వారితో నాట్యం చేయించడం సంతోషంగా ఉంది: షమీ | IND Vs SA 3rd Test: Shami Speech At Post Match Press Conference | Sakshi
Sakshi News home page

వారితో నాట్యం చేయించడం సంతోషంగా ఉంది: షమీ

Oct 22 2019 6:27 PM | Updated on Mar 21 2024 8:31 PM

మూడు టెస్టుల సిరీస్‌లో దక్షిణాఫ్రికాను వైట్‌వాష్‌ చేసిన టీమిండియా ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆగ్రస్థానాన్ని మరింత బలపరుచుకుంది. ఇక ఈ టెస్టు సిరీస్‌లో భారత బౌలర్లు 60 వికెట్లు పడగొట్టగా అందులో పేస్‌ బౌలర్లే 26 వికెట్లు దక్కించుకోవడం విశేషం. అత్యధికంగా మహ్మద్‌ షమీ 13 వికెట్లతో భారత బౌలింగ్‌ దళానికి నాయకత్వం వహించాడు. ఆ తర్వాత కేవలం చివరి రెండు టెస్టుల్లోనే ఉమేశ్‌ యాదవ్‌ 11 వికెట్లు దక్కించుకోవడం విశేషం. అయితే ఈ సిరీస్‌లో భారత్‌కు లాభించిన మరో అంశం టెయిలెండర్లు బ్యాట్‌తో రాణించడం. ముఖ్యంగా రాంచీ టెస్టులో ఉమేశ్‌ యాదవ్‌ సిక్సర్ల మోతతో పాటు షమీ కూడా తన బ్యాట్‌కు పనిచెప్పడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ సాధించగలిగింది.

Advertisement
 
Advertisement
Advertisement