breaking news
-
‘రేవ్’ పార్టీలో చిత్తూరు టీడీపీ నేతలు!
చిత్తూరు అర్బన్: కర్ణాటకలోని బెంగళూరు నగరంలో జరిగిన రేవ్ పార్టీలో టీడీపీ మూలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేవ్ పార్టీలో డ్రగ్స్ విక్రయించిన ఐదుగురు ప్రధాన నిందితుల ఫొటోలు, వివరాలను బెంగళూరు పోలీసులు వెల్లడించారు. వీరిలో చిత్తూరుకు చెందిన టీడీపీ యువనేత రణధీర్ విక్రమ్‌నాయుడు, టీడీపీ కార్యకర్త కాణిపాకానికి చెందిన అరుణ్కుమార్నాయుడు ఉన్నారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన బెంగళూరు పోలీసులు, వీళ్లపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రణధీర్‌విక్రమ్‌నాయుడుకు చిత్తూరులోని టీడీపీకి చెందిన పలువురు నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయంటున్నారు. అరుణ్‌కుమార్‌నాయుడుది కాణిపాకం సమీపంలోని మద్దిపట్లపల్లెగా చెబుతున్నారు. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో జరిగిన రేవ్ పార్టీలో 101 మందిని పట్టుకున్న పోలీసులు ఐదుగురు మినహా.. మిగిలినవాళ్లను సొంత పూచికత్తుపై విడుదల చేశారు. వీళ్ల రక్తనమూనాలు సేకరించగా, విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరుకావాలని షరతు పెట్టారు. మాదక ద్రవ్యాలు విక్రయించిన ఐదుగురిలో వీరిద్దరితో పాటు మొహ్మద్ అబూబక్కర్ సిద్ధికి, ఎల్.వాసు, డి.నాగబాబులున్నారు. నిందితుల నుంచి 15.56 గ్రా. ఎండీఎంఏ పిల్స్, 6 గ్రాముల హైడ్రో గాంజా, 6.2 గ్రాముల కొకైన్‌తో పాటు ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీళ్లపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం–1985, సెక్షన్ 8(సి), 22(బి), 22(సి), 22(ఏ), 27(బి), 25, 27, ఐపీసీ 1860 సెక్షన్ 290, 294 కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అంతా ఓ పద్ధతి ప్రకారం.. వాసు బర్త్ డే పేరుతో నిర్వహించిన ఈ రేవ్ పార్టీలో వాస్తవానికి ఎలాంటి బర్త్ డే వేడుకలు జరగలేదు. ఉద్దేశపూర్వకంగా డ్రగ్స్ విక్రయించడం, వేశ్యా గృహాన్ని నిర్వహించడాన్ని పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీలోకి వచ్చే ప్రతి ఒక్కరికీ ఓ పాస్వర్డ్ ఇచ్చారు. వాసు బర్త్ డే పార్టీ అనే యూజర్ నేమ్, పాస్వర్డ్ చెప్పినవాళ్లకు మాత్రమే ఇక్కడ ప్రవేశం ఉంటుంది. ఇందుకోసం నిర్వాహకులు ఓ ప్యాకేజీ ఇచ్చారు. ఒక్కో వ్యక్తి నుంచి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేసినట్టు తెలిసింది. ‘సన్‌సెట్ టు సన్‌రైజ్ విక్టరీ’ పేరిట ఈ నెల 19వ తేదీ సాయంత్రం 5 నుంచి 20వ తేదీ ఉదయం 6 గంటల వరకు రేవ్ పార్టీ జరిగేలా ప్రణాళిక రూపొందించారు. తొలుత ఎలక్ట్రానిక్ సిటీ స్టేషన్ పరిధిలో కేసు నమోదవగా, తర్వాత హెబ్బాగోడికి బదిలీ చేయాలనుకున్నారు. తాజాగా ఈ కేసును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ బెంగళూరు(సీసీబీ) పోలీసులకు అప్పగిస్తున్నట్లు కర్ణాటక పోలీసులు ప్రకటించారు. ఇందులో సెక్స్ రాకెట్ అంశం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానించి, ఆ దిశగా సైతం విచారణ చేస్తున్నారు. ఈ ఘటనలో పోలీసులు సీజ్ చేసిన కార్లలో ఫార్చూనర్ కారు ఏపీ 39 హెచ్ 0002 నంబర్‌తో ఉంది. ఇది చిత్తూరులోని గుడిపాల మండలం రాసనపల్లెకు చెందిన త్యాగరాజులు నాయుడు అనే వ్యక్తి పేరిట ఉంది. త్యాగరాజులు నాయుడు కారు అక్కడ ఎందుకు ఉందనే దానిపై పోలీసులు ఇప్పటికే విచారణ ప్రారంభించారు. ఇంతలోపు ఈ కారును తొమ్మిది నెలల కిందటే మరో వ్యక్తికి విక్రయించినట్లు, అతను ఇంకా కారును తన పేరిట మార్చకోలేదని కొత్త డ్రామా చేస్తున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు నియోజకవర్గానికి చెందిన ఓ టీడీపీ ముఖ్య నేత ఈ కారును ఉపయోగించినట్లు సమాచారం. -
హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు విచారణకు సిట్ ఏర్పాటు
సాక్షి, విశాఖపట్నం: హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. తాజాగా హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు విచారణకు విశాఖపట్నం సీపీ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు అయింది. విశాఖ సీపీ రవిశంకర్ ఆధ్వర్యంలో 20 మందితో సిట్ బృందం ఏర్పడింది. జాయింట్ సీపీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, 12 మంది హెడ్ కానిస్టేబుళ్లతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయనుంది. మరోవైపు.. ఆపరేషన్ కంబోడియా విజయవంతమైంది. 360 మంది భారతీయులను ఎంబసీ అఫ్ ఇండియా కాపాడింది. సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్: + 855 10642777 సంప్రదించాలని అధికారులు కోరారు. అయితే.. విదేశీ ఉద్యోగాలంటూ కోటి ఆశలతో కంబోడియా వెళ్లిన భారతీయులు మోసపోయారు. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగమని తీసుకువెళ్లి అక్కడ బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్న చైనా గ్యాంగ్‌పై సోమవారం తిరుగుబాటు చేసిన బాధితులు జైలు పాలయ్యారు. అక్కడ నిర్వాహకులు తమను చిత్ర హింసలకు గురి చేస్తున్నారని కొంత మంది బాధితులు విశాఖ పోలీసులకు మంగళవారం వాట్సాప్‌తో పాటు ‘ఎక్స్’ ద్వారా వీడియో సందేశాలు పంపించిన విషయం తెలిసిందే.విదేశాల్లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు అంటూ గాజువాకకు చెందిన చుట్టా రాజేష్ విజయ్‌కుమార్ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చాడు. అది నిజమని నమ్మి విశాఖ నుంచే కాకుండా రాష్ట్రంలో సుమారు 150 మంది నిరుద్యోగులు రూ.1.5 లక్షలు చొప్పున చెల్లించారు. వారిని బ్యాంకాక్, సింగపూర్ల మీదుగా కంబోడియాకు పంపించారు. అక్కడ మరో గ్యాంగ్ బాధితులను రిసీవ్ చేసుకొని కంబోడియాలో పాయిపేట్ వీసా సెంటర్‌కు తీసుకెళ్లింది. ఓ నెలకు టూరిస్ట్ వీసా చేయించి ఆ గ్యాంగ్ చైనా ముఠాకు విక్రయించింది. నిరుద్యోగుల నైపుణ్యం ఆధారంగా వారిని రూ.2,500 నుంచి రూ.4వేల అమెరికన్ డాలర్లకు చైనా కంపెనీలకు అమ్మేశారు.అక్కడ పని చేసి చైనా వారి చెర నుంచి తప్పించుకున్న నగరానికి చెందిన బొత్స శంకర్ అనే వ్యక్తి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ నేరాలతో పాటు మానవ అక్రమ రవాణా వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు.ఈ కేసుని లోతుగా దర్యాప్తు చేయాలని సీపీ రవిశంకర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో జాయింట్ కమిషనర్ ఫకీరప్ప సారథ్యంలో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కె.భవానీప్రసాద్, సిబ్బందితో ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
ఈవీఎంల ధ్వంసం కేసులో టీడీపీ నేతలకు రిమాండ్
సాక్షి, పల్నాడు: ఏపీలో ఎన్నికల సందర్బంగా ఈవీఎం ధ్వంసం కేసులో టీడీపీ నేతలకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ క్రమంలో నలుగురు టీడీపీ నేతలకు 14 రోజులు రిమాండ్ విధిస్తూ బుధవారం కోర్టు ఆదేశించింది.కాగా, ఏపీలో ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు ఈవీఎంలను ధ్వంసం చేశారు. తుమృకోటలోని 203, 204, 205, 206 పోలింగ్ బూత్‌ల్లోని ఈవీఎంలను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు వెంకట సతీష్, కోటయ్య, సైదులు, మహేష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.దీంతో, వారిని కోర్టులో హాజరుపరచగా నలుగురు టీడీపీ నేతలకు 14 రోజులు రిమాండ్ విధించింది. అలాగే, మరో 50 మంది టీడీపీ కార్యకర్తలపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో కొంతమంది టీడీపీ నేతలు, కార్యకర్తలు అరెస్ట్ భయంతో పరారయ్యారు. -
అర్థరాత్రి యార్లగడ్డ అనుచరుల వీరంగం, యువకులపై..
