ఉద్యోగుల ఆరోగ్య పథకంపై ఏపీ సీఎస్‌ సమీక్ష.. మరిన్ని అంశాలు చేర్చేలా రంగం సిద్ధం

AP CS Dr KS Jawahar Reddys Review Of Employees Health Scheme - Sakshi

సాక్షి, అమరావతి: ఉద్యోగులు ఆరోగ్య పథకం(ఈహెచ్‌ఎస్‌)పై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా కెఎస్‌ జవహార్‌ రెడ్డి సంబంధిత అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం, మెడికల్‌ రీ ఇంబర్స్‌మెంట్‌ అంశాల తోపాటు వైఎస్సాఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం అమలు గురించి కూడా చర్చించారు. ముఖ్యంగా ఈహెచ్‌ఎస్‌లో మరిన్నీ అంశాలు చేర్చడం గురించి కూడా మాట్లాడారు.

ఈమేరకు ఈహెచ్‌ఎస్‌లో ప్రస్తుతం ఉన్న కొన్ని ప్యాకేజీల ధరల పెంపు, ఉద్యోగుల నెలవారీ కంట్రీబ్యూషన్‌ పెంపు, మెడికల్‌ రీ ఇంబర్స్‌మెంట్‌ పరిమితి పెంచాల్సిన ఆవశ్యకత, కేన్సర్‌ వంటి రోగాలకు పరిమితి లేకుండా అందించే అంశం, అలాగే 40 ఏళ్లు పైబడిన ఉద్యోగులుకు వన్‌టైం మాస్టర్‌ హెల్త్‌ చెకప్‌ తదితర అంశాల గురించి సీఎస్‌ జవహార్‌ రెడ్డి అధికారులతో సమీక్షించారు. అంతేగాదు ఇందుకు సంబంధించిన అన్ని అంశాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేస్తే ఉద్యోగ సంఘాలతో మాట్లాడి రాష్ట్రస్థాయిలో ఒక నిర్ణయం తీసుకుందామని అధికారులుకు చెప్పారు.

అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు సంతృప్తికర స్థాయిలో ఆరోగ్య పథకం అమలుకు చర్యలు తీసుకోవాలని అధి​​కారులను ఆదేశించారు సీఎస్‌ జవహార్‌ రెడ్డి. కాగా, ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి యం.టీ.కృష్ణబాబు,ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి (హెచ్ ఆర్)చిరంజీవి చౌదరి, సర్వీసెస్ శాఖ కార్యదర్శి పి.భాస్కర్, ప్రత్యేక కార్యదర్శి (సియంఆర్ఎఫ్) డా.హరికృష్ణ, ఆరోగ్యశ్రీ సీఈవో హరీంద్ర ప్రసాద్,ఆరోగ్యశ్రీ ఎగ్జిక్యూటివ్ అధికారి టిఎస్ఆర్ మూర్తి, తదితర అధికారులు పాల్గొన్నారు.

(చదవండి: అపోహలొద్దు.. మూడు రాజధానులపై సజ్జల క్లారిటీ)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top