డల్లాస్ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించిన సందర్భంగా అమెరికాలోని డల్లాస్‌లో పార్టీ ఎన్నారై వింగ్ సభ్యులు పెద్ద ఎత్తున వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ఎన్నారై సభ్యులతో పాటు అభిమానులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ సీట్లను గెలుచుకోవడం ప్రజావిజయమని పేర్కొన్నారు. ప్రజా నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పట్టంకట్టినందుకు ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రజారంజక పాలన అందించాలని ఆకాక్షించారు.