ఎన్టీఆర్, సాక్షి: రాష్ట్రంలో ఎన్నికల ఓటమిని ముందుగానే పసిగట్టి అల్లర్లు, హింసాత్మక ఘటనలకు ప్రతిపక్ష టీడీపీ ప్రణాళిక రచిస్తోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పచ్చ మూక బరి తెగిస్తోంది. వైఎస్సార్సీపీకి సానుభూతిపరుల్ని వెతుక్కుంటూ వెళ్లి మరీ దాడులకు తెగబడుతోంది. ఈ క్రమంలోనే గన్నవరంలో యువకులపై దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడింది యార్లగడ్డ వెంకట్రావు అనుచరులుగా తేలింది.గన్నవరం మండలం మర్లపాలెం శివారులో ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు యువకులపై దాడి కలకలం రేపింది. రాత్రిపూట అపార్ట్మెంట్ తలుపుల్ని బద్ధలు కొట్టుకుని వెళ్లి మరీ యువకులను చితకబాదారు. ఆపై బలవంతంగా తమ కారులో ఎక్కించుకెళ్లి వాళ్లను చిత్రహింసలకు గురి చేశారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలు బయటకు వచ్చాయి.ఇద్దరు యువకులపై దాడి చేసింది గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అనుచరులుగా పోలీసులు గుర్తించారు. టీడీపీ నేతలు ఫణి రెడ్డి, పౌలూరి వంశీకృష్ణ, కంభంపాటి దేవేంద్ర, కంభంపాటి బాలనరేష్, దేవినేని హర్షచౌదరి, శొంఠి సురేష్, కన్నా కార్తిక్, బాబీ, కంఠమనేని అరుణకు మార్, మరి కొంత మంది ఉన్నట్టు గుర్తించారు. దాడి ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు కన్నుమూత
కొవ్వూరు: వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు (71) మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983లో ఎన్టీ రామారావుపై అభిమానంతో రాజకీయాల్లోకి వచ్చారు. వరుసగా 1983, 1985 (మధ్యంతర ఎన్నికలు), 1989, 1994, 2004లో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. పార్టీలు వేరైనప్పటికీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో కృష్ణబాబుకు అత్యంత సాన్నిహిత్యం ఉండేది. దీంతో ఆయన మరణానంతరం 2012లో వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థాపించిన వైఎస్సార్సీపీలో చేరారు. జిల్లా రాజకీయాల్లోనూ, గోపాలపురం, పోలవరం నియోజకవర్గాల్లో పునర్విభజన అనంతరం కొవ్వూరులోనూ కృష్ణబాబు రాజకీయంగా తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన భార్య నాగమణి గతంలోనే మరణించారు. కృష్ణబాబుకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వ సలహాదారు, పార్టీ కొవ్వూరు నియోజకవర్గ పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న ఎస్.రాజీవ్‌కృష్ణ ఆయన అల్లుడు. కృష్ణబాబు మృతి పట్ల రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, కొవ్వూరు మునిసిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారితోపాటు పలువురు రాష్ట్ర, జిల్లాస్థాయి ప్రజాప్రతినిధులు, నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన స్వగ్రామమైన దొమ్మేరులో బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
జగ్గయ్యపేట: తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ బంధువు ఒకరు ఎటువంటి పత్రాలు లేకుండా హైదరాబాద్ నుంచి కారులో తీసుకువస్తున్న రూ.68.40 లక్షల నగదును పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎనీ్టఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలో ఏపీ – తెలంగాణ రాష్ట్ర సరిహద్దు గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారును ఆపి తనిఖీ చేయగా ఈ నగదు లభించింది.దీనికి సంబంధించి ఎటువంటి పత్రాలు లేకపోవడంతో నగదును స్వా«దీనం చేసుకొని, చిల్లకల్లు పోలీసులకు అప్పగించారు. ఈ నగదు తెస్తున్న వ్యక్తి తెలుగుదేశం పార్టీ నేత, ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో కీలకంగా వ్యవహరించే మాజీ ఎమ్మెల్సీకి దగ్గరి బంధువుగా చెబుతున్నారు. ఆయన బెట్టింగ్‌లకు బుకీ (మధ్యవర్తి)గా వ్యవహరిస్తారని, ఆ డబ్బంతా ఎన్నికల ఫలితాలపై పందేలు కట్టిన వారి నుంచి వసూలు చేసి తెస్తున్నదని సమాచారం. -
ఇవాళే డీజీపీకి నివేదిక.. సిట్ పొడిగింపు?
విజయవాడ, సాక్షి: రాష్ట్రంలో ఎన్నికలకు ముందు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణకు ప్రత్యేక విచారణ బృందం(సిట్) ఇవాళ్టితో ముగియనుంది. సోమవారం సాయంత్రం రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాకు సిట్ ఇన్చార్జి.. ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ నివేదికను సమర్పించనున్నారు. అయితే రెండ్రోజుల్లో సమాచార సేకరణకే సమయం సరిపోవడంతో లోతైన దర్యాప్తు కోసం గడువు పొడిగించాలని సిట్ బృందం డీజీపీని కోరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ‘‘హింసాత్మక ఘటనలపై ఈసీకి ఇవాళ నివేదిక ఇస్తాం. నాలుగు జిల్లాల్లో టీమ్‌లు దర్యాప్తులో ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు చెప్పి.. కొన్ని కేసుల్లో అదనపు సెక్షన్లు చేరుస్తాం. అలాగే కొంతమంది నిందితులను గుర్తించాం. నేటి నుంచి దర్యాప్తును పర్యవేక్షిస్తాం’’ అని సిట్ ఇన్చార్జి వినీత్ బ్రిజ్‌లాల్ ఓ మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా వ్యాఖ్యానించారు. సిట్ ఇలా.. ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు ముమ్మరంగా జరిగింది. నాలుగు బృందాలుగా విడిపోయిన సిట్ సభ్యులు.. అలర్లు జరిగిన ప్రాంతాల్లో పర్యటించారు. పల్నాడులో అడిషనల్ ఎస్పీ సౌమ్యలత నేతృత్వంలో రెండు బృందాలు, తిరుపతి చంద్రగిరిలో ఒక టీం, అనంతపురం తాడిపత్రిలో మరో టీం పర్యటించింది. డీఎస్పీ ఆద్వర్యంలో ఇద్దరు సీఐలతో ప్రతీ బృందం క్షేత్రస్ధాయిలో సమాచార సేకరణ చేపట్టింది. అదే సమయంలో.. వినీత్ బ్రిజ్‌లాల్, ఐజీ (సిట్ ఇన్‌ఛార్జి)రమాదేవి, ఏసీబీ ఎస్పీసౌమ్యలత, ఏసీబీ అదనపు ఎస్పీరమణమూర్తి, శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీపి.శ్రీనివాసులు, సీఐడీ డీఎస్పీ వల్లూరి శ్రీనివాసరావు, ఒంగోలు ఏసీబీ డీఎస్పీ రవి మనోహరచారి, తిరుపతి ఏసీబీ డీఎస్పీవి.భూషణం, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (గుంటూరు రేంజ్) కె.వెంకటరావు, ఇన్స్పెక్టర్(ఇంటెలిజెన్స్), విశాఖపట్నంరామకృష్ణ, ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌జీఐ శ్రీనివాస్, ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌మోయిన్, ఇన్స్పెక్టర్, ఒంగోలు పీటీసీఎన్.ప్రభాకర్, ఇన్స్పెక్టర్, అనంతపురం ఏసీబీశివప్రసాద్, ఇన్స్పెక్టర్, ఏసీబీసిట్ హెడ్ క్వార్టర్స్‌లో ఉంటూ ఎప్పటికపుడు నాలుగు బృందాల నుంచి సమాచారాన్ని తీసుకుని నివేదిక సిద్దం చేసే పనిని మరో అదనపు ఎస్పీకి అప్పగించారు. మొత్తంగా.. హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల పరిధిలోని పీఎస్‌లలో నమోదు అయిన 33 ఎఫ్ఐఆర్లను సిట్ పరిశీలించింది. వీటి ఆధారంగా 300 మందిని ఈ హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నట్లు నిర్ధారించుకుంది. ఇందులోనూ 100 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు.. పరారీలో ఉన్న మిగతా వాళ్ల కోసం పోలీస్ బలగాలు గాలింపు చేపటినట్లు సిట్ నివేదికలో పొందుపర్చినట్లు సమాచారం. అదే సమయంలో పోలీసులకు సిట్ బృందాలు పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.ఇక క్షేత్రస్ధాయి పర్యటనలో కీలక సమాచారాన్ని రాబట్టిన సిట్ బృందాలు.. సీసీ కెమెరాల ఫుటేజీలను సైతం క్షుణ్ణంగా పరిశీలించింది. అదే సమయంలో పోలీస్ ఉన్నతాధికారుల వైఫల్యంపైనా పరిశీలన చేసింది. సస్పెండ్ అయిన పల్నాడు జిల్లా ఎస్పీ బిందుమాధవ్, అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ల పనితీరుపైనా సిట్ అనుమానాలు వ్యక్తం చేసినట్లుసమాచారం. ఇక సిట్ బృందాలకు వైఎస్సార్సీపీ, టీడీపీలు పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకున్నాయి. టీడీపీ శ్రేణులు ఘర్షణలకి దిగడానికి ఈ ఇద్దరి ఎస్పీల వైఫల్యమే కారణమంటూ ఇప్పటికే ఈసీకి, సిట్ బృందాలకి కూడా YSRCP ఫిర్యాదు చేసింది. ఈసీ నిర్ణయంపై ఉత్కంఠఈసీ ఆదేశాలనుసారం సిట్ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం సిట్‌కు పూర్తి అధికారులు అప్పగించింది. రెండ్రోజుల గడువులో క్షేత్రస్థాయి సమాచార సేకరణ మాత్రమే చేపట్టింది. ప్రధాన ఘటనలకు సంబంధించిన దర్యాప్తును మాత్రమే సిట్ సమీక్షించింది. అయితే ఈ అల్లర్ల వెనుక ఉన్న కుట్రను చేధించాలన్నా.. హింసకు కారణమైన రాజకీయ పెద్దలను గుర్తించాలన్నా పూర్థిస్తాయిలో దర్యాప్తు అవసరం. అందుకే గడువు పొడిగించాలని సిట్ ఇన్చార్జి వినీత్ బ్రిజ్‌లాల్ కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే డీజీపీ ప్రాథమిక నివేదికను ఎన్నికల సంఘానికి పంపాల్సి ఉంటుంది. దీంతో ఈసీ సిట్ ప్రాథమిక నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటుందా? లేదంటే పూర్తిస్థాయి దర్యాప్తు నివేదిక వచ్చేదాకా ఎదురు చూస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది. -
టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వ్యక్తి మృతి
