ఆస్ట్రేలియా గడ్డపై అత్యంత పిన్నవయసులో టెస్టులో అరంగేట్రం చేసిన ఆటగాడిగా ఘనత సాధించిన పాకిస్తాన్ యువ పేసర్ నసీమ్ షా తీవ్రంగా నిరాశపరిచాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా శుక్రవారం రెండో రోజు ఆటలో 16 ఓవర్లు వేసిన నసీమ్ 65 పరుగులిచ్చి వికెట్ సాధించలేకపోయాడు. కాకపోతే భారీ సెంచరీ సాధించిన ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(151 బ్యాటింగ్) వికెట్‌ను తీసే అవకాశాన్ని నసీమ్ తృటిలో చేజార్చుకున్నాడు. 27వ ఓవర్ చివరి బంతిని వార్నర్‌కు వేయగా అది క్యాచ్ అయ్యింది. దాంతో వార్నర్ పెవిలియన్‌కు చేరేందుకు సిద్ధమయ్యాడు. దానిపై అనుమానం వచ్చిన ఫీల్డ్ అంపైర్ వార్నర్‌ను అక్కడే ఆగమని ఆ బంతిని చెక్ చేశాడు. అది నో బాల్ కావడంతో వార్నర్‌కు లైఫ్ లభించింది.
మూడు నో బాల్స్ వేస్తే ఒకటే చెక్ చేశారు..
Nov 22 2019 6:03 PM | Updated on Nov 22 2019 6:06 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement