లక్ష కోట్ల రాజధాని ఏపీ అభివృద్ధికి దోహదపడదని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. అధికార వికేంద్రీకరణ కోరుతూ ఆదివారం శ్రీకాకుళంలో వైఎస్సార్‌సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్ష కోట్లతో సాగునీటి ప్రాజెక్టులు ప్రతిపాదిస్తే రాష్ట్రం శాశ్వతంగా సుభిష్టంగా ఉంటుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలంతా స్వాగతిస్తున్నారని చెప్పారు. పవన్‌కల్యాణ్ స్థిరత్వం లేని నాయకుడు అని.. రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారని విమర్శించారు.