kanthi rana tata
-
జత్వానీ కేసు.. ఐపీఎస్ కాంతిరాణా, విశాల్ గున్నీకి ఊరట
సాక్షి, అమరావతి: సినీ నటి జత్వానీ కేసులో ఇద్దరు ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. జత్వానీ వ్యవహారంలో కేసులను క్వాష్ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో పోలీసుల తదుపరి చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం, తదుపరి విచారణను జూన్ 30వ తేదీకి వాయిదా వేసింది. గత విచారణలో ఇలా..కొద్ది రోజుల క్రితం డాక్యుమెంట్ల ఫోర్జరీ కేసులో విచారణ చేసి అరెస్ట్ చేసినందుకే సినీనటి కాదంబరి జత్వానీ కక్షపూరితంగా తమపై తప్పుడు కేసు పెట్టారని ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్నీ, పోలీసు అధికారులు హనుమంతరావు, సత్యనారాయణలు హైకోర్టుకు నివేదించారు. కాంతిరాణా టాటా తదితరులపై కేసు నమోదు వెనుక దురుద్దేశాలు ఉన్నాయని వారి తరఫు సీనియర్ న్యాయవాదులు సుబ్రహ్మణ్యం శ్రీరాం, వేములపాటి పట్టాభి, వినోద్‌కుమార్ దేశ్‌పాండే వివరించారు.జత్వానీ ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం కాంతిరాణా టాటా, విశాల్ గున్నీ, కె.హనుమంతరావు, ఎం.సత్యనారాయణ, న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్ మరోసారి విచారణ జరిపారు. కాంతిరాణ టాటా తదితరుల తరఫు సీనియర్ న్యాయవాదులు సుబ్రహ్మణ్య శ్రీరాం, వేములపాటి పట్టాభి, వినోద్ కుమార్ దేశ్‌పాండే వాదనలు వినిపిస్తూ.. ‘పోలీసు అధికారులుగా తమకు వచ్చిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్ట ప్రకారం జత్వానీని విచారించడమే తప్పు అన్నట్లుగా పిటిషనర్లపై కేసులు నమోదు చేశారు. విధి నిర్వహణలో భాగంగా చేసిన చర్యలకు నేరాన్ని ఆపాదించడానికి వీల్లేదు. కేసు కట్టి విచారణ జరపడాన్ని నేరంగా పరిగణించిన దాఖలాలేవీ గతంలో లేవు.చట్ట ప్రకారం నిందితులను విచారించడం నేరం ఎలా అవుతుంది? జత్వానీ ఇచ్చిన ఫిర్యాదులో పేర్లు లేకపోయినప్పటికీ పోలీసులు కొందరిని నిందితులుగా చేర్చారు. ఆమెను విచారించిన పోలీసు అధికారులు ఎవరో కూడా జత్వానీకి తెలియదు. అలాంటప్పుడు పోలీసులు కేసు ఎలా నమోదు చేస్తారు?. జత్వానీ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో ఇదే హైకోర్టు ప్రధాన నిందితుడు విద్యాసాగర్‌కు బెయిల్ మంజూరు చేసింది. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని పిటిషనర్లకు ముందుస్తు బెయిల్ మంజూరు చేయాలి..’ అని కోర్టును కోరారు.అనంతరం సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ జత్వానీ విషయంలో పిటిషనర్లందరూ కుట్ర పూరితంగా వ్యవహరించారన్నారు. ఈ కుట్ర వెనుక ఎవరున్నారో తేల్చేందుకు వారిని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. జత్వానీ తరఫు న్యాయవాదులు వాసిరెడ్డి ప్రభునాథ్, నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. -
సీఎం జగన్‌పై రాళ్ల దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం..
