Horoscope Today: May 2, 2023 In Telugu: నేటి రాశి ఫలాలు.. ఈ రాశివారికి ఆస్తిలాభం, పనుల్లో పురోగతి - Sakshi
Sakshi News home page

మే 02వ తేదీ రాశుల ఫలితాలు: ఈ రాశివారికి ఆస్తిలాభం, పనుల్లో పురోగతి

May 2 2023 6:42 AM | Updated on May 2 2023 8:25 AM

Today Horoscope 02 05 2023 Telugu - Sakshi

ఈ రాశివారికి వస్తులాభాలు. పనులలో పురోగతి. ఆస్తిలాభం. బంధువులతో ఆనందంగా గడుపుతారు.

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం,
సూర్యోదయం: 5.38, సూర్యాస్తమయం: 6.15. 
తిథి: శు.ద్వాదశి రా.9.51 వరకు, తదుపరి త్రయోదశి,
నక్షత్రం: ఉత్తర సా.6.33 వరకు, తదుపరి హస్త,

వర్జ్యం: రా.3.26 నుండి 5.10 వరకు,
దుర్ముహూర్తం: ఉ.8.10 నుండి 9.01 వరకు, తదుపరి రా.10.49 నుండి 11.34 వరకు,
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు,
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు,

అమృతఘడియలు: ఉ.10.44 నుండి 12.06 వరకు;


మేషం: పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

వృషభం: ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

మిథునం: ఉత్సాహంగా పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు రాగలవు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కర్కాటకం: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

సింహం: పనులలో పురోగతి. ఆస్తిలాభం. బంధువులతో ఆనందంగా గడుపుతారు. మీ సత్తా చాటుకుంటారు. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలస్థితి.

కన్య: కుటుంబ, ఆరోగ్య సమస్యలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఆలోచనలు కలసిరావు. పనుల్లో జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

తుల: కొత్త  విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

వృశ్చికం: దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. భూ, గృహయోగాలు. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలం.

ధనుస్సు: పనులలో ఆటంకాలు. ధనవ్యయం. వ్యయప్రయాసలు. బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మకరం: ఆర్థిక ఇబ్బందులు.రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలలో అవాంతరాలు.పనులు వాయిదా. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళపరుస్తాయి.

కుంభం: కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. పరిచయాలు పెరుగుతాయి. భూవివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మీనం: శుభకార్యాలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. పనుల్లో పురోగతి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement