పేర్ని నానికి ఘన స్వాగతం | - | Sakshi
Sakshi News home page

పేర్ని నానికి ఘన స్వాగతం

Sep 2 2026 12:12 AM | Updated on Sep 2 2026 12:12 AM

రావులపాలెం: వైఎస్సార్‌ సీపీ ముఖ్య నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని)కి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యాన రావులపాలెంలో ఘన స్వాగతం పలికారు. స్థానిక జూనియర్‌ కళాశాల సమీపాన ఏర్పాటు చేసిన శిబిరానికి ఆయన మంగళవారం సాయంత్రం వచ్చారు. వైఎస్సార్‌ సీపీ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు, సీనియర్‌ నేత కుడుపూడి చిట్టబ్బాయి జయంతి సందర్భంగా ఆయన ఫ్లెక్సీకి నాయకులు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం సుమారు భారీగా కార్లు, మోటార్‌ సైకిళ్లపై ఆత్రేయపురం మండలం పేరవరం గ్రామానికి ర్యాలీగా బయలుదేరారు. దారి పొడవునా జై జగన్‌, జై జగ్గిరెడ్డి నినాదాలు హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీకి చెందిన ఎమ్మెల్సీలు బొమ్మి ఇజ్రాయిల్‌, కుడుపూడి సూర్యనారాయణరావు, మాజీ ఎంపీలు చింతా అనురాధ, మార్గాని భరత్‌రామ్‌, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, జెడ్పీ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు, వివిధ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు పాముల రాజేశ్వరీదేవి (రాజోలు), పినిపే శ్రీకాంత్‌ (అమలాపురం), గన్నవరపు శ్రీనివాసరావు (పి.గన్నవరం), పిల్లి సూర్యప్రకాశ్‌ (రామచంద్రపురం), పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, కర్రి నాగిరెడ్డి, గొల్లపల్లి డేవిడ్‌రాజు, కటకంశెట్టి ఆదిత్య, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కొత్తపేట నియోజకవర్గ పరిశీలకుడు పాటి శివకుమార్‌, ఎస్‌ఈసీ సభ్యులు కుడుపూడి భరత్‌ భూషణ్‌, కాశీ బాలమునికుమారి, జెడ్పీటీసీ సభ్యులు కుడుపూడి శ్రీనివాసరావు, గూడపాటి రమాదేవి, కొత్తపేట ఎంపీపీ మార్గాన గంగాధరరావు, మండల కన్వీనర్లు బొక్కా కరుణాకరం, తమ్మన శ్రీను, మైనార్టీ సెల్‌ జిల్లా కార్యవర్గ సభ్యుడు షేక్‌ వలీబాబు, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు బొక్కా వెంకటలక్ష్మి, పార్టీ మండల కార్యదర్శి పులగుర్త రామారావు, మాజీ సర్పంచులు సబ్బితి మోహనరావు, అంబటి సుబ్బలక్ష్మి, నాయకులు చల్లా ప్రభాకరరావు, నాండ్ర నాగమోహన్‌రెడ్డి, సఖినేటి వాకులరాజు, కోనాల రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

అదనపు డీఎంహెచ్‌ఓ

భరతలక్ష్మి బదిలీ

అమలాపురం టౌన్‌: జిల్లా అదనపు వైద్య, ఆరోగ్య శాఖ అధికారి(డీఎంహెచ్‌ఓ)గా పని చేస్తున్న డాక్టర్‌ భరతలక్ష్మి పశ్చిమ గోదావరి డీఎంహెచ్‌ఓగా ఉద్యోగోన్నతిపై బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎం.దుర్గారావుదొర తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement