క్రికెట్‌లో కనీవినీ ఎరుగని రనౌట్‌ | Players run into each other as BBL clash between Thunder, Renegades witnesses a comical run-out | Sakshi
Sakshi News home page

క్రికెట్‌లో కనీవినీ ఎరుగని రనౌట్‌

Jan 31 2019 10:51 AM | Updated on Mar 22 2024 11:23 AM

క్రికెట్‌లో రనౌట్లు అనేవి సహజం. పరుగు తీసే క్రమంలో బ్యాట్స్‌మన్‌ క్రీజ్‌లోకి చేరుకోలేకపోతే రనౌట్‌గా నిష్క్రమిస్తూ ఉంటారు. చేజింగ్‌ సమయంలో అందులోనూ చివర ఓవర్లలో ప్రతీ పరుగు ముఖ్యమైనదే. ఈ సమయంలో రనౌట్‌లు ఎక్కువగా జరుగుతుంటాయి. రనౌట్‌ అయిన విధానం పట్ల బ్యాట్స్‌మెన్‌పై ఒక్కోసారి జాలి చూపిస్తే.. మరికొన్నిసార్లు ఆగ్రహం వ్యక్తం చేస్తాం. ఆస్ట్రేలియాలో జరగుతున్న బిగ్‌ బాష్‌ లీగ్‌లో జరిగిన సిల్లీ రనౌట్‌ అందిరిలోనూ నవ్వు తెప్పిస్తోంది. బిగ్‌ బాష్‌ లీగ్‌లో భాగంగా సిడ్నీ ధండర్స్‌- మెల్‌బోర్న్‌ రెనిగేడ్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ వినూత్న రనౌట్‌ చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.బిగ్‌బాష్‌ లీగ్‌లో భాగంగా మెల్‌బోర్న్‌ రెనిగేడ్స్‌‌-సిడ్నీ థండర్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన మెల్‌బోర్న్‌, నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేపట్టిన సీడ్నీ లక్ష్య చేదనలో పూర్తిగా విఫలమైంది. దీంతో 19.1 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటై ఓటమి చవిచూసింది. అయితే సిడ్నీ ఇన్నింగ్స్‌ 18.3 ఓవర్లో జోనాథన్‌ కుక్‌, గురిందర్‌ సంధు ఇద్దరు బ్యాటింగ్‌ చేస్తున్నారు. ఈక్రమంలో కుక్‌కు బౌలర్‌ వేసిన బంతిని ఆడి పరుగు తీసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న సంధును ఢీకొన్నాడు. దీంతో బౌలర్ హ్యారీ గుర్నే వారిద్దరి మధ్య నుంచి వెళ్లి రనౌట్‌ చేశాడు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement