టీమిండియాకు జై అన్నందుకు..

యూఏఈలో జరుగుతున్న ఏషియన్‌ ఫుట్‌బాల్‌ కప్‌లో భాగంగా గురువారం రాత్రి యూఏఈ-భారత్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇండియా 0-2 తో పరాజయం పాలైంది. అయితే, మ్యాచ్‌కు ముందు టీమిండియాకు అభిమానులను ఓ దుబాయ్‌ షేక్‌ పక్షుల పంజరంలో బంధించాడు. వారితో యూఏఈకి మద్దతు పలుకుతామని బలవంతంగా చెప్పించాడు. ఆ వీడియో వైరల్‌ కావడంతో చిక్కుల్లో పడ్డాడు. ‘మీరు ఏ జట్టు గెలవాలని కోరుకుంటారు?’ అని షేక్‌ ప్రశ్నించాడు. టీమిండియా ఫ్యాన్స్‌ మూకుమ్మడిగా.. ‘ఇండియన్‌ జట్టుకే మా మద్దతు’ అనగానే.. ఆగ్రహం వ్యక్తం చేశాడు. మీరంతా యూఏఈ జట్టుకే మద్దతు పలకాలని చేతిలో బెత్తం పట్టుకుని బెదిరించాడు. దాంతో టీమిండియా ఫ్యాన్స్‌ యూఏఈకే మద్దతు పలుకుతామని చెప్పడంతో పంజరం నుంచి విడుదల చేశాడు. ఈ తతంగం అంతా సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో యూఏఈ అటార్నీ జనరల్‌ స్పందించారు. వివక్షాపూరితంగా వ్యవహరించి, బెదిరింపుకలకు పాల్పడినందుకు సదరు షేక్‌కు అరెస్టు వారెంట్‌ జారీ చేశారు.విచారణ నిమిత్తం అటెండ్‌ కావాలని వారెంట్‌ పేర్కొన్నారు. కాగా, ఈ విషయం అరెస్టు దాకా వెళ్లడంతో సదరు షేక్‌ మాటమార్చాడు. ‘వీడియోలో చేసిందంతా సరదా కోసమే. పంజరంలో వేసిన వారంతో నా దగ్గర పనిచేసేవారే. గత 20 ఏళ్లుగా వీళ్లు నాకు తెలుసు. మేమేంతా కలిసిమెలిసి ఉంటాం. ఒకే కంచంలో కలిసి భోజనం కూడా చేస్తాం. అదంతా ఉత్తిదే. నేను వారిని కొట్టలేదు. అసలు నిజంగా వారిని బంధించనేలేదు’ అంటూ మరో వీడియో రిలీజ్‌ చేశాడు. టీమిండియా అభిమానులు ఆసియా సంతతికి చెందినవారుగా తెలిసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top