ప్రియురాలి కోసం గుండు చేసుకున్నాడు | Watch: Man Goes Bald after Shaving Girlfriend Head | Sakshi
Sakshi News home page

ప్రియురాలి కోసం గుండు చేసుకున్నాడు

Published Thu, Jul 30 2020 5:43 PM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM

నిజమైన ప్రేమను మాటల్లో వ్యక్తం చేయడం కష్టం. మనం చేసే పనుల ద్వారా అవతలి వారి పట్ల ఎంత ప్రేమ ఉందో చూపిస్తాం. తాజాగా ఇందుకు నిదర్శనంగా నిలిచే వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ప్రియురాలికి మద్దతుగా ఓ యువకుడు గుండు గీసుకుని ఆమె మీద ఉన్న ప్రేమను వెల్లడించాడు. ఇది చూసిన నెటిజనులు సదరు వ్యక్తిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. బాస్కెట్‌ బాల్‌ ఆటగాడు రెక్స్‌ చాప్‌మాన్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేసిన ఈ వీడియో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. ఓ యువతి అలోపేసియా(పేనుకొరుకుడు) అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. రోగ నిరోధక వ్యవస్థ జుట్టు కుదుళ్ల మీద దాడి చేయడం వల్ల ఈ వ్యాధి సోకుతుంది. ఫలితంగా ప్యాచెస్‌ ప్యాచెస్‌గా జుట్టు రాలిపోతుంది. ప్రాంరంభంలో చిన్నగా ఉన్న ఇది రానురాను పెద్దగా మారుతుంది.

ఈ క్రమంలో సదరు యువతి కూడా ఈ వ్యాధితో బాధపడుతుంది. దాంతో ఆమె ప్రేమికుడు ట్రిమ్మర్‌తో యువతికి గుండు చేస్తాడు. ఇష్టంగా పెంచుకున్న జుట్టును కోల్పోవాల్సి రావడంతో యువతి ఎంతో ఆవేదనకు గురవుతుంది. ఆమెకు గుండు చేయడం పూర్తయిన తర్వాత ఆకస్మాత్తుగా తనకు గుండు చేసుకోవడం ప్రారంభిస్తాడు సదరు యువకుడు. ఇది చూసి ఆమె షాక్‌ అవుతుంది. ఏడుస్తుంది. జుట్టు కోల్పోయి బాధపడుతున్న ప్రియురాలకి మద్దతు తెలపడం కోసం సదరు యువకుడు ఇలా తనకు తానే గుండు చేసుకున్నాడు. మానవత్వం మిగిలి ఉందనడానికి ఈ సంఘటన ఉదాహరణ అంటూ రెక్స్‌ షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. నెటిజన్లు సదరు యువకుడిని తెగ ప్రశంసిస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement