ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరు రెండోరోజు కూడా హస్తినలో కొనసాగుతోంది. పార్లమెంట్ బయట, లోపల కూడా వైఎస్‌ఆర్ సీపీ పోరాటాన్ని ఉధృతం చేసింది. హోదా అంశంపై చర్చించాలంటూ వైవీ సుబ్బారెడ్డి మంగళవారం లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు.