
మనం సాధారణంగా ఏదైనా పిండి వంటలు చేసినపుడు ఎక్కువ వాడుతుంటాం. ముఖ్యంగా జంతికలు, కారప్పూస, అరిసెలు, బూందీ తదితర పిండివంటలు చేయాలంటే ఆయా పదార్థాలను నూనెలో ఫ్రై చేస్తుంటాం. అలాగే పకోడీ, బజ్జీ లాంటి స్నాక్స్ చేసినప్పుడు కూడా డీప్ ప్రై చేస్తాం. అప్పుడు వాటికి సంబంధించిన మడ్డి, చిన్న చిన్న తునకలు నూనెలో మిగిలిపోతాయి. అవి మాడిపోయి నల్లగా కనిపిస్తుంటాయి. అంతేకాదు అవి ఫ్రెష్‌గా వేయిస్తున్న వాటికి అంటుకుని చూడ్డానికి బాగా అనిపించవు. మరి అలాంటి నూనెను పూర్తిగా క్లీన్ చేయాలంటే ఏం చేయాలి? ఒకసారి వాడిన నూనెను పాప్‌కార్న్ పిండి సహాయంతో సులభంగా శుభ్రం చేయవచ్చని మీకు తెలుసా? ఈ ఈజీ టిప్ గురించి తెలుసుకుందాం.
పిండి వంటలు, స్నాక్స్ చేసినపుడు వండినపుడు కొంత నూనె మిగిలిపోతుంది. అలాగే గిన్నె అడుగు భాగంలో కొంత వేస్ట్, మడ్డి లాంటి పేరుకుపోతుంది. ఈ నూనెని మళ్ళీ వాడాలన్నా, అందులో కొన్ని మిగిలిన పదార్థాలను క్లీన్ చేయడం,నూనెను ఫిల్టర్ చేయడం కొంచెం కష్టమైన పనే. ఆయిల్ ఫిల్టర్‌తో వడ కట్టినా, పల్చటి బట్టతో వడపోసినా పూర్తిగా శుభ్రం కాదు. మరి అలాంటి నూనెని ఎలా క్లీన్ చేయాలి. దీనికి సంబంధించిన ఒక వీడియో ఎక్స్‌లో ఆసక్తికరంగా మారింది. దీనికి ఏకంగా 16.4 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం.
तेल से गंदगी/अवशेष साफ करने का ये सबसे सही जुगाड़ है। pic.twitter.com/ieS62WWQaM
— Dr. Sheetal yadav (@Sheetal2242) May 7, 2025
"> కార్న్‌ఫ్లోర్ చిట్కా
ముందుగా కార్న్‌ఫ్లోర్ తీసుకోండి. అందులో కొద్దిగా నీరు కలిపి బజ్జీ పిండిలా చేయాలి. దీనిని మరిగే నూనెలో వేయండి. అప్పుడు అది నూనె అడుగు భాగంలో ముద్దలాగా మారి, నూనెలోని మడ్డిని, మాడిపోయిన పిండి వంటల తునకలను ఎట్రాక్ట్ చేస్తుంది. మొక్క జొన్న పిండి ముద్దను అలా గుండ్రంగా తిప్పాలి. అంతే ఈజీగా నూనెలోని మొత్తం అవశేషాలు అయస్కాంతం లాగా పని చేస్తుంది. డస్ట్ అంతా పిండిముద్దకు అతుక్కుని పోయి.. నూనె పూర్తిగా శుభ్రపడి , తేటగా కనిపిస్తుంది. ఆ ముద్దను పారవేసి దీనికి మిగిలిన వంటల్లో వాడుకోవచ్చు. ఇలా చేయడం నూనెలోని మాడు వాసన కూడా పోతుంది.
జపాన్‌లో, టెంపురా చెఫ్‌లు 100 సంవత్సరాలుగా నూనెను శుభ్రం చేయడానికి స్టార్చ్‌ను ఉపయోగిస్తున్నారు. మరిగించిన నూనెలో మళ్లీ వేయించడం వల్ల అక్రిలామైడ్ వంటి కేన్సర్ కలిగించే సమ్మేళనాలు రెట్టింపు అవుతాయి. అయితే FDA డేటా ప్రకారం కార్న్‌స్టార్చ్ ఆ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే కార్న్‌స్టార్చ్ ఫ్రైస్‌తో శుభ్రం చేసిన నూనె ఫిల్టర్ చేయని నూనెతో పోలిస్తే 25 శాతం తక్కువ తడిగా ఉంటుందట.
ఇదీ చదవండి: World Ovarian Cancer Day : సైలెంట్‌గా..స్త్రీలకు గండంగా!
నోట్ : ఆయిలీ ఫుడ్స్, వేపుళ్లు ఆరోగ్యానికి హానికరం. అందులోనూ ఒకసారి వాడిన నూనెని పదే పదే వేడి చేయడం ఆరోగ్యానికి అంత మంచిది. ఎక్కువ సార్లు మరిగించిన పరిమితంగా వాడుకోవడం ఉత్తమం. వీలైతే అలాంటి ఆయిల్‌ను ఉపయోగించక పోవడమే మంచిది. ముందుగానే తక్కువ నూనెలో వేయించేలా జాగ్రత్తపడాలి.