Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

AP Police Over Action At Sakshi Editor Dhanunjaya Reddy1
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు.. ‘సాక్షి’పై ఏపీ సర్కార్‌ కక్ష సాధింపు

సాక్షి, విజయవాడ: ఏపీలో పత్రికా స్వేచ్చకు సంకెళ్లు పడ్డాయి. కూటమి ప్రభుత్వంలో సాక్షిపై కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై వార్తలు రాసినందుకు సాక్షి పత్రిక ఎడిటర్‌ ధనుంజయ రెడ్డిపై పోలీసులు వేధింపు చర్యలకు దిగారు. సోదాల పేరుతో ఏపీ పోలీసులు గురువారం ఉదయం.. సాక్షి ఎడిటర్‌ ధనుంజయ రెడ్డికి చేరుకున్నారు. ఎలాంటి నోటీసులు లేకుండానే ధనుంజయ రెడ్డి ఇంటికి పోలీసులు చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురిచేశారు. ఇంట్లోకి వెళ్లిన పోలీసులు.. కాసేపటికే ఇంటి తలుపులు మూసివేసి గంటల తరబడి సోదాలు చేశారు. అయితే, గతంలోనూ ధనుంజయ రెడ్డిపై పోలీసులు కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తూ కథనాలు రాసిన పలువురు సాక్షి విలేకర్లపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు.ఏసీపీ ప్రవర్తన దుర్మార్గం: ధనుంజయ రెడ్డి అనంతరం, సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ.. ఈరోజు ఉదయం 9:45కి పది మంది పోలీసులు ఇంటికి వచ్చారు. సోదాలకు సంబంధించి‌ నోటీసులు లేకుండా ఇంట్లోకి దూసుకొచ్చేశారు. ఏసీపీ మరింత దుర్మార్గంగా ప్రవర్తించారు. నోటీస్ కూడా ఇవ్వకుండా సోదాలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఇలాంటి చర్యలు పత్రికా స్వేచ్ఛకి విఘాతం కలిగిస్తాయి. ప్రజల గొంతుకై ‘సాక్షి’ నిలుస్తుంది అని కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. ఇప్పటికే నాలుగు సార్లు కేసులు పెట్టారు. ప్రస్తుతం హైకోర్టు పరిధిలో కేసు ఉంది. సంబంధం లేదని వాళ్లే చెబుతారు. మళ్లీ వారే సోదాలు చేస్తారు. ప్రెస్ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకి కూడా మేము ఫిర్యాదు ఇస్తాం. మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీయడానికి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యవాదులంతా ఈ పద్ధతిని ఖండించాలి’ అని అన్నారు. ఖండించిన పాత్రికేయులుఏపీలో ఎమ‌ర్జెన్సీ నాటి ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని పాత్రికేయులు మండిప‌డుతున్నారు. కూటమి ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను, ప్ర‌జా వ్య‌తిరేక చ‌ర్య‌ల‌ను ప్ర‌శ్నిస్తున్నందుకే సాక్షిపై చంద్ర‌బాబు స‌ర్కారు క‌క్ష సాధిస్తోంద‌ని ఆరోపిస్తున్నారు. కూట‌మి ప్ర‌భుత్వ క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌ను ప్ర‌జాసంఘాల‌తో పాటు ప్ర‌జ‌లు ముక్త కంఠంతో వ్య‌తిరేకిస్తున్నార‌ని తెలిపారు. ప్ర‌భుత్వంలో జ‌రుగుతున్న అక్ర‌మాల‌ను నిగ్గ‌దీసి అడుగుతున్నందుకు, క‌క్ష గ‌ట్టి ప్ర‌జల గొంతును నొక్కాల‌ని చేస్తున్న ప్ర‌య‌త్నంలో భాగంగానే కూట‌మి స‌ర్కారు ఇదంతా చేస్తోంద‌ని ఆరోపించారు. ప్ర‌జ‌ల‌కు జ‌రుగుతున్న అన్యాయాన్ని ప్ర‌శ్నిస్తూనే ఉంటామ‌ని, ఇచ్చిన హామీల‌ను నిల‌బెట్టుకునేలా ప్ర‌భుత్వంపై ఒత్తిడి కొన‌సాగిస్తామ‌న్నారు. సాక్షిపై కక్ష సాధింపు చ‌ర్య‌ల‌ను ప‌త్రికా స్వేచ్ఛ‌పై జ‌రిగిన దాడిగా పాత్రికేయులు పేర్కొన్నారు. ప్ర‌భుత్వం రాజ్యాంగ‌బ‌ద్దంగా న‌డుచుకోవాల‌ని కక్ష సాధింపు చ‌ర్య‌లు మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు.

Kommineni Srinivasa Rao Comments On Revanth Reddy2
చంద్రబాబు బాటలో​నే రేవంత్‌.. ఇదేం రాజకీయం!

ఆర్థిక పరిస్థితులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రేవంత్‌ వ్యాఖ్యల్లో వాస్తవమున్నప్పటికీ ఆయన కూడా తన రాజకీయ గురువు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి బాటే పట్టారేమో అనిపిస్తుంది. ఎన్నికల ముందు ఆకాశం మీ చేతుల్లోకి తెచ్చేస్తానన్న రీతిలో హామీలివ్వడం.. తీరా అధికారం చేపట్టిన తరువాత ఖజానా చూస్తే హామీల అమలుపై భయమేస్తోందని సన్నాయి నొక్కులు నొక్కడంలో చంద్రబాబు ఆరితేరిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు రేవంత్‌ కూడా అదే మాదిరిగా.. అప్పులు కూడా పుట్టడం లేదని చెబుతున్నట్లు అనిపిస్తోంది.నిజానికి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇంత బహిరంగంగా మాట్లాడడం సరికాకపోవచ్చు. వాస్తవాలు చెబుతున్న కారణంగా అంతా సర్దుకు పోతారని ఆయన భావన కావచ్చు. కాని దీనివల్ల రాష్ట్రం పరపతి దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకూ ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా మాట్లాడి ఉండకపోవచ్చు. తెలుగు రాష్ట్రాలకు అప్పులు నిజంగానే పుట్టడం లేదా అంటే ఆంధ్రప్రదేశ్‌లో పదకుండు నెలల్లోనే రూ.1.5లక్షల కోట్ల అప్పు చేస్తే, తెలంగాణలో రూ.1.58 లక్షల కోట్ల అప్పు చేశారు. అదనంగా అప్పులకు వెళితే ఇస్తున్నట్లు లేరు. దేనికైనా పరిమితులు ఉంటాయి. తోచినట్లు వాగ్దానాలు చేసి,అధికారంలోకి వచ్చాక ఇప్పుడు అప్పులు పుట్టడం లేదని, బ్యాంకులు తమను దొంగల్లా చూస్తున్నాయని అంటే ప్రజలు ఏమని అనుకుంటారు? తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులకు అప్పాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని, తీరు చూస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతారేమో అన్నట్లుగా పరిస్థితి దేశం ముందట ఉందని రేవంత్ అన్నారు.ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు. దీనికంతటికి గత ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యుడని రేవంత్ చెప్పవచ్చు. కాని అది పరిష్కారం కాదు. సరైన జవాబు కాదు. ఎందుకంటే ఎన్నికలకు ముందే రాష్ట్ర అప్పులపై రేవంత్ కాని, ఇతర కాంగ్రెస్ నేతలు కాని అనేక విమర్శలు చేశారు. అయినా అధికారం రాబట్టుకోవడం కోసం ఎన్ని అసాధ్యమైన హామీలు ఇచ్చారో గుర్తులేదా? ఆరు గ్యారంటీలకు ఎంత ఖర్చు అవుతుందో తెలియకుండానే వాగ్దానం చేశారా? అలా చేస్తే అది బాధ్యతారాహిత్యం కాదా? అదేమంటే రేవంత్ ఇచ్చిన సమాధానం చూడండి. ప్రతి సంవత్సరం మూడు లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. మూడు లక్షల కోట్ల ఆదాయం వస్తుంది కాబట్టి ఇదెంత సంసారం. చక్కదిద్దవచ్చని అనుకున్నానని ఆయన చెప్పారు. తీరా చూస్తే మూడు లక్షల కోట్ల ఆదాయం లేదు.. రెండు లక్షల కోట్లే ఆదాయం, అప్పు ఎనిమిది లక్షల కోట్లు ఉంది అని ఆయన వివరిస్తున్నారు.సరిగ్గా చంద్రబాబు కూడా ఏపీలో ఇలాగే మాట్లాడారు. తనకు ఎన్నికల ముందు అన్నీ ఇవ్వవచ్చని అనుకున్నానని, కాని లోపలికి వెళ్లి చూస్తే ఏమీ లేదని, ఖజానా ఖాళీగా కనబడస్తా ఉందని చంద్రబాబు చెప్పారు. ఎన్నికలకు ముందు రూ.14 లక్షల కోట్ల అప్పు ఉందని ప్రచారం చేసిన చంద్రబాబు తీరా బడ్జెట్‌లో రూ. ఆరున్నర లక్షల కోట్లే ఉందని అంగీకరించారు. అయినా హామీలు అమలు చేయకుండా ఎగ్గొట్టడానికి ఈ కబుర్లు చెబుతున్నారన్న సంగతి ఏపీ ప్రజలకు అర్థమైంది. అదే ధోరణిలో రేవంత్ కూడా ఎన్నికలకు ముందు వంద రోజులలో అన్ని హామీలు చేసి చూపిస్తామని, రైతులకు రూ.రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని, ఎవరైనా అప్పు చేయకపోతే బ్యాంకులకు వెళ్లి అప్పు తీసుకోండని చెప్పారా? లేదా? అది బాధ్యతారాహిత్యం కాదా? ఇప్పుడేమో తాను 18 గంటలు కష్టపడుతున్నానని, ఒక్క రోజైనా, ఒక్క గంట సెలవైనా తీసుకోలేదని సానుభూతి కోసం మాట్లాడుతున్నారు. నిజానికి ఏ సీఎం అయినా 18 గంటలు పనిచేస్తున్నానని చెబితే ఆ ప్రభుత్వం పద్దతిగా లేదని అర్థం.ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరి బాధ్యతలు వారికి ఉంటాయి. మిగిలినవారిని పని చేయనివ్వకుండా తానే పని చేస్తున్నానని చెప్పుకోవడానికి ఇలాంటి మాటలు పనికి వస్తాయి తప్ప జనానికి ఏమి ఉపయోగం? ఇది కూడా చంద్రబాబు తరహా మాటే.ఆయన కూడా తాను ఎంతలా కష్టపడుతున్నది పదే, పదే జనానికి చెబుతుంటారు. రేవంత్ కొత్తగా సీఎం అయి ఉండవచ్చు.ఆయన కొన్ని వాగ్దానాలు అమలు చేయడానికి ప్రయత్నం చేయకపోలేదు. అయినా అన్నిటిని అమలు చేయడం కష్టం కనుక ఈ కొత్తరాగం ఎత్తుకున్నారు. అప్పులు, వాయిదాలకే రూ.7500 కోట్లు అవుతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటివారు రేవంత్‌కు మద్దతుగా మాట్లాడుతున్నా, అవి అంత కన్విన్సింగా కనిపించవు. ఏ ప్రభుత్వం ఉన్నా, రుణాలు చెల్లించవలసిందే కదా! ఒక్కసారి గతానికి వెళితే చంద్రబాబు నాయడు 1996 లోక్ సభ ఎన్నికలకు ముందు టీడీపీ అత్యధిక లోక్ సభ స్థానాలు గెలిస్తేనే కిలో రెండు రూపాయల బియ్యం, మద్య నిషేధం, మొదలైనవి కొనసాగుతాయని ప్రచారం చేశారు.ఎన్నికలు అయ్యాక మాత్రం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని, మార్పులు చేయాలని, బియ్యం రేట్లు పెంచాలని, మద్య నిషేధం ఎత్తివేయాలంటూ ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ఒక తంతు సాగించారు. ప్రతి ఎన్నికకు ముందు ఇదే తతంగం ఆయన సాగిస్తుంటారు. 2014లో రైతుల రుణమాఫీ పూర్తిగా చేస్తానని, బ్యాంకులలో తనఖాలో ఉన్న రైతుల భార్యల బంగారం కూడా విడిపిస్తానని చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఆయన ఏదో అరకొర చేసి చేతులెత్తేశారు. 2024లో కూడా సూపర్ సిక్స్ అంటూ మరోసారి జనాన్ని మభ్య పెట్టడానికి వెనుకాడలేదు. ఈ రకంగా గురు, శిష్యులైన తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరూ ఒకే బాటలో పయనించడం విశేషం.ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి రేవంత్ చేసిన వ్యాఖ్యలు కూడా అంత సహేతుకంగా అనిపించవు. తమ డిమాండ్లు నెరవేర్చాలన్న ఉద్యోగ సంఘాలను ఉద్దేశించి ఎవరిపై మీ సమరం అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం వల్ల ఏమి ప్రయోజనం? తెలంగాణ రాష్ట్రం దివాళా తీయడానికి ఉద్యోగులు బాధ్యులు అవుతారా? లేక పాలన చేస్తున్న నేతలా?‘‘నన్ను కోసినా రూపాయి రాదు..ప్రభుత్వం అంటే నేను ఒక్కడినే కాదు..ప్రజా ప్రతినిధులు,, ప్రభుత్వ ఉద్యోగులు అంతా కలిస్తేనే ప్రభుత్వం’’ అంటూ సూత్రాలు చెబితే ఏమి లాభం. రేవంత్ ఒక్కసారి కాంగ్రెస్ మానిఫెస్టోని తిరిగి చదువుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్ని రకాల హామీలు ఇచ్చింది మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్‌ చదివి వినిపించారు. వాటన్నిటిని ఏ బాధ్యతతో చేశారు? ఇప్పుడు వాటిని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు అడిగితే ‘‘ఎవరిపై మీ సమరం?’’ అంటే వారేమి జవాబు ఇస్తారు! ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, తదితర వాగ్దానాలు చేశారా? లేదా? రేవంత్ తాను అన్ని నిజాలే చెప్పినట్లు అనుకోవచ్చు.కాని అది చెప్పిన తీరు బాగోలేదు. ఉద్యోగ సంఘాలను పిలిపించుకుని అంతరంగికంగా చర్చలు జరిపి వారికి నచ్చ చెప్పి ఉండవచ్చు. ఫలానా సమయానికి తాను హామీలు అమలు చేయగలుగుతామని చెప్పి ఉండవచ్చు. అలా కాకుండా ఇంత బహిరంగంగా వేరే కార్యక్రమంలో ఉద్యోగులను బెదిరించే రీతిలో మాట్లాడడం వల్ల ఆయనకే నష్టం. రేవంత్ తీరువల్ల రాష్ట్ర పరువు పోయిందని బీఆర్‌ఎస్‌, బీజేపీలు తీవ్ర అభ్యంతరం చెబుతున్నాయి. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఇతర బీజేపీ నేతలు ముఖ్యమంత్రి పై మండిపడ్డారు. ఒక్క మాటలో చెప్పాలంటే రేవంత్ తాను నిజాలే మాట్లాడుతున్నానులే అనుకుని సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లుగా అనిపిస్తుంది. ఈ సీఎంకు చేతకావడం లేదని ప్రజలు అనుకునే పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్‌లో కూడా దీనిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతాయి.కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదులు వెళతాయి. కుల గణన ద్వారా తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అయిందని ప్రచారం చేసుకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ దివాళా తీసిందని చెప్పడం ద్వారా దేశానికి ఏమి సంకేతం ఇచ్చినట్లయింది? అసలే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలలో రేటింగ్ తగ్గుతోందని అనుకుంటున్న తరుణంలో రేవంత్ రెడ్డే దానిని మరింత తగ్గించుకున్నట్లుగా ఉంది. ఎన్నికలకు ముందు పొలిటికల్ సైన్స్, ఎన్నికల తర్వాత ఎకనామిక్స్ చెబితే జనం నమ్ముతారా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

AP High Court Key Orders On IPS Kanthi Rana And Vishal Gunni3
జత్వానీ కేసు.. ఐపీఎస్‌ కాంతిరాణా, విశాల్‌ గున్నీకి ఊరట

సాక్షి, అమరావతి: సినీ నటి జత్వానీ కేసులో ఇద్దరు ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్‌ గున్నీలకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. జత్వానీ వ్యవహారంలో కేసులను క్వాష్‌ చేయాలంటూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ క్రమంలో పోలీసుల తదుపరి చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం, తదుపరి విచారణను జూన్‌ 30వ తేదీకి వాయిదా వేసింది. గత విచారణలో ఇలా..కొద్ది రోజుల క్రితం డాక్యుమెంట్ల ఫోర్జరీ కేసులో విచారణ చేసి అరెస్ట్‌ చేసినందుకే సినీనటి కాదంబరి జత్వానీ కక్షపూరితంగా తమపై తప్పుడు కేసు పెట్టారని ఐపీఎస్‌ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్‌ గున్నీ, పోలీసు అధికారులు హనుమంతరావు, సత్యనారాయణలు హైకోర్టుకు నివేదించారు. కాంతిరాణా టాటా తదితరులపై కేసు నమోదు వెనుక దురుద్దేశాలు ఉన్నాయని వారి తరఫు సీనియర్‌ న్యాయవాదులు సుబ్రహ్మణ్యం శ్రీరాం, వేములపాటి పట్టాభి, వినోద్‌కుమార్‌ దేశ్‌పాండే వివరించారు.జత్వానీ ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ కోసం కాంతిరాణా టాటా, విశాల్‌ గున్నీ, కె.హనుమంతరావు, ఎం.సత్యనారాయణ, న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్‌ కృపాసాగర్‌ మరోసారి విచారణ జరిపారు. కాంతిరాణ టాటా తదితరుల తరఫు సీనియర్‌ న్యాయవాదులు సుబ్రహ్మణ్య శ్రీరాం, వేములపాటి పట్టాభి, వినోద్‌ కుమార్‌ దేశ్‌పాండే వాదనలు వినిపిస్తూ.. ‘పోలీసు అధికారులుగా తమకు వచ్చిన ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి చట్ట ప్రకారం జత్వానీని విచారించడమే తప్పు అన్నట్లుగా పిటిషనర్లపై కేసులు నమోదు చేశారు. విధి నిర్వహణలో భాగంగా చేసిన చర్యలకు నేరాన్ని ఆపాదించడానికి వీల్లేదు. కేసు కట్టి విచారణ జరపడాన్ని నేరంగా పరిగణించిన దాఖలాలేవీ గతంలో లేవు.చట్ట ప్రకారం నిందితులను విచారించడం నేరం ఎలా అవుతుంది? జత్వానీ ఇచ్చిన ఫిర్యాదులో పేర్లు లేకపోయినప్పటికీ పోలీసులు కొందరిని నిందితులుగా చేర్చారు. ఆమెను విచారించిన పోలీసు అధికారులు ఎవరో కూడా జత్వానీకి తెలియదు. అలాంటప్పుడు పోలీసులు కేసు ఎలా నమోదు చేస్తారు?. జత్వానీ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో ఇదే హైకోర్టు ప్రధాన నిందితుడు విద్యాసాగర్‌కు బెయిల్‌ మంజూరు చేసింది. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని పిటిషనర్లకు ముందుస్తు బెయిల్‌ మంజూరు చేయాలి..’ అని కోర్టును కోరారు.అనంతరం సీఐడీ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ జత్వానీ విషయంలో పిటిషనర్లందరూ కుట్ర పూరితంగా వ్యవహరించారన్నారు. ఈ కుట్ర వెనుక ఎవరున్నారో తేల్చేందుకు వారిని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. జత్వానీ తరఫు న్యాయవాదులు వాసిరెడ్డి ప్రభునాథ్, నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు.

IPL 2025, KKR VS CSK: Dhoni Becomes The First Wicketkeeper To Complete 200 Dismissals In IPL4
IPL 2025: చరిత్ర సృష్టించిన ధోని

సీఎస్‌కే స్టాండ్‌ ఇన్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో 200 మందిని ఔట్‌ చేయడంలో భాగమైన తొలి వికెట్‌ కీపర్‌గా రికార్డు నెలకొల్పాడు. నిన్న (మే 7) కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ క్యాచ్‌, ఓ స్టంపౌట్‌ చేసిన తర్వాత ధోని ఈ ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో సీఎస్‌కే, రైజింగ్‌ పూణే సూపర్‌ జెయింట్స్‌ ఫ్రాంచైజీల తరఫున 276 మ్యాచ్‌లు ఆడిన ధోని 153 క్యాచ్‌లు, 47 స్టంపింగ్‌లు చేశాడు. ధోని తర్వాత దినేశ్‌ కార్తీక్‌ ఐపీఎల్‌లో అత్యధిక​ డిస్మిసల్స్‌లో భాగమైన వికెట్‌కీపర్‌గా ఉన్నాడు. డీకే.. ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌, ఆర్సీబీ, కేకేఆర్‌, గుజరాత్‌ లయన్స్‌, ముంబై ఇండియన్స్‌, కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ ఫ్రాంచైజీల తరఫున 236 మ్యాచ్‌లు ఆడి 174 మందిని ఔట్‌ చేయడంలో భాగమయ్యాడు. ఇందులో 137 క్యాచ్‌లు, 37 స్టంపింగ్‌లు ఉన్నాయి. ధోని, డీకే తర్వాత అత్యధిక డిస్మిసల్స్‌లో భాగమైన వికెట్‌ కీపర్లలో వృద్దిమాన్‌ సాహా, రిషబ్‌ పంత్‌, రాబిన్‌ ఉతప్ప తర్వాతి స్థానాల్లో ఉన్నారు.ఐపీఎల్‌లో అత్యధిక డిస్మిసల్స్‌లో భాగమైన వికెట్‌ కీపర్లు..200 - MS ధోని (CSK/RPS) - 153 క్యాచ్‌లు, 47 స్టంపింగ్‌లు174 - దినేష్ కార్తీక్ (DD/RCB/KKR/GL/MI/KXIP) - 137 క్యాచ్‌లు, 37 స్టంపింగ్‌లు113 - వృద్ధిమాన్ సాహా (GT/SRH/PBKS/CSK/KKR) - 87 క్యాచ్‌లు, 26 స్టంపింగ్‌లు100 - రిషబ్ పంత్ (DC/LSG) - 76 క్యాచ్‌లు, 24 స్టంపింగ్‌లు90 - రాబిన్ ఉతప్ప (KKR/CSK/RR/MI/RCB/PWI) - 58 క్యాచ్‌లు, 32 స్టంపింగ్‌లుఓవరాల్‌గా కూడా ధోనిదే అగ్రస్థానంఓవరాల్‌గా చూసినా పొట్టి క్రికెట్‌లో అత్యధిక డిస్మిసల్స్‌లో భాగమైన వికెట్‌ కీపర్లలో ధోనినే మొదటి స్థానంలో ఉన్నాడు. యావత్‌ టీ20 ఫార్మాట్‌లో ధోని 316 మందిని ఔట్‌ చేయడంలో భాగమయ్యాడు. ధోని తర్వాత క్వింటన్‌ డికాక్‌ రెండో స్థానంలో ఉన్నాడు. డికాక్‌ తన టీ20 కెరీర్‌లో 307 డిస్మిసల్స్‌లో భాగమయ్యాడు.నిన్న జరిగిన మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ సీజన్‌లో ధోని ఎట్టకేలకు కెప్టెన్‌గా రెండో విజయాన్ని సాధించాడు. ఉ‍త్కంఠగా సాగిన మ్యాచ్‌లో కేకేఆర్‌పై సీఎస్‌కే 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించిన సీఎస్‌కేకు ఈ సీజన్‌ల ఇది మూడో గెలుపు. ఈ గెలుపు వల్ల సీఎస్‌కేకు ఒరిగింది ఏమీ లేనప్పటికీ.. కేకేఆర్‌ ప్లే ఆఫ్స్‌ అవకాశాలను మాత్రం దెబ్బకొట్టింది. ఈ ఓటమితో కేకేఆర్‌ ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఆ జట్టు ఇకపై ఆడాల్సిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ దక్కడం అనుమానమే. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో 11 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఆ జట్టు పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. టాప్‌-5లో ఉన్న గుజరాత్‌ (16), ఆర్సీబీ (16), పంజాబ్‌ (15), ముంబై (14), ఢిల్లీ (13) కేకేఆర్‌ కంటే మెరుగైన పాయింట్లు సాధించి ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ కోసం పోటీ పడుతున్నాయి. ఈ సీజన్‌లో సీఎస్‌కేతో పాటు సన్‌రైజర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ ప్లే ఆఫ్స్‌ పోటీ నుంచి ఇదివరకే నిష్క్రమించాయి. లక్నో (10), కేకేఆర్‌ (11) కూడా నిష్క్రమణ అంచుల్లో ఉన్నాయి.నిన్నటి మ్యాచ్‌లో ధోని వికెట్‌కీపింగ్‌లోనే కాకుండా బ్యాటింగ్‌లోనూ రాణించి తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కీపింగ్‌లో రఘువంశీ, నరైన్‌ను ఔట్‌ చేయడంలో భాగమైన ధోని.. ఛేదనలో కీలక సమయంలో సిక్సర్‌ కొట్టి తన జట్టుకు విజయాన్ని ఖాయం చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో ధోని ఎంతో సంయమనంతో బ్యాటింగ్‌ చేసి, చివరి దాకా క్రీజ్‌లో నిలబడ్డాడు. ఫలితంగా సీఎస్‌కే సీజన్‌లో మూడో విజయం నమోదు చేసింది.

Pakistan Lahore Airport Strikes Video Viral5
పాకిస్తాన్‌ లాహోర్‌లో పేలుళ్లు.. పరుగు తీసిన ప్రజలు

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లోని లాహోర్‌లో పేలుడు ఘటన చోటుచేసుకుంది. లాహోర్‌లోని వాల్టన్ విమానాశ్రయం సమీపంలోని లాహోర్‌లోని గోపాల్ నగర్, నసీరాబాద్ ప్రాంతాలలో వరుసగా బాంబు పేలుడు ఘటన సంభవించింది. ఎయిర్‌పోర్టు వద్ద గురువారం ఉదయం ఒక్కసారిగా సైరన్లు మోగడంతో ఇళ్ల నుంచి పాక్‌ ప్రజలు బయటకు పరుగులు తీశారు.అయితే, డ్రోన్‌ కారణంగానే పేలుడు సంభవించినట్లు పాక్‌ పోలీసులు చెబుతున్నారు. 5-6 అడుగుల పొడవున్న డ్రోన్ పేలుడు సంభవించి ఉండవచ్చని పోలీసు వర్గాలు తెలిపాయి. డ్రోన్ వ్యవస్థను జామ్ చేయడం ద్వారా కూల్చివేసినట్లు చెప్పుకొచ్చారు. వరుస బాంబు పేలుడు ఘటనలతో పాకిస్తాన్‌లోని కరాచీ, ఇస్లామాబాద్‌ సహా పలు విమనాశ్రయాలను అధికారులు మూసివేశారు. ఇక, భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టిన మరుసటి రోజే పేలుళ్లు సంభవించడం గమనార్హం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఈ బాంబు పేలుడుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.Panic in Lahore after blast near laWhore airport pic.twitter.com/zsQNyoE4hx— Team Jhaat Official (@TeamJhaant__) May 8, 2025 Utter chaos in Lahore after drone strike at Walton Road which leads to Lahore cantonment. People out on streets in panic. Asim Munir's Jihadist policies have invited war to Pakistan's streets. pic.twitter.com/1195BQxlhf— Divya Kumar Soti (@DivyaSoti) May 8, 2025Something hit Naval college besides #Askari 5. Sirens are #lahore One 1x Drone intercept in #Walton road.#IndiaPakistanWar#Pakistan#PakistanZindabadpic.twitter.com/XN8HkYsi4S— Muhammad Asif (Parody) (@MuhammadAsif26_) May 8, 2025

Flight Passes Over Tirumala Temple6
తిరుమల ఆలయంపై విమానం చక్కర్లు.. దాడుల వేళ అలర్ట్‌!

సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు కొట్టిన తీవ్ర కలకలం రేపింది. ఆగమశాస్ర్త నిబంధనలు విరుద్దంగా ఆలయంపై విమానాలు వెళ్లడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదుల చర్యల కారణంగా తిరుమలకు ముప్పు పొంచి ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. ఆగమశాస్ర్త నిబంధనలు విరుద్దంగా తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు కొట్టింది. గురువారం ఉదయం 9 గంటల సమయంలో ఆలయంపై నుండి విమానం వెళ్లింది. విమానం వెళ్లడాన్ని చూసి తిరుమలలో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, తిరుమల శ్రీవారి ఆలయాన్ని నో ఫ్లైయింగ్ జోన్‌గా ప్రకటించాలని అనేక మార్లు కేంద్రాన్ని కోరిన ఫలితం మాత్రం శూన్యం. కాగా.. నేడు విమానం చక్కర్లపై టీటీడీ భద్రత అధికారులు ఆరా తీస్తున్నారు.మరోవైపు.. దేశంలో ఉగ్రదాడులు జరుగుతున్న నేపథ్యంలో తిరుమలకు ప్రమాదం ముప్పు పొంచి ఉంది. అంతకుముందు, జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో దాడి తర్వాత తిరుమలలో హైఅలర్ట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. తిరుమలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. భక్తుల వాహనాలను తనిఖీలు చేశారు.

USA Donlad Trump Reaction On Operation Sindoor7
భారత్‌-పాక్‌ యుద్ధం.. బిగ్‌ ట్విస్ట్‌ ఇస్తూ ట్రంప్‌ వ్యాఖ్యలు

వాషింగ్టన్‌: ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్‌ మెరుపు దాడుల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌, పాకిస్తాన్‌ ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడం ఆపేయాలని కోరారు. అలాగే, ఇరు దేశాలు సాయం కోరితే తాను అందుబాటులో ఉంటానని ట్రంప్‌ వెల్లడించారు.ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యం భారత్‌, పాకిస్తాన్‌ మధ్య మరోసారి ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పలువురు దేశాధినేతలు, రాయబారులు దాడుల ఘటనపై స్పందించారు. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని భారత్‌, పాక్‌లను కోరారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సైతం మరోసారి స్పందించారు.ఓవల్‌ ఆఫీస్‌లో ట్రంప్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘భారత్‌, పాక్‌ల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. దాడులు చేయడం అవమానకరం. రెండు దేశాల గురించి నాకు చాలా తెలుసు. ఎప్పటి నుంచో వారి మధ్య వైరం ఉంది. అయితే, రెండు దేశాలతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని, వాటిని ఆపేయాలని కోరుకుంటున్నాను. వారు అనుకుంటే ఇప్పుడే ఇది చేయగలరు. రెండు దేశాలు కయ్యానికి కాలు దువ్వాయి. అమెరికాతో భారత్‌, పాక్‌కు మంచి సంబంధాల దృష్ట్యా వారికి సహాయం చేయాల్సి వస్తే నేను అందుబాటులో ఉంటాను. ఏ సహాయమైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు.U.S. President Donald Trump has condemned India's attack, calling it shamefulPakistan Zindabad!#Pakistan #PakistanismyRedLine #donaldjtrump #PakistanZindabad #IndiaPakistanWar pic.twitter.com/iDl8SwVeLH— Anmol Sheraz (@iamanmolsheraz) May 6, 2025 చైనాకు భారత్ వార్నింగ్మరోవైపు.. ఆపరేషన్ సిందూర్‌పై విషం గక్కే ప్రయత్నం చేసిన పొరుగు దేశం చైనా భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. భారత్‌కు చెందిన మూడు విమానాలను పాక్ కూల్చేసిదంటూ చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ రాసిన కథనంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి కథనాలు రాయడం మానుకోవాలని హెచ్చరించింది.

PwC Announces Layoffs 1500 US Employees Impacted Amid Industry Shifts8
ప్రముఖ కంపెనీలో 1,500 మందికి లేఆఫ్స్‌

ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల మధ్య దీర్ఘకాలిక సుస్థిరతను నిర్ధారించే లక్ష్యంతో ప్రముఖ ఆడిటింగ్‌ సంస్థ ప్రైస్‌వాటర్‌హౌజ్‌కూపర్స్‌(పీడబ్ల్యూసీ) 1,500 మంది ఉద్యోగులకు లేఆఫ్స్‌ ప్రకటించింది. కంపెనీ తాజా నిర్ణయంతో యూఎస్ కార్యకలాపాలపై ప్రభావం పడుతుందని కొందరు విశ్లేషిస్తున్నారు. ఈ ఉద్యోగుల తొలగింపు దాని మొత్తం సిబ్బందిలో 2 శాతంగా ఉంది. ఆడిట్, ట్యాక్స్ విభాగాలకు చెందిన బాధిత ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ టీమ్స్ మీటింగ్ ద్వారా లేఆఫ్స్‌ సమాచారం అందించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.తొలగింపునకు కారణాలుప్రస్తుత వ్యాపార డిమాండ్లకు అనుగుణంగా కంపెనీ తన శ్రామిక శక్తిని సమీకరించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. మారుతున్న మార్కెట్ పరిస్థితుల మధ్య దీర్ఘకాలిక సుస్థిరతను నిర్ధారించే లక్ష్యంతో ఆలోచనాత్మకంగానే ఈ చర్య తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది. ఆర్థిక అనిశ్చితి, మారుతున్న ఖాతాదారుల డిమాండ్లు, పునర్నిర్మాణ ప్రయత్నాలు వంటి అంశాలను హైలైట్‌ చేస్తూ డెలాయిట్, కేపీఎంజీ వంటి సంస్థలు కూడా ఈ ఏడాది ప్రారంభంలో ఉద్యోగుల తొలగింపును ప్రకటించాయి. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, మార్కెట్ తీరుకు అనుగుణంగా సంస్థలు మారుతున్నాయి.ఇదీ చదవండి: దేశంలో వైర్‌లెస్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఎంతంటే..సవాళ్లుతొలగింపులతో ప్రభావితమైన ఉద్యోగులు తిరిగి కొలువు సాంపాదించాలంటే సవాళ్లను ఎదుర్కోకతప్పదని కొందరు అభిప్రాయపడుతున్నారు. అకౌంటింగ్, ఫైనాన్షియల్‌ కన్సల్టింగ్ రంగంలో ఉపాధి అవకాశాలకు అనుగుణంగా తమ నైపుణ్యాలు అభివృద్ధి చెందాల్సి ఉంటుంది. పెరిగిన ఆటోమేషన్, వ్యాపార వ్యూహాలతో ఆడిట్, ట్యాకేషన్‌ నిపుణులు డేటా అనలిటిక్స్, అడ్వైజరీ సర్వీసులు లేదా ప్రత్యేక ఫైనాన్స్ రంగాల్లో కొత్త అవకాశాలకు అనుగుణంగా మారవలసి ఉంటుంది.

Samantha Shares Fun Video With Vennela Kirshre9
‘సింగిల్‌’కాల్‌లో అతనికి ‘శుభం’ చెప్పేశా: సమంత పోస్ట్‌ వైరల్‌

స్టార్‌ హీరోయిన్‌ సమంత(samantha) నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆమె తన సొంత బ్యానర్‌ ట్రాలాలా మూవీస్‌ పిక్చర్స్‌లో నిర్మించిన తొలి సినిమా ‘శుభం’(subham movie) మే 9న రిలీజ్‌ కాబోతుంది. ఈ చిత్రానికి ప్రవీణ్‌ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం సమంత ఫోకస్‌ అంతా ఈ సినిమాపైనే పెట్టింది. ఈ సినిమా ప్రమోషన్స్‌ని తన భుజాన వేసుకొని ముందుకు సాగుతోంది. వరుస ఇంటర్వ్యూలు, మీడియా సమావేశాలతో ఫుల్‌ బిజీ అయిపోయింది. అంతేకాదు ఈ సినిమా ప్రమోషన్స్‌కి తన స్నేహితులను కూడా వాడుకుంటుంది. తాజా వెన్నెల కిశోర్‌తో కలిసి ఓ ఫన్‌ వీడియో కూడా చేసింది. ఈ వీడియోలో సమంత ‘ నా శుభం మూవీ ప్రీమియర్స్‌కి రావట్లేదా’ అని అడుగుతుంది. వెన్నెల కిశోర్‌ ఏమో తన నటించిన ‘సింగిల్‌’(#single) మూవీ కూడా అదే రోజు(మే 9) రాబోతుందని చెప్పాలనుకుంటాడు. కానీ సమంత అతన్ని మాట్లాడనీయకుండా.. ‘నువ్వు, నీ ఫ్యామిలీ తప్పకుండా వస్తారు కదా? నేను నిర్మించిన ఫస్ట్‌ మూవీ ఇది తప్పుకుండా రావాలి’ అంటూ గబగబా మాట్లాడేస్తుంది. చివరికి నువ్వు కచ్చితంగా వస్తున్నావు అని కట్ చేసేస్తది. ఈ వీడియోని సమంత తన ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ.. సింగిల్ ఫోన్ కాల్‌లో వెన్నెల కిశోర్‌కి శుభం చెప్పేశా.. మే 9న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది’ అని రాసుకొచ్చింది. దీంతో ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Pakistan ministers bizarre reply when asked for proof of downing IAF jets10
అది భారత సోషల్‌ మీడియా.. పాక్‌ మంత్రి వింత సమాధానం

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ (Operation Sindoor) విజయవంతమైంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాకిస్తాన్‌ భూభాగంలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై భారత దళాలు మెరుపు దాడులు చేశాయి. ఇందుకు తామూ సమర్థవంతంగా ప్రతిఘటించామంటూ పాకిస్తాన్‌ ప్రకటించుకుంది. రాఫెల్స్ సహా ఐదు భారత యుద్ధ విమానాలను తమ బలగాలు కూల్చివేశాయంటూ సోషల్‌ మీడియాలో ఫేక్‌ ప్రచారం చేసింది. అయితే దీనిపై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందించారు.భారత యుద్ధ విమానాలను పాకిస్తాన్‌ బలగాలు కూల్చివేశాయంటూ సోషల్‌ మీడియాలో చేసిన ఫేక్‌ ప్రచారాన్ని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కప్పిపుచ్చే ప్రయత్నం చేశాడు. పాకిస్తాన్ తన వాదనను నిరూపించడానికి ఏదైనా ఆధారాలు ఉన్నాయా అని సీఎన్ఎన్ ఇంటర్వ్యూలో విలేకరి అడిగ్గా ఆసిఫ్ వింత సమాధానం ఇచ్చాడు. ‘అదంతా ఇండియన్ సోషల్ మీడియాలోనే తప్ప మన సోషల్ మీడియాలో కాదు. జెట్ విమానాల శిథిలాలు వారి వైపు పడ్డాయి. ఇదంతా భారత మీడియాలోనే ఉంది' అని వింతగా బదులిచ్చారు.భారత్‌ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు ప్రతిగా తామూ రెండు రాఫెల్ జెట్‌లు, ఒక సు-30తో సహా మూడు భారత వైమానిక దళ (IAF) యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు పాకిస్తాన్ పేర్కొంది. అయితే, ఈ వాదనలను భారత్‌ నిర్ద్వంద్వంగా ఖండించింది. కార్యకలాపాల సమయంలో ఐఏఎఫ్‌ విమానాలు ఏవీ కోల్పోలేదని పేర్కొంది. ఇదంతా ఫేక్‌ ప్రచారమని తెలిపింది.పాకిస్తాన్‌ చేస్తున్నది ఫేక్‌ ప్రచారమని భారత ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ నివేదించింది. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా బహవల్ పూర్ సమీపంలో భారత రాఫెల్ జెట్ ను పాకిస్థాన్ కూల్చివేసిందంటూ సోషల్‌ మీడియా షేర్‌ చేసిన ఫొటో 2021లో జరిగిన ప్రమాదానికి సంబంధించినదని తెలిపింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement