జత్వానీ కేసు.. ఐపీఎస్‌ కాంతిరాణా, విశాల్‌ గున్నీకి ఊరట | AP High Court Key Orders On IPS Kanthi Rana And Vishal Gunni | Sakshi
Sakshi News home page

జత్వానీ కేసు.. ఐపీఎస్‌ కాంతిరాణా, విశాల్‌ గున్నీకి ఊరట

Published Thu, May 8 2025 11:39 AM | Last Updated on Thu, May 8 2025 2:36 PM

AP High Court Key Orders On IPS Kanthi Rana And Vishal Gunni

సాక్షి, అమరావతి: సినీ నటి జత్వానీ కేసులో ఇద్దరు ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్‌ గున్నీలకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. జత్వానీ వ్యవహారంలో కేసులను క్వాష్‌ చేయాలంటూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ క్రమంలో పోలీసుల తదుపరి చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం, తదుపరి విచారణను జూన్‌ 30వ తేదీకి వాయిదా వేసింది. 

గత విచారణలో ఇలా..
కొద్ది రోజుల క్రితం డాక్యుమెంట్ల ఫోర్జరీ కేసులో విచారణ చేసి అరెస్ట్‌ చేసినందుకే సినీనటి కాదంబరి జత్వానీ కక్షపూరితంగా తమపై తప్పుడు కేసు పెట్టారని ఐపీఎస్‌ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్‌ గున్నీ, పోలీసు అధికారులు హనుమంతరావు, సత్యనారాయణలు హైకోర్టుకు నివేదించారు. కాంతిరాణా టాటా తదితరులపై కేసు నమోదు వెనుక దురుద్దేశాలు ఉన్నాయని వారి తరఫు సీనియర్‌ న్యాయవాదులు సుబ్రహ్మణ్యం శ్రీరాం, వేములపాటి పట్టాభి, వినోద్‌కుమార్‌ దేశ్‌పాండే వివరించారు.

జత్వానీ ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ కోసం కాంతిరాణా టాటా, విశాల్‌ గున్నీ, కె.హనుమంతరావు, ఎం.సత్యనారాయణ, న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్‌ కృపాసాగర్‌ మరోసారి విచారణ జరిపారు. కాంతిరాణ టాటా తదితరుల తరఫు సీనియర్‌ న్యాయవాదులు సుబ్రహ్మణ్య శ్రీరాం, వేములపాటి పట్టాభి, వినోద్‌ కుమార్‌ దేశ్‌పాండే వాదనలు వినిపిస్తూ.. ‘పోలీసు అధికారులుగా తమకు వచ్చిన ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి చట్ట ప్రకారం జత్వానీని విచారించడమే తప్పు అన్నట్లుగా పిటిషనర్లపై కేసులు నమోదు చేశారు. విధి నిర్వహణలో భాగంగా చేసిన చర్యలకు నేరాన్ని ఆపాదించడానికి వీల్లేదు. కేసు కట్టి విచారణ జరపడాన్ని నేరంగా పరిగణించిన దాఖలాలేవీ గతంలో లేవు.

జెత్వాని కేసులో ఇద్దరు IPSలకు ఊరట

చట్ట ప్రకారం నిందితులను విచారించడం నేరం ఎలా అవుతుంది? జత్వానీ ఇచ్చిన ఫిర్యాదులో పేర్లు లేకపోయినప్పటికీ పోలీసులు కొందరిని నిందితులుగా చేర్చారు. ఆమెను విచారించిన పోలీసు అధికారులు ఎవరో కూడా జత్వానీకి తెలియదు. అలాంటప్పుడు పోలీసులు కేసు ఎలా నమోదు చేస్తారు?. జత్వానీ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో ఇదే హైకోర్టు ప్రధాన నిందితుడు విద్యాసాగర్‌కు బెయిల్‌ మంజూరు చేసింది. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని పిటిషనర్లకు ముందుస్తు బెయిల్‌ మంజూరు చేయాలి..’ అని కోర్టును కోరారు.

అనంతరం సీఐడీ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ జత్వానీ విషయంలో పిటిషనర్లందరూ కుట్ర పూరితంగా వ్యవహరించారన్నారు. ఈ కుట్ర వెనుక ఎవరున్నారో తేల్చేందుకు వారిని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. జత్వానీ తరఫు న్యాయవాదులు వాసిరెడ్డి ప్రభునాథ్, నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement