చేతిలోన చెయ్యేసి... | Yogi Adityanath and Azam Khan walk hand-in-hand in UP Assembly | Sakshi
Sakshi News home page

చేతిలోన చెయ్యేసి...

Dec 15 2017 10:44 AM | Updated on Mar 22 2024 11:27 AM

వాళ్లిద్దరూ ఒకరితో ఒకరు మాటల యుద్ధం చేస్తారు. విమర్శలు-ప్రతివిమర్శల్లో ఎక్కడా తగ్గరు. వాళ్లిద్దరి వాయిస్‌ను.. ఒక్క ఉత్తర్‌ ప్రదేశ్‌లోనే కాక దేశమంతా గమనిస్తుంది. అటువంటి ఆ ఇద్దరు.. గురువారం సరదాగా సంభాషిస్తూ, హస్యోక్తులు విసురుకుంటూ.. ప్రాణ స్నేహితుల మాదిరిగా చేతిలోని చెయ్యేసి నడుచుకుంటే శాసనసభకు వచ్చారు. ఈ ఆశ్చర్యకర ఘటనకు యూపీ అసెంబ్లీ వేదికైంది. ఇద్దరూ.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌.. మరొకరు సమాజ్‌ వాదీ పార్టీనేత ఆజంఖాన్‌. ఉత్తర ప్రదేశ్‌ శాసనసభ శీతాకాల సమావేశాలు గురువారం మొదలయ్యాయి. ఈ సందర్భంగా సభకు వస్తున్న సీఎం యోగి ఆదిత్యానాథ్‌, ఎస్పీ నేత ఆజంఖాన్‌.. ఇద్దరూ ఒకే సమయంలో అసెంబ్లీలో కారిడార్‌లోకి అడుగు పెట్టారు. ఒకరికొకరు చూసుకుని సరదాగా పలకరించుకున్నారు. తరువాత వివిధ అంశాలపై నడుస్తూ చర్చించారు. ఇంతలో ఆప్యాంగా ఆజంఖాన్‌ చేతిని యోగి ఆదిత్యనాథ్‌ తన చేతిలోకి తీసుకున్నారు. ఆజంఖాన్‌ కూడా అంతే ఆప్యాయంగా యోగి ఆదిత్యనాథ్‌తో మాట్లాడారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement