hantavirus
-
క్రూజ్ షిప్లో ప్రాణాంతక వైరస్.. కెనడాలో తొలి కేసు!
ఒట్టావా: అట్లాంటిక్ మహాసముద్రంలో ‘ఎంవీ హోండియస్’ క్రూజ్ షిప్లో ప్రయాణించిన వారిలో ప్రాణాంతక ‘ఆండీస్ హంటా వైరస్’ వెలుగుచూడటం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. తాజాగా ఈ నౌకలో ప్రయాణించిన ఓ కెనడా దేశస్థునికి ఈ వైరస్ సోకినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారికంగా నిర్ధారించడంతో విమానయాన, పర్యాటక వర్గాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.కెనడాలో తొలి కేసు నమోదుఏప్రిల్ 1న అర్జెంటీనా నుంచి బయలుదేరిన ఎంవీ హోండియస్ క్రూజ్ షిప్లో మొత్తం నలుగురు కెనడా పౌరులు ప్రయాణించారు. వీరిలో ఒకరి నమూనాలను పరీక్షించగా, మే 16న హంటా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ ఆఫ్ కెనడా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. విన్నిపెగ్‌లోని నేషనల్ మైక్రోబయాలజీ ల్యాబొరేటరీలో చేసిన పరీక్షల్లో, అతడితో పాటు ప్రయాణించిన మరో కెనడియన్‌కు మాత్రం నెగెటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు.మనిషి నుంచి మనిషికి వ్యాప్తిసాధారణంగా ఎలుకలు, వాటి వ్యర్థాల ద్వారా మాత్రమే ఈ హంటా వైరస్ వ్యాపిస్తుంది. కానీ, ప్రస్తుతం ఈ క్రూజ్ షిప్లో వెలుగుచూసిన ‘ఆండీస్’ రకం మాత్రం మనిషి నుంచి మనిషికి నేరుగా సోకే అత్యంత ప్రమాదకరమైన వైరస్ కావడం ఆందోళన కలిగిస్తోంది. నౌకలో ప్రయాణికుల మధ్య వైరస్ వ్యాప్తి చెందినట్లు గుర్తించిన ఆరోగ్య సంస్థలు తక్షణమే అప్రమత్తమై, ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిపై పర్యవేక్షణ చేపట్టాయి.కోవిడ్‌లా కాదు.. ప్రజలకు ముప్పు లేదుక్రూజ్ షిప్లో కేసులు నమోదైనప్పటికీ, కెనడాలోని సామాన్య ప్రజలకు ఈ వైరస్ వల్ల ప్రస్తుతం ఎలాంటి ముప్పు లేదని అధికారులు భరోసా ఇచ్చారు. ఇప్పటివరకు కొత్తగా ఎలాంటి కేసులు నమోదు కాలేదని, కాంటాక్ట్ ట్రేసింగ్, పరీక్షలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితిని కోవిడ్-19 మహమ్మారితో పోల్చవద్దని, ప్రజలు అనవసర భయాందోళనలకు గురికావొద్దని వైద్యాధికారులు చెబుతున్నారు.ఇది కూడా చదవండి: నాడు మన సొంతం.. నేడు పరాయి ముచ్చట! -
హంటా, నోరో, కోవిడ్.. ప్రాణాంతక నిజాలు!
న్యూఢిల్లీ: క్రూయిజ్ షిప్‌లలో వరుసగా నమోదవుతున్న నోరోవైరస్ కేసులు, అంతర్జాతీయ ప్రయాణికుల్లో బయటపడిన అరుదైన ‘హంటా’ వైరస్ ఉదంతాలు ప్రపంచాన్ని మరోసారి తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఈ తాజా పరిణామాలు కోవిడ్-19 నాటి చీకటి రోజులను గుర్తుచేస్తున్నాయి. అయితే ఈ మూడు వైరస్లు వ్యాప్తి చెందే విధానం, లక్షణాలు, వాటి వల్ల పొంచి ఉన్న ప్రాణాపాయం ఒకదానికొకటి పూర్తి భిన్నం. ఆ వ్యత్యాసాలు ఏమిటో నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.హంటా వైరస్: అరుదైనప్పటికీ ప్రాణాంతకంఎలుకల ద్వారా మనుషులకు సోకే ‘హంటా వైరస్’ చాలా అరుదైనదే అయినప్పటికీ, ప్రాణాపాయం కలిగించడంలో దీని తీవ్రత చాలా ఎక్కువ. ఎలుకల వ్యర్థాలు, మూత్రం లేదా లాలాజలం ఉన్న గాలిని పీల్చడం ద్వారా ఇది సోకుతుంది. జ్వరం, కండరాల నొప్పులు, తీవ్రమైన తలనొప్పి వంటి ప్రాథమిక ఫ్లూ లక్షణాలతో మొదలవుతుంది. తరువాత క్రమంగా ఊపిరితిత్తుల్లో నీరు చేరే ప్రమాదకరమైన ‘హంటావైరస్ పల్మనరీ సిండ్రోమ్’కు దారితీసి, శ్వాస తీసుకోవడాన్ని కష్టతరం చేస్తుంది. అయితే ఇది మనిషి నుంచి మనిషికి వ్యాపించే అవకాశం చాలా తక్కువ కావడం ఒక్కటే ఇందులో ఉన్న సానుకూలాంశం.నోరోవైరస్: వేగంగా చుట్టుముట్టే కడుపు ఫ్లూపాఠశాలలు, ఆఫీసులు క్రూయిజ్ షిప్‌ల వంటి రద్దీ ప్రాంతాల్లో ‘నోరోవైరస్’ అత్యంత వేగంగా, సులువుగా వ్యాపిస్తుంది. కలుషితమైన ఆహారం, నీరు, ఉపరితలాలను తాకడం ద్వారా ఇది సోకుతుంది. ఇది ప్రధానంగా జీర్ణవ్యవస్థపై దాడి చేస్తుంది. ఫలితంగా ఆకస్మిక వాంతులు, అతిసారం, తీవ్రమైన కడుపు నొప్పి వేధిస్తాయి. సాధారణంగా ఆరోగ్యవంతుల్లో ఇది రెండు, మూడు రోజుల్లోనే తగ్గిపోయినప్పటికీ, పిల్లలు, వృద్ధుల్లో ప్రాణాంతక డీహైడ్రేషన్‌కు (శరీరంలో నీరు శాతం పడిపోవడం) దారితీసే ప్రమాదం ఉంది. దీనికి నిర్దిష్టమైన మందు లేదు, విశ్రాంతి , ద్రవాహారం తీసుకోవడమే ఏకైక మార్గం.కోవిడ్-19: దీర్ఘకాలిక ప్రభావం చూపే శ్వాసకోశ వ్యాధిగాలి ద్వారా, తుంపర్ల ద్వారా అత్యంత సులభంగా వ్యాపించే కోవిడ్-19 నేరుగా శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీస్తుంది. పొడి దగ్గు, గొంతు నొప్పి, వాసన లేదా రుచి కోల్పోవడం దీని ప్రధాన లక్షణాలు. వ్యాక్సిన్ల రాకతో చాలా వరకు దీని తీవ్రత తగ్గినప్పటికీ, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇది ఇంకా ముప్పుగానే పరిణమిస్తోంది. కొందరిలో నెలల తరబడి వేధించే ‘లాంగ్ కోవిడ్’ సమస్యలు కూడా ఉన్నాయి. నోరోవైరస్ నివారణకు చేతులు శుభ్రంగా కడుక్కోవడం, కోవిడ్‌ను అడ్డుకునేందుకు మంచి గాలి ఆడేలా చూసుకోవడం, హంటా వైరస్ దరిచేరకుండా ఎలుకల సంచారాన్ని నివారించడం అత్యంత ఆవశ్యకం.ఇది కూడా చదవండి: బాబా వంగ చెప్పిన డెడ్లీ వైరస్ ఇదేనా? -
బాధితుల్లో ఇద్దరు భారతీయులు
ప్రాణాంతకంగా భావిస్తున్న హంటావైరస్ ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. క్రూయిజ్ షిప్‌లోని సిబ్బందిలో ఇద్దరు భారతీయులకు ఈ వైరస్ సోకింది. ముగ్గురి మరణానికి కారణమైన వైరస్ వ్యాప్తితో సంబంధం ఉన్న ఎంవి హోండియస్ క్రూయిజ్ షిప్లో ఇద్దరు భారతీయ సిబ్బంది ఉన్నారు. ఈ వైరస్ కోవిడ్-19 కంటే భిన్నంగా వ్యాపిస్తుందని, ప్రస్తుతం ఇది మహమ్మారి లాంటి ముప్పును కలిగించదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెబుతోంది.బీబీసి నివేదిక ప్రకారం అర్జెంటినా నుండి బయలుదేరిన 'MV హోండియస్' (MV Hondius) అనే డచ్ విహార నౌకలో భయంకరమైన హంటా వైరస్ (Hantavirus) కలకలం రేపుతోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకు ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ నౌకలో పనిచేస్తున్న సిబ్బందిలో ఇద్దరు భారతీయులు కూడా ఉండటం ఆందోళన రేపుతోంది.ఈ నౌక ఏప్రిల్ 1న అర్జెంటినాలోని ఉషువయా నుండి బయలుదేరింది. ఇది మే 10న స్పెయిన్‌లోని కానరీ దీవులకు చేరుకోవాల్సి ఉంది. ఈ విలాసవంతమైన నౌకలో మొత్తం 28 దేశాలకు చెందిన సుమారు 150 మంది ప్రయాణికులు మరియు సిబ్బంది ఉన్నారు. ఇందులో ఫిలిప్పీన్స్ (38), బ్రిటన్ (31), అమెరికా (23) దేశాల వారు అధికంగా ఉన్నారు.ఇదీ చదవండి : వరుడు అనూహ్య మరణం, పెద్దల షాకింగ్ నిర్ణయంఅయితే మానుషులనుంచి మనుషులకు వ్యాపించే హంటావైరస్ వ్యాప్తి అంతర్జాతీయ ఆందోళనను రేకెత్తించింది.ఈ వైరస్ బారిన పడి మరణించిన వారిలో నెదర్లాండ్స్‌కు చెందిన దంపతులతో పాటు ఒక జర్మనీ ప్రయాణికుడు ఉన్నారు. 69 ఏళ్ల డచ్ మహిళకు వైరస్ సోకినట్లు పరీక్షల్లో తేలింది.మరోవైపు వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి నౌకలో ప్రయాణించిన వారిని గుర్తించే పనిలో పడ్డారు . ఈ ఏప్రిల్ 24న సెయింట్ హెలెనా ద్వీపంలో సుమారు 29 మంది ప్రయాణికులు ఈ నౌక నుండి దిగిపోయారు. నౌకలో ఉన్న ఇద్దరు భారతీయుల ఆరోగ్య పరిస్థితి గురించి ప్రస్తుతం మరింత సమాచారం అందాల్సి ఉంది.ఇదీ చదవండి: ఎంపీ మహువాకు ఇండిగో విమానంలో చేదు అనుభవంమానవుల నుండి మానవులకు వ్యాప్తి?సాధారణంగా హంటా వైరస్ ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది. అయితే, ఈ నౌకలో గుర్తించిన 'ఆండీస్ స్ట్రెయిన్' (Andes strain) రకానికి ఒక ప్రత్యేకత ఏంటంటే..మానవుల నుండి మానవులకు (పరిమితంగా) వ్యాపించే సామర్థ్యం ఉన్న ఏకైక రకం ఇదే. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ అంటువ్యాధిపై నిశితంగా నిఘా ఉంచింది.ఊరటనిస్తున్న WHO వివరణ ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటువ్యాధుల నిపుణురాలు మరియా వాన్ కెర్ఖోవ్ ఈ విషయంపై స్పందిస్తూ ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు. ఇది కోవిడ్ లేదా ఇన్ఫ్లుయెంజా వంటిది కాదు. దీని వ్యాప్తి విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం ఇది ప్రపంచవ్యాప్త మహమ్మారిగా మారే ముప్పు లేదని ఆమె వెల్లడించారు. అయినప్పటికీ, ముందుజాగ్రత్తగా నౌకలో ఉన్నవారందరూ మాస్కులు ధరించాలని, రోగులకు సేవలు అందించే వారు పిపిఇ (PPE) కిట్లు వాడాలని అధికారులు సూచించారు. -
హంటా వైరస్ కలకలం
వాషింగ్టన్ డీసీ: ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న హంటావైరస్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వైరస్‌పై తనకు సమాచారం అందిందని ప్రస్తుతానికి పరిస్థితి అంతా బాగానే ఉందన్నారు. ఇటీవల ఓ క్రూయిజ్‌షిప్‌లో హంటా వైరస్‌తో ముగ్గురు మృతిచెందిన సంగతి తెలిసిందే.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాషింగ్టన్ డీసీలోని లింకన్ మెమోరియల్ రిఫ్లెక్టింగ్ పూల్ పునరుద్ధరణ పనులను పరిశీలించడానికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడి మీడియా హంటా వైరస్ గురించి ట్రంప్‌ను ప్రశ్నించగా "అంతా అదుపులోనే ఉందని మేము ఆశిస్తున్నాం. ఆ నౌక గురించి రేపు పూర్తి నివేదిక ఇవ్వబోతున్నాం. గొప్ప నిపుణులు దీనిపై అధ్యయనం చేస్తున్నారు, అంతా బాగుంటుంది," అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతానికి పరిస్థితి అంతా అదుపులోనే ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. హంటా కలకలంకాగా ఈ నౌకలో ప్రయాణించి అమెరికా చేరుకున్న ఐదుగురు పౌరులకు అమెరికా క్వారంటైన్ విధించింది. ఇటీవల అట్లాంటిక్ మహాసముద్రంలో ఎంబీ హోండియన్ క్రూయిజ్ నౌకలో హంటా వైరస్‌తో ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురిని వ్యాది అనుమానిత రోగులుగా గుర్తించారు. అనంతరం వ్యాధి నిర్ధారణ పరీక్షల తర్వాత వాళ్లకు వైరస్ సోకలేదని నిర్ధారించుకున్నాక 12 దేశాలకు చెందిన డజను మందికిపైగా ప్రయాణికులను నౌక నుంచి సురక్షితంగా బయటకు పంపేశామని నౌక యాజమాన్యం, నెదర్లాండ్స్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది.అయితే లక్షణాలు కనిపించనంత మాత్రాన నౌకలోని ప్రయాణికులను స్వేచ్ఛగా వదిలేస్తారా? వాళ్లు స్వదేశాలకు వచ్చాక వాళ్లలో వైరస్ లక్షణాలు బయటపడి ఇతరులకు వ్యాపిస్తే పరిస్థితి అదుపుతప్పుతుందన్న అనుమానాలు, భయాందోళనలు ఎక్కువయ్యాయి. నౌకలోకి ఎక్కకముందు విమానంలో ప్రయాణించిన ఒక మహిళలో హంటావైరస్ లక్షణాలు వెలుగుచూశాయి.దీంతో ప్రయాణం మొదలెట్టిన రోజు నుంచి వైరస్ వెలుగుచూసిన రోజుదాకా ఎంత మంది ఎక్కడెక్కడ దిగిపోరనే వివరాలతో వాళ్ల జాడను కనిపెట్టి వైద్యపరీక్షలు చేయడంలో ఆయా దేశాలు నిమగ్నమయ్యాయి. ఈలోపు ఈ విషయం తెలియక వాళ్లు స్థానికంగా ఇంకెంత మందికి వైరస్‌ను వ్యాపింపజేస్తారో అనే ఊహాగానాలూ ఎక్కువయ్యాయి.హంటావైరస్ అంటే ఏమిటి ?హంటావైరస్ అనేది ఎలుకల ద్వారా వ్యాపించే ఒక రకమైన ఇన్ఫెక్షన్. ఇది ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వ్యాపించడం చాలా అరుదు. ఈ వైరస్ ఒకరి నుండి ఒకరికి సులభంగా వ్యాపించదు కాబట్టి, సాధారణ ప్రజలకు దీనివల్ల కలిగే ప్రమాదం తక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. -
‘హంటావైరస్’ నౌక నుంచి డజను మందికి పైగా విముక్తి
ద హేగ్: ప్రాణాంతకర హంటావైరస్ గుప్పిట చిక్కిన విలాసవంత విహారనౌక ‘ఎంబీ హోండియస్’నుంచి డజను మందికిపైగా పర్యాటకులకు విముక్తి లభించింది. వ్యాధి నిర్ధారణ పరీక్షల తర్వాత వాళ్లకు వైరస్ సోకలేదని రూఢీ చేసుకున్నాక 12 దేశాలకు చెందిన డజను మందికిపైగా ప్రయాణికులను నౌక నుంచి సురక్షితంగా బయటకు పంపేశామని నౌక యాజమాన్యం, నెదర్లాండ్స్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. అయితే లక్షణాలు కనిపించనంత మాత్రాన నౌకలోని ప్రయాణికులను స్వేచ్ఛగా వదిలేస్తారా? వాళ్లు స్వదేశాలకు వచ్చాక వాళ్లలో వైరస్ లక్షణాలు బయటపడి ఇతరులకు వ్యాపిస్తే పరిస్థితి అదుపుతప్పుతుందన్న అనుమానాలు, భయాందోళనలు ఎక్కువయ్యాయి. నౌకలోకి ఎక్కకముందు విమానంలో ప్రయాణించిన ఒక మహిళలో హంటావైరస్ లక్షణాలు వెలుగుచూశాయి. ఈమెకు ఆ విమానంలో సేవలందించిన మహిళా ఫ్లయిట్ అటెండెంట్‌ను ప్రస్తుతం క్వారంటైన్లో ఉంచామని, లక్షణాలు ఆమెలో ఇంకా కని్పంచలేదని నెదర్లాండ్స్ వైద్యశాఖ తెలిపింది. ఏప్రిల్ 24వ తేదీన నౌకలో తొలిసారిగా వైరస్ జాడను గుర్తించిన విషయం తెల్సిందే. అయితే మార్గమధ్యంలో నౌక పలు దేశాల్లో లంగరువేయడం, అక్కడ కొందరు ప్రయాణికులు దిగిపోయిన నేపథ్యంలో ఎంతమందికి వైరస్ సోకి ఉండొచ్చనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టతలేదు. దీంతో ప్రయాణం మొదలెట్టిన రోజు నుంచి వైరస్ వెలుగుచూసిన రోజుదాకా ఎంత మంది ఎక్కడెక్కడ దిగిపోరనే వివరాలతో వాళ్ల జాడను కనిపెట్టి వైద్యపరీక్షలు చేయడంలో ఆయా దేశాలు నిమగ్నమయ్యాయి. ఈలోపు ఈ విషయం తెలియక వాళ్లు స్థానికంగా ఇంకెంత మందికి వైరస్‌ను వ్యాపింపజేస్తారో అనే ఊహాగానాలూ ఎక్కువయ్యాయి. -
వణికిస్తున్న హంటా వైరస్
జోహన్నెస్‌బర్గ్: అట్లాంటిక్ సముద్రంలో చిక్కుకున్న ‘ఎంవీ హోండియస్’క్రూయిజ్ నౌక నుండి ముగ్గురు వ్యాధి అనుమానిత రోగులను సురక్షితంగా తరలించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ రోగులను నెదర్లాండ్స్‌కు తరలిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రేయేసస్ బుధవారం ధ్రువీకరించారు. అర్జెంటీనాలో ఏప్రిల్ 1న బయలుదేరిన ఈ నౌకలో ఇప్పటికే ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్ర అనారోగ్యానికి గురవడం తెలిసిందే. క్రూయిజ్ నౌకలో హంటా వైరస్ వ్యాప్తిని అదుపు చేసేందుకు, ప్రయాణికులు, సిబ్బంది ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, ప్రస్తుతం ప్రజారోగ్యానికి ముప్పు తక్కువగానే ఉందని ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో స్పష్టం చేశారు. విషాద స్థావరంగా విలాస నౌక అట్లాంటిక్ మహాసముద్ర గర్భంలో కేప్ వర్డే తీరానికి చేరువలో, ‘ఎంవీ హొండియస్’అనే నౌక ఇప్పుడు ఓ విషాద స్థావరంగా మారింది. లోపల దాదాపు 150 మంది ప్రాణాలు కొట్టుమిట్టాడుతున్నాయి. నిన్నటి వరకు వినోదం పంచిన నౌక, నేడు ఒక క్వారంటైన్ జైలుగా మారింది. షిప్ డాక్టర్ మొదలుకొని, సామాన్య ప్రయాణికుల వరకు అందరూ ఇప్పుడు వైరస్ నీడలో బందీలు. ఏప్రిల్ 1న మొదలైన ఆ యాత్ర, చివరకు సముద్రం మధ్యలో ఒక నిశ్శబ్ద సమరంగా మిగిలిపోయింది. ఎలుకల విసర్జితాల నుంచి వ్యాప్తి ఎలుకల నుంచి పుట్టి, ఇప్పుడు ’ఆండీస్’ రకంగా పరిణామం చెంది మనుషుల మధ్యే వ్యాపిస్తున్న ఈ వైరస్, ఒక అరుదైన విషాదం. తాకడం, కలిసి భోజనం చేయడం వంటి అత్యంత సన్నిహిత చర్యల ద్వారా వ్యాపించే ఈ వ్యాధి, ప్రకృతి మానవాళికి సవాల్ విసురుతోంది. ఇప్పటికే ముగ్గురు ప్రాణాలు తీసిన ఈ వైరస్, మరికొందరి శరీరాల్లో తాండవిస్తోంది. కెనరీ దీవులకు తరలింపు ఏర్పాట్లు ప్రస్తుతం ఈ నౌక కేప్ వర్డే తీరంలో నిలిచి ఉంది. బాధితులకు చికిత్స అందించేందుకు, నౌకను సురక్షితంగా చేరవేసేందుకు స్పెయిన్‌లోని కెనరీ దీవుల వైపు వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, ఈ నౌక రాకపై కెనరీ దీవుల ప్రాంతీయ అధ్యక్షుడు ఫెర్నాండో క్లావిజో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, స్థానిక ప్రజల భద్రత దృష్ట్యా అత్యవసర సమావేశానికి డిమాండ్ చేశారు. దక్షిణాఫ్రికాలో చికిత్స పొందుతున్న ఇద్దరు ప్రయాణికులలో ‘అండీస్ స్ట్రెయిన్’ను గుర్తించగా, వారిలో ఒక బ్రిటిష్ వ్యక్తి ఐసీయూలో ఉండగా మరొకరు మరణించారు. స్విట్జర్లాండ్‌కు చెందిన ఒక ప్రయాణికుడు కూడా ఈ వైరస్ బారిన పడ్డారు. -
హంటావైరస్ అంటే..? ఈ వ్యాధి ఎందువల్ల వస్తుందంటే..
అట్లాంటిక్ మహాసముద్రం నడిబొడ్డున ఓ విలాసవంతమైన క్రూయిజ్ నౌకలో హంటా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఆ నౌక అర్జెంటీనా నుంచి పశ్చిమ ఆఫ్రికా తీరంలోని ద్వీపాల సమూహమైన కేప్ వెర్డేకు ప్రయాణిస్తోంది. దీంతో ఆ నౌకలోని ప్రయాణిస్తున్న దాదాపు 150 మంది ప్రయాణికులు దిక్కుతోచని స్థితిలో బందీలుగా చిక్కుకుపోయారు. ఇప్పటివరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. దాంతో ఒక్కసారిగా సర్వత్రా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అసలేంటి హంటా వైరస్, ఎందువల్ల వస్తుంది తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.హంటావైరస్ అంటే..హంటావైరస్ అనేది ప్రధానంగా ఎలుకల ద్వారా వ్యాపించే ప్రాణాంతక వైరస్. ఇది ఊపిరితిత్తులను ప్రభావితం చేసి పల్మనరీ సిండ్రోమ్ వంటి పలు అనారోగ్యాలకు కారణమవుతుంది. ఎలా వ్యాపిస్తుందంటే..వ్యాధి సోకిన ఎలుకల మూత్రం, మలం లేదా లాలాజలం ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే గాలి చొరవని ప్రదేశాల్లో నివశించే ప్రజలుకు ఈ వ్యాధి సోకే అవకాశం అని చెబుతున్నారు.మానువుల ద్వారా సంక్రమణ అనేది..అనేక వైరల్ ఇన్ఫెక్షన్ల వలె ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే వ్యాధి మాత్రం కాదని అంటున్నారు నిపుణులు. చాలామటుకు ఎలుకల కారణంగా నమోదవ్వుతాయని చెబుతున్నారు. లక్షణాలు..ఫ్లూ లక్షణాలను పోలి ఉంటాయని అన్నారు. జ్వరం, అలసట, కండరాల నొప్పులు, తలనొప్పి వంటివి ఉంటాయని చెప్పారు. అందువల్లే ఈ వ్యాధిని ముందుగా గుర్తించడం కష్టతరం అని పేర్కొన్నారు వైద్యులు.తక్కువ సమయంలోనే తీవ్రతరం అవ్వొచ్చు..వ్యాధి ముదిరే కొద్దీ, దగ్గు, ఆయాసం, ఊపిరితిత్తులలో ద్రవం చేరడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది హంటావైరస్ పల్మనరీ సిండ్రోమ్ ముఖ్య లక్షణం.మరణాల రేటు కూడా ఎక్కువే..ఇది అత్యంత అరుదైనదే అయినా..ఈ హంటావైరస్ ఇన్ఫెక్షన్లు ఒక్కోసారి ప్రాణాంతకం కావొచ్చని హెచ్చరిస్తున్నారు వైద్యులు. అందువల్ల వెంటనే వైద్య సంరక్షణ పొందడం అత్యంత కీలకం.నిర్దిష్ట నివారణ లేదుహంటావైరస్కు నిర్దిష్టమైన యాంటీవైరల్ చికిత్స లేదు. తీవ్రమైన సందర్భాలలో, ఆక్సిజన్ చికిత్స, ఆస్పత్రిలో చేరడం వంటి సహాయక చికిత్సలు తరచుగా అవసరమవుతాయ్.