టెక్కలి: శ్రీకాకుళం జిల్లా కోట»ొమ్మాళి మండలం నిమ్మాడ పంచాయతీ చిన్నవెంకటాపురంలో టీడీపీ మూకలు అన్యాయంగా ఓ ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. ఈ పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు స్వస్థలం కావడం గమనార్హం. చిన్నవెంకటాపురం పోలింగ్ బూత్‌లో వైఎస్సార్సీపీ తరఫున తోట మాధవరావు ఏజెంట్‌గా ఉండడంతో టీడీపీ కార్యకర్తలు కక్ష పెంచుకుని అతని తండ్రి మల్లేష్ పై ఇటీవల దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఆయన మృత్యువుతో పోరాడుతూ ఆదివారం ప్రాణాలు విడిచారు. అచ్చెన్నాయుడు, ఆయన సోదరుడు హరివరప్రసాద్ డైరెక్షన్లో ఈ నెల 16న గ్రామ దేవత పండగను ఆసరాగా చేసుకుని మల్లేష్‌పై దాడి చేశారు. గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు పూతి లక్ష్మణరావు, పూతి భానుచందర్, పూతి కర్రెన్న, పూతి రమణ తదితరులు ఈ దాడికి పాల్పడ్డారు. ఇది అచ్చెన్నాయుడు చేసిన హత్యేనని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆదివారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. సుమారు 40 ఏళ్లుగా నిమ్మాడ పంచాయతీలో శాంతియుతంగా ఎన్నికలు జరగలేదని, ఈ సారీ ఎన్నికల్లో రిగ్గింగ్‌కు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో అచ్చెన్నాయుడుకు ఓటమి భయం పట్టుకుందని పేర్కొన్నారు. నిమ్మాడ పోలింగ్ కేంద్రంలో వైఎస్సార్సీపీ తరఫున బూత్ ఏజెంట్‌గా వ్యవహరించిన కింజరాపు అప్పన్నను చంపేస్తామని బెదిరించారని దువ్వాడ ఆరోపించారు. మల్లేష్ మృతికి బాధ్యులైన అచ్చెన్నాయుడు, హరివరప్రసాద్తో పాటు టీడీపీ వర్గీయులను అరెస్టు చేయాలని దువ్వాడ డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి పార్టీ తరఫున అండగా ఉంటామని వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ హామీ ఇచ్చారు. -
ముందస్తు బెయిల్ లేకుండా విదేశాలకు చంద్రబాబు
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో జరిగిన పలు కుంభకోణాల్లో ప్రధాన నిందితుడుగా ఉన్న మాజీ సీఎం చంద్రబాబు గుట్టుచప్పుడు కాకుండా అమెరికా వెళ్లడం కలకలం రేపుతోంది. ఒకవైపు చంద్రబాబుపై సీఐడీ జారీ చేసిన లుక్ అవుట్ నోటీసు అమలులో ఉండగా మరోవైపు ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లు సుప్రీంకోర్టులో ఇంకా విచారణలోనే ఉన్నాయి. దీంతో హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు చంద్రబాబును శనివారం తెల్లవారుజామున కొద్దిసేపు నిలువరించారు. చంద్రబాబు దేశం విడిచి వెళ్లకూడదని సీఐడీ గతేడాది లుక్ అవుట్ నోటీసు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. విదేశీ ప్రయాణానికి కోర్టు అనుమతి ఉందా? అని ప్రశ్నించడంతో చంద్రబాబు కంగు తిన్నారు. తటపటాయిస్తూ సుదీర్ఘ వివరణ ఇచ్చిన తరువాత ఇమిగ్రేషన్ అధికారులు పలు దఫాలు సీఐడీ అధికారులతో చర్చించారు. అనంతరం ఎట్టకేలకు అనుమతించారు. పార్టీ ఖాతాల్లోకి అవినీతి నిధులు..టీడీపీ హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌తోపాటు ఫైబర్ నెట్, అసైన్డ్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణాల్లో చంద్రబాబును ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ సీఐడీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ ఆయన్ని అరెస్ట్ చేయగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనంతరం బెయిల్‌పై విడుదల అయ్యారు. కాగా ఫైబర్ నెట్ కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించడంతో చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ సీఐడీ వాదనలు వినిపించింది. కుంభకోణాల ద్వారా కొల్లగొట్టిన నిధులను టీడీపీ బ్యాంకు ఖాతాలకు తరలించిన విషయాన్ని న్యాయస్థానానికి నివేదించింది. దీనిపై చంద్రబాబును కస్టడీకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. షరతులు బేఖాతర్!స్కిల్ స్కామ్ కేసులో నిందితులైన చంద్రబాబు, ఆయన మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, కిలారు రాజేష్‌పై సీఐడీ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. సీఐడీ అదనపు డీజీ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని అందులో స్పష్టం చేసింది. అయితే సీఐడీ ముందస్తు అనుమతి లేకుండానే చంద్రబాబు అమెరికా వెళ్లేందుకు సిద్ధపడ్డారు. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ న్యాయస్థానంలో విచారణలో ఉంది. దీంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో చంద్రబాబు న్యాయవాదులు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో సీఐడీ అధికారులతో చర్చించారు. స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ నెట్, అసైన్డ్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణాల్లో చంద్రబాబును ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఇప్పటికే న్యాయస్థానంలో చార్జ్షీట్లు దాఖలు చేసిన విషయాన్ని సీఐడీ అధికారులు ఇమిగ్రేషన్ అధికారులకు తెలియచేశారు. సీఐడీకి సమాచారం ఇచ్చిన తరువాతే విదేశాలకు వెళ్లాలని చెప్పారు. చార్జ్షీట్లను పరిగణలోకి తీసుకున్న తరువాత న్యాయస్థానం విధించే షరతులను పాటించాలన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతానికి అమెరికా వెళ్లేందుకు సమ్మతించారు. సీఐడీ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని మరోసారి చంద్రబాబుకు నోటీసులు జారీ చేస్తామని సీఐడీ అధికారులు పేర్కొన్నారు. న్యాయస్థానం విధించే షరతులు, ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి ఉండాలన్నారు. అనంతరం ఇమ్మిగ్రేషన్ అధికారులు అనుమతించడంతో చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో కలసి దుబాయి మీదుగా అమెరికా వెళ్లారు.చికిత్స కోసం అంటున్న టీడీపీ వర్గాలుచంద్రబాబు తన విదేశీ పర్యటన గురించి చివరి వరకు ఎవరికీ తెలియనివ్వలేదు. కొద్ది రోజుల పాటు దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించిన ఆయన అమెరికా పర్యటన విషయంలో మాత్రం గోప్యత పాటించారు. వైద్య పరీక్షల కోసమే ఆయన అమెరికా వెళ్లినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. గతంలోనూ చంద్రబాబు చికిత్స కోసం అమెరికా వెళ్లారు. వారం తర్వాత ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని పార్టీ నాయకులు తెలిపారు. మరోవైపు నారా లోకేష్ కూడా నాలుగు రోజుల క్రితం చడీ చప్పుడు లేకుండా అమెరికా వెళ్లినట్లు సమాచారం. -
విజయవాడ: వాహనం ఢీ కొట్టి ఏఎస్ఐ మృతి
ఎన్టీఆర్ జిల్లా: ఎన్నికల విధులకు హాజరయ్యేందుకు వెళ్తండగా మృత్యువు రూపంలో వచ్చిన కారు ఏఎస్ఐ ప్రాణాలను బలిగొంది. ఈ దిగ్బ్రాంతికర ఘటన హైదరాబ్ టు విజయవాడ హైవేలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..ఎన్నికల విధులకు హాజరయ్యేందుకు రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం సంభవించింది.హైవేకి ఆనుకుని ఉన్న సడక్ రోడ్డు వద్ద అధికారులు పోలీస్ ఔట్ పోస్ట్ ఏర్పాటు చేశారు. సరిగ్గా ఆ ప్రదేశంలోనే రోడ్డు దాటుతుండగా సీపీఎస్‌లో పనిచేస్తున్న ఏఎస్ఐ రమణ మీదకు కారు దూసుకుపోయింది. దీంతో ఏఎస్ఐ రమణ తీవ్రగాయాల పాలయ్యారు. సంఘటన స్థలంలో ఉన్న మిగతా పోలీసులు స్పందించి హుటహుటాని రమణను విజయవాడలోని ఆంధ్ర ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
సాక్షి, తిరుపతి: తిరుపతి జిల్లాలో ఓ ప్రైవేటు ట్రవెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గరేణిగుంట మండలం, వెదళ్ళ చెరువు వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మార్నింగ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు బెంగళూరు నుంచి అమలాపురం వెళుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు.. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో బస్సులో మంటలను అదుపు చేయించారు. అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. బస్సులో 12 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో 12 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులను స్థానిక పోలీసులు చొరవ తీసుకొని గమ్యస్థానాలకు పంపారు. ఈ ఘటనపై రేణిగుంట అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
ఎయిర్‌పోర్ట్‌లో సీఎం జగన్‌ను అడ్డుకునేందుకు కుట్ర
విమానాశ్రయం (గన్నవరం): విదేశీ పర్యటనకు వెళ్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గన్నవరం విమానాశ్రయంలో అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు కుట్ర పన్నడం కలకలం సృష్టించింది. శుక్రవారం రాత్రి సీఎం జగన్ విదేశీ పర్యటనకు బయల్దేరేముందు ఎయిర్‌పోర్టులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కుట్ర విఫలమైంది. టీడీపీ సానుభూతిపరుడైన ఆయన్ని అమెరికా పౌరసత్వం కలిగిన గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంకు చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్బాబుగా పోలీసులు గుర్తించారు. వివరాలిలా ఉన్నాయి.. లండన్ పర్యటనకు వెళ్లేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం రాత్రి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్న సందర్భంగా పోలీసులు ముందస్తు భద్రత ఏర్పాట్లు చేపట్టారు. ఆ సమయంలో ఇంటర్నేషనల్ టెర్మినల్ పార్కింగ్ ఏరియాలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న డాక్టర్ ఉయ్యూరు లోకేష్‌బాబును గుర్తించారు. ఆయన సెల్‌ఫోన్ నుంచి సీఎం పర్యటనకు సంబంధించిన మేసెజ్‌లను పంపినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఈ విషయమై ఆయన్ని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అదుపులోకి తీసుకుని గన్నవరం పోలీసు స్టేషన్‌కు తరలించారు. విదేశాలకు వెళ్తున్న సీఎంను విమానాశ్రయంలో అడ్డుకునేందుకు అతను వచ్చినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఇటీవల ఎల్లో మీడియాకు చెందిన పలు ఛానళ్లలో జరిగిన చర్చల్లో కూడా లోకేశ్‌బాబు పాల్గొని సీఎం వైఎస్ జగన్ లండన్ పర్యటనపై వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు. పోలీసులు విచారిస్తున్న సమయంలో ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆయన్ని విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వరప్రసాద్ తెలిపారు. ఆయనకు 41ఎ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు.టీడీపీ నేతలు, ఎల్లో మీడియాకు ముందస్తు సమాచారంఎయిర్పోర్ట్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకుంటున్నట్లుగా డాక్టర్ లోకేశ్‌బాబు ముందుగానే టీడీపీ నేతలకు, ఎల్లో మీడియా ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. సీఎం లండన్‌కు వెళ్లకుండా అడ్డుకునేందుకు టీడీపీ నేతలు కూడా ఎయిర్‌పోర్ట్‌కు రావాలని వాట్సాప్ గ్రూపులో సందేశాలు పంపించారు. ఈ సంఘటనను ఎల్లో మీడియా ప్రసారం చేయాలని ఆయన కోరినట్లు సమాచారం. టీడీపీ సానుభూతిపరుడైన లోకేశ్ బాబు ఎన్నికలకు ముందు స్వదేశానికి వచ్చినట్లు తెలిసింది. నిత్యం సోషల్ మీడియా, ఎల్లో మీడియా వేదికగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన విషం కక్కుతున్నారు. ఇదిలా ఉండగా విజయవాడలో లోకేశ్‌బాబును టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆ పార్టీకి చెందిన ఇతర నేతలు కలిశారు. -
పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు జిల్లా దెందులూరు టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరారీలో ఉన్నారు. పోలింగ్ రోజు రెండు మూడు చోట్ల చెదురుమదురు సంఘటనలు జరిగినా ఎక్కడా ప్రత్యక్ష సంబంధం లేకపోవడంతో ఆయనపై కేసులు నమోదు కాలేదు. పెదవేగి మండలం కొప్పులవారిగూడెం పోలింగ్ బూత్ సమీపంలో ఈ నెల 13న ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. ఈ కేసుకు సంబంధించి 16వ తేదీన రాజశేఖర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న చింతమనేని అదే రోజు భారీ సంఖ్యలో అనుచరులతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సినీ ఫక్కీలో పోలీసులపై దౌర్జన్యం చేసి నిందితుడిని బలవంతంగా తీసుకెళ్లిపోయారు. ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారడంతో పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కొన్ని గంటల వ్యవధిలోనే చింతమనేనితో పాటు మరో 14 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఈ విషయం తెలియగానే చింతమనేనితో పాటు అతని అనుచరుల మొబైల్ ఫోన్లు విజయవాడ సమీపంలో స్విచాఫ్ చేశారు. అక్కడ నుంచి తాడేపల్లి ప్రాంతం వెళ్లి బెంగళూరుకు పరారైనట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిని పట్టుకోవడానికి పోలీస్ యంత్రాంగం ఆరుగురు సీఐల నేతృత్వంలో ఆరు స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేసింది. నూజివీడు డీఎస్పీ కేసు పర్యవేక్షిస్తున్నారు. 94కు చేరిన కేసుల సంఖ్య...చింతమనేనిపై ఈ నెల 16న ఐపీసీ సెక్షన్ 353, 224, 225, 143, 149 కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటికే చింతమనేనిపై ఎన్నికల అఫిడవిట్ ప్రకారం 93 కేసులు నమోదయ్యాయి. తాజా కేసుతో కలిపి వాటి సంఖ్య 94కు చేరింది. చింతమనేని బెంగళూరు వెళ్లినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించుకుని ప్రత్యేక టీమ్‌లను అక్కడికి పంపారు. హైదరాబాద్‌కు కూడా మరో టీమ్‌ను పంపినట్టు సమాచారం. చింతమనేని తీసుకువెళ్లిన నిందితుడు రాజశేఖర్‌ను శుక్రవారమే అరెస్టుచేసి రిమాండ్‌కు పంపారు. -
Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
విశాఖ సిటీ: ఉద్యోగాల పేరుతో విదేశాలకు జరుగుతున్న మానవ అక్రమ రవాణా వ్యవహారాన్ని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. విదేశాల్లో డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల ఆశ చూపి నిరుద్యోగులను చైనా గ్యాంగ్‌కు అమ్మేస్తున్న ముగ్గురు ఏజెంట్లను శనివారం అరెస్టు చేశారు. దీనిపై విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్ శనివారం సాయంత్రం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు.అక్కడ పని చేసి చైనా ముఠా చెర నుంచి తప్పించుకున్న నగరానికి చెందిన బొత్స శంకర్ సైబర్ హెల్ప్‌లైన్ 1930 నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. దీనిపై నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కె.భవాని ప్రసాద్ బృందం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ప్రధాన ఏజెంట్ చుక్క రాజేష్‌తో పాటు అదే ప్రాంతానికి చెందిన సబ్ ఏజెంట్లు సబ్బవరపు కొండలరావు (37), మన్నేన జ్ఞానేశ్వరరావు (29)లను అదుపులోకి తీసుకుని విచారించగా అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా సీపీ రవిశంకర్ మానవ వనరుల అక్రమ రవాణా గురించి వెల్లడించిన వివరాలివి...నిరుద్యోగులకు వల...గాజువాక ప్రాంతానికి చెందిన కన్సల్టెన్సీ ఏజెంట్ చుక్కా రాజేష్ (32) 2013 నుంచి 2019 వరకు గల్ఫ్ దేశాల్లో ఫైర్ సేఫ్టీ అండ్ ప్రికాషన్ మేనేజర్‌గా పనిచేశాడు. ఆ తరువాత విశాఖలోనే ఉంటూ గల్ఫ్‌దేశాలకు ఫైర్ సేఫ్టీ ఉద్యోగాలకు మానవవనరులను సరఫరా చేసేవాడు. 2023 మార్చిలో కాంబోడియా నుంచి సంతోష్ అనే వ్యక్తి ఫోన్ చేసి, కాంబోడియాలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేయడానికి 30 మందిని పంపాలని రాజేష్‌ను కోరాడు. ఆసక్తి చూపే వారి నుంచి ఫ్లైట్ టికెట్లు, వీసా, ఇతర ఖర్చుల కోసం రూ.1.5 లక్షల వంతున తీసుకోవాలని, అందులో కొంత కమిషన్‌గా ఇస్తామని ఆశ చూపాడు. రాజేష్ అందుకు అంగీకరించి సోషల్ మీడియా ద్వారా విదేశాల్లో డేటా ఎంట్రీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలు ఇచ్చాడు. నిజమని నమ్మిన 27 మంది నిరుద్యోగులు రూ.1.5 లక్షల వంతున కట్టారు. రాజేష్ వారిని కాంబోడియా ఏజెంట్ సంతోష్‌కు అప్పగించాడు. ఇలా మూడు దఫాలుగా నిరుద్యోగులకు కాంబోడియాకు పంపించాడు. కొద్ది రోజులకు ఆర్య అనే పేరుతో ఒక మహిళ రాజేష్‌కు ఫోన్ చేసింది. సంతోష్ కంటే ఎక్కువ కమిషన్ ఇస్తానని తమకూ మానవవనరులను సరఫరా చేయాలని కోరింది. ఇలా రాజేష్.. సంతోష్, ఆర్య, ఉమా మహేష్, హబీబ్ అనే ఏజెంట్ల ద్వారా 150 మంది నిరుద్యోగులను కాంబోడియాకు పంపించాడు.చీకటి గదిలో బంధించి..ఒప్పందం అనంతరం వారిని కాంబోడియాలోనే ఈ ముఠా ఒక చీకటి గదిలో బంధించింది. ఫెడెక్స్, టాస్క్‌గేమ్స్, ట్రేడింగ్‌తో పాటు అనేక ఆన్లైన్ స్కాములు చేయాలని నిరుద్యోగులను బలవంతం చేసింది. ఈ స్కామ్స్ ఎలా చేయాలో వారం రోజుల పాటు శిక్షణ ఇచ్చింది. అక్రమాలకు పాల్పడబోమని మొండికేసిన వారికి తిండి పెట్టకుండా చిత్ర హింసలకు గురి చేసింది. సైబర్ నేరాలు చేసిన వారికి వచ్చిన డబ్బులో ఒక శాతం కమిషన్‌గా ఇస్తూ.. 99 శాతం చైనా గ్యాంగ్ దోచుకునేది. అక్కడ ఉత్సాహంగా పనిచేసేందుకు అదే కాంపౌండ్‌లో పలు రకాల పబ్, క్యాసినో గేమ్స్, మద్యం, జూదంతో పాటు వ్యభిచారం వంటి సదుపాయాలను ఈ ముఠా కల్పించింది. అక్కడ సంపాదించిన డబ్బు అక్కడే ఖర్చు చేసేలా చేసేది. చైనా ముఠా చెరలో 5వేల మంది..చైనా ముఠా చెరలో సుమారు 5 వేల మంది భారతీయులు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 150 మంది చైనా గ్యాంగ్ ఆధీనంలో ఉన్నట్లు గుర్తించారు. బాధితులు ఎక్కువగా శ్రీకాకుళం, విశాఖ, రాజమండ్రి, అనంతపురాలతో పాటు తెలంగాణ, కోల్‌కత్తాకు చెందిన వారూ ఉన్నట్లు సీపీ రవిశంకర్ తెలిపారు. ఈ నెట్వర్క్ వెనుక ప్రధాన ముఠాను కనిపెట్టేందుకు లోతైన దర్యాప్తు చేపడుతున్నామని చెప్పారు. కాంబోడియాలో భారత ఎంబసీకీ దీనిపై సమాచారం అందిస్తామన్నారు. విశాఖ నుంచి ఎవరైనా కాంబోడియాకు వెళ్లి ఇబ్బందులు పడితే వెంటనే తమకు సమాచారం అందించాలని సీపీ సూచించారు. భారతదేశం నుంచి కాంబోడియా, మయన్మార్, బ్యాంకాక్ వంటి దేశాలకు రెండేళ్లుగా మానవ అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలుస్తోందని సీపీ తెలిపారు. ఇలా వెళ్లిన భారతీయుల ద్వారా సైబర్ నేరాల రూపంలో మన దేశీయుల నుంచే సుమారు రూ.100 కోట్ల వరకు దోచుకున్నట్లు తమ విచారణలో వెల్లడైందని ఆయన వివరించారు.అది కుటుంబాల మధ్య తగాదాలో దాడి...కంచరపాలెం పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు కుటుంబాల మధ్య తగాదా కారణంగా మహిళపై దాడి జరిగిందని సీపీ రవిశంకర్ స్పష్టం చేశారు. దీనికి రాజకీయాలకు, పార్టీలకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. దాడి ఘటన వీడియోలు ఉన్నాయని, వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు కథనాలను ప్రచురిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.చైనా ముఠాకు భారత యువత విక్రయం...నిరుద్యోగులను ముందు బ్యాంకాక్ పంపించి, అక్కడ రెండో ఏజెంట్‌కు అప్పగించారు. వీరు నిరుద్యోగులను కాంబోడియాలో పాయిపేట్ వీసా సెంటర్‌కు తీసుకువెళ్లి ఒక నెలకు టూరిస్ట్ వీసా తీసుకున్నారు. అలా తీసుకువెళ్లిన నిరుద్యోగులను ఏజెంట్లు వారికున్న నైపుణ్యం ఆధారంగా వారికి రూ.2500 నుంచి రూ.4 వేల అమెరికన్ డాలర్ల రేటు కట్టి చైనా కంపెనీలకు అమ్మేశారు. తమ వద్ద ఏడాది పాటు పనిచేసేలా చైనా ముఠా అగ్రిమెంట్ రాయించుకుంది. సెక్యూరిటీ కింద 400 డాలర్ల పూచీకత్తును కట్టించుకుంది. ఒకవేళ కంపెనీ నుంచి వెళ్లిపోవాలనుకుంటే ఆ మొత్తం చెల్లించాలని ఒప్పందంలో ఈ ముఠా షరతులు విధించింది. -
టీడీపీ చీటింగ్: వందల మందికి జీతాలు ఎగ్గొట్టి..
హైదరాబాద్, సాక్షి: పచ్చ మూకల కుట్ర రాజకీయాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. సర్వే పేరుతో దొడ్డిదారిన తెలుగు దేశం పార్టీ చేసిన నిర్వాకం ఇది. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ.. అదీ రాజధాని నగరంలో సర్వే కోసం యువతను రిక్రూట్ చేసుకుంది. మూడు నెలలపాటు గొడ్డు చాకిరీచేయించుకుని.. చివరకు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టింది. ఆగ్రహంతో బాధితులు విధ్వంసానికి దిగగా.. ఈ ఘటన బయటపడింది.నగరంలోని పంజాగుట్ట నాగార్జున సర్కిల్లో టీడీపీ నేతలు కొందరు తమ బినామీ పేరిట ఓ అద్దె భవనం తీసుకున్నారు. అందులో invitcus pvt lmtd bpo పేరిట బీపీవో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. టెలికాలర్స్ జాబ్స్ పేరిట కొందరు స్టూడెంట్స్‌ను నియమించుకున్నారు. అయితే బీపీవో ముసుగుతో.. గుట్టు చప్పుడు కాకుండా వాళ్లతో ఎన్నికల సర్వే పని చేయించారు వాళ్లు. తీరా ఎన్నికలయ్యాక వాళ్లకు జీతాలు ఎగ్గొట్టడంతో బాధితులు ఆందోళనకు దిగారు.రూ.13 వేలు ఇస్తామని చెప్పి.. రూ.3 వేలే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీంతో కొందరు యువకులు ఆ ఆఫీస్ వద్దకు చేరి ఆందోళన చేపట్టారు. ఇదేంటని? వాళ్లు నిలదీయడంతో.. టార్గెట్ పూర్తి చేయలేదని అవతలి నుంచి సమాధానం వచ్చింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన యువకులు.. ఆఫీస్‌ను ధ్వంసం చేసేందుకు యత్నించారు. గొడవలు జరుగుతున్నాయన్న సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ గ్యాప్‌లోనే కంపెనీ నిర్వాహకులు పరారైనట్లు, బాధితుల తరఫున నిలదీయబోయిన మీడియాపైనా దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం.టీడీపీ నేతల అండదండలతోనే ఈ కార్యాలయం నడుస్తోందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అంతేకాదు.. కూకట్‌పల్లిలో సైతం invitcus pvt lmtd ఓ బ్రాంచ్‌ను ఓపెన్ చేసి ఇదే మాదిరి అక్కడా కూడా ఎన్నికల సర్వే నిర్వహించినట్లు తేలింది. ఇంకోవైపు మైనర్లతో వెట్టి చాకిరీ పై విచారణ చేయాలనీ బాధితుల బంధువుల ఆందోళన చేపట్టారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపడతామని పోలీసులు చెబుతున్నారు. -
టీడీపీ దాష్టీకానికి పరాకాష్ట
సాక్షి ప్రతినిధి, విజయనగరం: వైఎస్సార్సీపీ తరఫున ప్రచారం చేశారనే ఆరోపణలతో టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదు ఓ మహిళా వలంటీర్ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఊళ్లో అందరికీ తలలో నాలుకలా వ్యవహరించిన ఓ సేవకురాలిని టీడీపీ స్వార్థ రాజకీయాల కోసం పొట్టన పెట్టుకోవడం దిగ్భ్రాంతి పరుస్తోంది. తప్పుడు ఆరోపణలతో వేధింపులు, ఫిర్యాదు, పోలీసుల విచారణతో తీవ్ర భయాందోళనలకు గురై విజయనగరం రూరల్ మండలం దుప్పాడ గ్రామంలో వలంటీరు బొబ్బాది సంతోషి (36) గుండె ఆగిపోయింది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం మేరకు ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సంతోషి భర్త బొబ్బాది కృష్ణ విజయనగరం కూరగాయల మార్కెట్లో పని చేస్తుంటారు. వీరికి ఇద్దరు పిల్లలు. అబ్బాయి జయదీప్ ఇటీవలే పదో తరగతి ఉత్తీర్ణుడయ్యాడు. అమ్మాయి లహరి ఎనిమిదో తరగతి చదువుతోంది. సంతోషి వలంటీరుగా చేరిన తర్వాత గ్రామంలో తనకు అప్పగించిన 50 కుటుంబాలకు నిత్యం అందుబాటులో ఉండేది. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి పథకాన్ని అర్హులకు చేర్చుతూ వారి మన్ననలు అందుకుంది. తనది పేద కుటుంబమే అయినా గ్రామంలో ఏ పేద వారూ ఇబ్బంది పడకూడదనే సంకల్పంతో సేవలందించింది. ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారుజామునే అవ్వాతాతలకు పింఛన్ అందించడంలో పోటీ పడేది. సీఎం జగన్ అంటే అభిమానం. ఇవన్నీ అదే గ్రామంలోని టీడీపీ నాయకులకు కంటగింపుగా మారాయి. ఏదో విధంగా వలంటీర్లపై కక్ష సాధింపు లక్ష్యంతో ఉన్న టీడీపీ నేతలు ఎన్నికల కమిషన్‌ను అడ్డు పెట్టుకుని కుట్రలు, కుతంత్రాలకు తెర లేపారు. టీడీపీ నేతల బెదిరింపులుటీడీపీ ప్రభుత్వం వస్తే వలంటీర్ ఉద్యోగం ఇప్పిస్తామంటూ స్థానిక టీడీపీ నేతలు గ్రామంలో 50 మంది యువకులను మభ్యపెట్టి ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారు. మరోవైపు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారంటూ వలంటీర్లు బొబ్బాది సంతోషి, నారాయణమ్మ, రామలక్ష్మి, స్వాతి, కృష్ణవేణి, కోటమ్మలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. పూర్వాపరాలు సరిగా విచారించకుండానే టీడీపీ నేతల ఒత్తిళ్లతో అధికారులు ఆగమేఘాలపై ఆ ఆరుగురు వలంటీర్లను సస్పెండ్ చేశారు. పోలీసులతో ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. పుట్టుమచ్చలు, తదితర వివరాలు చెప్పాలని పోలీసులు మూడు రోజుల కిందట సంతోషికి ఫోన్ చేసి అడిగారు. అంతకు ముందు గ్రామంలో నిర్వహించిన టీడీపీ ప్రచార సభలో కూడా ఆ నాయకులు వలంటీర్ల ప్రస్తావన తీసుకొచ్చారు. ఇప్పుడు ఉద్యోగాలు ఊడగొట్టి కేసులు పెట్టించామని, తమ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వదిలి పెట్టబోమని హెచ్చరించారు. పోలీసులు గ్రామంలోకి వచ్చి ఇంటింటి విచారణ చేశారు. ఇవన్నీ సంతోషినిని ఆందోళనకు గురి చేశాయి. ఇదిలా ఉండగా పుట్టుమచ్చలు తదితర వివరాలు చెప్పాలని పోలీసులు మూడ్రోజుల కిందట ఆమెకు ఫోన్ చేయడంతో తీవ్రంగా భయాందోళనకు గురైంది. గురువారం ఛాతీలో పట్టేసినట్టు ఉండటంతో తొలుత గ్యాస్ తాలూకు నొప్పిగా భావించింది. కొంత సేపటి తర్వాత గుండెల్లో నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు విజయనగరంలో డాక్టర్లకు చూపించారు. వారి సూచనలతో విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యం అందిస్తుండగా పరిస్థితి విషమించి శుక్రవారం ఆ పేదరాలి గుండె ఆగిపోయింది. సంతోషి హఠాన్మరణం ఆమె కుటుంబాన్ని తీవ్ర విషాదంలో నింపింది. గ్రామంలో పెద్ద ఎత్తున ప్రజలు ఆమె అంతిమ యాత్రలో పాల్గొని కంట నీరు పెట్టారు. కాగా, ఇంత జరిగినా టీడీపీ నాయకులకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడటానికి ఆ కుటుంబం భయపడిపోతోంది. తోటి వలంటీర్లంతా లోలోన కుమిలిపోతున్నారు. -
వంద మందికి పైగా పచ్చ గూండాలపై కేసులు
చంద్రగిరి/తిరుపతి లీగల్: ఎన్నికల నేపథ్యంలో సోమవారం తిరుపతి జిల్లా చంద్రగిరి మండల పరిధిలోని రామిరెడ్డిపల్లి పంచాయతీ కూచువారిపల్లిల్లో టీడీపీ నాయకుల విధ్వంసకాండపై పోలీసులు కేసులు నమోదు చేశారు. టీడీపీ, వైఎస్సార్సీపీ బాధితుల ఫిర్యాదు మేరకు రెండు వర్గాలకు చెందిన పలువురిపై కేసులు పోలీసులు నమోదు చేసినట్లు సమాచారం.ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి గన్‌మెన్ ఈశ్వర్‌రెడ్డి, పీఏ వేణుగోపాల్‌రెడ్డిపై దాడి చేసి గాయపరచడంతో పాటు వారిని నిర్బంధించిన ఘటనపైనా కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇదే దుర్ఘటనలో సర్పంచ్ కొటాల చంద్రశేఖర్‌రెడ్డితో పాటు అయన అనుచరుల్ని తీవ్రంగా గాయపర్చడంతో పాటు హత్యాయత్నానికి పాల్పడి, సర్పంచ్ ఇంట్లో విలువైన వస్తువులు, ఆభరణాలను దోచుకెళ్లి, ఇంటిని పూర్తిగా కాల్చి ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీనిపై సుమారు 100 మందికి పైగా పచ్చగూండాలపై కేసులు నమోదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. విధ్వంసకాండపై కేసుల నమోదు రామిరెడ్డిపల్లి, కూచువారిపల్లిల్లో చోటు చేసుకున్న విధ్వంసకాండపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. కర్రలు, రాడ్లు, రాళ్లు, కత్తులతో దాడులు చేసి తీవ్రంగా గాయపరచడం, వాహనాలకు నిప్పంటించడం, ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి దాడులకు పాల్పడటం, ఇంట్లోని విలువైన బంగారం, వెండి, నగదుతో పాటు ఇతర వస్తువులను దోచుకెళ్లడం, ఇళ్లను ధ్వంసం చేసి, దగ్ధం చేయడం వంటి ఘటనలపై సెక్షన్ 143, 147, 452, 427, 323, 324, 380, 435, 436, ఐపిసీ రెడ్‌విత్ 149 ప్రకారం కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఆ గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. హింసాకాండ ఘటనలో 13 మందికి రిమాండ్ శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద వైఎస్సార్సీపీ, టీడీపీ నేతల మధ్య జరిగిన ఘటన కేసులో ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు 13 మందిని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు. వీరికి ఈనెల 29 వరకు రిమాండ్ విధిస్తూ తిరుపతి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వాణిశ్రీ గురువారం ఆదేశాలు జారీ చేశారు. -
నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!
సాక్షి, నరసరావుపేట, నరసరావుపేట టౌన్ :నరసరావుపేటలో రాజకీయాలను ‘పచ్చ’ దండు వ్యక్తిగత కక్షగా మార్చి, ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఓటమి భయంతో టీడీపీ అరాచకం సృష్టిస్తోంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు.. చివరకు ఓటు వేసిన వారి ఇళ్లపై విధ్వంసానికి పూనుకుంది. పల్నాడు ప్రాంతంలో ఎన్నికలప్పుడు ప్రధాన పార్టీల మధ్య గొడవలు ఎన్నో ఏళ్లుగా రగులుతూనే ఉంటాయి. ఎన్నికల అనంతరం ఆ పగలు చల్లారి, అన్నదమ్ముల్లా కలసిమెలసి ఉంటారు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకత్వం సరికొత్త ప్రతీకారానికి తెర తీసింది.గత ఎన్నికల్లో ఓటమి మూటగట్టుకుని మరోసారి పోటీకి దిగిన నరసరావుపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబుకు మళ్లీ ఓటమి ఖాయమని పోలింగ్‌కు ముందే అన్ని సర్వేలు తేల్చాయి. దీంతో ఆయన వెన్నులో వణుకు పుట్టింది. ఈ క్రమంలో ప్రత్యర్థిని అడ్డు తొలగించుకుంటే తన గెలుపు ఖాయమని భావించి, నరసరావుపేటలో విధ్వంసానికి ప్రణాళిక రచించారని సమాచారం. ఇందులో భాగంగా పోలింగ్ రోజున నరసరావుపేట వైఎస్సార్సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపైకి సుమారు 200 మంది టీడీపీ రౌడీలు మారణాయుధాలతో పట్టపగలు దాడికి వెళ్లారు. ఆ సమయంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంట్లో లేకపోవడంతో ఆయన మామ కంజుల రామకోటిరెడ్డిపై దాడికి తెగబడ్డారు. ఈ సంఘటనపై అరవింద్‌బాబుతో పాటు మరో 30 మందిపై నరసరావుపేట టూటౌన్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కాగా, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని మట్టుబెట్టాలనే పథకంతోనే ఆయన ఇంటిపైకి దాడికి వచ్చినట్లు తెలిసింది. ఈ దాడికి ఇతర రాష్ట్రాల నుంచి బౌన్సర్లు, కిరాయి రౌడీలను అరవింద్ బాబు పోలింగ్ ముందు రోజు రాత్రికే రప్పించినట్టు సమాచారం.అరవింద బాబు ఇంట్లో పెట్రోల్ బాంబులు, వేట కొడవళ్లు గొడవల నేపథ్యంలో పోలింగ్ అనంతరం టీడీపీ అభ్యర్థి అరవింద బాబును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆ సయమంలో ఆయన ఇంట్లో (ఇల్లు, ఆస్పత్రి ఒకచోటే) సోదాలు నిర్వహించగా.. పెట్రోల్ బాంబులు, ఇనుప రాడ్లు, వేట కొడÐ] ళ్లు, కంకర రాళ్లు, ఇతర మారణాయుధాలు దొరికాయి. పోలింగ్‌కు ముందుగానే వీటిని తీసుకొచ్చి ఉంచినట్లు సమాచారం.ఈ ఎన్నికల్లోనూ ఓటమి ఖాయమని తేలడంతో గోపిరెడ్డిని అడ్డు తొలగించుకోవాలనే మారణాయుధాలు తెప్పించినట్లు తెలిసింది. మారణాయుధాలకు సంబంధించిన వీడియోలు రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయినా పోలీసులు ఇందుకు సంబంధించి ఎటువంటి కేసు నమోదు చేయకపోవడం గమనర్హం. పోలీసు పెద్దల అనుమతి రాకపోవడం వల్లే అరవింద్బాబుపై కేసు నమోదు కాలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా నరసరావుపేటలో అల్లర్ల కారణంగా రెండు రోజుల పాటు దుకాణాలు బంద్ చేయాలని పోలీసులు ఆదేశించారు. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగేలా ఉంది. దీంతో ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టీడీపీ స్వార్థ రాజకీయాల కోసం తాము ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలాగైతే తామెలా బతకాలని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
తాడిపత్రి ఘటనలో 91 మందికి రిమాండ్
విడపనకల్లు: పోలింగ్ అనంతరం తాడిపత్రిలో జరిగిన అల్లర్లకు సంబంధించి టీడీపీ, వైఎస్సార్సీపీలకు చెందిన 91 మందిని పోలీసులు గురువారం అరెస్టు చేసి ఉరవకొండ సివిల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజి్రస్టేట్ దుర్గా కళ్యాణి ఎదుట హాజరు పరిచారు. జడ్జి వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. వారిని రెడ్డిపల్లిలోని అనంతపురం జిల్లా జైలుకు తరలించాలని ఆదేశించారు. అయితే అక్కడ సౌకర్యాలు సరిగా లేవని, శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్ జడ్జికి తెలిపారు. అందువల్ల నిందితులను కడప కేంద్ర కారాగానికి తరలించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఇందుకు జడ్జి నిరాకరించారు. జిల్లా జైలుకు తరలించాలని ఆదేశించారు. కోర్టు వద్ద భారీ భద్రత అల్లర్ల ఘటనలో నిందితులను ఉరవకొండకు తీసుకువస్తున్నారన్న సమాచారంతో ఉదయం నుంచి కోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైఎస్సార్సీపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, నిందితుల బంధువులు భారీగా కోర్టు వద్దకు తరలివచ్చారు. పోలీసులు ఉదయమే ఉరవకొండ కోర్టు ఆవరణను ఆ«దీనంలోకి తీసుకున్నారు. గుంతకల్లు డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మీడియాను కూడా లోనికి అనుమతించలేదు. సాయంత్రం 4 గంటలకు వైఎస్సార్సీపీకి చెందిన 37 మందిని, టీడీపీకి చెందిన 54 మందిని పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. అల్లర్లకు పాల్పడిన వారిపై ఐపీసీ 143, 147, 324, 307, 363 ఆర్డబ్యూ149 కింద కేసులు నమోదు చేశారు. -
టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌కు బిగ్ షాక్..
