విజయవాడ సీపీగా కాంతి రాణా..

సాక్షి, విజయవాడ: 2004 బ్యాచ్ ఐపీఎస్ అధికారి కాంతి రాణా విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అనంతపురం డీఐజీగా పని చేస్తున్న కాంతి రాణా.. గతంలో విజయవాడ డీసీపీగా పని చేశారు.