టెర్రస్‌పై గబ్బర్ ధూమ్‌ధామ్
న్యూఢిల్లీ: నిత్యం క్రికెట్ మ్యాచ్‌లు, ప్రాక్టీస్ సెషన్‌లతో బిజీగా ఉండే టీమిండియా క్రికెటర్లకు చిన్న విరామం దొరకడంతో ప్రస్తుతం సేద తీరుతున్నారు. ఈ గ్యాప్‌లో వచ్చిన దీపావళి పండుగను కుటుంబసభ్యులతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు కుటుంబసభ్యులతో కలిసి చేసిన ఎంజాయ్ అంతా ఇంతా కాదు. తాజాగా ఈ జాబితాలో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ చేరాడు.
శిఖర్ ధావన్ ఇంటాబయటా చేసే వినోదం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మైదానంలో అభిమానులను ఉత్సాహపరచడానికి స్టెప్పులేయడం.. అదేవిధంగా డ్రెస్సింగ్ రూమ్‌లో, ట్రావెలింగ్‌లో సహచర ఆటగాళ్లతో కామెడీ పండించడం చూస్తుంటాం. ముఖ్యంగా తన పిల్లలతో చేసే అల్లరి అంతా ఇంతా కాదు. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో తన అభిమానులతో ధావన్ పంచుకుంటాడు. తాజాగా భాయ్ దూజ్ వేడుక సందర్భంగా తన కుటంబసభ్యులతో కలిసి సందడి చేశాడు. అదేవిధంగా ఇంటి టెర్రస్‌పై క్రికెట్ ఆడుతూ ధూమ్‌ధామ్ చేశాడు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి