రేపు బంద్‌ పై ఉత్కంఠ | TSRTC Strike Enters 14th Day | Sakshi
Sakshi News home page

రేపు బంద్‌ పై ఉత్కంఠ

Oct 18 2019 12:13 PM | Updated on Mar 21 2024 8:31 PM

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 14వ రోజు కొనసాగుతోంది. చర్చలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి పిలుపు రాకపోవడంతో కార్మికుల ఆందోళనలు, నిరసనలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ప్రజా, ఉద్యోగ సంఘాలు, విపక్ష పార్టీలు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఆందోళనలు చేస్తున్నాయి. ఆర్టీసీ కార్మికులకు న్యాయవాదులు, తెలంగాణ మెడికల్ ఉద్యోగుల జేఏసీ కూడా సంఘీ‌భావం ప్రకటించింది. ఆర్టీసీ జేఎసీ ఆధ్వర్యంలో కరీంనగర్ రెండు డిపోల ముందు కార్మికులు శుక్రవారం ధర్నా, నగరంలో బైక్ ర్యాలీ చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement