జడేజా రనౌట్‌పై వివాదం.. | Virat Kohli Miffed After Ravindra Jadeja Run Out | Sakshi
Sakshi News home page

జడేజా రనౌట్‌పై వివాదం..

Dec 15 2019 8:38 PM | Updated on Mar 20 2024 5:39 PM

టీమిండియా-వెస్టిండీస్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డేలో నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. రవీంద్ర జడేజా రనౌట్‌ ఇందుకు ఆజ‍్యం పోసింది. ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా రనౌట్‌ కాగా, అది వివాదాస్పదమైంది. టీమిండియా ఇన్నింగ్స్‌ 48 ఓవర్‌ నాల్గో బంతికి జడేజా బంతిని మిడ్‌ వికెట్‌ వైపు ఆడి సింగిల్‌ కోసం యత్నించాడు. అయితే దాన్ని అందుకున్న రోస్టన్‌ ఛేజ్‌ నాన్‌ స్టైకింగ్‌ ఎండ్‌లో వికెట్లను డైరక్ట్‌ త్రో గిరటేశాడు. అయితే దానిపై అంపైర్‌ ఔట్‌ ఇవ్వలేదు. ఆ సమయంలో జడేజా క్రీజ్‌లోకి వచ్చాడని భావించిన ఫీల్డ్‌ అంపైర్‌ షాన్‌ జార్జ్‌ అది నాటౌట్‌గా ప్రకటించాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement