కాకినాడ సీపోర్టు లిమిటెడ్ (కేఎస్‌పీఎల్)లో ఘోర ప్రమాదం సంభవించింది. ఆరో నెంబర్ బెర్త్‌లో రెండు భారీ క్రేన్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, తొమ్మిది మంది కార్మీకులు తీవ్రంగా గాయపడ్డారు. మరి కొంత మంది క్రేన్ల కింద చిక్కుకున్నారు. సమాచారం ఆందుకున్న పోర్టు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్రేన్ల కింద చిక్కుకున్న కార్మికులను బయటకు తీసేందుకు పోర్టు సిబ్బంది శ్రమిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు వెంటనే తెలియరాలేదు.