వివాహితను రక్షించబోయి ఇద్దరు యువకులు గల్లంతు అయిన ఘటన విజయవాడలోని గుణదలలో చోటుచేసుకుంది. గల్లంతు అయిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వివరాల్లోకి వెళితే... గుణదలకు చెందిన రాణి అనే ఓ మహిళ మంగళవారం గుణదల రైవస్ కాల్వలో దూకేసింది. అదే సమయంలో అక్కడ ఉన్న అయిదుగురు యువకులు గమనించి ఆమెను రక్షించేందుకు కాలువలోకి దూకారు. వీరిలో ముగ్గురు యువకులు రాణిని రక్షించి బయటకు తీసుకొని రాగా, మరో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. కాగా గల్లంతైన యువకులను వడుగు శివరామకృష్ణ (నాని), తాడేపల్లి సాయి అజయ్‌గా గుర్తించారు. గల్లంతైన యువకుల కోసం కాలువలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి.
కాల్వలో దూకిన వివాహితను రక్షించబోయి గల్లంతు
Aug 20 2019 5:55 PM | Updated on Aug 20 2019 6:08 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement