ప్రపంచకప్ 2019 లక్ష్యంగా ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా నెట్స్‌లో తీవ్రంగా కష్టపడుతోంది. కోచ్‌ల పర్యవేక్షణలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఆటగాళ్లు తుది మెరుగులు దిద్దుకుంటున్నారు. అయితే నెట్స్‌లో టీమిండియా సారథి విరాట్ కోహ్లి బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్వీటర్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తోంది. ‘టీమిండియాకు ఆరో బౌలర్ దొరికాడోచ్’, ‘ప్రపంచకప్‌లో కోహ్లి మరో అవతారం ఎత్తునున్నాడు’, ‘కేదార్ జాదవ్ అందుబాటులో లేకుంటే అతడి బౌలింగ్ కోటాను కోహ్లితో భర్తీ చేయించవచ్చు’అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.