విద్యార్థి దశ నుంచే వైఎస్‌ జగన్‌‌ నాయకుడు

1991 బ్యాచ్‌ హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌కు చెందిన 30మంది పూర్వ విద్యార్థులు హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వచ్చారు. స్కూల్‌లో విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షనాలున్న వైఎస్‌ జగన్‌ను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చూడాలని వారందరూ ఆకాంక్షించారు. ప్రజాసంకల్పయాత్ర 257వ రోజులో భాగంగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శనివారం కొత్తపాలెం దగ్గర విశాఖపట్నంలో ప్రవేశించారు. ఉక్కు నగరంలో ప్రవేశించిన వైఎస్‌ జగన్‌కు స్వాగతం పలికేందుకు విశాఖవాసులు భారీగా తరలివచ్చారు. వైఎస్‌ జగన్‌తో కలిసి చదువుకున్న స్నేహితులు కూడా ఆయనకు స్వాగతం పలకడానికి వచ్చారు.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top