకరించకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది. దాంతో తాము తప్పు చేసినట్టు రామోజీరావు అంగీకరించారు. నగదు రూపంలో డిపాజిట్లు వసూలు చేసినట్టు కూడా సమ్మతించారు. తమ తప్పును అంగీకరిస్తూ డిపాజిట్‌దారులకు వారి డిపాజిట్లను తిరిగి చెల్లించేస్తామని, మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను మూసి వేస్తామని న్యాయస్థానానికి లిఖిత పూర్వకంగా తెలిపారు. వివరాలు చెప్పం అని వితండవాదం తాము అక్రమంగా వసూలు చేసిన డిపాజిట్లను సంబంధిత డిపాజిట్‌దారులకు తిరిగి చెల్లించేశామని రామోజీరావు న్యాయస్థానానికి తెలిపారు. కాగా అక్రమ డిపాజిట్లు ఎవరెవరి నుంచి సేకరించారు.. ఎవరెవరికి తిరిగి చెల్లించారో ఆ వివరాలు వెల్లడించాలని సీఐడీ, ఉండవల్లి అరుణ్‌కుమార్ కోరినప్పటికీ రామోజీరావు సమ్మతించ లేదు. ఆ వివరాలు తాము వెల్లడించాల్సిన అవసరం లేదని వితండవాదం చేశారు. కాగా అక్రమంగా డిపాజిట్లు వసూలు చేసిన రామోజీరావును ప్రాసిక్యూట్ చేయాలని అదీకృత అధికారి కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను ఉమ్మడి హైకోర్టు తన చివరి పనిదినాన కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ.. డిపాజిట్ దారుల వివరాలు వెల్లడించాలని కోరుతూ ఉండవల్లి అరుణ్‌కుమార్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ఏపీ ప్రభుత్వం 2022లో ఇంప్లీడ్ అయ్యింది. డిపాజిట్‌దారుల వివరాలు వెల్లడించాల్సిందేనని సుప్రీంకోర్టు గత ఏడాది పేర్కొంది. కానీ ఇంతవరకు రామోజీరావు తమ డిపాజిట్‌దారుల వివరాలను వెల్లడించకపోవడం గమనార్హం. నల్లధనం దందా వల్లే గప్‌చుప్ ► మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించిన ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ ముసుగులో రామోజీరావు భారీగా నల్లధనం దందాను సాగించారు. సీఐడీ సోదాల్లో, ఆదాయ పన్ను శాఖ తనిఖీల్లో ఆ విషయం వెలుగు చూసింది. అందుకే తమ సంస్థలో డిపాజిట్‌దారుల వివరాలను వెల్లడించేందుకు రామోజీరావు ససేమిరా అంటున్నారు. ► 2006 నాటికే ఏకంగా 32,385 మంది నుంచి రూ.2,600 కోట్ల వరకు అక్రమంగా డిపాజిట్లు సేకరించారని వెల్లడైంది. కానీ వారి పేర్లు, వివరాలను మాత్రం వెల్లడించేందుకు రామోజీరావు ససేమిరా అంటుండటం గమనార్హం. ఎందుకంటే ఆ డిపాజిట్ల ముసుగులో టీడీపీ పెద్దలు భారీగా నల్లధనాన్ని చలామణిలోకి తీసుకువచ్చారు. అందుకే సీఐడీతోపాటు న్యాయస్థానం కోరినప్పటికీ వారి వివరాలను వెల్లడించేందుకు సమ్మతించడం లేదు. ► కేంద్ర ఆదాయపన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించి నల్లధనం దందా నడిపారు. రూ.20 వేలకు మించిన లావాదేవీలు నగదు రూపంలో తీసుకోకూడదని ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 269 స్పష్టం చేస్తోంది. కానీ మార్గదర్శి ఫైనాన్సియర్స్‌లో దాదాపు అన్ని డిపాజిట్లు కూడా నగదు రూపంలోనే తీసుకోవడం గమనార్హం. నగదు రూపంలో డిపాజిట్లు స్వీకరించి తమ సిబ్బంది ద్వారా డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ), పే ఆర్డర్లు(పీఓ)ల రూపంలోకి మార్చినట్టు ఆదాయ పన్ను శాఖ అధికారుల తనిఖీల్లో బయట పడింది. డిపాజిట్ చేసిన మొత్తాలు రూ.50 వేలకు మించి ఉన్నప్పటికీ వాటిని రూ.50 వేల కంటే తక్కువ మొత్తాలుగా విభజించి మరీ డీడీలు, పీఓ లుగా మార్చింది. ► మార్గదర్శి ఫైనాన్సియర్స్ రశీదు రూపంలో సేకరించిన డిపాజిట్ల పత్రాలను పరిశీలిస్తే అదంతా నల్లధనం బాగోతమేనన్నది స్పష్టమవుతోంది. డిపాజిట్‌దారుల పాన్ నంబర్లు, పూర్తి చిరునామాలు కూడా లేకుండానే డిపాజిట్లు సేకరించడం గమనార్హం. ► మార్గదర్శి ఫైనాన్సియర్స్ డిపాజిట్‌దారులకు చెల్లించాల్సిన మొత్తం రూ.2,610.38 కోట్లుగా రామోజీరావు 2006లో తమ అఫిడవిట్లో పేర్కొన్నారు. కానీ 2008లో సమర్పించిన అఫిడవిట్లో రూ.1,864.10 కోట్లు చెల్లించేశామని తెలిపారు. మరి మిగిలిన రూ.800 కోట్ల డిపాజిట్లు ఏమయ్యాయనే విషయంపై మౌనం వహించారు. గుట్టుచప్పుడు కాకుండా రికార్డుల నుంచి తొలగించిన ఆ రూ.800 కోట్లు రామోజీకి అత్యంత సన్నిహితుడైన పచ్చ బాబు, ఆయన గ్యాంగ్వే అని తెలుస్తోంది. పోనీ చెల్లించామని చెబుతున్న రూ.1,864.10 కోట్ల డిపాజిట్లు ఎవరెవరికి చెల్లించారో చెప్పడానికి రామోజీ ససేమిరా అంటున్నారు. -
కారు, ఆటో ఢీ... ముగ్గురి దుర్మరణం
బేస్తవారిపేట: నిద్రమత్తులో కారు... ఆటోను ఢీకొట్టి న ఘటనలో ఇద్దరు రైతులు, సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలోని పూసలపాడు రహదారిపై మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ షేక్ ఖాశీంషా, కారులోని బైనగాని ఓబయ్య, గురవయ్య తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే... బేస్తవారిపేట మండలంలోని ప్రకాశం జిల్లా, బార్లకుంటకు చెందిన చిత్తారు వెంకటేశ్వర్లు (53), చిత్తారు రాములు (40), బిళ్ల చిన్నవెంకటేశ్వర నాయుడు కలిసి ఎండుమిర్చి పంటను అమ్ముకునేందుకు గుంటూరు మిర్చియార్డుకు వెళా్లరు. విక్రయించిన సొమ్ముతో గుంటూరులో రైలు ఎక్కారు. కంభంలో దిగాల్సి ఉండగా, నిద్రపోవడంతో గిద్దలూరులో దిగారు. అక్కడ నుంచి బేస్తవారిపేటకు వచ్చేందుకు ఆటో ఎక్కారు. మరోవైపు విజయవాడలో కొత్తగా కొనుగోలు చేసిన కారును తీసుకుని తండ్రీకొడుకులు ఓబయ్య, గురవయ్య వెళుతూ మార్గమధ్యంలో నిద్రమత్తులో పూసలపాడు వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టారు. దీంతో ఆటో నుజ్జు నుజ్జు అయ్యింది. అందులో ఇరుక్కుపోయిన ముగ్గురిలో వెంకటేశ్వర్లును రోడ్డుపై వెళ్లే వాహనదారులు బయటకు తీశారు. ఆ సమయానికే అతడు మృత్యువాత పడ్డాడు. రాములు, చినవెంకటేశ్వర నాయుడు ఆటోలో చిక్కుకుపోయారు. ఈలోగా లీకైన ఆయిల్ ట్యాంక్ నుంచి మంటలు వ్యాపించడంతో ఇద్దరి శరీరాలు కాలిపోయాయి. వారి వద్ద మిర్చి పంట విక్రయించిన సొమ్ము రూ.10లక్షలు కాలి బూడిదైపోయాయి. మృతుడు చిన్న వెంకటేశ్వర నాయుడు సీఎస్‌పురం మండలం, నల్లమడుగుల సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. -
‘ఫైబర్’ ఫ్రాడ్ సూత్రధారి బాబే
సాక్షి, అమరావతి: కేంద్ర నిధులతో చేపట్టిన ఫైబర్ నెట్ ప్రాజెక్టు స్కామ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు లూటీకి సంబంధించి కీలక ఆధారాలను సేకరించిన సీఐడీ శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. తనకు సన్నిహితుడైన, నేర చరిత్ర కలిగిన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి అడ్డగోలుగా ఈ ప్రాజెక్టును కట్టబెట్టి చంద్రబాబు ప్రజాధనాన్ని స్వాహా చేసినట్లు ఆధారాలతో నిగ్గు తేల్చింది. ఈ నేపథ్యంలో ఏ 1గా మాజీ సీఎం చంద్రబాబు, ఏ 2గా టెరాసాఫ్ట్ ఎండీ వేమూరి హరికృష్ణ, ఏ 3గా ఏపీ ఫైబర్‌నెట్ కార్పొరేషన్, ఇన్‌క్యాప్ సంస్థల మాజీ ఎండీ కోగంటి సాంబశివరావు (ప్రస్తుతం ద.మ. రైల్వేలో చీఫ్ కమర్షియల్ మేనేజర్)తోపాటు మరికొందరిని నిందితులుగా పేర్కొంది. వారిపై ఐపీసీ సెక్షన్లు 166, 167, 418, 465, 468, 471, 409, 506 రెడ్ విత్ 120(బి)లతోపాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(2), రెడ్ విత్ 13(1)(సి)(డి) ప్రకారం కేసులు నమోదు చేసింది. ఫైబర్‌నెట్ పేరుతో చంద్రబాబు బృందంప్రజాధనాన్ని ఎలా కొల్లగొట్టిందీ సీఐడీ తన చార్జ్‌షీట్‌లో సవివరంగా పేర్కొంది. ఎఫ్ఐఆర్ నమోదు సమయంలో చంద్రబాబును ఏ 25గా పేర్కొనగా అనంతరం దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా తాజాగా చార్జ్‌షీట్‌లో ఏ1గా చేర్చారు. ఈ వెసులుబాటు దర్యాప్తు సంస్థలకు ఉంది. ఐటీ శాఖకు బదులుగా.. టెరాసాఫ్ట్‌కు ఫైబర్‌నెట్ ప్రాజెక్టును కట్టబెట్టడం ద్వారా చంద్రబాబు యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. మొత్తం రూ.2 వేల కోట్ల విలువైన ప్రాజెక్టు మొదటి దశలో రూ.333 కోట్ల పనుల్లో అక్రమాలకు బరితెగించారు. ఈ ప్రాజెక్టును ఐటీ శాఖ చేపట్టాల్సి ఉండగా విద్యుత్, మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల శాఖ ద్వారా చేపట్టాలని స్వయంగా ఆదేశించారు. నాడు ఈ శాఖలను చంద్రబాబే నిర్వహించడం గమనార్హం. బిడ్లు.. టెండర్లు వేమూరివే వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్‌కే ఈ ప్రాజెక్టును అప్పగించాలని ముందే నిర్ణయించుకున్న చంద్రబాబు పక్కాగా కథ నడిపారు. అందుకోసం వేమూరిని ఏపీ ఈ–గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యుడిగా చేర్చారు. నేర చరిత్ర ఉన్న ఆయన్ను కీలక స్థానంలో నియమించి పనులు చక్కబెట్టారు. నిబంధనలను విరుద్ధంగా ఫైబర్‌నెట్ టెండర్ల మదింపు కమిటీలో సభ్యుడిగా కూడా నియమించారు. ప్రాజెక్టు బిడ్లు దాఖలు చేసే కంపెనీకి చెందిన వ్యక్తులు నిబంధనల ప్రకారం టెండర్ల మదింపు కమిటీలో ఉండకూడదు. చంద్రబాబు దీన్ని తుంగలోకి తొక్కారు. అమాంతం విలువ పెంచేసి... ప్రాజెక్ట్ విలువను అడ్డగోలుగా నిర్ణయించారు. ఎలాంటి మార్కెట్ సర్వే చేపట్టకుండా సరఫరా చేయాల్సిన పరికరాలు, నాణ్యతను ఖరారు చేసి ప్రాజెక్ట్ విలువను అమాంతం పెంచేశారు. వేమూరి హరికృష్ణ, నాటి ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఎండీ కోగంటి సాంబశివరావు ఇందులో కీలక పాత్ర పోషించారు. బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించి మరీ.. ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ చేపట్టేనాటికి టెరాసాఫ్ట్ ప్రభుత్వ బ్లాక్ లిస్ట్‌లో ఉంది. పౌర సరఫరాల శాఖకు ఈ – పోస్ యంత్రాల సరఫరాలో విఫలమైన టెరాసాఫ్ట్‌ను అధికారులు బ్లాక్ లిస్టులో చేర్చారు. చంద్రబాబు ఆ కంపెనీని ఏకపక్షంగా బ్లాక్ లిస్టు నుంచి తొలగించారు. పోటీలో ఉన్న ఇతర కంపెనీలను పక్కనబెట్టేశారు. దీనిపై పేస్ పవర్ అనే కంపెనీ అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఖాతరు చేయలేదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను సైతం సాంకేతిక కారణాలతో అనర్హులుగా పేర్కొంటూ టెరాసాఫ్ట్‌కే ప్రాజెక్టును కట్టబెట్టారు. టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని పట్టుబట్టిన అధికారి బి.సుందర్‌ను హఠాత్తుగా బదిలీ చేసి తమకు అనుకూలమైన వ్యక్తులను నియమించుకున్నారు. టెండర్ల ప్రక్రియ మొదలైన తరువాత టెరాసాఫ్ట్ తమ కన్సార్షియంలో మార్పులు చేసి సాంకేతికంగా అధిక స్కోర్ సాధించేందుకుగా వివిధ పత్రాలను ట్యాంపర్ చేశారు. అమలు లోపభూయిష్టం ప్రాజెక్టును అమలు చేయడంలో టెరాసాఫ్ట్ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. టెండర్ నోటిఫికేషన్ నాణ్యత ప్రమాణాలను ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో 80 శాతం ప్రాజెక్టు పనులు నిరుపయోగంగా మారాయి. మరోవైపు షెల్ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని అక్రమంగా తరలించారు. వేమూరి హరికృష్ణ తన సన్నిహితుడైన కనుమూరి కోటేశ్వరరావు సహకారంతో వ్యవహారాన్ని నడిపించారు. వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో కనుమూరి కోటేశ్వరరావు భాగస్వామిగా ఉన్నాడు. వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్‌కుమార్ రామ్మూర్తిలతో కలసి విజయవాడ కేంద్రంగా నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ ఎల్ఎల్పీ అనే మ్యాన్ పవర్ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్ కంపెనీని సృష్టించారు. ఆ కంపెనీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుకు సిబ్బందిని సమకూర్చినట్లు, పర్యవేక్షించినట్లు కాగితాలపై చూపించారు. ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్, ఇతర కంపెనీలకు చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రూ.284 కోట్లు విడుదల చేసింది. నకిలీ ఇన్వాయిస్లతో ఆ నిధులను కొల్లగొట్టి కనుమూరి కోటేశ్వరరావు ద్వారా అక్రమంగా తరలించారు. వాటిలో రూ.144 కోట్లను షెల్ కంపెనీల ద్వారా తరలించారు. నాసిరకమైన పనులతో ప్రభుత్వ ఖజానాకు రూ.119.8 కోట్ల నష్టం వాటిల్లిందని నిగ్గు తేలింది. కీలక అధికారుల వాంగ్మూలం.. ఫైబర్‌నెట్ కుంభకోణంపై కేసు నమోదు చేసిన సీఐడీ కీలక ఆధారాలను సేకరించింది. ఇండిపెండెంట్ ఏజెన్సీ ఐబీఐ గ్రూప్ ద్వారా ఆడిటింగ్ జరపడంతో అవినీతి మొత్తం బట్టబయలైంది. టెరాసాఫ్ట్ కంపెనీ నిబంధనలను ఉల్లంఘించి నాసిరకం పరికరాలు సరఫరా చేసి ప్రభుత్వాన్ని మోసగించిందని ఐబీఐ గ్రూప్ నిర్ధారించింది. ఫైబర్ నెట్ కుంభకోణంలో నిధులు కొల్లగొట్టిన తీరును కీలక అధికారులు వెల్లడించారు. నిబంధనలు పాటించాలని తాము పట్టుబట్టినప్పటికీ అప్పటి సీఎం చంద్రబాబు బేఖాతరు చేశారని, ఈ టెండర్ల ప్రక్రియలో ఆయన క్రియాశీలంగా వ్యవహరించారని సెక్షన్ 164 సీఆర్పీసీ ప్రకారం న్యాయస్థానంలో వారి వాంగ్మూలాన్ని నమోదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఫైబర్‌నెట్ స్కామ్ కేసు.. సీఐడీ చార్జ్‌షీట్‌లో ఏ-1గా చంద్రబాబు
అమరావతి: ఏపీ ఫైబర్‌నెట్ స్కామ్ కేసులో సీఐడీ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ మేరకు ఏసీబీ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసింది సీఐడీ. ఈ చార్జ్‌షీట్‌లో ఏ-1గా చంద్రబాబు, ఏ-2గా వేమూరి హరికృష్ణ, ఏ-3గా కోగంటి సాంబశివరావులను పేర్కొంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి దోపిడీ పర్వంలో ఫైబర్‌నెట్ కుంభకోణం ఒకటి. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఫైబర్ నెట్ ప్రాజెక్టులో పచ్చ ముఠా అడ్డగోలు అవినీతికి పాల్పడింది. మొత్తం రూ.2 వేల కోట్ల ఈ ప్రాజెక్టు కింద మొదటి దశలో రూ.333 కోట్ల విలువైన పనుల్లో అక్రమాలను సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) బట్టబయలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు, లోకేశ్‌కు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన “టెరా సాఫ్ట్’ కంపెనీకి టెండర్లు కట్టబెట్టారని నిగ్గు తేల్చింది. ఈ మేరకు సీఐడీ.. ఏసీబీ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఇదీ చదవండి: ఫైబర్‌నెట్‌లోనూ బాబు మార్కు అవినీతి