‘డియర్ టీమిండియా.. ఎంజాయ్ చేయడానికి కాదు ప్రపంచకప్ ఆడటానికి మిమ్మల్ని పంపించింది’ అంటూ కోహ్లిసేనపై భారత అభిమానులు మండిపడుతున్నారు. ప్రపంచకప్‌లో తమ తొలిపోరుకు ఇంకా సమయం ఉండటంతో తమకు లభించిన విశ్రాంతిని భారత క్రికెటర్లు సరదాగా గడుపుతున్నారు. గత మూడు రోజులుగా షాపింగ్‌లతో బిజిగా కనిపించిన టీమిండియా సభ్యులంతా శుక్రవారం అడవి బాట పట్టారు. పచ్చటి చెట్ల మధ్య పెయింట్‌బాల్ ఆడుతూ హుషారు ప్రదర్శించారు.