-
చలో విద్యుత్ సౌద మహాధర్నాకు అనుమతి లేదు: సీపీ కాంతి రానా
-
చలో విజయవాడకు అనుమతి లేదు
విజయవాడ: ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఈ నెల 25వ తేదీన విజయవాడలో నిర్వహించ తలపెట్టిన చలో విజయవాడ, సీఎం కార్యాలయ ముట్టడి కార్యక్రమానికి అనుమతి మంజూరు చేయలేదని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ టి.కె.రాణా తెలిపారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. నగరంలో 30 పోలీస్ యాక్ట్, 144 సీఆర్పీసీ ఆంక్షలు అమలులో ఉన్నాయని తెలిపారు. ఈ నిబంధనలు అతిక్రమించవద్దని ఉపాధ్యాయ సంఘాల నాయకులకు సూచించారు. ఈ ఆంక్షలు ఉల్లగించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే పలువురికి ముందస్తుగా నోటీసులు ఇచ్చామన్నారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని చలో విజయవాడ కార్యక్రమాన్ని విరమించుకోవాలని సూచించారు. -
విజయవాడ సీపీ కాంతి రాణా టాటా: రాధా భద్రతపై ఎలాంటి ఆందోళన అవసరం లేదు
-
విజయవాడ సీపీగా కాంతి రాణా..
సాక్షి, విజయవాడ: 2004 బ్యాచ్ ఐపీఎస్ అధికారి కాంతి రాణా విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అనంతపురం డీఐజీగా పని చేస్తున్న కాంతి రాణా.. గతంలో విజయవాడ డీసీపీగా పని చేశారు. -
చంద్రగిరిలో పటిష్ట బందోబస్తు
అమరావతి: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ జరగబోయే పోలింగ్ బూత్‌ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తోన్నట్లు డీఐజీ కాంతి రాణా టాటా తెలిపారు. పోలింగ్ ముగిసే వరకు రీపోలింగ్ జరిగే ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. పోలింగ్ బూత్‌ల వద్ద అలజడులు సృష్టించేందుకు యత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసుకునేందుకు అన్ని వర్గాలు సహకరించాలని కోరారు. రీపోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతో పహారా కాస్తున్నట్లు చెప్పారు. ఒక్కొక్క పోలింగ్ కేంద్రం వద్ద సుమారు 350 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశామన్నారు. రీపోలింగ్ జరిగే ప్రాంతాల్లో స్థానికేతరులు వస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రౌడీషీటర్లను ఇప్పటికే బైండోవర్ చేశామని తెలిపారు. ఇప్పటి వరకు ఐదు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని పేర్కొన్నారు. -
డీఐజీగా కాంతిరాణా టాటా
అనంతపురం సెంట్రల్: అనంతపురం రేంజ్ నూతన డీఐజీగా కాంతిరాణా టాటాను నియమించారు. ప్రస్తుతం ఆయన విజయవాడ అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఇక ఇన్నాళ్లూ ఇక్కడ డీఐజీగా పనిచేసిన జె. ప్రభాకర్‌రావును సీఐడీ విభాగానికి బదిలీ చేస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిఅనిల్చంద్రపునీత గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 2016 మే 12న అనంతపురం రేంజ్ డీఐజీగా ప్రభాకర్‌రావు బాధ్యతలు చేపట్టారు. దాదాపు రెండు సంవత్సరాల నాలుగునెలల పాటు ఆయన పనిచేశారు. జిల్లాపై డీఐజీ ప్రభాకర్‌రావు ముద్ర ఉండేలా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా అవినీతి, అరోపణలు ఎదుర్కొన్న వారిపై చర్యల్లో తనదైన మార్క్ చూపించారు. -
బ్లేడ్‌బ్యాచ్‌పై ప్రత్యేక దృష్టి: డీసీపీ
విజయవాడ: నగరంలో నేరాలకు పాల్పడే బ్లేడ్ బ్యాచ్ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు డీసీపీ కాంతిరాణా టాటా తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు ఆపరేషన్ నైట్ సేఫ్టీ అమలు చేస్తున్నామన్నారు. దీంతోపాటు శివారు ప్రాంతంల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నామన్నారు. వెస్ట్ జోన్ పరిధిలో రౌడీషీటర్లకు మంగళవారం డీసీసీ కాంతిరాణా టాటా కౌన్సెలింగ్ ఇచ్చారు. నగర పరిధిలోని 136 రౌడీషీటర్లకుగాను 80 మంది వరకు కౌన్సెలింగ్ కు హాజరయ్యారని ఆయన తెలిపారు. రౌడీషీటర్ల రికార్డులను అప్డేట్ చేస్తున్నామని, పాత రాజ రాజేశ్వరీపేట, సింగ్ నగర్ లలో అవుట్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. పాత నేరస్తుల కదలికలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నామని వెల్లడించారు. -
చిత్తూరు ఎస్పీ బదిలీ
చిత్తూరు(క్రైమ్), న్యూస్‌లైన్: చిత్తూరు ఎస్పీ కాంతిరాణాటాటాను మాదాపూర్ డీసీపీగా బదిలీ చేస్తూ రాష్ట్ర డీజీపీ ప్రసాద్‌రావ్ ఆదేశాలు జారీ చేశారు. ఆయన స్థానం లో స్టేట్ ఇంటలిజెన్స్‌బ్యూరో (ఎస్ఐబీ) హైదరాబాద్‌లో పనిచేసే పీహెచ్డీ.రామకృష్ణను నియమించారు. చిత్తూరు ఎస్పీగా కాంతిరాణాటాటా 2011 జూన్ 12న బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచీ ఎర్రచందనంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి స్మగ్లర్ల గుండెల్లో దడ పుట్టించారు. శేషాచలం అడవుల్లోని ఎర్రబంగారం రవాణాను అరికట్టడానికి సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. అటవీశాఖకు చిక్కకుండా, కనీసం ముఖచిత్రమూ తెలవని మోస్ట్‌వాంటెడ్ స్మగ్లర్ల ఆటకట్టించడంలో సఫలీకృతులయ్యారు. దీంతో పాటు ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించాలనే సంకల్పతో ‘డయల్ యువర్ ఎస్పీ’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. నేరాలను అదుపుచేయడానికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్లి నేరస్తులను పట్టుకొని రూ.కోట్ల సొమ్ము రికవరీ చేశారు. చోరీ సొమ్ము రికవరీలో 2011-2012, 2012-13 సంవత్సరాల్లో వరుసగా రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. జిల్లాలో పనిచేసే పోలీసులందరికీ ఉపయోగపడేలా పోలీస్ క్యాంటిన్, వివాహాలకు కల్యాణ మండపం ఏర్పాటుకు ఆయన కృషిచేశారు. ఇటీవల పుత్తూరులో తీవ్రవాదులను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించి రాష్ట్ర స్థాయిలో పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వం నుంచి ప్రశంసలు పొందారు. ప్రజలు, అధికారుల సహకారం మరువలేను చిత్తూరు జిల్లాలో ఎస్పీగా రెండు సంవత్సరాల నాలుగు నెలలు సమర్థవంతంగా పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఎస్పీ కాంతిరాణాటాటా తెలిపారు. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జిల్లాలో శాంతిభద్రతలను కాపాడడంలో ప్రజలు, పోలీసు సిబ్బంది సహకారం మరువలేనిదన్నారు. ముఖ్యంగా జిల్లాలో ఎర్రచందనం రవాణాపై ఉక్కుపాదం మోపి రూ.కోట్ల విలువైన సంపదను కాపాడాననే సంతృప్తి కలిగిందన్నారు. పుత్తూరులో తీవ్రవాదులను పట్టుకోవడం కోసం నిర్వహించిన ఆపరేషన్ విజయవంతం కావడం ఎప్పటికీ మరువలేనన్నారు. ఎర్రచందనం కాపాడటం, డయల్ యువర్ ఎస్పీ ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరించడం, నేరాలను తగ్గించి అత్యధికంగా రికవరీలు చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. తనకు సహకరించిన ప్రజలకు, పోలీసు సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.