ఐపీఎల్‌-12: వీరి ఖాతాలోనే ‘తొలి ఘనత’

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-12వ సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న ఆరంభపు మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు నెమ్మదిగా ఇన్నింగ్స్‌ ఆరంభించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను విరాట్‌ కోహ్లి, పార్థివ్‌ పటేల్‌లు ఆరంభించారు.  ఈ మ్యాచ్‌లో తొలి ఓవర్‌ను దీపక్‌ చాహర్ వేశాడు. ఆ ఓవర్‌ ఐదో బంతిని పార్ధివ్‌ పటేల్‌ ఫోర్‌ కొట్టాడు. దాంతో ఈ సీజన్‌లో తొలి ఫోర్‌ కొట్టిన ఆటగాడిగా పార్థివ్‌ నిలిచాడు. ఇక ఈ సీజన్‌లో తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరింది కోహ్లినే. హర్భజన్‌ సింగ్‌ వేసిన నాల్గో ఓవర్‌ మూడో బంతికి కోహ్లి ఔటయ్యాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter


మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top