ఓటు ఎలా నమోదు చేసుకోవాలంటే...

సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగిన వేళా.. ఓటర్లలో చైతన్యం తీసుకురావడానికి ‘సాక్షి’ నడుం బిగించింది. తెలంగాణ, ఏపీలోని లోక్‌సభ స్థానాలతోపాటు.. ఏపీలో అసెంబ్లీకి ఏప్రిల్‌ 11న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటు నమోదు చేసుకోనివారు, ఓటరు జాబితాలో తమ పేరు లేనివారు దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల సంఘం ఐదు రోజు సమయం ఇచ్చింది. ఈ గడువు మార్చి 15 వ తేదీతో ముగుస్తుంది. ఆన్‌లైన్‌లో లేదా సంబంధిత రెవెన్యూ కార్యాలయాలు, మున్సిపల్‌ కార్యాలయాల్లో ఫాం 6ను సమర్పించడం ద్వారాగాని ఓటర్‌గా నమోదుకు దరఖాస్తు చేయాలి. ఈ సందర్భంగా ఓటు ప్రాముఖ్యత తెలిపేలా సాక్షి ప్రచారం కల్పిస్తుంది. అంతేకాకుండా ఆన్‌లైన్‌లో ఓటు కోసం నమోదు చేసుకునేవారికి ఆ ప్రక్రియను సులభతరం చేయడం కోసం ఓ వీడియోను రూపొందించింది. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top