గత కొంతకాలంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపనల పేరుతో చేస్తున్న హడావిడి అంతా ప్రజలను వంచించడానికేనని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి మండిపడ్డారు. గతంలో కూడా చంద్రబాబు ఇలాగే హడావిడి చేశారనే సంగతిని ఆయన గుర్తు చేశారు. వారంలో ఎన్నికల షెడ్యూల్ వస్తున్న కారణంగానే చంద్రబాబు తెగ హైరానా పడిపోతున్నారని విమర్శించారు. కర్నూల్ జిల్లాలో శంకుస్థాపన చేసిన నాలుగు ప్రాజెక్టులకు ఎలాంటి అనుమతులు లేవని ఈ సందర్భంగా నాగిరెడ్డి పేర్కొన్నారు.