పొలార్డ్‌.. పోలా! అదిరి పోలా

ముంబై ఇండియన్స్‌ ఆల్‌రౌండర్‌ కీరన్‌ పోలార్డ్‌ ప్రతి సీజన్‌లో తన వైవిధ్యమైన ఆటతో అభిమానులను కట్టిపడేస్తాడు. అది ఫీల్డింగ్‌.. బ్యాటింగ్‌.. బౌలింగ్‌ ఏదైనా తన వైవిధ్యమైన ఆటతీరుతో ప్రతీసీజన్‌లో వార్తల్లో నిలుస్తాడు. అయితే తాజా సీజన్‌ ప్రారంభమై నాలుగు మ్యాచ్‌లైనా పోలార్డ్‌ మెరుపులు కనిపించక అభిమానులు దిగాలు చెందారు. అయితే బుధవారం చెన్నైసూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన మార్క్‌ ఫీల్డింగ్‌తో జిగేల్‌మన్నాడు. చెన్నై కీలక ఆటగాడైన సురేశ్‌ రైనాను సూపర్‌ మ్యాన్‌ క్యాచ్‌తో పెవిలియన్‌కు చేర్చి ముంబై జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. 

Tags: 

మరిన్ని వీడియోలు

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top