న్యూఢిల్లీ : సాధారణంగా పక్షులు ఎగురుతాయి, కప్పలు గెంతుతాయి. పాములు అనేవి పాకుతాయి. ఇది అందరికి తెలుసు. కానీ పాములు నడుస్తాయి అంటే మీరు నమ్ముతారా? పాములు నడవడం ఏంటని నవ్వుకుంటారు కూడా. కానీ వీడియో చూస్తే అలా నవ్వుకోక పోగా.. ఆశ్చర్యపోతారు. ఒక పాము రోడ్డుపై పాకుతూ వెళ్లకుండా గొంగళిపురుగు మాదిరి నడుస్తూ వెళ్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘నాన్ స్లైడరింగ్’ పామును చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ‘ఇలాంటి పామును ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. ఇది సైన్స్ ప్రయోగం కావొచ్చు. ‘ఇది గొంగళి పురుగులతో పాటు పెంచబడిన పాము కావొచ్చ’, అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఈ పాము పాకడం లేదు.. నడుస్తోంది!
May 14 2020 3:46 PM | Updated on May 14 2020 3:53 PM
Advertisement
Advertisement
Advertisement
