
ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై భారత్ జరిపిన దాడిని స్వాగతించారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు రవిశంకర్. ఉగ్రవాదాన్ని ఎప్పుడూ ప్రోత్సహించకూడదని, అది మానవాళి మనుగడకు అత్యంత ప్రమాదమన్నారు రవిశంకర్. ఆపరేషన్ సిందూర్ పై రవిశంకర్ మాట్లాడుతూ.. ‘ మనం నాగరిక సమాజంలో ఉన్నాం. మానవాళిని నాశనం చేసే ఉగ్రవాదులు దాడులు కానీ మిలిటెంట్ల దాడులను కానీ ఎంతమాత్రం ఉపేక్షించకూడదు
ఉగ్రవాదం అనేది ఓ ఆటవిక చర్య. భారత్ కేవలం పాక్‌లోని ఉగ్రస్థాపరాలను లక్ష్యంగా చేసుకునే దాడులు చేసింది. ఇది హర్షించదగ్గ విషయం. భారత్ చేసిన దాడులపై ఏ ఒక్కరు మాట్లాడాలన్నా మాట్లాడటానికి ఏమీ లేదు. ఎందుకంటే భారత్ కేవలం ఉగ్రవాదుల మీద మాత్రమే దాడి చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదాన్ని సహించబోమని పదే పదే చెబుతూ ఉన్నారు. ఉగ్రవాదాన్ని ఉపేక్షించలేదని చాలాసార్లు చెప్పారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఉగ్రస్థావరాలపై భారత్ దాడులు చేయాల్సి వచ్చింది. ఇది కచ్చితంగా తెలివైన నిర్ణయమే. ప్రస్తుతం భారత్ నరేంద్ర మోదీ చేతుల్లో సురక్షితంగా ఉంది. ఆయన తీసుకునే నిర్ణయాలతో భారత్ కు మేలే జరుగుతుంది. ఆయనకు మరింత ఆత్మస్థైర్యం కలగానికి ప్రార్దిద్దాం అని రవిశంకర్ అన్నారు.