Cornflour
-
వాడిన నూనెను ఇంత బాగా క్లీన్ చేయొచ్చా.. సూపర్ ఐడియా!
మనం సాధారణంగా ఏదైనా పిండి వంటలు చేసినపుడు ఎక్కువ వాడుతుంటాం. ముఖ్యంగా జంతికలు, కారప్పూస, అరిసెలు, బూందీ తదితర పిండివంటలు చేయాలంటే ఆయా పదార్థాలను నూనెలో ఫ్రై చేస్తుంటాం. అలాగే పకోడీ, బజ్జీ లాంటి స్నాక్స్ చేసినప్పుడు కూడా డీప్ ప్రై చేస్తాం. అప్పుడు వాటికి సంబంధించిన మడ్డి, చిన్న చిన్న తునకలు నూనెలో మిగిలిపోతాయి. అవి మాడిపోయి నల్లగా కనిపిస్తుంటాయి. అంతేకాదు అవి ఫ్రెష్‌గా వేయిస్తున్న వాటికి అంటుకుని చూడ్డానికి బాగా అనిపించవు. మరి అలాంటి నూనెను పూర్తిగా క్లీన్ చేయాలంటే ఏం చేయాలి? ఒకసారి వాడిన నూనెను పాప్‌కార్న్ పిండి సహాయంతో సులభంగా శుభ్రం చేయవచ్చని మీకు తెలుసా? ఈ ఈజీ టిప్ గురించి తెలుసుకుందాం.పిండి వంటలు, స్నాక్స్ చేసినపుడు వండినపుడు కొంత నూనె మిగిలిపోతుంది. అలాగే గిన్నె అడుగు భాగంలో కొంత వేస్ట్, మడ్డి లాంటి పేరుకుపోతుంది. ఈ నూనెని మళ్ళీ వాడాలన్నా, అందులో కొన్ని మిగిలిన పదార్థాలను క్లీన్ చేయడం,నూనెను ఫిల్టర్ చేయడం కొంచెం కష్టమైన పనే. ఆయిల్ ఫిల్టర్‌తో వడ కట్టినా, పల్చటి బట్టతో వడపోసినా పూర్తిగా శుభ్రం కాదు. మరి అలాంటి నూనెని ఎలా క్లీన్ చేయాలి. దీనికి సంబంధించిన ఒక వీడియో ఎక్స్‌లో ఆసక్తికరంగా మారింది. దీనికి ఏకంగా 16.4 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం.तेल से गंदगी/अवशेष साफ करने का ये सबसे सही जुगाड़ है। pic.twitter.com/ieS62WWQaM— Dr. Sheetal yadav (@Sheetal2242) May 7, 2025 "> కార్న్‌ఫ్లోర్ చిట్కాముందుగా కార్న్‌ఫ్లోర్ తీసుకోండి. అందులో కొద్దిగా నీరు కలిపి బజ్జీ పిండిలా చేయాలి. దీనిని మరిగే నూనెలో వేయండి. అప్పుడు అది నూనె అడుగు భాగంలో ముద్దలాగా మారి, నూనెలోని మడ్డిని, మాడిపోయిన పిండి వంటల తునకలను ఎట్రాక్ట్ చేస్తుంది. మొక్క జొన్న పిండి ముద్దను అలా గుండ్రంగా తిప్పాలి. అంతే ఈజీగా నూనెలోని మొత్తం అవశేషాలు అయస్కాంతం లాగా పని చేస్తుంది. డస్ట్ అంతా పిండిముద్దకు అతుక్కుని పోయి.. నూనె పూర్తిగా శుభ్రపడి , తేటగా కనిపిస్తుంది. ఆ ముద్దను పారవేసి దీనికి మిగిలిన వంటల్లో వాడుకోవచ్చు. ఇలా చేయడం నూనెలోని మాడు వాసన కూడా పోతుంది.జపాన్‌లో, టెంపురా చెఫ్‌లు 100 సంవత్సరాలుగా నూనెను శుభ్రం చేయడానికి స్టార్చ్‌ను ఉపయోగిస్తున్నారు. మరిగించిన నూనెలో మళ్లీ వేయించడం వల్ల అక్రిలామైడ్ వంటి కేన్సర్ కలిగించే సమ్మేళనాలు రెట్టింపు అవుతాయి. అయితే FDA డేటా ప్రకారం కార్న్‌స్టార్చ్ ఆ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే కార్న్‌స్టార్చ్ ఫ్రైస్‌తో శుభ్రం చేసిన నూనె ఫిల్టర్ చేయని నూనెతో పోలిస్తే 25 శాతం తక్కువ తడిగా ఉంటుందట.ఇదీ చదవండి: World Ovarian Cancer Day : సైలెంట్‌గా..స్త్రీలకు గండంగా!నోట్ : ఆయిలీ ఫుడ్స్, వేపుళ్లు ఆరోగ్యానికి హానికరం. అందులోనూ ఒకసారి వాడిన నూనెని పదే పదే వేడి చేయడం ఆరోగ్యానికి అంత మంచిది. ఎక్కువ సార్లు మరిగించిన పరిమితంగా వాడుకోవడం ఉత్తమం. వీలైతే అలాంటి ఆయిల్‌ను ఉపయోగించక పోవడమే మంచిది. ముందుగానే తక్కువ నూనెలో వేయించేలా జాగ్రత్తపడాలి. -
కార్న్ ఫ్లోర్ తినకుంటే కోమాలోకి...
ఆ చిన్నారిని ప్రాణాంతక వ్యాధి పీడిస్తోంది. ఆ వింత వ్యాధి అతడిని రోజురోజుకూ చావుకు దగ్గర చేస్తోంది. తమ బిడ్డకు సంక్రమించిన వ్యాధికి మందులు లేకపోవడంతో తల్లిదండ్రులు అనుక్షణం ఆందోళనకు గురౌతున్నారు. బిడ్డ ప్రాణాలు రక్షించుకోడానికి లక్షల్లో డబ్బు ఖర్చు చేస్తున్నారు. లండన్ కు చెందిన ఆరేళ్ల జార్జి మొర్రిసన్ ను అరుదైన గ్లికోజెన్ స్టోరేజ్ వ్యాధి (GSD) వేధిస్తోంది. అయితే ఆ కొత్తరకం వ్యాధికి ఇప్పటిదాకా మందులే లేకపోవడంతో వైద్యులు ప్రత్యామ్నాయంగా కార్న్ ఫ్లోర్ ఇవ్వాలని సూచించారు. ప్రతిరోజూ సుమారు ఓ బాక్స్ కార్న్ ఫ్లోర్ తినకుంటే ఆ బాలుడు కోమాలోకి వెళ్ళిపోతున్నాడు. జార్జి మొర్రిసన్ కు ఎనిమిది నెలల వయసున్నపుడే వైద్యులకు కూడా అంతు చిక్కని ఓ వింత వ్యాధి సోకింది. ప్రాణాంతకమైన ఆ వ్యాధికి మందుల్లేకపోవడంతో కార్న్ ఫ్లోర్ వినియోగిస్తున్నారు. రోజుకో కార్న్ ఫ్లోర్ డబ్బా తినకపోతే చిన్నారి చనిపోయే అవకాశం ఉంటుందని వైద్యులు చెప్పారు. లండన్ లోని మిగతా పిల్లల్లో మరెక్కడా కనిపించని ప్రాణాంతక గ్లైకోజెన్ లోపంతో మొర్రిసన్ బాధపడుతున్నాడు. రాత్రి సమయంతో సహా ప్రతి మూడు గంటలకు ఓసారి కార్న్ ఫ్లోర్ తినిపిస్తూ ఆ బాలుడ్ని ప్రమాదానికి దూరంగా ఉంచాల్సి వస్తోంది. ఎనిమిదేళ్ళు దాటని పసివాడు కావడంతో అన్నిరకాల పరీక్షలు చేసే అవకాశం లేదు. అందుకే అతడి లోపానికి ఫార్మసిస్టులు ప్రత్యామ్నాయాలను అందిస్తున్నారు. ఇప్పటిదాకా బ్రిటిష్ నేషనల్ ఫార్ములరీ జాబితాలోని మందుల్లో ఎక్కడా కార్న్ ఫ్లోర్ ను వాడే పద్ధతి అమల్లో లేదు. అయితే ఓ ఫార్మాసూటికల్ రిఫరెన్స్ పుస్తకంలో ఉన్న సలహాల మేరకు బాలుడి లోపానికి కార్న్ ఫ్లోర్ ను వాడుతున్నారు. తమ బిడ్డకు వచ్చిన వ్యాధికి మందులు లేకపోవడంతో జార్జి తల్లిదండ్రులు సామ్, పెటె మొర్రిసన్ లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మిగిలిన పిల్లల్లా తమ చిన్నారికి మందులు ఎందుకు ఇవ్వరంటూ నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) ను వాళ్లు ప్రశ్నిస్తున్నారు. కార్న్ ఫ్లోర్ వాడే పద్ధతి ఎంతో కష్టంగా ఉండటంతోపాటు ఖర్చు కూడ ఎక్కువగా ఉందని, దానికి బదులుగా మందులు సూచించమని ఎన్ హెచ్ ఎస్ ను కోరుతున్నారు. జార్జికి కేవలం ఎనిమిది నెలల వయసున్నపుడే ఈ వ్యాధి ఉన్నట్లుగా వైద్యులు నిర్థారించారని, అప్పట్నుంచీ మందుల్లేకుండా పిల్లాడి ప్రాణాలు కాపాడుకోవడం ఎంతో కష్టంగా మారిందని సామ్ ఆవేదన చెందుతున్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ వింత వ్యాధికి మందు కనిపెట్టాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో తాము ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధమౌతున్నట్లు చెప్తున్నాడు. ఇప్పటికే భారీ మొత్తంలో ఖర్చు కావడంతో ఇకపై జార్జికి వైద్య సహాయంకోసం స్వచ్ఛంద సంస్థలను ఆశ్రయించే ప్రయత్నంలో ఉన్నాడు. -
బ్యూటిప్స్
కొందరి అరచేతులు, కాళ్లు గరకుగా, జీవం లేనట్టుగా ఉంటాయి. అలాంటప్పుడు ఈ చిట్కాను వాడి చూడండి. ఒక టబ్‌లో సగం వరకు వేడి నీళ్లు పోసి, అందులో రెండు టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్ (మొక్కజొన్న పిండి) వేసి కలపాలి. అందులో చేతులను, కాళ్లను 10-15 నిమిషాలపాటు నానబెట్టాలి. తర్వాత వాటిని గోరువెచ్చని మంచి నీళ్లతో శుభ్రం చేసుకొని కొబ్బరినూనె రాసుకోవాలి. ఇలా రోజూ రాత్రి పడుకునేముందు చేస్తే రెండు వారాల్లో ఫలితం కచ్చితంగా కనిపిస్తుంది. ఎలాంటి వాతావరణంలోనైనా చర్మానికి బాడీ లోషన్ చాలా ముఖ్యం. మార్కెట్లో దొరికే లోషన్లు వాడటం కన్నా ఇంట్లోనే తయారు చేసుకుంటే ఆరోగ్యకరం. తయారు చేసుకునేందుకు నిమ్మకాయలు, గ్లిజరిన్, రోజ్‌వాటర్ ఉంటే చాలు. టేబుల్ స్పూన్ నిమ్మరసంలో టేబుల్ స్పూన్ రోజ్‌వాటర్, టేబుల్ స్పూన్ గ్లిజరిన్ వేసి బాగా కలపాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ఓ గాజు సీసాలో ఫ్రిజ్‌లో పెట్టుకుంటే సరి. రోజూ స్నానానికి అరగంట ముందు లేదా రాత్రి పడుకునేటప్పుడు రాసుకుంటే సరి. చర్మం మృదువుగా ఆరోగ్యవంతంగా ఉంటుంది.