నాలుగో వన్డేలో భారత్ పరాజయం | Sakshi
Sakshi News home page

నాలుగో వన్డేలో భారత్ పరాజయం

Published Mon, Mar 11 2019 7:41 AM

ఆస్ట్రేలియా అద్భుత ఆటతీరుతో వన్డే సిరీస్‌లో సమంగా నిలిచింది. ఆదివారం జరిగిన నాలుగో వన్డేలో ఆసీస్‌ 4 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ (115 బంతుల్లో 143; 18 ఫోర్లు, 3 సిక్సర్లు) వన్డేల్లో తన అత్యధిక స్కోరు నమోదు చేశాడు. రోహిత్‌ శర్మ (92 బంతుల్లో 95; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. కమిన్స్‌కు 5 వికెట్లు దక్కాయి. అనంతరం ఆస్ట్రేలియా 47.5 ఓవర్లలో 6 వికెట్లకు 359 పరుగులు చేసి గెలిచింది. పీటర్‌ హ్యాండ్స్‌కోంబ్‌ (105 బంతుల్లో 117; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకం నమోదు చేయగా, ఉస్మాన్‌ ఖాజా (99 బంతుల్లో 91; 7 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. చివర్లో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఆస్టన్‌ టర్నర్‌ (43 బంతుల్లో 84 నాటౌట్‌; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగి జట్టును గెలిపించాడు. సిరీస్‌ ఫలితాన్ని తేల్చే ఐదో వన్డే బుధవారం న్యూఢిల్లీలో జరుగుతుంది.  

Advertisement
Advertisement