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి మరో షాక్ తగిలింది. జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఛార్జ్‌షీట్ నమోదు చేసింది. బీఎస్-IV వాహనాల మనీలాండరింగ్ స్కామ్ కేసుకు సంబంధించి ఈడీ ఛార్జ్‌షీట్‌ను ఫైల్ చేసింది.ఈడీ ఛార్జ్‌షీట్‌లో భాగంగా.. హైదరాబాద్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టులో ఈ కేసుకు సంబంధించి 17 మంది నిందితులు, సంస్థలపై ప్రాసిక్యూషన్ ఫిర్యాదును దాఖలు చేసింది. బీఎస్-4 నిబంధనలకు అనుగుణంగా లేని వాహనాలను ఏప్రిల్ 1, 2017 నుంచి భారతదేశంలో విక్రయించరాదని, రిజిస్ట్రేషన్ చేయకూడదని 2017లో సుప్రీంకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ జేసీ ప్రభాకర్ రెడ్డి, సీ. గోపాల్ రెడ్డితో పాటుగా పలువురు అశోక్ లేల్యాండ్ లిమిటెడ్ నుంచి బీఎస్-3 వాహనాలను కొనుగోలు చేశారు.ఈ క్రమంలో జటాధార ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్, సీ.గోపాల్ రెడ్డి అండ్ కో పేరుతో భారీ తగ్గింపుతో బీఎస్-3 వాహనాలను కొనుగోలు చేసి, మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నకిలీ పత్రాల ఆధారంగా బీఎస్-4 వాహనాలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పేర్కొంది. ఈ అక్రమ రిజిస్ట్రేషన్లలో ఎక్కువ కొనుగోళ్లు నాగాలాండ్‌లో జరుగగా.. కొన్ని కర్ణాటక, ఏపీలో కూడా జరిగాయని ఈడీ తెలిపింది.జటాధార ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట 50 వాహనాలు, సి.గోపాల్ రెడ్డి పేరిట 104 వాహనాలు రిజిస్టర్ అయినట్లు ఈడీ విచారణలో తేలింది. ఈ వాహనాల్లో చాలా వరకు వాటిని బీఎస్-4 వాహనాలుగా ఉపయోగించడం ద్వారా వారి రవాణా వ్యాపారంలో వారు మరింత ఉపయోగించుకున్నారు. అలాంటి కొన్ని వాహనాలను బీఎస్-4 వాహనాలుగా చూపి విక్రయించారు. ఈ వాహనాలను సొంతం చేసుకోవడం, నడపడం, విక్రయించడం ద్వారా 38 కోట్ల రూపాయలు ఆర్జించినట్టు ఈడీ పేర్కొంది. అంతకుముందు, జేసీ ప్రభాకర్ రెడ్డి, సీ గోపాల్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులకు చెందిన 68 కోట్ల చరాస్తులు.. 28.6 కోట్ల రూపాయల స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే. -
రెచ్చిపోతున్న పచ్చమూక పల్నాడులో ఆగని విధ్వంసం
సాక్షి, నరసరావుపేట: ఎన్నికలు ముగిసి మూడు రోజులైనా పల్నాడు జిల్లాలో టీడీపీ మూకల విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. ఓటమి ఖాయమని తేలిపోవడంతో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ మూకలు బుధవారం దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. టీడీపీ దాడుల నుంచి తప్పించుకొని గ్రామాలు వదిలివెళ్లిపోయిన వైఎస్సార్సీపీ సానుభూతిపరులు ఇంకా ఇళ్లకు పూర్తిగా చేరుకోలేదు. తెలిసిన వారి ఇళ్లల్లో దూరప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. కుటుంబంలోని మహిళలు, పిల్లల బాగోగుల గురించి వారంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పోలీసులు రక్షణ కల్పిస్తే గ్రామాలకు తిరిగిరావాలని చూస్తున్నారు. మరోవైపు మాచర్ల, గురజాల, నరసరావుపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేశ్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. టీడీపీ మూక స్వైరవిహారం.. మాచవరం మండలం కొత్త గణేషునిపాడులో గ్రామం వదిలి వెళ్లిన ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన వైఎస్సార్సీపీ సానుభూతిపరులు ఇంకా గ్రామాలకు చేరలేదు. పోలీస్ పికెటింగ్ ఉన్నా మళ్లీ టీడీపీ మూకలు దాడులు చేస్తాయనే అభద్రతాభావంతో గ్రామానికి దూరంగా ఉంటున్నారు. పల్నాడు జిల్లాలో పలు ప్రాంతాల్లో టీడీపీ మూకలు విధ్వంసకాండ కొనసాగిస్తుండటంతో పోలీసులు జిల్లావ్యాప్తంగా మంగళవారం సాయంత్రం నుంచి 144 సెక్షన్ విధించారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా జిల్లాలోని పలు గ్రామాలు, పట్టణాల్లో దుకాణాలను మూసివేయించారు. చివరకు కొన్నిచోట్ల మెడికల్, కూరగాయలు, పాల దుకాణాలు, టీస్టాల్స్‌ను కూడా తెరవలేదు. బహిరంగ ప్రదేశాల్లో నలుగురికి మించి గుమిగూడకూడదని పోలీసులు ఆంక్షలు విధించారు. అయినప్పటికీ టీడీపీ నేతల దాడులు ఆగడం లేదు. వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా స్వైరవిహారం చేస్తున్నారు. తమకు ఓటు వేయని వారిపై దాడులు కొనసాగిస్తున్నారు. గ్రామానికి తిరిగిరాగానే పచ్చ మూకల దాడి.. గురజాల నియోజకవర్గంలో టీడీపీ దౌర్జన్యకాండ కొనసాగుతోంది. పల్లెల్లో టీడీపీ ఫ్యాక్షన్ చిచ్చురేపుతోంది. దాచేపల్లి మండలం మాదినపాడులో వైఎస్సార్సీపీ కార్యకర్త దొండేటి ఆదిరెడ్డిపై టీడీపీ నేతలు కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేశారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. పోలింగ్ రోజునే ఆదిరెడ్డితో టీడీపీ నాయకులు వాగి్వవాదానికి దిగారు. పోలింగ్ ముగిశాక గ్రామంలో పరిస్థితి బాగోలేకపోవటంతో రెండు రోజులపాటు వేరే గ్రామంలో ఉన్న బంధువుల ఇంటిలో ఆయన తలదాచుకున్నాడు. బుధవారం ఉదయం మాదినపాడు చేరుకున్న వెంటనే 30 మందికిపైగా టీడీపీ కార్యకర్తలు, నాయకులు కర్రలు, ఇనుపరాడ్లతో ఆదిరెడ్డిపై దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన తలకు బలమైన గాయాలు కావడంతో సొమ్మసిల్లిపడిపోయాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు గ్రామానికి చేరుకుని ఆదిరెడ్డిని పిడుగురాళ్లలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తీసుకెళ్లారు. ఆదిరెడ్డి తలలో నరాలు తెగి రక్తప్రసరణ నిలిచిపోయిందని.. రెండు మేజర్ సర్జరీలు చేయాలని వైద్యులు చెబుతున్నారు. వైఎస్సార్సీపీ నాయకుడిపై హత్యాయత్నం.. నాదెండ్ల మండలం అప్పాపురంలో వైఎస్సార్సీపీ నేతపై టీడీపీ నేతలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన మాజీ మండల ఉపాధ్యక్షుడు కోవెలమూడి సాంబశివరావుపై కర్రలు, కత్తులతో దాడికి తెగబడ్డారు. పోలింగ్ రోజు పన్నెండో బూత్‌లో ఎస్సీ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో బారులు తీరి రాత్రి 7 గంటల వరకు ఓట్లేశారు. వీరికి సాంబశివరావు అండగా ఉన్నాడు. ఇది మనసులో పెట్టుకున్న టీడీపీ నేతలు ఆయనపై దాడికి దిగారు. మరికొంతమందిపై కూడా దాడి చేసేందుకు కారులో వెంటపడ్డారు. అలాగే పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణç³ల్లిలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులు వెంకయ్య, విజయేంద్రబాబుల ఇళ్లపై దాడి చేశారు. వారిద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో గురజాల ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు.ఎమ్మెల్యేల హౌస్ అరెస్ట్.. పల్నాడు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులతో పోలీసులు కీలక నేతలను హౌస్ అరెస్ట్ చేసి వారిని ఇంటికే పరిమితం చేశారు. వైఎస్సార్సీపీకి చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలను హౌస్ అరెస్ట్‌లో ఉంచారు. మరోవైపు అల్లర్లకు కారణమైన టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై జిల్లావ్యాప్తంగా పోలీసులు కేసులు నమోదు చేశారు. ముందు జాగ్రత్తగా నేరస్వభావం ఉన్న వారిని బైండోవర్ చేశారు. దీంతో వందలాది మంది గ్రామాలను వదిలి వేరే ప్రాంతాలకు మకాం మార్చారు. -
బడుగులపై బరితెగింపు
అయ్యన్న గ్యాంగ్ అరాచకంఎన్నికల్లో చురుగ్గా పని చేసిందనే క్షక్షతో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం ధర్మసాగరంలో ఓ ఒంటరి మహిళ పట్ల అయ్యన్నపాత్రుడి అనుచరులు దుశ్శాసనుల్లా వ్యవహరించారు. మంగళవారం అర్థరాత్రి బాధితురాలి ఇంట్లోకి చొరబడి జుత్తు పట్టుకొని ఈడ్చుకొచ్చి కాళ్లతో తన్నుతూ.. తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. ఈ దుశ్చర్యను అడ్డుకోడానికి ప్రయత్నించిన స్థానికులపై పచ్చముఠాలు విరుచుకుపడ్డాయి. బాధితురాలు పొలమూరి రాజకుమారి 13 ఏళ్ల తన కుమారుడితో కలసి జీవిస్తోంది. కొన్నాళ్లు వలంటీరుగా పని చేసింది. పోలింగ్ రోజు ఓటర్లకు స్లిప్‌లు రాసిచ్చి వైఎస్సార్సీపీకి అనుకూలంగా పని చేయడం అయ్యన్న పాత్రుడి అనుచరులకు మింగుడు పడలేదు. పోలింగ్ మర్నాడు బాధితురాలు అదే గ్రామంలో ఉన్న తన పుట్టింటికి వెళ్లింది. రాత్రి 10 గంటల సమయంలో టీడీపీకి చెందిన రెడ్డి రాజేష్, రెడ్డి సత్యసాయి, కామిరెడ్డి శివ, సుకల రాజేష్, పెట్ట గంగాధర్, అల్లు రాజు, వానపల్లి రాజేష్, సొర్ల రఘు, నందిపల్లి బోయిల నాయుడు ఆమె ఇంటిని చుట్టుముట్టి తలుపులు బాదటంతో బయటకు వచ్చింది.రౌడీ మూకలు ఆమె మొబైల్‌ను లాక్కుని భౌతిక దాడికి పాల్పడ్డాయి. మెడలోని బంగారు గొలుసు లాక్కున్నారు. దీన్ని ప్రతిఘటించిన వృద్ధురాలు సీతమ్మ చెంపపై కొట్టి చెవి దుద్దులు లాక్కున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు 324, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయ్యన్నపాత్రుడి అనుచరురాలు, జెడ్పీటీసీ సుకల రమణమ్మ తన అనుచరులను దాడికి పురిగొల్పినట్లు బాధితురాలు పేర్కొంది.సాక్షి, అమరావతి/విశాఖ సిటీ/ఉంగుటూరు, నెట్వర్క్: ‘ఈసీ’ ఉదాసీనతతో పేట్రేగుతున్న పచ్చ ముఠాలు రాష్ట్రవ్యాప్తంగా భయానక వాతావరణాన్ని సృష్టిస్తూ మహిళలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలపై పాశవికంగా దాడులకు తెగబడుతున్నాయి. గ్రామాల్లో హింసను ప్రేరేపిస్తూ దమనకాండకు తెర తీశాయి. అనకాపల్లి జిల్లాలో టీడీపీ నేత అయ్యన్నపాత్రుడి అనుచరులు ఒంటరి మహిళపై కీచక పర్వానికి తెగబడగా కృష్ణా జిల్లా ఉంగుటూరులో ఫ్యాన్‌కు ఓటేసిందనే కక్షతో ఓ మహిళను ట్రాక్టర్‌తో తొక్కించి హత్యాయత్నానికి తెగబడ్డాయి. ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి మద్దతుగా పని చేయడమే ఈ అక్కచెల్లెమ్మలు చేసిన నేరం! తాజాగా పల్నాడులోనూ టీడీపీ మూకల దాష్టీకాలకు బడుగు, బలహీన వర్గాలు ఓ రాత్రంతా దేవాలయంలో తలదాచుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. ఓట్ల లెక్కింపు వరకు విధ్వంసకాండ కొనసాగించే ప్రణాళికను టీడీపీ మూకలు అమలు చేస్తున్నాయి. ఓట్ల లెక్కింపు చేపట్టే జూన్ 4వరకు రాష్ట్రం రావణకాష్టంగా రగులుతూ ఉండాలని టీడీపీ నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీనికనుగుణంగానే టీడీపీ గూండాలు, రౌడీ మూకలు స్వైర విహారం చేస్తుండటంతో ఏపీలో భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన ఎన్నికల కమిషన్ ఈ దాడుల పట్ల నిర్లిప్తంగా వ్యవహరించడం పరిస్థితిని మరింత దిగజారుస్తోంది. సమస్యాత్మక జిల్లాల్లో బదిలీలపై వచ్చిన పోలీసు అధికారులు పచ్చమూకల దౌర్జన్యకాండకు కొమ్ము కాస్తున్నారు.బెదిరించి.. భయపెట్టిప్రజాబలంతో టీడీపీ నెగ్గలేదని స్పష్టం కావడంతో పోలింగ్ రోజు రాష్ట్రవ్యాప్తంగా అవ్వాతాతలు, మహిళలను బెదిరిస్తూ దాడులతో హడలెత్తించే కుట్రలను చంద్రబాబు అమలు చేశారు. పోలింగ్ రోజు మొదలైన ఈ విధ్వంస కాండ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కల్పించేందుకు పథకాలను రచిస్తున్నారు. వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు కొనసాగిస్తూ గ్రామాల్లో లేకుండా చేయాలని, జూన్ 4న కౌంటింగ్ కేంద్రాల వద్దకు సైతం రాకుండా భయోత్పాతం సృష్టించాలని చంద్రబాబు ఎత్తుగడలు వేస్తున్నారు.పల్నాడులో చల్లారని ఉద్రిక్తతలుఎన్నికలు ముగిసి మూడు రోజులైనా పల్నాడులో ఉద్రిక్తతలు చల్లబడలేదు. టీడీపీ మూక దాడులతో ఎస్టీ, బీసీ వర్గాలు గ్రామాలు వీడి దూరంగా తలదాచుకుంటున్నాయి. పోలింగ్ రోజు రాత్రి అరాచక ముఠాల దాడులతో మాచవరం మండలం కొత్త గణేశునిపాడులో గ్రామం వదిలి వెళ్లిన ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన వైఎస్సార్సీపీ సానుభూతిపరులు ఇంతవరకు స్వగ్రామాలకు చేరుకోలేదు. పల్నాడులో 144 సెక్షన్‌తో దుకాణాలు మూతబడ్డాయి. మాచర్ల, గురజాల, నరసరావుపేట ఎమ్మెల్యేలు హౌస్ అరెస్ట్‌లో ఉన్నారు. దాచేపల్లి మండలం మాదినపాడులో వైఎస్సార్సీపీ కార్యకర్త దొండేటి ఆదిరెడ్డిపై టీడీపీ నేతలు కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేయడంతో గాయపడ్డాడు. తాడిపత్రిలో పట్టణాన్ని వీడి వెళ్లిన ఎమ్మెల్యే కేతిరెడ్డి నివాసంలో చొరబడ్డ పోలీసులు తలుపులు బద్ధలు కొట్టారు. కంప్యూటర్లను పగులగొట్టారు.ఫ్యాన్‌కు ఓటేసిందని.. మహిళను ట్రాక్టర్‌తో తొక్కించబోయాడు!వైఎస్సార్సీపీకి ఓటు వేసిందని కక్షగట్టి ఓ మహిళను టీడీపీ నాయకుడు ట్రాక్టర్‌తో తొక్కించబోగా తృటిలో తప్పించుకుంది. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామానికి చెందిన వేముల సంధ్యారాణి వైఎస్సార్ సీపీకి ఓటు వేసిందని టీడీపీ నాయకుడు ఏడుకొండలు కక్ష పెంచుకున్నాడు. బుధవారం ఉద్దేశపూర్వకంగా ఆమెతో ఘర్షణ పడి తన ట్రాక్టర్‌తో ఢీకొట్టాడు. పిన్నమనేని సిద్ధార్థ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని గన్నవరం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంశీమోహన్ పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల దన్ను... ఈసీ ఉదాసీనత టీడీపీ మూకలు బరితెగించి దాడులు, విద్వంసానికి పాల్పడుతున్నా పోలీసు యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం విస్మయపరుస్తోంది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో డీఐజీ నుంచి ఎస్సై వరకూ పోలీసు అధికారులను పోలింగ్‌కు ముందు ఈసీ హఠాత్తుగా బదిలీ చేసింది. వారి స్థానంలో క్షేత్రస్థాయి పరిస్థితులపై ఏమాత్రం అవగాహనలేని అధికారులను నియమించింది. శాంతిభద్రతల పరిరక్షణలో కీలకమైన డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీలను కూడా ఈసీ బదిలీ చేసింది. చంద్రబాబు ఆదేశాలతో పురందేశ్వరి అందచేసిన జాబితాలో సూచించిన వారినే నియమించింది. అదే దన్నుగా టీడీపీ గూండాలు చెలరేగిపోతున్నారు. ఈసీ టీడీపీకి అనుకూలంగా ఉందనే సంకేతాలు వెలువడటంతో విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయి. అధికార యంత్రాంగాన్ని నడిపిస్తున్న ఈసీ ఈ దాడుల పట్ల బుధవారం వరకూ స్పందించలేదు. ఎస్పీలు, డీఐజీలకు ఆదేశాలు ఇవ్వలేదు. డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌లతో చర్చించలేదు. ఈసీ, పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ గట్టిగా నిలదీయడంతో ఇక తప్పదన్నట్లుగా సమీక్షకు ఉపక్రమించింది. -
వైఎస్సార్సీపీ ఏజెంట్‌పై టీడీపీ మూకల హత్యాయత్నం
మైదుకూరు: పోలింగ్ రోజు ఏజెంట్‌గా కూర్చున్నాడనే అక్కసుతో వైఎస్సార్ జిల్లా మైదుకూరులో వైఎస్సార్సీపీ కార్యకర్త భూమిరెడ్డి చంద్ర ఓబుళరెడ్డిపై బుధవారం సాయంత్రం టీడీపీ వర్గీయులు హత్యాయత్నం చేశారు. బాధితుడి కథనం ప్రకారం... చాపాడు మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన భూమిరెడ్డి చంద్ర ఓబుళరెడ్డి సమగ్ర శిక్ష అభియాన్‌లో ఏఈగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ఆయన మైదుకూరులోని బద్వేలు రోడ్డులో నివాసముంటున్నారు. ఈ ఎన్నికల్లో స్వగ్రామం విశ్వనాథపురంలో పోలింగ్ సందర్భంగా సోమవారం వైఎస్సార్సీపీ తరపున ఏజెంట్‌గా కూర్చున్నారు.అంతకుముందు రోజు టీడీపీ వర్గీయులు ఏజెంట్‌గా కూర్చోవద్దని బెదిరించారు. వారి బెదిరింపులకు తలొగ్గక ఆయన వైఎస్సార్సీపీ ఏజెంట్‌గా కూర్చున్నారు. ఆ కడుపుమంటతో టీడీపీ వర్గీయులు చంద్ర ఓబుళరెడ్డి ప్రొద్దుటూరు రోడ్డులోని బైపాస్ వద్దకు రోజూ వాకింగ్‌కు వస్తుంటారని తెలుసుకుని.. బుధవారం సాయంత్రం అదే రోడ్డులోని ఏవీఆర్ స్కూల్ వద్ద కాపు కాశారు. వాకింగ్ ముగించుకుని వస్తున్న చంద్ర ఓబుళరెడ్డిపై విశ్వనాథపురం గ్రామానికి చెందిన కార్తీక్ రెడ్డి, ఇల్లూరు సుబ్బారెడ్డి, బొచ్చు సుబ్బారెడ్డి, మరో ముగ్గురు దాడి చేసి బీర్ బాటిళ్లతో తలపై కొట్టారు.‘చెప్పినా వినకుండా ఏజెంట్‌గా కూర్చుంటావా...ఇప్పుడే నిన్ను చంపుతాం..’ అంటూ కేకలు వేశారు. వారి దెబ్బలకు తీవ్రంగా గాయపడిన చంద్ర ఓబుళరెడ్డి స్పృహ తప్పి కింద పడిపోయాడు. అయినా విడిచి పెట్టకుండా నిందితుల్లో కొందరు బండరాయిని ఎత్తి తలపై మోదేందుకు ప్రయత్నించారు. సమీపంలో ఉన్న కొందరు మహిళలు గట్టిగా కేకలు వేయడంతో నిందితులు అతన్ని వదిలేసి తమ వెంట తెచ్చుకున్న బైకులపై పరారయ్యారు. తలపై తీవ్ర గాయాలైన చంద్ర ఓబుళరెడ్డిని మైదుకూరు ప్రభుత్వాస్పత్రికి చికిత్స కోసం తరలించారు.సంఘటన గురించి తెలియగానే ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ప్రభుత్వాస్పత్రికి చేరుకుని బాధితుడిని పరామర్శించారు. దాడి గురించి అడిగి తెలుసుకున్నారు. పోలింగ్‌కు ముందు రోజే టీడీపీ వారు బెదిరించారని బాధితుని భార్య, కుమారుడు మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యేకు తెలిపారు. పథకం ప్రకారమే దాడి చేసి హత్యాప్రయత్నం చేశారని వారు చెప్పారు. దాడి సమాచారం తెలియగానే చాపాడు ఎంపీపీ తెలిదేల లక్ష్మయ్య, మండల నాయకులు, మైదుకూరు సింగిల్ విండో చైర్మన్ మూలె సుధాకర్‌రెడ్డి, ఖాజీపేట వైఎస్సార్సీపీ నాయకుడు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, మైదుకూరు మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు ఎంఆర్ఎఫ్ సుబ్బయ్య తదితరులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. మైదుకూరు డీఎస్పీ వెంకటేశులు, రూరల్, అర్బన్ సీఐలు శ్రీనాథరెడ్డి, ఏపీ మస్తాన్ ఆస్పత్రికి వచ్చి చంద్ర ఓబుళరెడ్డితో మాట్లాడారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మెరుగైన చికిత్స కోసం ప్రొద్దుటూరుకు తరలించారు. -
ఇంటికి చేరే వేళ మృత్యు గంట
ఇంటికి చేరే వేళ మృత్యు గంట ’’ తెల్లారిన కూలీల బతుకులు ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్ రోడ్డు ప్రమాదంలో నలుగురు కూలీల మృతి ధాన్యం బస్తాలు లోడ్ చేస్తుండగా దుర్ఘటన మృతదేహాల వద్ద కుటుంబ సభ్యుల రోదన పి.గన్నవరం/అంబాజీపేట: వారంతా రెక్కాడితేగాని డొక్కాడని పేద కుటుంబాలకు చెందిన కూలీలు. జీవనాధారంలో భాగంగా ట్రాక్టర్ పై ధాన్యం బస్తాలు లోడ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఆర్టీసీ బస్ రూపంలో మృత్యువు వారిని కాటేసింది. ప్రధాన రహదారి నెత్తురోడింది. మృతుల కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. కూలి పనులకు వెళ్లిన వారు తిరిగి మరో 30 నిమిషాల్లో ఇంటికి చేరతారనుకున్న సమయంలో విగత జీవులు అయారనే వార్త తెలియడంతో వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగాయి. పి.గన్నవరం మండలం, ఊడిమూడి గ్రామం వద్ద ఆర్.పి.రోడ్డుపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఊడిమూడి గ్రామం వద్ద చింతావారిపేట సమీపంలో రోడ్డు పక్కన ట్రాక్టర్ పై ధాన్యం బస్తాలను పది మంది కూలీలు లోడ్ చేసి పగ్గం కడుతున్నారు. అదే సమయంలో రాజోలు నుంచి రావులపాలెం వెళుతున్న ఆర్టీసీ బస్ ట్రాక్టర్‌ను వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్, ట్రాక్టర్ల కింద పడి కూలీలు మృత్యువాత పడ్డారు. జి.పెదపూడికి చెందిన నూకపెయ్యి శివ (35), వాసంశెట్టి సూర్యనారాయణ (45), ఈరి కట్లయ్య (50), ఊడిమూడి శివారు ఆదిమూలంవారిపాలెంకు చెందిన చిలకలపూడి మణిబాబు (30) అక్కడికక్కడే మృతి చెందారు. ఆదిమూలవారిపాలెంకు చెందిన చిలకలపూడి సురే‹Ùకు తీవ్ర గాయాలు కాగా అమలాపురం ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. జి.పెదపూడికి చెందిన బొరుసు నానికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. బొరుసు రాంబాబు, బుజ్జి, వాసంశెట్టి సాయికిరణ్, గూనపాటి పెద్దిరాజులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆర్టీసీ బస్‌లో 20 మంది ప్రయాణికులున్నారు. ఇద్దరు మహిళలకు స్వల్పగాయాలు అయ్యాయి. బస్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. రెండు గ్రామాల్లో విషాద ఛాయలు... మరో 30 నిమిషాల్లో ఇళ్లకు చేరుకోవల్సిన వారు విగత జీవులుగా మారడంతో జి.పెదపూడి, ఆదిమూలంవారిపాలెం గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. జి.పెదపూడికి చెందిన నూకపెయ్యి శివ కొబ్బరి వలుపు కారి్మకుడిగా, కూలీగా పని చేసేవాడు. మృతునికి భార్య బేబి కుమారి, సుశాంత్, జస్వంత్ అనే చిన్న పిల్లలు ఉన్నారు. భర్త శివ మరణించడంతో ఆ కుటుంబం దిక్కులేనిదయ్యిందని బంధువులు, కుటుంబ సభ్యులు రోదించారు. అదే గ్రామానికి చెందిన వాసంశెట్టి సూర్యనారాయణ మృతి చెందడంతో భార్య దుర్గ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. సూర్యనారాయణ కుమార్తె నాగేశ్వరికి ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. ఇంటిలో శుభకార్యం జరిగి ఏడాది తిరగ కుండానే అందరిని వదలి వెళ్లిపోయాడని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన వీరి కట్లయ్యకు భార్య సుబ్బలక్షి్మ, కుమారులు నాగరాజు, సురే‹Ù, కుమార్తెలు వైష్ణవి, హారికలు ఉన్నారు. అతని మృతితో పెద్ద దిక్కును కోల్పోవడమే కాకుండా జీవనాధారం కోల్పోయామని కుటుంబీకులు విలపిస్తున్నారు. ఆదిమూలంవారిపాలెంకు చెందిన చిలకలపూడి మణిబాబు మృతి చెందడం, అతని అన్న సురేష్ తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో వారి తల్లితండ్రులు వెంకటేశ్వరరావు, సత్యనారాయణమ్మ రోదనలు గ్రామస్తులకు కంటతడి పెట్టించాయి. అందరితో కలివిడిగా ఉండే మణిబాబు మృతి చెందడం, సురేష్ తీవ్ర గాయాలు పాలవ్వడంతో బంధువులు, స్నేహితులు బోరున విలపిస్తున్నారు. ఆందోళన చేపట్టిన గ్రామస్తులు నిర్లక్ష్యంగా, మితి మీరిన వేగంతో బస్సును నడిపి నలుగురు మృతికి కారణమైన బస్ డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జి.పెదపూడి, ఊడిమూడికి చెందిన నాయకులు, గ్రామస్తులు ఆర్పీ రోడ్డుపై ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. కలెక్టర్, ఎస్పీ, ఆరీ్టవోలు రావాలని నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత వాతావారణం నెలకొనడంతో పి.గన్నవరం సీఐ డి.ప్రశాంత్‌కుమార్, ఎస్సై బి.శివకృష్ణ ఆందోళన కారులతో చర్చించారు. ఆర్డీఓ సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ మొత్తం పెంచాలని మృతుల కుటుంబ సభ్యులు ఆందోళన కొనసాగిస్తున్నారు. -
Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
నంద్యాల, సాక్షి: పోలింగ్ ముగియడంతో జిల్లాలో పాత పగలు భగ్గుమన్నాయి!. గత అర్ధరాత్రి ఆళ్లగడ్డలో ఒక యువకుడిపై హత్యాయత్నం జరిగింది. సదరు యువకుడ్ని టీడీపీ నేత భూమా అఖిలప్రియ దగ్గర పని చేసే బాడీగార్డుగా గుర్తించగా.. ఏవీ సుబ్బారెడ్డి మనుషులే ఈ పని చేయించి ఉంటారనే అనుమానాలు తలెత్తున్నాయి.కిందటి ఏడాది మే నెలలో జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా.. అఖిల ప్రియ వర్గీయులు కొత్తపల్లిరోడ్డులో ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేశారు. ఆ సమయంలో నిఖిల్ ఆయనపై చేయి చేసుకున్నాడు. భూమా వర్గీయుల దాడిలో ఏవీ సుబ్బారెడ్డి నోటి నుంచి రక్తం కారింది. ఆయనను కొడుతున్నప్పుడు భూమా అఖిల ప్రియా అక్కడే ఉన్నారు. పైగా ఆమె ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులను బెదిరించడం కనిపించింది. వారిపై ఘాటు పదాలతో విరుచుకుపడ్డారామె. ఉమ్మడి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో తన తరువాతే ఇంకెవరైనా అంటూ హెచ్చరించారు. ఈ ఘటన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇరువురిని ఎన్నికలయ్యేదాకా గొడవపడొద్దని మందలించినట్లు ప్రచారం జరిగింది. కట్ చేస్తే.. ఏడాది తర్వాత నిన్న అర్ధరాత్రి ఆళ్లగడ్డలో అఖిలప్రియ బాడీగార్డు నిఖిల్‌పై దాడి జరిగింది. తొలుత కారుతో నిఖిల్‌కు ఢీ కొట్టారు. ఆ తర్వాత అతనిపై రాడ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో నిఖిల్ తీవ్రంగా గాయపడగా.. నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాత పగతో సుబ్బారెడ్డి మనుషులే ఈ పని చేయించి ఉంటారని స్థానిక చర్చ నడుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై స్పందించాల్సి ఉంది. అయితే దాడికి ఉపయోగించిన వాహనం నంద్యాలకు చెందిందిగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.