టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఎంఎస్ ధోనిని గుర్తు చేశాడు. ధోని పరిచయం చేసిన హెలికాప్టర్ షాట్‌ను అచ్చం అతనిలానే ఆడుతూ సిక్స్ బాదాడు. ఐర్లాండ్‌తో డబ్లిన్ వేదికగా బుధవారం రాత్రి ముగిసిన తొలి టీ20 మ్యాచ్‌లో ధోనీ హెలికాప్టర్ సిక్సర్లు బాదలేకపోయాడు. కానీ.. ఆ కొరతను హిట్టర్ హార్దిక్ పాండ్య ఆఖరి బంతిని హెలికాప్టర్ షాట్‌తో సిక్సర్‌గా కొట్టి తీర్చాడు.