ఉన్నావ్ అత్యాచార ఘటనలో బాధితురాలు శుక్రవారం మృతి చెందింది. 90 శాతం కాలిన గాయాలతో రాత్రి 11.40 గంటల సమయంలో బాధితురాలు చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. గతేడాది డిసెంబర్‌లో మృతురాలిపై అత్యాచారం జరుగగా, విచారణ నేపథ్యంలో గురువారం కోర్టుకు వస్తున్న బాధితురాలిపై ఐదుగురు దుండగులు కిరోసిన్ పోసి నిప్పంటించారు. కాలిన గాయాలతో బాధితురాలు కేకలు వేసుకుంటూ కిలోమీటరు వరకు పరుగులు పెట్టింది. అనంతరం ఆమెను లక్నోలో ఓ ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూనే చనిపోయే ముందు బాధితురాలు మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చింది. ఈ ఘటనపై విచారణకు ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది.
చికిత్స పొందుతూ ఉన్నావ్ బాధితురాలు మృతి
Dec 7 2019 7:54 AM | Updated on Dec 7 2019 8:00 AM
Advertisement
Advertisement
Advertisement
