‘ఆగు తమ్మి నీకు దండం పెడుతా’ | TRS Working President KTR Funny Comments in Public Meeting At Secunderabad | Sakshi
Sakshi News home page

‘ఆగు తమ్మి నీకు దండం పెడుతా’

Mar 13 2019 8:44 PM | Updated on Mar 22 2024 11:23 AM

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బుధవారం సికింద్రాబాద్ పార్లమెంట్ టీఆర్‌ఎస్‌ సన్నాహక సమావేశంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన సరాదాగా చేసిన వ్యాఖ్యలు సభకు హాజరైన వారిని విపరీతంగా ఆకట్టుకున్నాయి. సభలో ప్రసంగించిన కేటీఆర్‌ బీజేపీ, కాంగ్రెస్‌లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రసంగంలో చివర్లో కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘ఇప్పుడు వ్యవసాయం చేస్తాం అనుకో.. ఇక్కడున్నారా  వ్యవసాయం చేసోటోళ్లు ఎవలైనా.. అయిన గిడెందుకు ఉంటారు సికింద్రాబాద్‌లా. వ్యవసాయం అయితే తెలుసుకదా? నాగలి ఎరికెనా నాగలి? అందరం ఎప్పుడో ఒకప్పుడు రైతు బిడ్డలమే కదా.. అందరం అడికెళ్లి వచ్చినోళ్లమేన’ని అన్నారు. ఆ సమయంలో సభలో పాల్గొన్న ఓ వ్యక్తి మాది కరీంనగర్‌ అని తెలిపాడు. ఇది విన్న కేటీఆర్‌..‘నీది కరీంనగరేనా.. ఆగు తమ్మి నీకు దండం పెడుతా.. మీకు చైతన్యం ఎక్కువ ముందే’ అని వ్యాఖ్యానించి తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ వ్యాఖ్యలు సభలో నవ్వులు నింపాయి.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement