KKR Vs CSK: చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా | IPL 2025 KKR Vs CSK: Ravindra Jadeja Becomes CSK All Time Highest Wicket Taker In IPL, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

IPL 2025 KKR Vs CSK: చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా

Published Wed, May 7 2025 9:13 PM | Last Updated on Thu, May 8 2025 11:59 AM

IPL 2025, KKR VS CSK: Ravindra Jadeja Becomes CSK All Time Highest Wicket Taker In IPL

Photo Courtesy: BCCI

వెటరన్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో సీఎస్‌కే తరఫున ఆల్‌టైమ్‌ లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా అవతరించాడు. ఐపీఎల్‌ 2025లో భాగంగా కేకేఆర్‌తో ఇవాళ (మే 7) జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో తన కోటా 4 ఓవర్లు వేసిన జడేజా కీలకమైన రహానే వికెట్‌ తీశాడు. సీఎస్‌కే తరఫున లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా అవతరించే క్రమంలో జడేజా డ్వేన్‌ బ్రావోను అధిగమించాడు. ఐపీఎల్‌లో జడేజా సీఎస్‌కే తరఫున 184 మ్యాచ్‌ల్లో 141 వికెట్లు సాధించగా.. బ్రావో 116 మ్యాచ్‌ల్లో 140 వికెట్లు తీశాడు.

ఐపీఎల్‌లో సీఎస్‌కే తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..
141* - రవీంద్ర జడేజా (184 మ్యాచ్‌లు)
140 - డ్వేన్ బ్రావో (116 మ్యాచ్‌లు)
95 - ఆర్ అశ్విన్ (104 మ్యాచ్‌లు)
76 - దీపక్ చాహర్ (76 మ్యాచ్‌లు)
76 - ఆల్బీ మోర్కెల్ (78 మ్యాచ్‌లు)
60 - శార్దూల్ ఠాకూర్ (57 మ్యాచ్‌లు)
58 - మోహిత్ శర్మ (48 మ్యాచ్‌లు)

మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. నూర్‌ అహ్మద్‌ 4 వికెట్లు తీసి కేకేఆర్‌ను దెబ్బేశాడు. అన్షుల్‌ కంబోజ్‌, జడేజా తలో వికెట్‌ తీశారు. కేకేఆర్‌ ఇన్నింగ్స్‌లో రహానే (48), మనీశ్‌ పాండే (36 నాటౌట్‌), రసెల్‌ (38) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. సునీల్‌ నరైన్‌ 26, గుర్భాజ్‌ 11, రఘువంశీ 1, రింకూ సింగ్‌ 9 పరుగులు చేసి ఔటయ్యారు.

కాగా, ఈ సీజన్‌లో సీఎస్‌కే కథ ముగిసిన విషయం తెలిసిందే. ఆ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో ఆడిన 11 మ్యాచ్‌ల్లో రెండే విజయాలు సాధించింది.

కేకేఆర్‌ విషయానికొస్తే.. ఈ జట్టు ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ కోసం ఇంకా పోటీలో ఉంది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో 11 పాయింట్లు సాధించింది. ఓ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో ఓ పాయింట్‌ వచ్చింది. కేకేఆర్‌ ఈ మ్యాచ్‌తో కలుపుకుని ఆడాల్సిన మూడు మ్యాచ్‌ల్లో గెలిస్తే ప్లే ఆఫ్స్‌ రేసులో ఉంటుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement